హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో ప్రమాదవశాత్తూ ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం పాతబిల్డింగ్ ఏఎంసీ
బ్లాక్లోని రెండో అంతస్తులో శుభ్రం చేస్తుండగా కళ్లు తిరగడంతో సదానంద్(40) అనే కార్మికుడు కిందపడ్డాడు. ఆ సమయంలో ఎవరు అతనిని గమనించకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. కాసేపటి తర్వాత గమనించిన వారు అతనిని ఐసీయూకు తరలించారు. అప్పటికే సదానంద్కు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
నిమ్స్‌లో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
Published Sun, Feb 7 2016 5:05 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
Advertisement
Advertisement