
కొలంబో: ఉత్కంఠభరిత పోరులో భారత యువ జట్టు ఆసియా అండర్–19 వన్డే విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో భారత అండర్–19 జట్టు 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ అండర్–19ను ఓడించింది. ముందుగా భారత్ 32.4 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. కరణ్ లాల్ (37), కెపె్టన్ ధ్రువ్ జురేల్ (57) ఫర్వాలేదనిపించగా... ఎనిమిది మంది ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. అనంతరం భారత లెఫ్టార్మ్ స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అథర్వ అంకోలేకర్ (5/28) ధాటికి బంగ్లాదేశ్ 33 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. కెపె్టన్ అక్బర్ అలీ (23), మృత్యుంజయ్ (21) కొంత పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. చివర్లో విజయానికి 29 పరుగులు చేయాల్సిన దశలో తన్‌జీమ్ (12), రకీబుల్ (11 నాటౌట్) తొమ్మిదో వికెట్‌కు 23 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువగా తీసుకొచ్చారు. గెలుపు కోసం మరో 6 పరుగులు చేయాల్సి ఉండగా... ఒకే ఓవర్లో అథర్వ రెండు వికెట్లు పడగొట్టడంతో బంగ్లా ఆట ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment