ఎన్నికల నేపథ్యంలో వస్తువులకు అసాధారణ గిరాకీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం | Lok Sabha Elections: Election Commission Says GST Eway Bill Analytics To Track Real Time, Details Inside - Sakshi
Sakshi News home page

ఎన్నికల నేపథ్యంలో వస్తువులకు అసాధారణ గిరాకీ..

Published Mon, Mar 18 2024 11:30 AM | Last Updated on Mon, Mar 18 2024 12:10 PM

Election Commission Says GST Eway Bill Analytics To Track Real Time - Sakshi

ఈ-వేబిల్లులు తప్పనిసరి చేసిన ప్రభుత్వం
 

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొన్ని రకాల వస్తువులు, సేవలకు అసాధారణ రీతిలో గిరాకీ పెరుగుతోంది. అందుకుగల కారణాలు విశ్లేషించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈమేరకు జీఎస్‌టీ ఇ-వేబిల్లుల అనలటిక్స్‌ను ఉపయోగించి రియల్‌టైమ్‌లో ప్రభుత్వం ధరల ప్రభావాన్ని పరిశీలిస్తోందని భారత ఎన్నికల సంఘం తెలిపింది. 

జీఎస్‌టీ విధానంలో వస్తువుల మొత్తం విలువ రూ.50,000 మించితే అంతరాష్ట్ర రవాణాకు ఇ-వేబిల్లును తీసుకోవడం తప్పనిసరి. రూ.5 కోట్లకు పైగా టర్నోవరు ఉన్న వ్యాపార సంస్థలు కూడా 2024 మార్చి 1 నుంచి ఇ-వేబిల్లులు తీసుకోవాల్సి ఉంది. వస్తు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి. నిజంగా గిరాకీ ఏర్పడిందా.. లేదంటే కృత్రిమ కొరత సృష్టించేలా ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా అనే అంశాలను పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వం అడుగులేస్తోంది. 

ఇదీ చదవండి: ఉద్యోగులు కంపెనీ ఎందుకు మారడం లేదో తెలుసా..?

వస్తువులకు గిరాకీ పెరగడాన్ని పర్యవేక్షించేందుకు రియల్‌- టైం జీఎస్‌టీ ఇ-వేబిల్లు అనలటిక్స్‌ మంచి సాధనమని నిపుణులు భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ రూపంలోని పత్రాలను విశ్లేషణ చేయడం ద్వారా మార్కెట్ల ధోరణి, పన్ను నిబంధనల పాటింపు వంటి వాటిని అధికారులు, వ్యాపారులు గుర్తించే అవకాశం ఉంది. దాంతో వెంటనే నిర్ణయాలు తీసుకునే వీలుంటుందని చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement