labourer
-
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. యూపీ కార్మికునికి తీవ్రగాయాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మరో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఈసారి పుల్వామాలో ఉగ్రవాదులు కాశ్మీరేతరులను లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆర్మీ అధికారులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వార్తా సంస్థ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గల ట్రాల్ ప్రాంతంలో గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కార్మికునిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రీతమ్ సింగ్‌ను ఆర్మీ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత వారం రోజులుగా కశ్మీర్లో స్థానికేతర కార్మికులపై దాడులు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి గందర్‌బాల్‌లోని శ్రీనగర్-లేహ్ హైవేపై సోనామార్గ్ సమీపంలోని గగాంగిర్ ప్రాంతంలో టన్నెల్ నిర్మిస్తున్న కంపెనీకి చెందిన వలస కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక వైద్యునితో సహా ఆరుగురు కార్మికులు మృతిచెందారు.మరణించిన కార్మికులలో కశ్మీరీలతోపాటు కశ్మీరేతరులు ఉన్నారు. కశ్మీర్లో వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరు ఇక్కడి ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లకు చెందిన కార్మికులు కశ్మీర్‌లోని యాపిల్ తోటలు, పలు నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్టులలో పనులు చేస్తున్నారు. 2021లో కూడా వలస కార్మికులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ కశ్మీర్లో ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: బాలికపై లైంగిక వేధింపులు.. మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత -
రైతు చుట్టూ రాజకీయం
ఎన్నికల్లో రైతులను ఆకర్షించే పనిలో అన్ని పార్టీలూ నిమగ్నమయ్యాయి. రైతులను ప్రసన్నం చేసుకుంటేనే అధికారం దక్కుతుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే రైతు కేంద్రంగా అనేక పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీలు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలే నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన రైతులు, వ్యవసాయ కూలీలను పార్టీలు టార్గెట్‌గా చేసుకొని ప్రచారం చేస్తున్నాయి. వ్యవసాయం : 2 కోట్ల మంది రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతులు 66 లక్షల మంది ఉన్నారు. వీరే కాకుండా సెంటు భూమిలేని కౌలు రైతులు 6 లక్షల మందికి పైగా ఉంటారు. అంటే రైతులు, కౌలుదారులు కలిపి దాదాపు 72 లక్షల రైతు కుటుంబాలు ఉన్నట్లు ఓ లెక్క. కుటుంబంలో కనీసం ఇద్దరు చొప్పున ఓటు హక్కు కలిగి ఉన్నా, దాదాపు కోటిన్నర మంది వరకు ఉంటారు. ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న కూలీల సంఖ్య 52 లక్షలు. అంటే రాష్ట్రంలో వ్యవసాయం, దానిపై ఆధారపడిన వారే 2 కోట్ల మంది ఉంటారని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ రైతుబంధు రూ.16 వేలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రైతులపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. సాగునీటి ప్రాజెక్టులు మొదలు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టింది. రైతుబంధు కింద రైతులకు ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 72 వేల కోట్లు అందజేసింది. ప్రస్తుతం ఎకరానికి ఏడాదికి రూ. 10 వేలు ఇస్తుండగా, మరోసారి అధికారం అప్పగిస్తే విడతల వారీగా పెంచుతామని తెలిపింది. రైతుబంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12 వేల రూపాయలకు పెంచుతామని హామీనిచ్చింది. వచ్చే ఐదేళ్లలో రైతుబంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ... గరిష్టంగా ఎకరానికి ఏటా 16 వేల రూపాయలకు పెంచుతామని చెబుతోంది. రైతుబీమా ఎలాగూ ఉంది. అయితే గత రెండుసార్లు రైతులకు రూ. లక్ష రుణమాఫీ ప్రకటించి అమలు చేసిన బీఆర్ఎస్, ఈసారి మాత్రం తన ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీని ప్రకటించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూ.2 లక్షల రుణమాఫీ రైతులకు భరోసా దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. 24 గంటల ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని ఆ పార్టీ చెబుతోంది. రైతుబంధుకు బదులుగా రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరానికి ఒక్కో రైతుకు రూ. 15 వేలు ఇస్తామని వెల్లడించింది. కౌలు రైతులకు రైతు భరోసా రూ. 15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. ఇక వ్యవసాయ కూలీలకు, ఉపాధి కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెబుతోంది. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధర, వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని పేర్కొంది. అలాగే రైతు డిక్లరేషన్‌లో భాగంగా ఒకేసారి రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని తెలిపింది. మద్దతు ధరకు అన్ని పంటలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపింది. భూమి యాజమాన్య హక్కులను అందిస్తామని, పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్దిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని తెలిపింది. రైతు కమిషన్ ఏర్పాటుతో సహా సరికొత్త వ్యవసాయ విధానం తెస్తామని చెబుతోంది. వరికి మద్దతు ధర రూ. 3,100 ఇస్తామన్న బీజేపీ మరోవైపు తామూ అధికారంలోకి వస్తామని చెబుతోన్న బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో చిన్న సన్నకారు రైతులకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునేందుకు రూ. 2,500 సాయం అందిస్తామని తెలిపింది. ఉచిత పంటల బీమాను ప్రకటించింది. వరికి రూ. 3,100 మద్దతు ధర ఇస్తామని తెలిపింది. పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఆసక్తి కలిగిన రైతులకు దేశీ ఆవులను ఉచితంగా అందిస్తామని తెలిపింది. జాతీయ పసుపు బోర్డు నిర్ణయానికి అనుగుణంగా నిజామాబాద్ టర్మరిక్ సిటీని అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఏమాత్రం తగ్గని లెఫ్ట్ పార్టీల మేనిఫెస్టో... ఇక ఒంటరిగా బరిలో నిలిచి 19 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న సీపీఎం తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకు అనుకూలంగా అనేక హామీలు ఇచ్చింది. రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ కోసం కృషి చేస్తామని తెలిపింది. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం రూపొందించాలని కోరుతామని, రైతుల పంటలపై 80 శాతం రుణాలు ఇచ్చి గోదాముల సౌకర్యం కల్పించాలని, ధరల నిర్ణాయక కమిషన్ ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటలు సేకరించాలని కోరుతామని స్పష్టం చేసింది. కౌలు రైతుల గుర్తింపు, వ్యవసాయ రుణాలు, సబ్సి డీలు, పంట బీమా, కౌలు, పోడు తదితర రైతులందరికీ రూ. 5 లక్షల రైతు బీమా సౌకర్యం కల్పించా లని, ప్రకృతి వైపరీత్యాలు, అటవీ జంతువుల వల్ల పంట నష్టం జరిగితే సాగు చేసిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా మని సీపీఎం పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ మద్దతుతో ఒక స్థానంలో పోటీ చేస్తున్న సీపీఐ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో కీలకమైన అంశాలను పొందుపర్చింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ. 20 వేలు ఇవ్వాలని కోరింది. ఒకేసారి రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని పేర్కొంది. -బొల్లోజు రవి -
శరవేగంగా రెస్క్యూ ఆపరేషన్: హృదయ విదారకం, ఆనంద్ మహీంద్ర ట్వీట్
Uttarakhand Tunnel ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్ సొరంగం కూలి శిథిలాల మధ్య ఉన్న బాధితులను కాపాడేందుక అమెరికాకు చెందిన అత్యాధునిక డ్రిల్లింగ్ పరికరం 'అమెరికన్ ఆగర్'తో సహాయక చర్యలు చేపట్టారు. అయితే వాతావరణ ప్రతికూలత, మంగళవారం రాత్రి మళ్లీ కొండ చరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో టన్నెల్ బయట నిరీక్షిస్తున్న కార్మికుల కుటుంబసభ్యుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక సూపర్వైజర్ తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందవద్దని తన కుమారుడికి హామీ ఇచ్చిన ఆడియో క్లిప్ ఒకటి గురువారం వెలువడింది. చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్, ఆహారం చేరేలా ఏర్పాటు చేసిన పైపు ద్వారా తన కొడుకుతో మాట్లాడాడు నేగి. దీంతో అతని కుమారుడు ఆకాష సంతోషం వ్యక్తం చేశాడు. ఎవరికీ గాయాలు కాలేదని, సరిపడా ఆహారం, నీరు అందుతున్నాయని నాన్న చెప్పారనీ ఆందోళన చెందవద్దని ఇంట్లో అందరికీ చెప్పమన్నారని చెప్పాడు. అంతా మంచి జరుగుతుందని భావిస్తున్నాని తెలిపాడు. మరో కార్మికుడు మహదేవ్ బావున్నాను అని తన కుటుంబానికి చెప్పండి అంటూ ఒడియాలో చెప్పడం కాస్త ఊరటినిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ ఘటనపై పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్ర స్పందించారు. హృదయ విదారకంగా ఉంది. తొందరగానే వీరంతా ఈ ప్రమాదంనుంచి క్షేమంగా తిరిగి రావాలి. అంతేకాదు కాస్త ఆలస్యమైనా క్షేమంగా బైటికి వచ్చి, వారి కుటుంబాలతో సంతోషంగా దీపావళి వేడుక జరుపుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు సొరంగంలో చిక్కుకుని ఇప్పటికే అయిదు రోజులైంది. రక్షణ చర్యల్లో భాగంగా సోమవారం 55 మీటర్ల నుంచి 60 మీటర్ల శిథిలాలను తొలగించారు. అయితే ఆ ప్రాంతంలో మళ్లీ మట్టి కొట్టుకుపోవడంతో తవ్విన భాగాన్ని 14 మీటర్లకు తగ్గించారు. రాయిని డ్రిల్‌చేసి దాని ద్వారా 80 మిమీ (3 అడుగుల కంటే తక్కువ)బోర్ వేసి దాని ద్వారా కూలీలను రక్షించడానికి ప్లాన్ చేస్తున్నామని జాతీయ విపత్తు సహాయ దళం చీఫ్ అతుల్ కర్వాల్ తెలిపారు. అమెరికన్ అగర్ డ్రిల్ సుమారు 12 -15 గంటల్లో 70 మీటర్ల రాళ్లను కట్ చేసే సామర్థ్యం ఉందన్నారు. ప్రస్తుతం చేపట్టిన సహాయక చర్యలు ప్లాన్ బీ విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రెస్క్యూ ఆపరేషన్ అధికారి కల్నల్ దీపక్ పాటిల్ గురువారం ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యాధునిక అమెరికన్ డ్రిల్లింగ్ పరికరాలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. అటు రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారని కేంద్ర మంత్రి వీకే సింగ్ కూడా వెల్లడించారు. విదేశీ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామనీ, అనుకున్న సమయానికంటే ముందే రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుందని భావిస్తున్నామన్నారు. #WATCH | On arriving at Uttarakhand's Uttarkashi to take stock of the operation to rescue 40 workers who are stuck inside the Silkyara tunnel, Union Minister General VK Singh (Retd) says, "Rescue operation is underway, we have full hope. We are trying our best." pic.twitter.com/M1pXGYFBbn — ANI (@ANI) November 16, 2023 -
కార్మికుడికి రూ.24. 61 లక్షలు టాక్స్ కట్టమంటూ నోటీసులు..?
లక్నో: నిరుద్యోగి ఆయిన ఒక కార్మికుడి కంపెనీ టర్నోవర్ రూ.2. 5 కోట్లు దాటింది కానీ అతడు టాక్స్ కట్టడం లేదంటూ అతడికి నోటీసులు పంపించింది ఆదాయపు పన్ను శాఖ. రోజుకి రూ. 300 సంపాదించుకునే కూలీని, అంత మొత్తాన్ని ఎక్కడ నుండి తెచ్చి కట్టాలని వాపోతున్నాడు ఆ కార్మికుడు. బులంద్ షహర్ కు చెందిన 22 ఏళ్ల దేవేంద్ర కుమార్ కు చాలా కాలంగా ఉద్యోగం లేదు. ఏవో కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు కానీ అక్కడ ఎక్కువకాలం స్థిరంగా లేడు. ప్రస్తుతానికైతే అతడు నరౌరాలో ఒక టౌన్ షిప్ ప్రాజెక్టులో దినవారీ కూలీగా పనిచేస్తున్నాడు. అతడికి రెండు వ్యాపారాలున్నాయని, వాటి నుంచి అతడు ఏడాదికి రూ.2.5 కోట్లు ఆదాయం పొందుతున్నాడని తెలుపుతూ జీఎస్టీ నోటీసులు జారీ చేశారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. నిందితుడు దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం నోయిడాలో నేనొక సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్యాకర్ గా పని చేసేవాడిని. అక్కడి కాంట్రాక్టర్లు నాకు జీతం ఇవ్వడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవ్వమని కోరారు. మార్చి 13, 16న అల్లాగే ఏప్రిల్ 4న రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖ నుండి, అలీగఢ్ ఆదాయపు పన్ను కార్యాలయం నుండి ఘజియాబాద్ లోని మా ఇంటికి నోటీసులు వచ్చాయి. జేకే ట్రేడర్స్ అనే నా కంపెనీ టర్నోవర్ రూ.136.60 లక్షలని, అలాగే సర్వశ్రీ జేకె ట్రేడర్స్ అనే నా మరో కంపెనీ టర్నోవర్ 116.24 లక్షలని రెండిటికీ కలిపి మొత్తం రూ.24. 61 లక్షలు టాక్స్ కట్టాల్సి ఉందని నోటీసుల్లో ఉంది. జీఎస్టీ నెంబర్ ఆధారంగా చూస్తే అది జితేందర్ సిసోడియా అనే వ్యక్తి పేరు మీద ఉందని.. మా పాత కంపెనీ యజమాని, జితేందర్ ఇద్దరూ కలిసి ఏదైనా మతలబు చేసి ఉంటారని ఆరోపించాడు. ఏమి చెయ్యాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించానని.. బులంద్ షహర్, నోయిడా, ఘజియాబాద్ తిరిగి తిరిగి చివరకు గౌతమ్ బుద్ధా జిల్లాలోని సెక్టార్-63 పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశానని ఇంతవరకు దానికే రూ.40000 ఖర్చు చేశానని భోరుమన్నాడు. ఇది కూడా చదవండి: పక్కా ఆధారాలున్నాయి.. ఇక జైలుకే.. -
యువకునిపై మూత్ర విసర్జన.. నిందితుని ఇల్లు కూల్చివేత..
భోపాల్: యోగీ ఆదిత్యనాథ్ బుల్ డోజర్ విధానాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన ఓ వ్యక్తి ఇంటిని రాష్ట్ర అధికారులు కూల్చి వేశారు. గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రభుత్వం స్బందించింది. వీడియోలో ఓ వ్యక్తి కింద కూర్చున్న గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి వెళ్లింది. నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని ప్రవేశ్ శుక్లాగా గుర్తించి అరెస్టు చేశారు. #WATCH | Sidhi viral video | Accused Pravesh Shukla's illegal encroachment being bulldozed by the Administration. He was arrested last night.#MadhyaPradesh pic.twitter.com/kBMUuLtrjK — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 5, 2023 నిందితుని అరెస్టు చేసిన అనంతరం.. అక్రమంగా ఆక్రమించాడనే ఆరోపణలతో అధికారులు అతని ఇంటిని బుల్ డోజర్‌తో కూల్చివేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. నిందితుడు పాల్పడిన ఘటన అమానవీయమని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఇలాంటివారికి సాధారణ శిక్ష సరిపోదని చెప్పారు. ఇదీ చదవండి: Delhi Court Firing: లాయర్ల మధ్య వాగ్వాదం.. కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం -
136 ఏళ్ల నాటి బ్రిటీష్ కాలం నిధి..పోలీసులకు అప్పగించిన కూలీ
ఒక దినసరి కూలీ 136 ఏళ్ల బ్రిటీస్ కాలం నిధిని పోలీసులకు అప్పగించాడు ఓ కార్మికుడు. అయితే అతను తన స్థలం నుంచి చెప్పకుండా పట్టుకెళ్లాడని ఆరోపించింది ఆ భూ యజమాని. విషయం తెలుసుకున్న పోలీసులకు అక్కడకు వెళ్లితే మరో విషయం బయటపడింది. ఈ ఘటన మధ్యప్రధేశ్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..మధ్యప్రదేశ్‌లోని ఓ దినసరి కూలీ కి ఓ ఇంటి కింద 136 ఏళ్ల నాటి బ్రిటీష్ కాలం నిధిని కనుగొన్నాడు. ఆ కార్మికుడు మధ్యప్రదేశ్‌లోని హలీ అహిర్వార్లోని దామోహ్ జిల్లాలోని ఇంటి తవ్వకంలో ఈ నిధిని గుర్తించాడు. అందులో సుమారు 240 వెండి నాణేలను కనుగొన్నాడు. వాటి విలు సుమారు రూ. 1.92 లక్షల వరకు ఉంటుంది. అయితే ఆ కూలీ తొలుత తన ఇంటికి తీసుకెళ్లి.. చివరికి బాగా ఆలోచించి పోలీసులకు అప్పగించేశాడు. ఐతే ఆ స్థలం యజమానురాలు మీనాక్షి ఉపాధ్యాయ్ మాత్రం ఆ నిధిని తన స్థలంలోనే బయటపడిందని, ఆ కూలి తనకు చెప్పకుండా ఇంటికి తీసుకువెళ్లినట్లు ఆరోపణలు చేసింది. తాను ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను నిలిపి వేయించారు. పురావస్తు శాఖకు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ నాణేలను అప్పగించారు. అంతేగాదు ఆ స్థలంలో తవ్వకాలు జరిపిన పురావస్తు శాఖ..అక్కడ ఒక దేవాలయం ఉన్నట్లు గుర్తించింది. అక్కడ ఇంకా తవ్వకాలు జరిపి నిశితంగా దర్యాప్తు చేస్తే.. విలువైన వస్తువులు బయటపడే అవకాశం ఉందంటూ పుకార్లు గుప్పుమన్నాయి. ఇదిలా ఉండగా, ఎవరైనా పురాతన వస్తువు లేదా నిధిని కనుగొన్న వ్యక్తి దానిని 24 గంటలలోపు భారత పురావస్తు సర్వే డైరెక్టర్ జనరల్ లేదా అధీకృత అధికారికి నివేదించాలి. అలా చేయనట్లయితే ఆ వ్యక్తికి జైలు శిక్ష లేదా జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. (చదవండి: దాని గురించి మాట్లాడను! 'అదంతా మైండ్‌గేమ్': న్యాయశాఖ మంత్రి) -
త్వరగా చెల్లించు. కాదు.. కూడదు అంటే ఈడీ దాడులు చేయాల్సివస్తుంది! జాగ్రత్త!!
త్వరగా చెల్లించు. కాదు.. కూడదు అంటే ఈడీ దాడులు చేయాల్సివస్తుంది! జాగ్రత్త!! -
దినసరి కూలీకి దిమ్మతిరిగే షాక్! ఏకంగా రూ. 14 కోట్లు చెల్లించమన్న ఐటీ శాఖ
దినసరి కూలీకి ఆదాయపు పన్ను శాఖ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఏకంగా రూ. 14 కోట్లు ట్యాక్స్ చెల్లించాలంటూ ఆ కూలీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఐతే నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులు సైతం అతడి పరిస్థితిని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బిహార్‌లోని రోహ్తాస్ జిల్లాలోని యాదవ్ అనే దినసరి కూలీకి ఆదాయపు పన్ను శాఖ ఏకంగా రూ. 14 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న అతడి కుటుంబం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. తాను దినసరి కూలీనని, తన ఆస్తి మొత్తాన్ని పలుమార్లు విక్రయించిన కూడా అంత మొత్తం చెల్లించలేనని అధికారులకు తెలియజేశాడు. యాదవ్‌కి నోటీసులు జారీ చేసేందుకు వచ్చిన అధికారులు సైతం అతడి స్థితిని చూసి ఆశ్చర్యపోయారు. ఐతే యాదవ్ గతంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో వివిధ ప్రదేశాల్లో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసినట్లు అధికారులకు తెలిపాడు. ఆ తర్వాత 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా బిహార్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చేసినట్లు తెలిపాడు. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో అక్కడ అధికారులు తన ఆధార్, పాన్‌కార్డుల కాపీలను తీసుకున్నట్లు వెల్లడించాడు. బహుశా వారే ఆదాయపు పన్ను నుంచి తప్పించుకునేందుకు ఇలా తన పేరిట నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు జరిపి ఉండవచ్చని ఐటీ అధికారులకు వివరించాడు. ఆ దినసరి కూలీ యదవ్కి ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యాలయం నుంచే నేరుగా నోటీసులు పంపినట్లు ఐటీ అధికారి సత్యభూషణ్ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా, యాదవ్ సోమవారం తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో ఎక్కడికో వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. (చదవండి: షాకింగ్ ఘటన:రెస్టారెంట్లోకి దూసుకొచ్చిన టెంపో..ముగ్గురికి గాయాలు) -
దీనస్థితిలో క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్... రోజుకూలీగా పనులకు
గుజరాత్: దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మూమూలుది కాదు. అందులోనూ పాకిస్తాన్‌పై విజయం అంటే మరింత మోజు. కానీ బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన ఓ క్రికెటర్ మాత్రం తాజాగా కడు దీనస్థితిలో జీవనం సాగిస్తున్నాడు. టీమిండియా బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు గుజరాత్‌కు చెందిన నరేష్ తుమ్డా. కట్ చేస్తే.. ఇపుడు జీవనోపాధి కోసం నానా పాట్లు పడుతున్నాడు. రోజు కూలిగా మారి పొట్ట పోషించుకుంటుకున్నాడు. అంతేకాదు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదైనా ఉద్యోగమివ్వాలని వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే 2018లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్‌ను సాధించిన విన్నింగ్ టీమ్‌లో సభ్యుడు నరేష్ తుమ్డా. షార్జాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌ను ఓడించింది. అయితే అంధుడైన నరేష్ ఇపుడు నవ్సారీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజుకు కేవలం 250 రూపాయలు సంపాదనతో అరకొర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిని కలిసినా ఎలాంటి ప్రయోజనం రాలేదని నరేష్ వాపోయాడు. ఇప్పటికైనా తన కుటుంబ పోషణకోసం ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.(షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్) కాగా వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ 1996 నుండి బ్లైండ్ క్రికెట్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికి అయిదుసార్లు ఈ పోటీలు జరగ్గా 2018, జనవరి 20న షార్జాలో జరిగిన ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ని ఓడించింది. 308 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి మరీ ఈ విజయాన్ని దక్కించుకుంది. అలాగే 2012లో తొలిసారిగా బ్లైండ్ వరల్డ్ కప్ టీ20 బెంగళూరులో జరిగింది. (Tokyo Olympics: టోక్యోలో కత్తిపోట్ల కలకలం.. మహిళలపై అగంతకుడి దాడి) -
రోజు కూలీగా మారిన అంతర్జాతీయ అథ్లెట్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 23 ఏళ్ల పంజాబ్ అథ్లెట్ హర్దీప్ కౌర్, ప్రస్తుతం కుటుంబ పోషణ నిమిత్తం దినసరి కూలీగా మారింది. రోజుకు రూ.300 సంపాదన కోసం వరి పొలాల్లో పని చేస్తుంది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 20కి పైగా పతకాలు సాధించిన ఆమె.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా దుర్భర జీవితం కొనసాగిస్తుంది. ఓ వైపు విద్యను(ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా) అభ్యసిస్తూనే, తల్లిదండ్రులతో కలిసి కూలీ పనులకు వెళ్తుంది. 2018లో మలేషియాలో జరిగిన కరాటే పోటీల్లో స్వర్ణం సాధించిన హర్దీప్కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అప్పటి పంజాబ్ క్రీడామంత్రి రాణా గుర్మీత్ సోధీ హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అమల్లోకి రాకపోవడంతో ఆమె ఆవేదన చెందుతుంది. ఉద్యోగం కోసం ప్రభుత్వ పెద్దలను ఎన్ని సార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, దీంతో తప్పని పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్లాల్సి వస్తుందని వాపోతుంది. తండ్రి నయాబ్ సింగ్, తల్లి సుఖ్విందర్ కౌర్ తన క్రీడా భవిష్యత్తు కోసం చాలా శ్రమించారని, ఉన్నది అమ్ముకుని తనను ఈ స్థాయికి తెచ్చారని, వారి బాధ చూడలేకే తాను వారితో కలిసి పనికి వెళ్తున్నానని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాక ఇటువంటి పరిస్థితి వస్తుందని తానెప్పుడు ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని ఆమె ఆశగా ఎదురు చూస్తుంది. చదవండి: ఆ ఇంగ్లీష్ బౌలర్ పీక కోస్తానన్నాడు.. అందుకే అలా చేశా -
దారుణం: కూలీ ప్రాణం తీసిన పెంపుడు కుక్క
సాక్షి, బెంగళూరు: నిర్మాణ స్థలంలో మెట్ల కింద నిద్రిస్తున్న కూలీని యజమాని పెంపుడు కుక్క దాడి చేసింది. ఆ కుక్క చేతిలో తీవ్రంగా గాయపడి అతడు మృతి చెందాడు. ఈ దాడిని ఆపడానికి ప్రయత్నించిన యజమానిని కూడా ఆ కుక్క గాయపరిచింది. దీంతో ఆ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని అత్తూర్ లేఅవుట్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుడు నరసింహ (36) పని చేసేందుకు వచ్చాడు. నిర్మాణం జరుగుతున్న స్థలంలో మెట్ల కింద నరసింహ నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో యజమాని తన విదేశీ (పిట్ బుల్) జాతికి చెందిన పెంపుడు కుక్కతో అక్కడకు చేరింది. అకస్మాత్తుగా ఆ కార్మికుడిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అతడి మెడను పట్టుకుని కొరికేసింది. అయితే కుక్క అదుపు చేయడానికి వెళ్లగా యజమానికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. నరసింహ అరుపులు విని తోటి కార్మికులు అక్కడికి చేరుకుని వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నరసింహ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒక వ్యక్తి మరణానికి కారణమైన కుక్క యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అర్ధరాత్రి రౌడీ షీటర్ హల్చల్.. పోలీసుల ఎన్కౌంటర్ చదవండి: దారుణం.. వేశ్యను వాడుకుని డ్రైనేజీలో పారవేత -
రాత్రికి రాత్రే కేరళ కూలీకి రూ. 12కోట్లు..!
తిరువనంతపురం: అతడో రోజువారీ కూలీ. రెక్కాడితేకానీ డొక్కాడని పరిస్థితి అతని కుటుంబానిది. అలాంటి వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఘటన కేరళ రాష్ట్రం కన్నూరు జిల్లాలో చోటుచేసుకుంది. పేరూన్నోన్ రాజన్ అనే వ్యక్తి రోజూవారీ కూలీ పనులకు వెళ్తూ.. జీవనాన్ని సాగించేవాడు. అప్పులపాలైన అతడు చాలీచాలని కూలీ డబ్బులతోనే తన కుటుంబాన్ని నెట్టుకొస్తుండేవాడు. అతడి భార్య రజనీ స్థానిక అంగన్వాడీలో తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తోంది. రాజన్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే తాను పడుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఏ రోజైనా అదృష్టం తలుపు తట్టదా అనే ఆశతో రోజూ లాటరీ టికెట్లు కొంటుండేవాడు. చదవండి: ఆ ఇంట్లో అనుమానాస్పదంగా ఐదు శవాలు అలా తాజాగా రాజన్ కొన్న లాటరీ టికెట్టుకు కేరళ క్రిస్టమస్ బంపర్ లాటరీ పేరిట రూ.12కోట్లు దక్కాయి. తనకు బంపర్ లాటరీ లభించిందని తెలుసుకున్న రాజన్ షాక్‌కు గురయ్యారు. వెంటనే అతడు గెలిచిన ఆ టికెట్‌తో స్థానిక కోఆపరేటీవ్ బ్యాంకు వద్దకు వెళ్లి అధికారికంగా అందజేశాడు. ఇప్పటికే ఆ బ్యాంకులో ఇంటిపై అతను అప్పు చేశాడు. ప్రైజ్ మనీ రాగానే ముందుగా ఈ లాటరీ డబ్బులతో తనకున్న అప్పులు తీరుస్తానని రాజన్ చెప్పారు. తన చిన్న కూతురిని బాగా చదివించాలని చూస్తున్నట్లు చెప్పారు. రూ.12 కోట్ల లాటరీకి గాను పన్నులు పోను తనకు రూ.7.2 కోట్లు వస్తాయని, ఆ డబ్బుతో తనకు గతంలో సహాయపడిన వారికి సాయం చేస్తానని రాజన్ చెప్పారు. చెమట చిందించి సంపాదించే తనకు డబ్బు విలువ తెలుసునని, అందుకే ఈ లాటరీ డబ్బును వృథా చేయనని రాజన్ వివరించారు. రాజన్‌కు భార్య రజని, ఇద్దరు కుమార్తెలు అక్షర, అథిర, కుమారుడు రిగిల్ ఉన్నారు. చదవండి: వేరుశెనక్కాయల్లో డబ్బులే డబ్బులు -
ఖాకీల కక్కుర్తి.. సీసీటీవీలో బుక్కు
చెన్నై: తమిళనాడులో ముగ్గురు కానిస్టేబుళ్లు కక్కుర్తి పడ్డారు. ఓ కూలీ చేసుకొని బతికే వ్యక్తి దగ్గర దొంగతనానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే అతడిపై దొంగతనం కేసు పెడతామంటూ హెచ్చరించారు. ఎట్టకేలకు పోలీసులు ఆ ముగ్గురుని అరెస్టు చేసి జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. జే ఇరుదయరాజ్, జే అరుల్దాస్, ఎస్ రామకృష్ణ అనే ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రత్యేక విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ముగ్గురు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్‌పై పడుకున్న ఓ కూలీ దగ్గరకు వెళ్లారు. కూలీ నాలి చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్న అతడు ఉదయాన్నే కేరళకు రైలెక్కాల్సి ఉంది. అయితే, అతడిని బెదిరించిన ఆ ముగ్గురు అతడి దగ్గర నుంచి పర్సు(అందులో రూ.1800 ఉన్నాయి), రూ.16వేల విలువైన సెల్‌ఫోన్, అతడి వాచ్ తీసుకున్నారు. అయితే, కనీసం తను ఊరెళ్లెందుకు ఒక రూ.300 ఇవ్వాలని బతిమిలాడుకోవడంతో ఇచ్చి వెళ్లిపోయారు. అయితే, ఈ విషయం అతడు పోలీసులకు చెప్పడంతో వారు విచారణ ప్రారంభించి సీసీటీవీ ఫుటేజీ సేకరించారు. అలాగే, అక్కడే ఉన్న కొంతమంది రిక్షా కార్మికుల వద్ద వివరాలు తెలుసుకొని ఆ ముగ్గురు కానిస్టేబుల్స్‌ను అరెస్టు చేశారు. నేరం రుజువైతే వారికి పదేళ్ల వరకు జైలు శిక్షపడనుంది. -
ఉపాధి పనులకు వెళ్తే ఆగిన ఊపిరి
కుందుర్పి(కళ్యాణదుర్గం) : కుందుర్పి మండలం తూముకుంటలో చంద్రశేఖర్(38) అనే కూలీ ఉపాధి పనులు చేస్తుండగానే.. గుండెపోటుకు గురై ఊపిరి ఆగింది. రోజులాగే బుధవారం ఉదయం గ్రామ శివార్లలో జరుగుతున్న ఫారంపాండ్ తవ్వేందుకు తోటి కూలీలతో కలసి వెళ్లాడు. ఉదయం 11 గంటలకు పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురవడంతో కుప్పకూలిపోయాడని కూలీలు తెలిపారు. వెంటనే కుందుర్పి పీహెచ్‌సీకి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే ప్రాణాలొదిలినట్లు చెప్పారు. మృతుడికి భార్య పద్మజ, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ, వెలుగు ఏపీఎం తిమ్మప్ప, ఏపీఓ నీరజ, తహసీల్దార్ రమేషన్ తూముకుంటకు చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఉపాధి హామీ నుంచి రూ.50 వేలు, చంద్రన్న బీమా పథకం కింద మరో రూ.25 వేలు అందజేస్తామని ప్రకటించారు. తక్షణ సాయంగా రూ.5 వేలు అందించారు. -
కర్మాగారంలో కార్మికుడి మృతి
హిందూపురం రూరల్ : మండలంలోని మణేసముద్రం సమీపంలో ఏ1 స్టీల్ పరిశ్రమలో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివపాల్ యాదవ్(42) అనే కార్మికుడు గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. విధి నిర్వహణలో ఉండగా క్రేన్ నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడని వివరించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
నిమ్స్‌లో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో ప్రమాదవశాత్తూ ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం పాతబిల్డింగ్ ఏఎంసీ బ్లాక్‌లోని రెండో అంతస్తులో శుభ్రం చేస్తుండగా కళ్లు తిరగడంతో సదానంద్(40) అనే కార్మికుడు కిందపడ్డాడు. ఆ సమయంలో ఎవరు అతనిని గమనించకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. కాసేపటి తర్వాత గమనించిన వారు అతనిని ఐసీయూకు తరలించారు. అప్పటికే సదానంద్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
మహారాష్ట్రలో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్?
ముంబై: మహారాష్ట్ర పోలీసులు అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేశారా? స్థానిక రైతులను, కార్మికులను అప్పుల పేరుతో వేధించిందా? అప్పులు తీర్చకపోతే కిడ్నీలు అమ్ముకోమని బలవంతం చేసిందా.. తాజాగా అంకోలా పోలీసులు బృందం దర్యాప్తులో వెలుగు చూసిన విషయాలు దీన్నే బలపరుస్తున్నాయి. అటు జిల్పా ఎస్పీ సీకే మీనా కూడా ఇవే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. టూరిస్టు వీసాతో శ్రీలంక వెళుతున్న సంతోష్ గాలి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు విచారించారు. ఈ క్రమంలో అంతర్జాతీయ కిడ్నీ ముఠా గుట్టు రట్టయింది. విదర్భ, అంకోలా తదితర ఏరియాల్లోని పేద రైతులను, కార్మికులను వడ్డీ వ్యాపారులు దోచుకుంటున్నవైనం బైటపడింది. శ్రీలంక కేంద్రంగా అక్రమ కిడ్నీ దందా నడుస్తున్నట్టుగా పోలీసులు కనుగొన్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరు వడ్డీ వ్యాపారులను, ఏజెంట్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంకోలాకు చెందిన సంతోష్ గాలీ, శ్రీలంకకు చెందిన వడ్డీ వ్యాపారి ఆనంద్ జాదవ్ దగ్గర 20 వేల రూపాయల అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించాల్సిందిగా ఆనంద్ జాదవ్ ఒత్తిడి చేశాడు. అప్పు తీర్చలేకపోతే కిడ్నీ అమ్ముకోవాల్సిందిగా ప్రలోభ పెట్టాడు. అలా చేస్తే 20 వేల అప్పు మాఫీతో నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించాడు. దీంతోపాటు శ్రీలంకలోని ఆసుపత్రిలో కిడ్నీ ఇచ్చేటట్టుగా ఏర్పాట్లు చేశారు. కానీ పోలీసుల అప్రమత్తతతో అక్రమ దందాకు అడ్డుకట్ట పడింది. అటు అప్పు తీర్చకపోతే చంపేస్తామని బెదరించారని బాధితుడు గాలి పోలీసులకు తెలిపాడు. ఇక వేరే గత్యంతరం లేక కిడ్నీ అమ్ముకోవడానికి సిద్ధపడ్డట్టు వివరించాడు. నాలుగు లక్షలని చెప్పి రెండు లక్షలు మాత్రమే ఇచ్చారన్నాడు. బాధితుడు గాలి, వడ్డీ వ్యాపారి ఆనంద్ జాదవ్ సహా, గాలి శ్రీలంక వెళ్లేందుకు వీసా,పాస్‌పోర్టు ఏర్పాటు చేసిన దేవేంద్ర షిర్సత్ అనే ఏజెంటునూ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు బాధితుడు గాలికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన నాగ్‌పూర్ ఆసుపత్రి, శ్రీలంకలోని ఆసుపత్రి జోక్యంపై కూడా ఆరాతీస్తున్నామన్నారు. ఈపరిణామాలన్నింటి నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులును, పేద కార్మికులను అప్పుల పేరుతో లోబర్చుకుంటున్న ముఠా, అక్రమ కిడ్నీ వ్యాపారం నిర్వహిస్తోందనే అనుమానాన్ని ఎస్పీ సీకే మీనా వ్యక్తం చేశారు. వ్యవస్థీకృత కిడ్నీ సిండికెట్ అక్రమ కార్యకలాపాల వ్యవహారం తమ ప్రాథమిక విచారణలో తేలిందని పూర్తి విచారణ అనంతరం ,త్వరలోనే వివరాలు వెల్లడిచేస్తామన్నారు. -
వందకోసం హత్య.. పరిస్థితి ఉద్రిక్తం....
ఆగ్రా: వంద రూపాయల కూలి కోసం ఓ కార్మికుడిని హత్య చేసిన ఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. రిటైర్ట్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఎంఎల్ ఉపాధ్యాయ మనవడు జై కిషన్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానిక దేవాలయంలో చేసిన పనికిగాను తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందిగా అడిగిన పప్పుపై జై కిషన్ ఆవేశంతో దాడికి దిగాడు. నేలమీద పడేసి పిడిగుద్దులు కురిపించడంతో పప్పు అక్కడిక్కడే ప్రాణాలొదిలాడు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, వందలాదిమంది దళితులు మేజర్ ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. ఆస్తులను ధ్వంసం చేశారు. నిందితుడి తాతపై దాడిచేశారు. పరిస్థతి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రబ్బరు బుల్లెట్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. తీవ్రంగా గాయపడిన రిటైర్ట్ ఆర్మీ ఆఫీసర్ ఉపాధ్యాయను స్థానిక సరోజిని నాయుడు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించామని సీనియర్ పోలీస్ అధికారి రాజేష్ డి. మోదక్ తెలిపారు. అయితే జై క్రిషన్ పరారీలో ఉన్నాడనీ... అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
వందకోసం వ్యక్తి హత్య
ఆగ్రా: కేవలం వంద రూపాయల చెల్లింపు విషయంపై ఓ ఆర్మీ అధికారి మనమడు ఆగ్రాలో ఓ కూలి వ్యక్తిని హతమార్చాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఘర్షణలకు దారి తీసింది. చనిపోయిన వ్యక్తి బంధువులు పెద్ద సంఖ్యలో ఘటన ప్రాంతానికి చేరుకొని ఆ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి ఇంటిపై రాళ్లు విసరడమే కాకుండా.. రెండు మోటారు సైకిళ్లకు నిప్పుపెట్టారు. ఆస్తి ధ్వంసం చేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకొని రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపడంతో వారంతా చెల్లా చెదురయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పప్పు(40) అనే దళిత కూలి ఎంఎల్ ఉపాధ్యాయ అనే ఆర్మీ అధికారి మనమడు జై క్రిష్ణన్ వద్ద పని చేశాడు. ఆ పనికి సంబంధించిన డబ్బులకోసం అతడి వద్దకు వెళ్లగా కేవలం వంద రూపాయల విషయంలో గొడవ పెట్టుకున్నాడు. అనంతరం ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరికి పప్పును జై క్రిష్ణన్ బలంగా నేలకేసి కొట్టడంతోపాటు చావు దెబ్బలు కొట్టడంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.