ఆగ్రా: కేవలం వంద రూపాయల చెల్లింపు విషయంపై ఓ ఆర్మీ అధికారి మనమడు ఆగ్రాలో ఓ కూలి వ్యక్తిని హతమార్చాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఘర్షణలకు దారి తీసింది. చనిపోయిన వ్యక్తి బంధువులు పెద్ద సంఖ్యలో ఘటన ప్రాంతానికి చేరుకొని ఆ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి ఇంటిపై రాళ్లు విసరడమే కాకుండా.. రెండు మోటారు సైకిళ్లకు నిప్పుపెట్టారు. ఆస్తి ధ్వంసం చేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకొని రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపడంతో వారంతా చెల్లా చెదురయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పప్పు(40) అనే దళిత కూలి ఎంఎల్ ఉపాధ్యాయ అనే ఆర్మీ అధికారి మనమడు జై క్రిష్ణన్ వద్ద పని చేశాడు. ఆ పనికి సంబంధించిన డబ్బులకోసం అతడి వద్దకు వెళ్లగా కేవలం వంద రూపాయల విషయంలో గొడవ పెట్టుకున్నాడు. అనంతరం ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరికి పప్పును జై క్రిష్ణన్ బలంగా నేలకేసి కొట్టడంతోపాటు చావు దెబ్బలు కొట్టడంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
వందకోసం వ్యక్తి హత్య
Published Wed, Apr 1 2015 1:11 PM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM
Advertisement