
సాక్షి, హైదరాబాద్ : సినిమా ప్రేక్షకుల నుంచి జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ.35.66 లక్షలను ‘వినియోగదారుల సంక్షేమనిధి’కి చెల్లించిన సినీనటుడు మహేష్‌బాబును జీఎస్‌టీ హైదరాబాద్ కమిషనరేట్ ప్రశంసించింది. మల్టీ సినిమా థియేటర్ కాంప్లెక్సు (ఏఎంబీ సినిమాస్) యజమానులైన మహేష్‌బాబు, సునీల్ నారంగ్‌లు తమది కాని లాభాన్ని గుర్తించి.. తిరిగి చెల్లించినందుకు అభినందిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎవరూ ఇలా బాధ్యతగా జీఎస్టీని వెనక్కు తిరిగి ఇవ్వలేదని.. మహేష్‌బాబు, సునీల్‌లు అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరుల్లోని థియేటర్ల యజమానులపై ఈ నిర్ణయం సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది.
ఇది చదవండి : మహేశ్‌బాబుకు జీఎస్టీ ‘షాక్’