లక్నో: నిరుద్యోగి ఆయిన ఒక కార్మికుడి కంపెనీ టర్నోవర్ రూ.2. 5 కోట్లు దాటింది కానీ అతడు టాక్స్ కట్టడం లేదంటూ అతడికి నోటీసులు పంపించింది ఆదాయపు పన్ను శాఖ. రోజుకి రూ. 300 సంపాదించుకునే కూలీని, అంత మొత్తాన్ని ఎక్కడ నుండి తెచ్చి కట్టాలని వాపోతున్నాడు ఆ కార్మికుడు.
బులంద్ షహర్ కు చెందిన 22 ఏళ్ల దేవేంద్ర కుమార్ కు చాలా కాలంగా ఉద్యోగం లేదు. ఏవో కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు కానీ అక్కడ ఎక్కువకాలం స్థిరంగా లేడు. ప్రస్తుతానికైతే అతడు నరౌరాలో ఒక టౌన్ షిప్ ప్రాజెక్టులో దినవారీ కూలీగా పనిచేస్తున్నాడు. అతడికి రెండు వ్యాపారాలున్నాయని, వాటి నుంచి అతడు ఏడాదికి రూ.2.5 కోట్లు ఆదాయం పొందుతున్నాడని తెలుపుతూ జీఎస్టీ నోటీసులు జారీ చేశారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు.
నిందితుడు దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం నోయిడాలో నేనొక సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్యాకర్ గా పని చేసేవాడిని. అక్కడి కాంట్రాక్టర్లు నాకు జీతం ఇవ్వడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవ్వమని కోరారు. మార్చి 13, 16న అల్లాగే ఏప్రిల్ 4న రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖ నుండి, అలీగఢ్ ఆదాయపు పన్ను కార్యాలయం నుండి ఘజియాబాద్ లోని మా ఇంటికి నోటీసులు వచ్చాయి.
జేకే ట్రేడర్స్ అనే నా కంపెనీ టర్నోవర్ రూ.136.60 లక్షలని, అలాగే సర్వశ్రీ జేకె ట్రేడర్స్ అనే నా మరో కంపెనీ టర్నోవర్ 116.24 లక్షలని రెండిటికీ కలిపి మొత్తం రూ.24. 61 లక్షలు టాక్స్ కట్టాల్సి ఉందని నోటీసుల్లో ఉంది. జీఎస్టీ నెంబర్ ఆధారంగా చూస్తే అది జితేందర్ సిసోడియా అనే వ్యక్తి పేరు మీద ఉందని.. మా పాత కంపెనీ యజమాని, జితేందర్ ఇద్దరూ కలిసి ఏదైనా మతలబు చేసి ఉంటారని ఆరోపించాడు.
ఏమి చెయ్యాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించానని.. బులంద్ షహర్, నోయిడా, ఘజియాబాద్ తిరిగి తిరిగి చివరకు గౌతమ్ బుద్ధా జిల్లాలోని సెక్టార్-63 పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశానని ఇంతవరకు దానికే రూ.40000 ఖర్చు చేశానని భోరుమన్నాడు.
ఇది కూడా చదవండి: పక్కా ఆధారాలున్నాయి.. ఇక జైలుకే..
Comments
Please login to add a commentAdd a comment