గుజరాత్: దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మూమూలుది కాదు. అందులోనూ పాకిస్తాన్‌పై విజయం అంటే మరింత మోజు. కానీ బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన ఓ క్రికెటర్ మాత్రం తాజాగా కడు దీనస్థితిలో జీవనం సాగిస్తున్నాడు. టీమిండియా బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు గుజరాత్‌కు చెందిన నరేష్ తుమ్డా. కట్ చేస్తే.. ఇపుడు జీవనోపాధి కోసం నానా పాట్లు పడుతున్నాడు. రోజు కూలిగా మారి పొట్ట పోషించుకుంటుకున్నాడు. అంతేకాదు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదైనా ఉద్యోగమివ్వాలని వేడుకుంటున్నాడు.
వివరాల్లోకి వెళితే 2018లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్‌ను సాధించిన విన్నింగ్ టీమ్‌లో సభ్యుడు నరేష్ తుమ్డా. షార్జాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌ను ఓడించింది. అయితే అంధుడైన నరేష్ ఇపుడు నవ్‌సారీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజుకు కేవలం 250 రూపాయలు సంపాదనతో అరకొర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిని కలిసినా ఎలాంటి ప్రయోజనం రాలేదని నరేష్ వాపోయాడు. ఇప్పటికైనా తన కుటుంబ పోషణకోసం ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.(షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్)
కాగా వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ 1996 నుండి బ్లైండ్ క్రికెట్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికి అయిదుసార్లు ఈ పోటీలు జరగ్గా 2018, జనవరి 20న షార్జాలో జరిగిన ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ని ఓడించింది. 308 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి మరీ ఈ విజయాన్ని దక్కించుకుంది. అలాగే 2012లో తొలిసారిగా బ్లైండ్ వరల్డ్ కప్ టీ20 బెంగళూరులో జరిగింది. (Tokyo Olympics: టోక్యోలో కత్తిపోట్ల కలకలం.. మహిళలపై అగంతకుడి దాడి)
Comments
Please login to add a commentAdd a comment