సనత్‌నగర్/లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రిలో అనస్థీషియా విభాగంలో అడిషనల్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రాచీకార్ (46) బలవన్మరణానికి పాల్పడ్డారు. నెల రోజుల క్రితమే ఖాళీ చేసిన ఇంటికి ఒంటరిగా వచ్చిన ఆమె అధిక మోతాదులో అనస్థీషియా ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన ప్రాచీకార్, దీపక్‌లు దంపతులు. ప్రాచీకార్ నిమ్స్‌లో ఎనస్థీషియా విభాగంలో అడిషనల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, భర్త దీపక్ మరో ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌గా ఉన్నారు.
వీరికి ఒక కుమారుడు. గత నెల రోజుల క్రితం వరకు బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉన్న వీరి కుటుంబం..మూసాపేటలో కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి బేగంపేటలోని ఇల్లు ఖాళీగా ఉంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పాత ఇంటికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి ప్రాచీకార్ వెళ్లారు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భర్త దీపక్ ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో అక్కడికి వచి్చన భర్తకు ఇంటి లోపలి గడియ వేసుకుని ఉండడంతో పాటు ఎంతకీ తలుపు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అపస్మారక స్థితిలో కనిపించిన ప్రాచీకార్‌ను హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి తరలించగా..పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.
కాగా ప్రాచీకర్ అధిక మోతాదులో మత్తు మందు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి గాం«దీలో పోస్టుమార్టం నిర్వహించి..నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. అయితే ప్రాచీకార్ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచి్చందనేది అంతుపట్టడం లేదు. ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి స్థితిలో ఉన్న ప్రాచీకార్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తెలియడం లేదని పోలీసులు పేర్కొన్నారు.
అయితే కుటుంబపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేక విధి నిర్వహణలో ఏదైనా ఇబ్బంది ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రాచీకర్ ఆత్మహత్య విషయం తెలిసి నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర ఉద్యోగులు అర్ధరాత్రి నిమ్స్‌కు వచ్చారు. ప్రాచీకర్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయంత్రం 6.30 గంటల వరకు ఆమె విధుల్లో ఉన్నారని, రెండేళ్ల బాలుడి సర్జరీకి సహకరించారని కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ అమరేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment