జీఎస్టీతో ఒకే పన్ను విధానం
►‘సాక్షి’ డయల్ యువర్ సీటీఓకు అనూహ్య స్పందన
►రూ.20 లక్షల లోపు టర్నోవర్‌కు పన్ను ఉండదు
►జాయింట్ కమిషనర్ కృష్ణమోహనరెడ్డి
నేటి నుంచి వస్తు సేవా పన్ను(జీఎస్టీ) అమలులోకి రానుంది. ఈ పన్ను అమలుతో కొన్ని వస్తువులు ధరలు పెరగనుండగా మరికొన్ని వస్తువులు రేట్లు తగ్గనున్నాయి. జీఎస్టీ పరిధిలోకి 10 వేల రకాలు వస్తువులు రానున్నాయి. అయితే ఏ కొద్ది మంది వ్యాపారులు ఒక చోట చేరినా జీఎస్టీ గురించి చర్చ నడుస్తోంది. ఏయే వస్తువులు ధరలు పెరుగుతాయో, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయోనన్న సందేహాలు ప్రతి ఒక్కరిలో నెలకొన్నాయి.
ఈ సందేహాలను నివృత్తి చేసేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో డయల్ యువర్ సీటీఓ కార్యక్రమాన్ని స్థానిక వాణిజ్యపన్నులశాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించారు. వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కృష్ణమోహనరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పలువురు వ్యాపారులు, వినియోగదారుల సందేహాలను నివృత్తి చేశారు.