దుబాయ్: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్‌లో యువ భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. చివరి బంతికి ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ అండర్–19 జట్టు 2 వికెట్ల తేడాతో భారత్‌పై నెగ్గింది. చివరి ఓవర్లో పాకిస్తాన్ విజయ సమీకరణం 8 పరుగులు కాగా... తొలి ఐదు బంతుల్లో 6 పరుగులు లభించాయి. దాంతో ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సిన స్థితిలో ఫోర్ బాదిన అహ్మద్ ఖాన్ (19 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) పాక్‌ను గెలిపించాడు.
శనివారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. ఆరాధ్య యాదవ్ (50; 3 ఫోర్లు), హర్నూర్ సింగ్ (46; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. పాక్ మీడియం పేసర్ జీషన్ జమీర్ (5/60) భారత్‌ను పడగొట్టాడు. ఛేదనలో పాకిస్తాన్ సరిగ్గా 50 ఓవర్లలో 8 వికెట్లకు 240 పరుగులు చేసి గెలిచింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌ను రేపు అఫ్గానిస్తాన్‌తో ఆడనుంది.
చదవండి: India vs South africa: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment