టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 20 ఏళ్ల తన వైవాహిక బంధానికి స్వస్తి పలుకనున్నట్లు తెలుస్తుంది. సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లావత్‌తో విడాకులు తీసుకోనున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన వార్త నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.
సెహ్వాగ్, ఆర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు గత కొన్ని నెలలుగా వేర్వేరుగా ఉంటున్నట్లు తెలుస్తుంది. గత దీపావళి రోజున సెహ్వాగ్ ఒంటరిగా ఉన్న ఫోటోలు షేర్ చేయడం.. సెహ్వాగ్ ఒంటరిగానే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం విడాకుల ప్రచారానికి బలం చేకూరుస్తుంది.
కొడుకులు ఇద్దరూ క్రికెట్‌లో రాణిస్తున్నారు
సెహ్వాగ్‌కు 2004లో ఆర్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. ఆర్యవీర్, వేదాంత్. వీరిద్దరూ తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు.
అర్యవీర్.. గతేడాది నవంబర్‌లో జరిగిన అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించే ఆర్యవీర్.. మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 229 బంతుల్లోనే 34 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 200 పరుగులు చేశాడు.
రెండో కుమారుడు వేదాంత్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. వేదాంత్.. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తూ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఈ సీజన్‌లో వేదాంత్ 24 వికెట్లు పడగొట్టి.. ఢిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇందులో రెండు 5 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.
ఆర్తి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చేసింది
ఆర్తి.. సెహ్వాగ్ కంటే రెండేళ్లు చిన్నది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చేసింది. ఆర్తి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది. ఆర్తి భారతీయ విద్యా భవన్‌లో చదువుకుంది. సెహ్వాగ్-ఆర్తిల వివాహం దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇంట్లో జరిగింది. విడాకుల ప్రచారంపై సెహ్వాగ్ కాని, ఆర్తి కాని ఇప్పటివరకు స్పందించలేదు.
భారత క్రికెట్ సర్కిల్స్‌లో వరుస విడాకుల వార్తలు
కాగా, ఇటీవలికాలంలో భారత క్రికెట్ సర్కిల్‌లో విడాకుల వార్తలు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. విడాకుల ప్రచారాన్ని చహల్, ధనశ్రీ ఖండించకపోవడంతో ఈ వార్త నిజమేనని తెలుస్తుంది.
మరో భారత క్రికెటర్ మనీశ్ పాండే కూడా తన భార్య అశ్రిత షెట్టి నుంచి విడిపోబోతున్నాడని తెలుస్తుంది. మనీశ్, అశ్రిత్ సైతం సెహ్వాగ్-ఆర్తి, చహల్-ధనశ్రీ తరహాలో సోషల్‌మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాల్లో చేసుకున్నారు.
వీరిద్దరికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలోనూ ఇదే డ్రామా నడిచింది. అయితే హార్దిక్, అతని భార్య నటాషా ఒకరినొకరు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హార్దిక్‌కు ముందు షమీ, శిఖర్ ధవన్ కూడా తమతమ భార్యలతో విడాకులు తీసుకున్నారు.
సెహ్వాగ్ క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. సెహ్వాగ్‌ను క్రికెట్ సర్కిల్స్‌లో ముద్దుగా నజఫ్‌ఘడ్ నవాబ్, వీరూ అని పిలుస్తారు. వీరూ 1999లో భారత్ తరఫున అరంగేట్రం చేసి 2013లో రిటైరయ్యాడు. సెహ్వాగ్ తన కెరీర్‌లో 104 టెస్ట్‌లు, 251 వన్డేలు, 19 టీ20 ఆడి 17000కు పైగా పరుగులు చేశాడు.
రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన సెహ్వాగ్ భారత్ తరఫున 136 వికెట్లు తీశాడు. సెహ్వాగ్ కెరీర్‌లో 23 టెస్ట్ సెంచరీలు, 15 వన్డే సెంచరీలు ఉన్నాయి. సెహ్వాగ్ టెస్ట్‌ల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment