Blind cricket team
-
అమెరికాలో భారతీయ అంధుల క్రికెట్ జట్టు.. డాలస్‌లో మహాత్ముడికి నివాళి
డాలస్, టెక్సాస్: జూలై 25 నుంచి సెప్టెంబర్ 17 వరకు అమెరికా పర్యటనలో ఉన్న “భారతీయ అంధ క్రికెట్ జట్ట్ఙు మంగళవారం డాలస్ లో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలిని మంగళవారం సందర్శించి జాతిపితకు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, బోర్డు సభ్యుడు కమల్ కౌశల్, బాబీ, రవి మొదలైన వారు వీరికి ఘనస్వాగతం పలికారు.బోస్టన్, న్యూ యార్క్, న్యూ జెర్సీ, వాషింగ్టన్ డి.సి, చికాగో, డాలస్, లాస్ ఏంజిల్స్, సియాటెల్ మరియు బే ఏరియా లలో పర్యటిస్తున్న ఈ క్రికెట్ జట్టులో సమర్తనం ఇంటర్నేషనల్ ఛైర్మన్ డా. మహన్ టెష్, టీం మేనేజర్ ధీరజ్ సెక్వేరియా ఆటగాళ్ళు దున్న వెంకటేశ్వర రావు, సునీల్ రమేశ్, షుక్రం మాజిహ్, సంజయ్ కుమార్ షా, రవి అమితి, పంకజ్ భూ, నీలేష్ యాదవ్, నరేష్ తుందా, నకుల బడానాయక్, మహారాజ, లోకేష్, గుడ్డాడప్ప, దుర్గారావు తోమ్పాకి, దినేష్ రాత్వా, దినాగర్, దేబరాజ్ బెహరా, అజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు.వీరిలో కొంతమంది పూర్తిగా అంధులు, మరికొంతమంది కొద్దిగా మాత్రమే చూడగల్గుతారు. వీరి క్రికెట్ బంతి సాధారణ బంతిలా కాకుండా దానిలో శబ్దంచేసే కొన్ని మువ్వలు లాంటివి ఉంటాయి. బౌలర్ బంతి విసిరినప్పుడు, ఆ బంతి చేసే శబ్దం ఆధారంగా ఎటువైపు ఎంత వేగంతో బంతి వస్తుందో అంచనావేసి బాట్స్ మాన్ బంతిని కొడతాడు. ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని చాంపియన్స్ గా నిలిచిన ఈ భారతజట్టులో విజయవాడకు చెందిన అర్జున అవార్డు గ్రహీత అజయ్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. ఈ క్రికెట్ టీం విదేశీ పర్యటన మొత్తాన్ని ‘సుబ్బు కోట ఫౌండేషన్’ వారు స్పాన్సర్ చేసి తగు ఆర్ధిక సహకారం అందించడం ముదావహం. పర్యటిస్తున్న అన్ని నగరాలలో అంధులు క్రికెట్ ఎలా ఆడతారో తెలియజేస్తూ ఎగ్జిబిషన్ మ్యాచ్స్ ఆడుతూ తమ క్రికెట్ ఆటలు సుదీర్ఘ కాలం విజయవంతంగా కొనసాగడానికి కావలసిన ఆర్ధిక పరిపుష్టికోసం విరాళాలు సేకరిస్తున్నారు. -
అంధుల భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా దుర్గారావు
వంగర: విజయనగరం జిల్లా వంగర మండలం కొప్పరవలస గ్రామానికి చెందిన టొంపాకి దుర్గారావు (26)ను భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (కేబీ) ఎంపిక చేసింది. ఈ విషయాన్ని అసోసియేషన్ చైర్మన్ కె.మహేంతేష్ గురువారం ఢిల్లీలో ప్రకటించారు. దుర్గారావు నేపథ్యమిదీ నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గారావు చిన్నతనంలోనే తండ్రి దాలయ్య మరణించారు. తల్లి సుందరమ్మ రెక్కల కష్టంతో దుర్గారావును పెంచి పెద్దచేశారు. విజయనగరం జిల్లా మెట్టవలస అంధుల పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఇంటర్ సికింద్రాబాద్‌లో, డిగ్రీ హైదరాబాద్‌లోని కాలేజీల్లో పూర్తిచేశాడు. అంధుల క్రికెట్లో భారత్ తరఫున రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండుసార్లు అంధుల వన్డే క్రికెట్ ప్రపంచ కప్, మూడుసార్లు అంధుల టీ–20 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకోవడంలో దుర్గారావు కీలక పాత్ర పోషించాడు. 2014 భారత అంధుల క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్‌గా ఆరంగేట్రం చేశాడు. 2014 నవంబర్ 7 నుంచి డిసెంబర్ 25 వరకు దక్షిణాఫ్రికాలో జరిగిన అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 2016 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు భారత్‌లో జరిగిన టీ–20 జట్టులో స్థానం లభించింది. 2018 జనవరిలో దుబాయ్‌లో జరిగిన అంధుల వరల్డ్ కప్‌లో కూడా ఆల్‌రౌండర్‌గా ప్రతిభ చాటాడు. 2019లో వెస్టిండీస్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లో సత్తాచాటి భారత్‌కు విజయాన్ని అందించాడు. 2022 భారత్‌లో జరిగిన వరల్డ్ కప్ విజయంలోనూ, ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఇప్సా) లండన్‌లో జరిగిన క్రికెట్ టోర్నీలో ద్వితీయ స్థానం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 21నుంచి 26 వరకు దుబాయ్‌లో జరిగే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక దేశాల ముక్కోణపు టోర్నీకి భారత అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించనున్నాడు. నా ఆశయానికి అమ్మే తోడు నేను మంచి క్రికెటర్‌గా ఎదగాలని ఆకాక్షించాను. కష్టపడి సాధన చేశాను. నా ఆశయానికి మా అమ్మ సుందరమ్మ సహకారం తోడైంది. పాఠశాల, కళాశాలల్లో ఉపాధ్యాయులు, స్నేహితులు ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నివ్వడంతో భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాను. కష్టపడితే ఎంతటి విజయమైనా సిద్ధిస్తుందని నమ్ముతాను. ఇదే నా విజయ రహస్యం – టొంపాకి దుర్గారావు, కెప్టెన్ భారత అంధుల జట్టు -
Zahara Begum: చూపున్న మనసు
మనసుకు చూపు ఉంటే ఎదుటి వారి కష్టం కనపడుతుంది. మనసుకు స్పందన ఉంటే ఎదుటివారి సాయం కోసం మార్గం వేస్తుంది. జహారా బేగంకు అలాంటి మనసు ఉంది. అందుకే ఆమె అంధుల కోసం పని చేస్తూ ఉంది. అంధుల క్రికెట్‌కు ప్రోత్సాహం అందిస్తోంది. వారి మేచ్‌లు నిర్వహిస్తోంది. ఆ సేవకు ‘క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’కు చైర్ పర్సన్‌గా నియమితురాలైంది. జహారా పరిచయం. ‘మనలో ఎవరైనా ఎప్పుడైనా అంధులు కావచ్చు. దృష్టి పోతే జీవితం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అందుకే దృష్టి లేని వారి గురించి ఎవరికి తోచినంత వారు పని చేయాలి’ అంటుంది జహారా బేగం. తెనాలికి చెందిన జహారా తన తల్లి తాహెరా పేరున ‘తాహెరా ఫౌండేషన్’ స్థాపించి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అలాగే బెంగళూరు, హైదరాబాద్‌లలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ‘నేను నాలుగో క్లాస్‌లో ఉండగా నా క్లాస్మేట్ ఒకమ్మాయి మధ్యాహ్నం పూట ప్రసాదం తెచ్చుకుని తినేది. అన్నం ఉండేది కాదు. ఆ అమ్మాయి కోసం నేను మా అమ్మతో చెప్పి బాక్స్ తీసుకెళ్లేదాన్ని. చిన్నప్పటి నుంచి ఎందుకో ఎదుటివారికి సాయం చేయాలనే గుణం నాలో ఉంది. ఆ గుణాన్ని వయసు పెరిగే కొద్దీ కాపాడుకున్నాను’ అంటుంది జహారా. ఆటలంటే ఇష్టం ‘మాది గుంటూరు. చిన్నతనం నుంచి ఆటలంటే ఇష్టం. బాస్కెట్‌బాల్ జాతీయస్థాయి ప్లేయర్‌గా ఆడాను. గుంటూరు మహిళా బాస్కెట్‌బాల్ జట్టు మాతోనే మొదలైంది. అయితే చదువులో కూడా చురుగ్గా ఉండి బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను. ఆ తర్వాత అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసి పీహెచ్డీ కోసం జర్మనీలో కొంత రీసెర్చి చేశాను. అక్కడి నుంచి తిరిగొచ్చాక నా మాతృమూర్తి పేరుతో తాహెరా ట్రస్ట్ ప్రారంభించి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవల్లో మమేకమయ్యాను. ఆ సమయంలోనే బెంగళూరులోని ‘సమర్థనం ట్రస్ట్ ఫర్ బ్లైండ్’ చేస్తున్న పని నాకు నచ్చింది. వారితో కలిసి అంధుల కోసం పని చేయసాగాను. బెంగళూరులో విమెన్ బ్లైండ్ క్రికెట్ వర్క్‌షాపును నిర్వహించాను’ అని తెలిపిందామె. అంధుల కోసం ‘అంధుల క్రీడలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చేవారు చాలా తక్కువ. అంధుల క్రికెట్‌కు ప్రోత్సాహం అందించేవారూ తక్కువే. వారికోసం నేనెందుకు ఏదైనా చేయకూడదు అనుకున్నాను. అప్పటినుంచి నా చేయూత నిరవధికంగా సాగింది. అంతేకాదు, ‘క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా’ (సీఏబీఐ)లోనూ, ‘టి20 వరల్డ్ కఫ్ క్రికెట్ ఫర్ బ్లైండ్–2017’ పోటీల సమయంలోనూ చురుగ్గా పని చేసే అవకాశం కలిగింది. దాంతో ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీబీబీఏపీ) ఛైర్‌పర్సన్‌గా నియమితురాలినయ్యాను. ఇది నాకు సంతోషంగా ఉంది’ అని తెలిపిందామె. అంధుల టి20 ‘2017లో దేశంలోని మెట్రో నగరాల్లో 2వ అంధుల టి20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలను సీఏబీఐ నిర్వహించింది. పది దేశాల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్గనైజింగ్ కమిటీ ఇన్చార్జ్గా నేను రెండు మ్యాచ్‌లను ఆంధ్ర, తెలంగాణలో నిర్వహించేందుకు చొరవ చూపాను. అలాగే ‘తొలి విమెన్స్ నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ బ్లైండ్ – 2019’ న్యూఢిల్లీలో జరిగింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ (సీఏబీఏపీ)కి నిధుల కొరత, స్పాన్సర్లు లేకపోవటం, క్రీడాకారిణుల లేమి గమనించాను. దాంతో ఆంధ్రప్రదేశ్ అంధ మహిళల క్రికెట్ జట్టు రూపకల్పనకు పూనుకున్నా. అనంతపురంలో రాష్ట్రస్థాయి అంధ మహిళల క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహించాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంధ మహిళల క్రికెట్ జట్టు ఎంపికకు సహకారం అందించాను.. ఇటీవల యూకేలో జరిగిన ఐబీఎస్ఏ టోర్నమెంటులో విజేతగా నిలిచిన ఇండియా జట్టులో మా శిక్షణలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపిందామె. అంధుల క్రికెట్ గురించి.... ‘అంధుల క్రికెట్ ఢిపరెంట్‌గా ఉంటుంది. బ్యాట్, వికెట్లు అన్నీ ఒకలాగే ఉంటాయి. బంతి మాత్రం వైవిధ్యంగా తయారు చేస్తారు. ఇందులో ఉండే బేరింగ్స్ చేసే శబ్దాన్ని ఆధారంగా బాట్స్మెన్ ఆడతారు. బౌలింగ్ సాధారణ క్రికెట్లోలా భుజంపైనుంచి కాకుండా దిగువ నుంచి వేస్తారు. క్రికెట్ జట్టులో బీ1, బీ2, బీ3 అనే మూడు కేటగిరీల వారుంటారు. బౌలరు, బ్యాట్స్‌మెన్ పూర్తిగా అంధులై ఉంటారు. మిగిలినవారు పాక్షికంగా అంధులు. వీరు ఆడే మైదానం 50 గజాలు మాత్రమే. నిబంధనలన్నీ మామూలే. సీఏబీఐలో 25 వేల మంది సభ్యులున్నారు’ అని తెలిపిందామె. తన సేవా కార్యక్రమాలను అమెరికాకు కూడా విస్తరించిన జహారా అక్కడ చిన జీయర్ నేత్రాలయం కోసం నిధులు సేకరించడంతో తనవంతు సహకారం అందించారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి. -
భారత్‌పై పాకిస్తాన్ ఘన విజయం.. ఫైనల్‌కు!
యూఏఈ వేదికగా జరుగుతోన్న ముక్కోణపు అంధుల టీ20 టోర్నమెంట్లో భారత్‌పై ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. పాకిస్తాన్ బ్యాటర్లు బదర్ మునీర్(64), రషీద్(64) పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ ప్రకాష్ జయరామయ్య 79 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ విజయంతో టోర్నమెంట్లో పాక్ ఫైనల్‌కు చేరుకుంది. అదే విధంగా భారత్.. బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు అయితే విజయం సాధిస్తుందో ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో 64 పరుగులతో రాణించిన బదర్ మునీర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: Ranji Trophy 2022: ధోని హోం టీమ్ ప్రపంచ రికార్డ్.. ఏకంగా 1008 పరుగుల ఆధిక్యం Badar and Rashid trounced India in the Triangular T-20 Blind Cricket Tournament! 🇵🇰🏏 Pakistan 166/3 in 18.4 overs (Badar 64) defeated India 163/8 in 20 overs. Click on the following link for more details: https://t.co/PnoHhdicBn #PakvsInd pic.twitter.com/OriO9pBVbU — Pakistan Blind Cricket Council (PBCC) (@pbcc_official) March 16, 2022 -
అంధుల క్రికెట్ కాంతిరేఖ
తెనాలి: బెంగళూరులో ఈనెల 28 నుంచి జరగనున్న జాతీయ అంధ మహిళల క్రికెట్ టోర్నమెంటులో ఆంధ్రప్రదేశ్ జట్టు తొలిసారిగా ప్రాతినిథ్యం వహించనుంది. గుంటూరు జిల్లాకు చెందిన తాహెరా ట్రస్ట్ దీనికి మార్గం సుగమం చేసింది. తొలి విమెన్స్ నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ బ్లైండ్–2019 ఢిల్లీలో జరిగింది. టీ–20 ఫార్మట్‌లో జరిగిన ఈ టోర్నీలో వివిధ జిల్లాల నుంచి క్రీడాకారుల ప్రాతినిథ్యం ఉన్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి జట్టు పాల్గొనలేదు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ (సీఏబీఏపీ)కి నిధుల కొరత, స్పాన్సర్లు లేకపోవడమే దీనికి కారణం. ఇప్పటికే మెన్ బ్లైండ్ క్రికెట్లో ఏపీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొంటున్నారు. ఇండియా జట్టు వరల్డ్ కప్‌నూ సాధించింది. ముందుకొచ్చిన జహరాబేగం అంధ మహిళల విభాగంలో క్రికెట్ పోటీల ఆరంభంతో గత రెండేళ్లుగా సాధన చేసేవారి సంఖ్య పెరిగింది. అయినా మహిళల జట్టు ఎంపిక లేక నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన తాహెరా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, ఎన్నారై జహరాబేగంకు క్రీడాకారులు సమాచారం పంపారు. గతంలో బ్లైండ్ మెన్ వరల్డ్ కప్ టోర్నమెంటులో హైదరాబాద్, మూలపాడుల్లో జరిగిన రెండు మ్యాచ్‌లకు తాహెరా ట్రస్ట్ స్పాన్సర్ చేసింది. గతేడాది జాతీయ పోటీల్లో పాల్గొన్న ఏపీ మెన్ బ్లైండ్ టీమ్‌కు స్పాన్సర్‌గానూ వ్యవహరించింది. ఈ క్రమంలో ఏపీ నుంచి అంధ మహిళల జట్టును జాతీయ పోటీలకు పంపేందుకు తోడ్పడాలని క్రీడాకారుల నుంచి వచ్చిన వినతులను జహరాబేగం పరిగణనలోకి తీసుకున్నారు. ఏపీ జట్టుకు స్పాన్సర్ చేయాలని నిర్ణయించుకున్నారు. సీఏబీఏపీ చురుగ్గా ఏర్పాట్లు తాహెరా ట్రస్ట్ గ్రీన్ సిగ్నల్‌తో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ (సీఏబీఏపీ) చురుగ్గా ఏర్పాట్లు చేసింది. అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్లో క్రీడాకారులకు సన్నాహక శిబిరం చేపట్టింది. ఈనెల 15 నుంచి ఇది ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 35 మంది క్రీడాకారులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. జహరా బేగం సన్నాహక శిబిరానికి హాజరై, క్రీడాకారిణులకు వసతి, భోజనం, యూనిఫాం, కిట్‌ను సమకూర్చారు. వీరి నుంచి 14 మంది జట్టును ఈనెల 17న ఎంపిక చేశారు. మళ్లీ వీరికి పూర్తిస్థాయి శిక్షణ నడుస్తోంది. క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఇండియా కార్యదర్శి, ఏపీ అధ్యక్షుడు జాన్ డేవిడ్ నేతృత్వంలో జాతీయ క్రీడాకారుడు జి.వెంకటేష్ వీరికి శిక్షణనిస్తున్నారు. రాయలసీమ కో–ఆర్డినేటర్ ఫర్ బ్లైండ్ వెంకటనారాయణ పర్యవేక్షిస్తున్నారు. త్వరలో సీఎం వద్దకు.. అంధ క్రీడాకారుల్లో క్రీడాపరంగా అపూర్వమైన సామర్థ్యం ఉందని జహరాబేగం చెప్పారు. క్రికెట్ సాధనకు క్రీడాకారులకు తగిన ఆటస్థలం, వసతిగృహం అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని త్వరలోనే కలవనున్నట్టు చెప్పారు. క్రీడాకారుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వివరించారు. -
దీనస్థితిలో క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్... రోజుకూలీగా పనులకు
గుజరాత్: దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మూమూలుది కాదు. అందులోనూ పాకిస్తాన్‌పై విజయం అంటే మరింత మోజు. కానీ బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన ఓ క్రికెటర్ మాత్రం తాజాగా కడు దీనస్థితిలో జీవనం సాగిస్తున్నాడు. టీమిండియా బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు గుజరాత్‌కు చెందిన నరేష్ తుమ్డా. కట్ చేస్తే.. ఇపుడు జీవనోపాధి కోసం నానా పాట్లు పడుతున్నాడు. రోజు కూలిగా మారి పొట్ట పోషించుకుంటుకున్నాడు. అంతేకాదు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదైనా ఉద్యోగమివ్వాలని వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే 2018లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్‌ను సాధించిన విన్నింగ్ టీమ్‌లో సభ్యుడు నరేష్ తుమ్డా. షార్జాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌ను ఓడించింది. అయితే అంధుడైన నరేష్ ఇపుడు నవ్సారీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజుకు కేవలం 250 రూపాయలు సంపాదనతో అరకొర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిని కలిసినా ఎలాంటి ప్రయోజనం రాలేదని నరేష్ వాపోయాడు. ఇప్పటికైనా తన కుటుంబ పోషణకోసం ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.(షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్) కాగా వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ 1996 నుండి బ్లైండ్ క్రికెట్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికి అయిదుసార్లు ఈ పోటీలు జరగ్గా 2018, జనవరి 20న షార్జాలో జరిగిన ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ని ఓడించింది. 308 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి మరీ ఈ విజయాన్ని దక్కించుకుంది. అలాగే 2012లో తొలిసారిగా బ్లైండ్ వరల్డ్ కప్ టీ20 బెంగళూరులో జరిగింది. (Tokyo Olympics: టోక్యోలో కత్తిపోట్ల కలకలం.. మహిళలపై అగంతకుడి దాడి) -
వరల్డ్‌కప్ విన్నర్.. నేడు కూరగాయల వ్యాపారి
అహ్మదాబాద్ : ప్రాణాంతక కరోనా వైరస్ పౌరుల జీవితాలను అతలాకుతలం చేసింది. ప్రతి ఒక్కరిపై ఏదో ఒక విధంగా తన ప్రభావాన్ని, ప్రతాపాన్ని చూపిస్తోంది. వైరస్ ధాటికి ఎంతో మంది జీవితాలు తలకిందులు అయ్యాయి. బడా వ్యాపారుల నుంచి బడ్డీ కొట్టు చిరు వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు తీవ్ర నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితిని కరోనా కల్పించింది. ఈ క్రమంలోనే భారత అందుల క్రికెట్ జాతీయ జట్టుకుప్రాతినిధ్యం వహించిన ఓ క్రికెటర్‌ను సైతం కోవిడ్ తన ప్రతాపానికి లొంగదీసుకుంది. కోవిడ్ ధాటికి క్రికెటర్ కాస్తా.. కూరగాయల వ్యాపారిగా అవతారం ఎత్తాడు. ఓ జాతీయ మీడియా శుక్రవారం ప్రచురించిన కథనం ప్రకారం.. నరేష్ తుంబ్డా (29) అంధుల క్రికెట్ జట్టులో సభ్యుడు. 2018లో షార్జా వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో నరేష్ కీలక పాత్ర పోషించాడు. లీగ్‌లో ప్రధానంగా పాకిస్తాన్‌తో జరిగిన కీలక ఫైనల్ పోరులో భారత్ విజయం సాధించి ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్యభూమిక పోషించాడు. దీంతో అతని పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. అంతా బాగానే సాగుతున్న క్రమంలో కరోనా అతని జీవితంలోకి అనుకోని అతిథిలా వచ్చింది. కరోనా విపత్తు కారణంగా క్రికెట్‌కు తాత్కాలిక బ్రేక్ పడటంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఇక చేసేదేం లేక కుటుంబ సభ్యుల సహకారంతో కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో గల జమల్పూర్ మార్కెట్ అతని వ్యాపారానికి వేదికైంది. అతని ధీన పరిస్థితిని చూసి అనేక మంది చలించిపోతున్నారు. భారత క్రికెట్ యాజమాన్యం నరేష్‌ను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
థ్యాంక్యూ సచిన్..
సాక్షి, బెంగళూరు: భారత అంధుల క్రికెట్ సంఘాన్ని గుర్తించాలని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బీసీసీఐకి లేఖ రాయడంపై అంధుల క్రికెట్ టీమ్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అంధ క్రికెటర్లను బోర్డు పింఛను పథకం కిందకు తీసుకురావాలని కోరుతూ సచిన్ బోర్డు పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అంధుల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జీకే మహంతేష్ స్పందిస్తూ.. సచిన్ తమ గురించి ఆలోచించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అందుకు టీమ్ తరుఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సచిన్ రాసిన లేఖను చదివి చాలా ఆనందించినట్టు మహంతేష్ అన్నారు. గత వారం తమ సభ్యులంతా బీసీసీఐని కలిసినపుడు మద్దతు తెలిపడానికి బోర్డు సముఖత వ్యక్తం చేసిందని వెల్లడించారు. తాజాగా సచిన్ అంధుల క్రికెట్ సంఘాన్ని గుర్తించాల్సిన అవసరముందని విజ్ఞప్తి చేయడం ఎంతో గొప్ప విషయమని మహంతేష్ పేర్కొన్నారు. ‘అంధుల జట్టు ఎన్నో అవరోధాలు అధిగమించింది. వారి స్ఫూర్తిదాయక ప్రపంచకప్ విజయం మానవ మేధస్సుకు పరిమితి లేదని గుర్తుచేస్తోంది. అందుకని భారత అంధుల క్రికెట్ సంఘం (సీఏబీఐ)కు గుర్తింపునిస్తూ ఆ క్రికెటర్లను బోర్డు పెన్షన్ పథకం పరిధిలోకి తీసుకోండి’ అని సచిన్ టెండూల్కర్ బీసీసీఐని కోరాడు. ఈ మేరకు బోర్డు పరిపాలకుల కమిటీ అధ్యక్షుడు వినోద్‌రాయ్‌కు లేఖ రాశాడు. బీసీసీఐ గుర్తింపు దక్కడం వారి కృషికి మెచ్చుకోలుగా ఉంటుందని, ఆటగాళ్ల ఆర్థిక భద్రతకూ భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నా డు. గత నెలలో అంధుల జట్టు ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా బీసీసీఐ తరఫున రివార్డు అందిస్తామని రాయ్ ప్రకటించారు. -
అంధుల క్రికెట్‌కూ గుర్తింపు ఇవ్వండి
న్యూఢిల్లీ: ‘అంధుల జట్టు ఎన్నో అవరోధాలు అధిగమించింది. వారి స్ఫూర్తిదాయక ప్రపంచకప్ విజయం మానవ మేధస్సుకు పరిమితి లేదని గుర్తుచేస్తోంది. అందుకని భారత అంధుల క్రికెట్ సంఘం (సీఏబీఐ)కు గుర్తింపునిస్తూ ఆ క్రికెటర్లను బోర్డు పెన్షన్ పథకం పరిధిలోకి తీసుకోండి’ అని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బీసీసీఐని కోరాడు. ఈ మేరకు బోర్డు పరిపాలకుల కమిటీ అధ్యక్షుడు వినోద్‌రాయ్‌కు లేఖ రాశాడు. బీసీసీఐ గుర్తింపు దక్కడం వారి కృషికి మెచ్చుకోలుగా ఉంటుందని, ఆటగాళ్ల ఆర్థిక భద్రతకూ భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నా డు. గత నెలలో అంధుల జట్టు ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా బీసీసీఐ తరఫున రివార్డు అందిస్తామని రాయ్ ప్రకటించారు. -
విజేత ఆంధ్రప్రదేశ్
ముంబై: విశ్వవిజేతగా నిలిచిన భారత అంధుల క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన అజయ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ జట్టును జాతీయ చాంపియన్‌గా నిలబెట్టాడు. శుక్రవారం ముగిసిన జాతీయ అంధుల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గుజరాత్‌తో జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 35 ఓవర్లలో 9 వికెట్లకు 250 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్ దుర్గా రావు 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం ఆంధ్రప్రదేశ్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టి. కృష్ణ (97 బంతుల్లో 103 నాటౌట్) అజేయ సెంచరీ చేయగా... కెప్టెన్ అజయ్ రెడ్డి 32 పరుగులు, వెంకటేశ్ రావు 66 పరుగులు సాధించారు. భారత జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత ఆంధ్రప్రదేశ్ జట్టుకు రూ. 50 వేలు... రన్నరప్‌గా గుజరాత్‌కు రూ. 30 వేలు అందజేశారు. -
చీకటి చూపిన వెలుగు!
బెంగళూరు: సమస్యలొచ్చినప్పుడు పారిపోకుండా వాటిని ఎదిరించి సవాల్ స్వీకరించినవాడే అసలైన పోరాట యోధుడు. అలా తనకు ఎదురైన సమస్యలను జయించి నిలిచిన శేఖర్ నాయక్ నిజంగా ఆదర్శప్రాయుడు. ప్రస్తుతం భారత అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శేఖర్ నాయక్ బాల్యం ముళ్ల బాటలోనే సాగింది. పుట్టుకతోనే అంధత్వం. దానికి తోడు కటిక పేదరికం. ఈ రెండింటిని జయించి నిలిచాడు. దాంతో పాటు భారతదేశ కీర్తిని మరింత పెంచాడు. కర్ణాటకలోని షిమోగా(శివమొగ్గ)లో 1986 లో పుట్టిన శేఖర్ పుట్టుకతోనే అం(గ)ధ వైకల్యానికి గురయ్యాడు. శేఖర్ పుట్టుకతోనే అంధుడు కావడంతో పాటు కుటుంబం పరిస్థితి కూడా అంతంత మాత్రమే. శేఖర్ కుటుంబంలో కూలి పని చేస్తే గానీ రోజు గడవని పరిస్థితి. కానీ అమ్మా-నాన్నలు శేఖర్ కు అన్నీ తామై నిలిచారు. కుమారునికి చూపు లేదన్న లోటు తెలియకుండా పెంచాలన్నది కుటుంబ సభ్యుల భావన. అయితే 1994 వ సంవత్సరం శేఖర్ జీవితాన్ని మరింత విషాదంలోకి నెట్టింది. తల్లి దండ్రులతో కలిసి పొలానికి వెళ్లిన శేఖర్ కాల్వలోకి కాలుజారి పడిపోయాడు. ఆ ప్రమాదం శేఖర్ ను మరింత కృంగదీసింది. అతని కుడి కణత దెబ్బతీంది. దీంతో చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లిన శేఖర్ కు కుడి కన్నుకు కొంత మేర చూపు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. ఆ తరువాత ఆపరేషన్ చేయించుకున్న శేఖర్ కు 60 శాతం కంటి చూపు మెరుగైంది. తన జీవితంలో తొలిసారి సరికొత్త ప్రపంచాన్ని చూడటంతో శేఖర్ ఆనందానికి అవధుల్లేవు. ఆ సంతోషం శేఖర్ జీవితంలో ఎక్కువ కాలం నిలవలేదు. కన్న కొడుకు కంటి చూపు మెరుగుపడిందని ఇంట్లో వాళ్లు సంబరిపడే లోపే మరో చేదు వార్త తారసపడింది. శేఖర్ ఆపరేషన్ చేయించుకున్న మూడు నెలలకే తండ్రి కన్నుమూశాడు. ఆ తరువాత తల్లి చేతుల మీద శేఖర్ జీవితం సాగింది. ఈ క్రమంలోనే 1997లో శేఖర్ 11వ ఏట ఫస్ట్ గ్రేడ్ విద్యలో భాగంగా అంధుల పాఠశాలలో చేరాడు. ఇక్కడే శేఖర్ జీవితం పూర్తిగా మారడానికి బీజం పడింది. అప్పటి వరకూ క్రికెట్ లో ఓనమాలు కూడా తెలియని శేఖర్ దాని గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. అలా క్రికెట్ పై మొక్కువ పెంచుకుంటున్న తరుణంలో మరో షాక్ తగిలింది. అతని తల్లి లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. దీంతో శేఖర్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఒకపక్క చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో పొలం పనులు చేసుకుంటూ నెలకు రూ.1000 నుంచి 1,500 వరకూ సంపాదించేవాడు. మరోపక్క క్రికెట్ ను కూడా కొనసాగించాడు. అలా రాష్ట్ర స్థాయి అంధ క్రికెట్ లో స్థానం సంపాదించిన శేఖర్ జీవితాన్ని 2001 వ సంవత్సరం పూర్తిగా మలుపుతిప్పింది. అండర్-18 టోర్నీలో భాగంగా హైదరాబాద్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలచుకున్నాడు. దీంతో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తరువాత 2002లో జరిగిన అంధుల వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, శ్రీలంకలపై శేఖర్ రాణించి రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఆ తరువాత 2004 లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన భారత టీమ్ లో శేఖర్ మరోసారి మెరిశాడు. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో రెండు భారత్ గెలిచింది. ఓ మ్యాచ్ లో శేఖర్ 198 పరుగులతో ఆకట్టుకున్నాడు. అదే అతని అత్యధిక అంతర్జాతీయ స్కోరు. 2005 లో పాకిస్థాన్ భారత పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో శేఖర్ రాణించాడు. 2005 నుంచి 2010 వరకూ శేఖర్ ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. 2010 లో జాతీయ టీమ్ కు కెప్టెన్ గా ఎంపికైన శేఖర్.. 2012లో జరిగిన ట్వంటీ 20 వరల్డ్ కప్ ను సాధించిపెట్టడమే కాకుండా, 2014 లో అంధుల వన్డే వరల్డ్ కప్ ను దేశానికి సాధించి పెట్టాడు. శేఖర్ నాయక్ నిజంగా ఆదర్శప్రాయుడే కదా? పుట్టుకతోనే అంధత్వం సంపాదనగా వచ్చినా.. దానికి ఎదురొడ్డి నిలబడి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. హాట్యాఫ్ టూ శేఖర్ నాయక్. -
అంధత్వం మనసుకు కాదు
- సీఏబీఐ ప్రధాన కార్యదర్శి మహంతేశ్ - విదేశీ పర్యటనకు బయలుదేరిన అంధ క్రికెట్ జట్టు సాక్షి, ముంబై: ‘లక్ష్య సాధనకు పట్టుదల ముఖ్యం. అంధత్వమనేది మనిషికే కానీ మనసుకు కాదు. పట్టుదలే ముందుకు తీసుకెళుతుంది’ అని క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇండియా (సీఏబీఐ) ప్రధాన కార్యదర్శి జి.కె.మహంతేశ్ అన్నారు. అంధుల జట్టు శుక్రవారం విదేశీ పర్యటనకు బయలుదేరిన సందర్భంగా వర్లీ సీఫేస్‌లో ఆయన మాట్లాడారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అంధులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ క్రికెటర్లుగా తీర్చిదిద్దామన్నారు. ఇంగ్లండ్‌కు బయలుదేరిన ఈ జట్టు 24 నుంచి మూడు వన్ డే మ్యాచ్‌లు ఆడుతుందని, 31న తిరిగి స్వదేశానికి చేరుకుంటుందన్నారు. అంధ క్రికెట్‌ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబరులో వరల్డ్‌కప్ గెలుచుకున్నా వీరికి గుర్తింపు లభించడం లేదన్నారు. బీసీసీఐలో అంధుల జట్టును చేర్చుకోవాలని విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదన్నారు. జట్టులో నలుగురు తెలుగు యువకులు విదేశీ పర్యటనకు వెళ్లిన అంధ క్రికెట్ జట్టులో నలుగురు తెలుగు యువకులు ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దుర్గారావు, అజయ్‌కుమార్ రెడ్డి, దూన వెంకటి జట్టులో ఉన్నారు.