goods service tax
-
కార్మికుడికి రూ.24. 61 లక్షలు టాక్స్ కట్టమంటూ నోటీసులు..?
లక్నో: నిరుద్యోగి ఆయిన ఒక కార్మికుడి కంపెనీ టర్నోవర్ రూ.2. 5 కోట్లు దాటింది కానీ అతడు టాక్స్ కట్టడం లేదంటూ అతడికి నోటీసులు పంపించింది ఆదాయపు పన్ను శాఖ. రోజుకి రూ. 300 సంపాదించుకునే కూలీని, అంత మొత్తాన్ని ఎక్కడ నుండి తెచ్చి కట్టాలని వాపోతున్నాడు ఆ కార్మికుడు. బులంద్ షహర్ కు చెందిన 22 ఏళ్ల దేవేంద్ర కుమార్ కు చాలా కాలంగా ఉద్యోగం లేదు. ఏవో కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు కానీ అక్కడ ఎక్కువకాలం స్థిరంగా లేడు. ప్రస్తుతానికైతే అతడు నరౌరాలో ఒక టౌన్ షిప్ ప్రాజెక్టులో దినవారీ కూలీగా పనిచేస్తున్నాడు. అతడికి రెండు వ్యాపారాలున్నాయని, వాటి నుంచి అతడు ఏడాదికి రూ.2.5 కోట్లు ఆదాయం పొందుతున్నాడని తెలుపుతూ జీఎస్టీ నోటీసులు జారీ చేశారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. నిందితుడు దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం నోయిడాలో నేనొక సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్యాకర్ గా పని చేసేవాడిని. అక్కడి కాంట్రాక్టర్లు నాకు జీతం ఇవ్వడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవ్వమని కోరారు. మార్చి 13, 16న అల్లాగే ఏప్రిల్ 4న రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖ నుండి, అలీగఢ్ ఆదాయపు పన్ను కార్యాలయం నుండి ఘజియాబాద్ లోని మా ఇంటికి నోటీసులు వచ్చాయి. జేకే ట్రేడర్స్ అనే నా కంపెనీ టర్నోవర్ రూ.136.60 లక్షలని, అలాగే సర్వశ్రీ జేకె ట్రేడర్స్ అనే నా మరో కంపెనీ టర్నోవర్ 116.24 లక్షలని రెండిటికీ కలిపి మొత్తం రూ.24. 61 లక్షలు టాక్స్ కట్టాల్సి ఉందని నోటీసుల్లో ఉంది. జీఎస్టీ నెంబర్ ఆధారంగా చూస్తే అది జితేందర్ సిసోడియా అనే వ్యక్తి పేరు మీద ఉందని.. మా పాత కంపెనీ యజమాని, జితేందర్ ఇద్దరూ కలిసి ఏదైనా మతలబు చేసి ఉంటారని ఆరోపించాడు. ఏమి చెయ్యాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించానని.. బులంద్ షహర్, నోయిడా, ఘజియాబాద్ తిరిగి తిరిగి చివరకు గౌతమ్ బుద్ధా జిల్లాలోని సెక్టార్-63 పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశానని ఇంతవరకు దానికే రూ.40000 ఖర్చు చేశానని భోరుమన్నాడు. ఇది కూడా చదవండి: పక్కా ఆధారాలున్నాయి.. ఇక జైలుకే.. -
మహేష్.. శభాష్!
సాక్షి, హైదరాబాద్ : సినిమా ప్రేక్షకుల నుంచి జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ.35.66 లక్షలను ‘వినియోగదారుల సంక్షేమనిధి’కి చెల్లించిన సినీనటుడు మహేష్‌బాబును జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ ప్రశంసించింది. మల్టీ సినిమా థియేటర్ కాంప్లెక్సు (ఏఎంబీ సినిమాస్) యజమానులైన మహేష్‌బాబు, సునీల్ నారంగ్‌లు తమది కాని లాభాన్ని గుర్తించి.. తిరిగి చెల్లించినందుకు అభినందిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎవరూ ఇలా బాధ్యతగా జీఎస్టీని వెనక్కు తిరిగి ఇవ్వలేదని.. మహేష్‌బాబు, సునీల్‌లు అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరుల్లోని థియేటర్ల యజమానులపై ఈ నిర్ణయం సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది. ఇది చదవండి : మహేశ్‌బాబుకు జీఎస్టీ ‘షాక్’ -
మహేశ్‌బాబుకు జీఎస్టీ ‘షాక్’
సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు మహేశ్‌బాబుకు మరోసారి జీఎస్టీ షాక్ తగిలింది. మహేశ్ బాబు కు సంబంధించిన ఏఎంబీ మాల్లోని మల్టీప్లెక్స్‌లపై ప్రదర్శిస్తున్న సినిమాల టికెట్ల ధర విషయంలో జీఎస్టీ నిబంధనలను అతిక్రమించారని, తగ్గించిన పన్ను ఆధారంగా టికెట్లు అమ్మకుండా ఎక్కువ వసూలు చేశారని జీఎస్టీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో జీఎస్టీ అధికారులు చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధమయ్యే తరుణంలో ఏఎంబీ మాల్ యాజమాన్యం టికెట్ ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది. అయినా టికెట్ ధరలు ఎక్కువగా వసూలు చేసినందుకు రూ.35 లక్షలు చెల్లించాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుం టామని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇటీవలే మహేశ్‌బాబు ఆదాయానికి సంబంధించిన వ్యవహారంలో పన్ను వసూలు చేసిన జీఎస్టీ అధికారులు మళ్లీ ఇప్పుడు ఆయనకు సంబంధించిన మాల్ నుంచి పన్ను వసూలుకు ఉపక్రమించడం గమనార్హం. సినిమా మాల్స్‌పై ప్రత్యేక దృష్టి: తగ్గించిన జీఎస్టీ ధరల ప్రకారం సినిమా టికెట్లు అమ్ముతున్నారా లేదా అనే కోణంలో హైదరాబాద్ జీఎస్టీ అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నట్లు కన్పిస్తోంది. జీఎస్టీ నిబంధనలకు విరుద్ధంగా టికెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారనే ఆరోపణలపై ప్రసాద్, ఐమ్యాక్స్, పీవీఆర్, ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్స్‌లపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. దీంతో చాలా మల్టీప్లెక్స్‌లలో టికెట్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు రంగారెడ్డి జీఎస్టీ కమిషనరేట్ కూడా రంగంలోకి దిగడంతో ఏఎంబీ మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
28% శ్లాబులో ఇక 35 మాత్రమే
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థలో అత్యధిక పన్ను రేటైన 28 శాతం శ్లాబులో ఇక 35 వస్తువులే మిగిలాయి. 2017 జూలై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు 28 శాతం శ్లాబులో మొత్తం 226 వస్తువులు ఉండేవి. అయితే గత ఏడాది కాలంలో ఈ శ్లాబులోని 191 వస్తువులపై జీఎస్టీ మండలి పన్ను రేట్లను తగ్గించింది. వాటిలో కొన్నింటిపై పన్ను పూర్తిగా ఎత్తివేయగా, మరి కొన్నింటిని 5, 12, 18 శాతం శ్లాబుల్లో చేర్చింది. ప్రస్తుతం 28 శాతం శ్లాబులో ఎయిర్ కండీషనర్లు, వంటపాత్రలు కడిగే యంత్రాలు, 27 అంగుళాల కంటే పెద్దవైన టీవీలు, తదితర విలాసవంతమైన వస్తువులతోపాటు సిగరెట్లు, గుట్కా వంటి ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులు మాత్రమే ఉన్నాయి. ఈ నెల 27న కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చి, స్థిరమైన ఆదాయం రావడం మొదలైన అనంతరం.. 28 శాతం శ్లాబు నుంచి మరికొన్ని వస్తువులను కూడా ప్రభుత్వం తొలగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్యంత విలాసవంతమైన వస్తువులు, ఆరోగ్య హానికారక ఉత్పత్తులపైన మాత్రమే అత్యధిక పన్నును వసూలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండొచ్చంటున్నారు.పెద్ద టీవీలు, పాత్రలు కడిగే యంత్రాలు, డిజిటల్ కెమెరాలు, ఏసీలు తదితరాలను కూడా ప్రభుత్వం 18 శాతం పన్ను శ్లాబులోనే చేర్చొచ్చని డెలాయిట్ ఇండియా భాగస్వామి ఎంఎస్ మణి పేర్కొన్నారు. ఆరోగ్యానికి చేటు చేసే ఉత్పత్తులను మాత్రమే 28 శాతం జీఎస్టీ శ్లాబులో ఉంచితే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. భవిష్యత్తులో అత్యంత విలాస వస్తువులు, ఆరోగ్యం పాడు చేసే ఉత్పత్తులపైనే 28 శాతం పన్ను ఉండేలా ప్రభుత్వ వైఖరి కనిపిస్తోందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ భాగస్వామి అభిషేక్ జైన్ అంటున్నారు. 27 నుంచి 28 శాతం శ్లాబులో మిగిలేవి ఏసీలు, 27 అంగుళాల కన్నా పెద్ద టీవీలు, పాత్రలు కడిగే యంత్రాలు, డిజిటల్ కెమెరాలు, వీడియో రికార్డర్లు, సిమెంటు, మోటార్ వాహనాలు, వాహనాల విడిభాగాలు, టైర్లు, స్టీమర్లు, విమానాలు, శీతల పానీయాలు, బెట్టింగ్, పొగాకు, సిగరెట్, పాన్ మసాలా, గుట్కాలు తదితరాలు. భవిష్యత్తులో మూడు శ్లాబ్‌లే: సుశీల్ మోదీ జీఎస్టీలో పన్ను రేట్ల శ్లాబ్‌లను భవిష్యత్తులో మూడుకు తగ్గించే అవకాశం ఉండొచ్చని బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ వెల్లడించారు. జీఎస్టీపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘానికి సుశీల్ నేతృత్వం వహిస్తుండటం తెలిసిందే. ‘ప్రస్తుతం జీఎస్టీలో 0, 5, 12, 18, 28 శాతం పన్నులు.. మొత్తం 5 శ్లాబులు ఉన్నాయి. వీటిని మూడుకు తగ్గించే ఆలోచన ఉంది. అయితే, ఇది రాష్ట్రాల ఆదాయానికి సంబంధించింది కాబట్టి సమయం పడుతుందని సుశీల్ చెప్పారు. -
ఏప్రిల్ 1 నుంచి ఈ–వే బిల్లు అమలు
న్యూడిల్లీ: అంతర్రాష్ట్ర సరకు రవాణా కోసం ఎలక్ట్రానిక్–వే బిల్లును వచ్చే నెల 1 నుంచి తప్పనిసరి చేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయించింది. పన్ను రిటర్నుల విధానాన్ని మరింత సరళీకరించడంపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జీఎస్టీ మండలి ప్రస్తుత విధానాన్నే మరో 3 నెలలు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. వాణిజ్య సంస్థలు ప్రతినెలా జీఎస్టీఆర్–3బీ, జీఎస్టీఆర్–1 అనే 2 రకాల రిటర్నులు ఇస్తున్నాయి. వీటిని సరళీకరించి ఒకే రిటర్ను పత్రాన్ని ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని భావించామనీ, సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆ నిర్ణయం వాయిదా పడిందని జైట్లీ చెప్పారు. దీంతో ప్రస్తుతం ఉన్న రిటర్నుల విధానాన్నే జూన్ వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. కాగా, అంతర్రాష్ట్ర రవాణా కోసం ఈ–వే బిల్లును ప్రభుత్వం ఫిబ్రవరి 1నే అమలు చేయగా ఆ వ్యవస్థలో లోపాలు తలెత్తి సరిగ్గా పనిచేయకపోవడం తెలిసిందే. దీంతో తప్పులను సరిదిద్ది అంతర్రాష్ట్ర సరకు రవాణా కోసం ఏప్రిల్ 1 నుంచి ఈ–వే బిల్లులను మళ్లీ తప్పనిసరి చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. ఒకే రాష్ట్రంలో రవాణాకు కూడా ఈ–వే బిల్లులను దశల వారీగా తప్పనిసరిచేస్తామనీ, ఇందుకోసం రాష్ట్రాలను నాలుగు భాగాలుగా విభజిస్తామని జైట్లీ తెలిపారు. జూన్ 1 నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ ఈ–వే బిల్లుల వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఏప్రిల్ 15న తొలిదశను అమలు చేస్తామనీ, ఆ రాష్ట్రాలేవో ఏప్రిల్ 7న ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అలాగే ఎగుమతిదారులకు జీఎస్టీ కింద రీఫండ్లు చెల్లించేందుకు ఈ–వాలెట్‌ను అక్టోబరు 1 నాటికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. -
పన్ను బకాయిలపై టార్గెట్!
- బేస్ రెవెన్యూ పెంపు కోసం వాణిజ్య పన్నుల శాఖ కసరత్తు - బకాయిల వసూళ్లకు రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగానికీ సిద్ధం - ఇప్పటికే రాష్ట్రంలోని వందల మంది డీలర్లకు నోటీసులు - రూ.350 కోట్లకుపైగా వసూలు చేయాలని నిర్ణయం - జీఎస్టీ అమలు నేపథ్యంలో పరిహార పన్ను లబ్ధిపై దృష్టి సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలు నేపథ్యంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల మూల ఆదాయాన్ని (బేస్ రెవెన్యూ) పెంచుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూల ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా వీలైనంత మేర కేంద్రం నుంచి నిధులు రాబట్టాలన్న యోచనతో.. పెండింగ్ బకాయిల వసూళ్లపై దృష్టి సారించారు. ముఖ్యంగా 2009–10 నుంచి 2016–17 మధ్య బకాయిపడ్డ డీలర్ల నుంచి వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ మేరకు రాష్ట్రంలోని వందలాది మంది డీలర్లకు ఇప్పటికే నోటీసులిచ్చారు. రెవెన్యూ రికవరీ చట్టాన్ని కూడా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. మొండి బకాయిలపై దృష్టి.. వాణిజ్య పన్నుల చెల్లింపు ప్రక్రియలో పన్నులు పెండింగ్ పడడం, ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడే వారిని ఏటా గుర్తించడం సాధారణంగా జరుగుతుంటుంది. వీటినే డిక్లేర్డ్, డిటెక్టెడ్ పన్నులు అంటారు. తాజాగా వీటిని వసూలు చేయడంపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ.. వందల మంది డీలర్లకు నోటీసులు జారీ చేసింది. మొత్తంగా 2 నెలలు గా బకాయిలపై కసరత్తుచేసి న పన్నుల శాఖ ఉన్నతాధికా రులు.. రూ.350 కోట్ల వరకు రావాల్సి ఉందని గుర్తించారు. వచ్చే మార్చికల్లా రూ.14,037 కోట్లు జీఎస్టీ అమలు నేపథ్యంలో రాష్ట్రాల పన్ను రాబడి లెక్కలను తేల్చేందుకు తీసుకొనేందుకు 2015–16 ఆర్థిక సంవత్సరాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్రంలో ఆ ఏడాది వాణిజ్య పన్నుల ఆదాయం రూ.16,201 కోట్లుగా లెక్కించారు. అక్కడి నుంచి ఏటా 14శాతం పెంపును చేర్చుతూ.. ఆ మేరకు పన్ను రాకపోతే తగ్గిన మొత్తం మేరకు కేంద్రం అందజేస్తుంది. ఈ లెక్కన రాష్ట్రానికి 2017–18లో రూ.21,055 కోట్లు ఆదాయం రావాలి. అయితే ఈ ఏడాది జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చినందున.. ఆ తేదీ నుంచి వచ్చే మార్చి వరకు రూ.14,037 కోట్లు పన్నుల కింద రావాలి. మరోవైపు వాణిజ్య పన్నుల శాఖ ఈ ఏడాది పన్ను వసూళ్ల టార్గెట్‌ను రూ.32 వేల కోట్లుగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో వీలైనంత మేరకు పన్నులు వసూలు చేసి, ఈ ఏడాది లెక్క చూపించగలిగితే వచ్చే ఏడాదికి అంత లబ్ధి కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. -
జీఎస్టీతో ఒకే పన్ను విధానం
►‘సాక్షి’ డయల్ యువర్ సీటీఓకు అనూహ్య స్పందన ►రూ.20 లక్షల లోపు టర్నోవర్‌కు పన్ను ఉండదు ►జాయింట్ కమిషనర్ కృష్ణమోహనరెడ్డి నేటి నుంచి వస్తు సేవా పన్ను(జీఎస్టీ) అమలులోకి రానుంది. ఈ పన్ను అమలుతో కొన్ని వస్తువులు ధరలు పెరగనుండగా మరికొన్ని వస్తువులు రేట్లు తగ్గనున్నాయి. జీఎస్టీ పరిధిలోకి 10 వేల రకాలు వస్తువులు రానున్నాయి. అయితే ఏ కొద్ది మంది వ్యాపారులు ఒక చోట చేరినా జీఎస్టీ గురించి చర్చ నడుస్తోంది. ఏయే వస్తువులు ధరలు పెరుగుతాయో, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయోనన్న సందేహాలు ప్రతి ఒక్కరిలో నెలకొన్నాయి. ఈ సందేహాలను నివృత్తి చేసేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో డయల్ యువర్ సీటీఓ కార్యక్రమాన్ని స్థానిక వాణిజ్యపన్నులశాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించారు. వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కృష్ణమోహనరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పలువురు వ్యాపారులు, వినియోగదారుల సందేహాలను నివృత్తి చేశారు. -
నేడే ఆరంభం
నేటి నుంచి కొత్త వస్తు, సేవల పన్నులు అమలు పెరగనున్న రైస్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల ధరలు అదే బాటలో టి.వి.లు, వాషింగ్మిషన్లు, ఫ్రిజ్‌లు ఔషధాలు, వ్యవసాయ పనిముట్లపై భారం తగ్గనున్న నిత్యవసర సరుకుల ధరలు, కార్ల ధరలు అదే బాటలో దుస్తులు, సిమెంట్ ధరలు ఇప్పటికీ పన్నులపై స్పష్టత కరువు ఆందోళనలో వ్యాపార, ఉద్యోగ, సామాన్య వర్గాలు ఒంగోలు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం నేటి శనివారం నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. శుక్రవారం అర్థరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాలు వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీఎస్టీ అమలును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ అమలుపై ప్రజల నుంచి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వ్యాపార వర్గాలతో పాటు మిగిలిన మరికొన్ని వర్గాలు జీఎస్టీ వల్ల తీవ్రంగా నష్టపోతామని వాదిస్తుండగా.. పాలక పక్షం మాత్రం సామాన్యులపై భారం పడబోదని చెబుతోంది. మొత్తంగా జీఎస్టీ అమలుపై మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఏ వస్తువులపై ఎంత శాతం పన్ను ఉంటుంది. ధరలు తగ్గనున్న వస్తువులేవీ, పెరగనున్న వస్తువులేవీ అన్న దానిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవం అన్ని వర్గాలనూ ఆందోళనకు గురి చేస్తోంది. జీఎస్టీ ప్రభావంతో వర్గాలకు అవసరమైన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గనున్నాయని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. దేశమంతటా ఒకే పన్ను విధానం తీసుకురావడంతో వ్యాపారులు రకరకాల పన్నుల పేరు చెప్పి వినియోగదారులను మోసం చేసే అవకాశం లేకుండా పోయింది. నిత్యవసరాలను పన్ను నుంచి మినహాయించడంతోపాటు మరికొన్నింటిని కనిష్ట పన్ను రేటు 5 శాతం శ్లాబులోనే ఉంచారు. దీంతో 332 సరుకులకు పన్ను లేకుండా కనిష్ట పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. జీఎస్టీ వల్ల 115 వస్తువుల ధరలు తగ్గనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వస్తు సేవల పన్నుతో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయోనన్న దానిపై స్పష్టత లేదు. జీఎస్టీతో చిన్న వ్యాపారులకు పన్ను బాధ తప్పనుందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వార్షిక టర్నోవర్ 7.5 లక్షలు దాటిన వారంతా వ్యాట్ పరిధిలోకి వచ్చేవారు. జీఎస్టీలో ఈ పరిమితిని 20 లక్షలకు పెంచారు. ఈ లెక్కన వ్యాట్ పరిధిలో ఉన్న వారి సంఖ్య గణనీయంగా తగ్గనుంది. వ్యవసాయ పనిముట్లపై భారం.. దేశంలో 55 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ రంగం జీఎస్టీ వల్ల మరింత నష్టపోతుందన్న వాదన వినిపిస్తోంది. సేద్యానికి అవసరమైన పనిముట్లు జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. ట్రాక్టర్ విడి భాగాలపై తొలుత 28 శాతం పన్ను విధించి విమర్శలు వెల్లువెత్తడంతో దీనిని 18 శాతానికి తగ్గించారు. మొత్తంగా ఇప్పటి వరకు ఎలాంటి డ్యూటీ లేని ట్రాక్టర్, ఇతర పనిముట్లపై 12 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిఎస్టితో వ్యాపారులు, ట్రేడర్లు, వాణిజ్య, సెంట్రల్ ఎక్సైజ్, అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్ ద్వారానే లావాదేవీలు నడపవచ్చు. పన్ను రూ.10 వేలు దాటితే నగదు రూపంలో కాకుండా ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి. ఎలక్ట్రానిక్స్ వస్తువులు పై పైకి.. బ్రాండెడ్ రైస్ జీఎస్టీ తర్వాత 5 శాతం పెరగనుంది. (10 కేజీల రైస్ బ్యాగుకు రూ.25 పన్ను పెరగనుంది), సిమ్‌కార్డులు, రీచార్జ్ కార్డులపై పన్ను రేట్లు 15 నుంచి 18 శాతానికి పెరగనున్నాయి. నెయ్యి 5 శాతం నుంచి 12 శాతానికి పెరగనుంది. మొబైల్ ఫోన్లు 6 శాతం నుంచి 12 శాతానికి, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు 6 నుంచి 18 శాతానికి పెరగనున్నాయి. ఆయుర్వేదం మందులు 10 నుంచి 12 శాతానికి, బ్రాండెడ్ న్యూడిల్స్, కూల్‌డ్రింక్స్ ఒక శాతం పెరగనున్నా యి. టి.వి.లు, వాషింగ్ మిషన్లు, ఫ్రిజ్, మైక్రోఓవెన్లు 26 నుండి 28 శాతానికి పెరగనున్నాయి. ఔషధాలు మరింత ప్రియం.. జీఎస్టీతో కొన్ని ఔషధాల ధరలు పెద్ద ఎత్తున పెరగనుండగా మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ అండ్ మెడిసిన్, ఇన్సులిన్ ఇంజక్షన్ల ధరలు 11 శాతం నుంచి 5 శాతానికి తగ్గనుండగా, వైద్యపరీక్షల కిట్లు 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గనున్నాయి. సర్జరికల్ ఇంప్లాంట్స్, కంటి లెన్స్‌లు 17.5 శాతం నుంచి 12 శాతానికి తగ్గనున్నాయి. ఇప్పటి వరకు ఔషధాలపై 5 శాతం పన్ను మాత్రమే ఉండగా ఇకపై 12 నుంచి 18 శాతం పన్ను పరిధిలోకి వస్తుంది. ఉదాహరణకు బి కాంప్లెక్స్, మల్టీ విటమన్, జింకోవిక్ లాంటి విటమిన్ టాబ్లెట్లు, యాంటీబయోటిక్స్ మందులన్నీ 12 శాతం పన్ను పరిధిలోకి వస్తున్నాయి. సెరెలాక్, పెడిన్యూర్ వంటి ప్రోటీన్ (చిన్నపిల్లలకు ఇచ్చే ఆహారం) 18 శాతం పన్ను పరిధిలోకి వస్తున్నాయి. పొగాకు, బొగ్గు తదితర ఉత్పత్తులపైనా ప్రత్యేక పన్నులు విధించారు. మొత్తంగా జీఎస్టీ కొందరికి మోదం.. ఖేదం మిగిల్చింది. నిత్యావసరాలు అందుబాటులోకి.. జీఎస్టీ ప్రభావంతో కొన్ని నిత్యవసరల ధరలు మరింతగా తగ్గనున్నాయి. పౌడర్ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుంది. కాఫీ పౌడర్ 29 నుంచి 18 శాతానికి, చక్కెర 10 నుంచి 5 శాతానికి తగ్గనుంది. వెన్న 14.5 నుంచి 12 శాతానికి, హెయిర్ఆయిల్ 29 నుంచి 18 శాతానికి, టూత్‌పేస్ట్, సబ్బులు 29 నుంచి 18 శాతానికి తగ్గనున్నాయి. చాక్లెట్లు, బిస్కెట్లు 29 నుంచి 18 శాతానికి, బర్త్‌డే కేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు ఇంతే శాతంలో తగ్గనున్నాయి. ఫర్నీచర్ 29 నుంచి 12 శాతానికి తగ్గనుండగా, పిజ్జా, బర్గర్లు 3 శాతం తగ్గనున్నాయి. తగ్గేవి ఇవీ... చెప్పులు, బూట్లు ధరల్లోనూ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రూ.1000 పైన కొంటే ప్రస్తుతమున్న 26.5 నుంచి 18 శాతానికి తగ్గనున్నాయి. రూ.500 నుంచి రూ.1,000 మధ్యన కొనుగోలు చేసే వాటిపై 20.5 నుంచి 18 శాతానికి తగ్గనున్నాయి. రెడీమేడ్ దుస్తుల్లో రూ.1,000 పైన కొనుగోలు చేస్తే ప్రస్తుతం ఉన్న 12.5 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గనున్నాయి. రూ.1,000 లోపు కొనుగోలు చేస్తే ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గుతాయి. వైద్య పరికరాలు 18 శాతం నుంచి 12 శాతానికి, సిమెంట్ 29 నుంచి 28 శాతానికి తగ్గనున్నాయి. పెద్ద వాహనాలు 30 శాతం నుంచి 28 శాతానికి తగ్గనున్నాయి. ఎస్‌యూబీ కార్ల ధరలు 55 నుంచి 43 శాతానికి తగ్గనుండగా, లగ్జరీ కార్లు 49 శాతం నుంచి 43 శాతానికి, చిన్న కార్లు, బైక్‌లు 30 నుంచి 28 శాతానికి తగ్గుతాయి. -
మందుల వ్యాపారంపై పన్నుపోటు
వజ్రపుకొత్తూరు: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) దెబ్బకు పలు రంగాల్లో వ్యాపారం కుదేలవుతోంది. ఇప్పటికే వస్త్రాలు, గ్రానైట్ వ్యాపారులు పన్ను సడలింపు కోరుతూ ఆందోళన బాట పట్టారు. తాజాగా జీఎస్టీ ప్రభావం మందుల వ్యాపారంపైనా పడింది. జూలై 1 నుంచి జీఎస్టీ బాదుడుకు రంగం సిద్ధం కావడంతో చాలా ఏజెన్సీలు స్టాకును తిప్పి పంపుతున్నాయి. దీంతో మందుల కొరత ఏర్పడి విక్రయాలు 25 శాతం మేర పడియాయి. షాపుల్లో ఇప్పటికే ఉన్న స్టాక్‌పై కూడా పన్ను భాగం పడుతుండడంతో ఏజన్సీలు స్టాక్‌ను ఆయా ఫార్మా కంపెనీలకు తిప్పి పంపుతున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానంతో రోజూ కీలకంగా అవసరమయ్యే మందులు మెడికల్ దుకాణాల్లో లభించడం లేదు. దీంతో చేసేది లేక కాంబినేషన్‌తో ఉన్న ఇతర కంపెనీల మందులను ప్రజలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే 30 వాతం మేర మందులు మార్కెట్లో లభించడం లేదని సమాచారం. 5 నుంచి 28 శాతం పన్ను.. జిల్లాలో దాదాపు 2136 మంది ఔషధ విక్రయదారులు ఉన్నారు. ఇందులో సుమారు 195 దుకాణాలు హోల్‌సేల్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. రోజుకు సగటున రూ.1.86 కోట్ల వ్యాపారం జరగుతోందని అంచనా. జీఎస్టీ ప్రభావంతో మందులపై పన్ను వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రస్తుతం ఔషధాలపై 5 శాతం పన్ను విధిస్తుండగా జీఎస్టీ వస్తే నాలుగు స్థాయిలుగా పన్ను విధించనున్నారు. వివిధ కేటగిరీల ఔషధాల టర్నోవర్ ఆధారంగా 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా పన్ను చెల్లించి వ్యాపారులు మందులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నెలాఖరు వరకు దుకాణాల్లో మిగిలిన సరుకులకు కూడా జీఎస్టీ పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో దుకాణదారులు ఆందోళన చెందుతున్నారు. పైగా ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉండటం పెద్ద సమస్యగా మరిందని పలువురు దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనపు బాదుడు.. జీఎస్టీ ప్రభావం ఔషధ వ్యాపారంపై తీవ్రంగా పడుతోంది. జూలై ఒకటి నుంచి 80 శాతం ఔషధాలపై 12 శాతం, షుగర్‌ను నియంత్రించే ఇన్సులిన్‌పై 5 శాతం, మెడికేటెడ్ సోపులు, టూత్‌పేస్ట్‌లపై 18 శాతం, ఔషధ ఆహార పదార్థాలపై 28 శాతం పన్ను పడనుంది. -
వాణిజ్య స్థలం కొంటున్నారా?
సాక్షి, హైదరాబాద్: రూ.1,000, రూ.500 నోట్ల రద్దు, స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు, వస్తు సేవల పన్ను వంటి రకరకాల కారణాలతో దేశంలో వాణిజ్య స్థలాల ధరలు కొంతమేర తగ్గాయని సర్వేలు చెబుతున్నాయి. అందుకే కమర్షియల్ ప్రాపర్టీల్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంటిపై వచ్చే అద్దెతో పోలిస్తే వాణిజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8–11 శాతం వరకు అద్దె గిట్టుబాటవుతుంది కూడా. కమర్షియల్ ప్రాపర్టీల్లో స్థలం కొనుగోలు చేసిన తర్వాత దాన్ని విక్రయించగానే మెరుగైన ఆదాయం వస్తుంది. ఇదొక్కటే కాదు ప్రతి నెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. అందుకే పెట్టుబడిదారులెవరైనా సరే పెట్టుబడుల కోసం ముందుగా చూసేది కమర్షియల్ ప్రాపర్టీలనే. కాకపోతే అన్ని విధాల అభివృద్ధికి ఆస్కారమున్న చోట నిర్మితమయ్యే వాణిజ్య కట్టడాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి. ఇవే కీలకం.. ♦ వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి. ♦ ఒక ప్రాంతంలో కట్టే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశముందా అనే విషయాన్ని బేరీజు వేయాలి. ♦ భవనాన్ని నిర్మించే డెవలపర్ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది. ♦ మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగడానికి ఆస్కారముందా? ఆయా ప్రాంతంలో జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి. ♦ మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడుంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి. ♦ వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది.