అండర్-19 ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో భారత్ 103 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్‌లో షేక్ రషీద్ (108 బంతుల్లో 90 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఏపీలోని గుంటూరుకు చెందిన షేర్ రషీద్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన షేక్ రషీద్ 90 పరుగుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే బౌండరీల రూపంలో వచ్చాయి. ఇక కెప్టెన్ యష్‌దుల్ 26 పరుగులు, రాజ్ భవా 23 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రకీబుల్ హసన్ 3 వికెట్లు తీయగా.. మిగతావారు తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు టీమిండియా బౌలర్ల దాటికి 38.2 ఓవర్లలో 140 పరుగలుకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్లలో ఆరిఫుల్ ఇస్లామ్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో రాజ్‌వర్దన్, రవికుమార్, రాజ్ భవా, విక్కీ ఓస్తల్ తలా రెండు వికెట్లు తీయగా.. నిషాంత్ సింధు, కుషాల్ తంబే చెరో వికెట్ తీశారు. ఇక డిసెంబర్ 31న జరిగే ఫైనల్లో టీమిండియా.. శ్రీలంకతో ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment