india under -19
-
పాక్‌పై చివరి బంతికి ఓడిన భారత్..
దుబాయ్: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో యువ భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. చివరి బంతికి ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ అండర్–19 జట్టు 2 వికెట్ల తేడాతో భారత్‌పై నెగ్గింది. చివరి ఓవర్లో పాకిస్తాన్ విజయ సమీకరణం 8 పరుగులు కాగా... తొలి ఐదు బంతుల్లో 6 పరుగులు లభించాయి. దాంతో ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సిన స్థితిలో ఫోర్ బాదిన అహ్మద్ ఖాన్ (19 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) పాక్‌ను గెలిపించాడు. శనివారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. ఆరాధ్య యాదవ్ (50; 3 ఫోర్లు), హర్నూర్ సింగ్ (46; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. పాక్ మీడియం పేసర్ జీషన్ జమీర్ (5/60) భారత్‌ను పడగొట్టాడు. ఛేదనలో పాకిస్తాన్ సరిగ్గా 50 ఓవర్లలో 8 వికెట్లకు 240 పరుగులు చేసి గెలిచింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌ను రేపు అఫ్గానిస్తాన్‌తో ఆడనుంది. చదవండి: India vs South africa: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే.. -
106 పరుగులే చేసినా...
కొలంబో: ఉత్కంఠభరిత పోరులో భారత యువ జట్టు ఆసియా అండర్–19 వన్డే విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో భారత అండర్–19 జట్టు 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ అండర్–19ను ఓడించింది. ముందుగా భారత్ 32.4 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. కరణ్ లాల్ (37), కెపె్టన్ ధ్రువ్ జురేల్ (57) ఫర్వాలేదనిపించగా... ఎనిమిది మంది ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. అనంతరం భారత లెఫ్టార్మ్ స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అథర్వ అంకోలేకర్ (5/28) ధాటికి బంగ్లాదేశ్ 33 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. కెపె్టన్ అక్బర్ అలీ (23), మృత్యుంజయ్ (21) కొంత పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. చివర్లో విజయానికి 29 పరుగులు చేయాల్సిన దశలో తన్జీమ్ (12), రకీబుల్ (11 నాటౌట్) తొమ్మిదో వికెట్‌కు 23 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువగా తీసుకొచ్చారు. గెలుపు కోసం మరో 6 పరుగులు చేయాల్సి ఉండగా... ఒకే ఓవర్లో అథర్వ రెండు వికెట్లు పడగొట్టడంతో బంగ్లా ఆట ముగిసింది.