యూఏఈ వేదికగా జరుగుతోన్న ముక్కోణపు అంధుల టీ20 టోర్నమెంట్‌లో భారత్‌పై ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. పాకిస్తాన్ బ్యాటర్లు బదర్ మునీర్(64), రషీద్(64) పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో కెప్టెన్ ప్రకాష్ జయరామయ్య 79 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ విజయంతో టోర్నమెంట్‌లో పాక్ ఫైనల్‌కు చేరుకుంది. అదే విధంగా భారత్.. బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు అయితే విజయం సాధిస్తుందో ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో 64 పరుగులతో రాణించిన బదర్ మునీర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.
చదవండి: Ranji Trophy 2022: ధోని హోం టీమ్ ప్రపంచ రికార్డ్.. ఏకంగా 1008 పరుగుల ఆధిక్యం
Badar and Rashid trounced India in the Triangular T-20 Blind Cricket Tournament!
— Pakistan Blind Cricket Council (PBCC) (@pbcc_official) March 16, 2022
🇵🇰🏏
Pakistan 166/3 in 18.4 overs (Badar 64)
defeated
India 163/8 in 20 overs.
Click on the following link for more details: https://t.co/PnoHhdicBn #PakvsInd pic.twitter.com/OriO9pBVbU
Comments
Please login to add a commentAdd a comment