గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విశ్వమైత్రి నది కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది. దీంతో వడోదరలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అపార్ట్‌మెంట్లలో మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చాయి. ఎక్కడి వారు అక్కడే కదలకుండా ఉండిపోయారు. భారత మహిళా క్రికెటర్ రాధా యాదవ్ కూడా ఈ వరదల్లో చిక్కుకుంది. ఆమె కుటుంబంతో నివసిస్తున్న అపార్ట్‌మెంట్ నీట మునగడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వచ్చి వారిని రక్షించాయి. ఈ విషయాన్ని రాధా యాధవే స్వయంగా ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది.
విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న తమను బోట్ల సాయంతో రక్షించిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు రాధా యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, గత రెండు రోజులుగా గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జామ్ నగర్, రాజ్‌కోట్, పోర్‌బందర్ వంటి నగరాలు నీట మునిగాయి. నిన్న ఈ ప్రాంతాల్లో 50-200 మిల్లీ మీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన రాధా యాదవ్ భారత జట్టు తరఫున 4 వన్డేలు. 80 టీ20లు ఆడింది. ఇందులో ఆమె 91 వికెట్లు పడగొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment