Asia Cup Under-19
-
అండర్–19 జట్టుపై ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు
ఆసియా కప్‌లో విజేతగా నిలువడం ద్వారా అండర్–19 ప్రపంచకప్‌కు ముందు యువ భారత జట్టుకు కావాల్సినంత విశ్వాసం లభించిందని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆసియా కప్‌కు సరైన సన్నాహాలు లేకుండానే యువ భారత్ వెళ్లిందని... నిలకడగా రాణించి విజేతగా అవతరించదని లక్ష్మణ్ కొనియాడాడు. అండర్–19 ప్రపంచకప్ ఈనెల 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్‌లో జరుగుతుంది. కాగా, శ్రీలంక అండర్–19 జట్టుతో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో యువ భారత్ 9 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును చిత్తు చేసి టైటిల్ చేజిక్కించుకుంది. భారత అండర్–19 టీమ్ ఆసియా కప్‌ను గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. (చదవండి: భారత యువ ఆటగాళ్లకిది ఎనిమిదోసారి...) -
Under-19 Asia Cup: గుంటూరు కుర్రాడు అదుర్స్.. ఫైనల్లో టీమిండియా
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో భారత్ 103 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్‌లో షేక్ రషీద్ (108 బంతుల్లో 90 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఏపీలోని గుంటూరుకు చెందిన షేర్ రషీద్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన షేక్ రషీద్ 90 పరుగుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే బౌండరీల రూపంలో వచ్చాయి. ఇక కెప్టెన్ యష్‌దుల్ 26 పరుగులు, రాజ్ భవా 23 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రకీబుల్ హసన్ 3 వికెట్లు తీయగా.. మిగతావారు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు టీమిండియా బౌలర్ల దాటికి 38.2 ఓవర్లలో 140 పరుగలుకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లలో ఆరిఫుల్ ఇస్లామ్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో రాజ్‌వర్దన్, రవికుమార్, రాజ్ భవా, విక్కీ ఓస్తల్ తలా రెండు వికెట్లు తీయగా.. నిషాంత్ సింధు, కుషాల్ తంబే చెరో వికెట్ తీశారు. ఇక డిసెంబర్ 31న జరిగే ఫైనల్లో టీమిండియా.. శ్రీలంకతో ఆడనుంది. -
Ind Vs Pak: పాక్‌తో మ్యాచ్.. భారత బ్యాటర్ల స్కోర్లు.. 0, 6,0,8, 6, 1.. ఆరాధ్య ఒక్కడే 50!
ACC Asia Cup U19 Ind Vs Pak: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్ ఆరాధ్య యాదవ్ అర్ధ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు ఓపెనర్ హర్నూర్ సింగ్(46) మెరుగ్గా రాణించడంతో భారత్ 237 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ యశ్ ధుల్ సహా మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. దుబాయ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు... 49 ఓవర్లలో 237 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశి, షేక్ రషీద్, యశ్ ధుల్, నిషాంత్ సింధు, విక్కీ, రవికుమార్ వరుసగా 0, 6,0,8, 6, 1 పరుగులు చేశారు. ఇక హర్నూర్, వికెట్ కీపర్ బ్యాటర్ ఆరాధ్య చెప్పుకోదగ్గర స్కోర్లు చేశారు. వీరికి తోడు రాజ్ బవా(25 పరుగులు), కుశాల్ తంబే(32 పరుగులు), రాజవర్ధన్(33 పరుగులు) చేయడంతో భారత్ 200 మార్కు దాటగలిగింది. పాక్ బౌలర్లలో జీషన్ జమీర్‌కు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కాయి. 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటింగ్ కొనసాగుతోంది. చదవండి: Who Is Yash Dhull: ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేశారు! ACC U19 Asia Cup 2021 India U19 vs Pakistan U19 India set Pakistan a target of 238 runs. 🇮🇳 237 all out (49 ov)#INDvPAK | #U19AsiaCup | #PakistanFutureStars 📸: ACC pic.twitter.com/0uDmB6bDFO — Pakistan Cricket Live (@TheRealPCB_Live) December 25, 2021 -
106 పరుగులే చేసినా...
కొలంబో: ఉత్కంఠభరిత పోరులో భారత యువ జట్టు ఆసియా అండర్–19 వన్డే విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో భారత అండర్–19 జట్టు 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ అండర్–19ను ఓడించింది. ముందుగా భారత్ 32.4 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. కరణ్ లాల్ (37), కెపె్టన్ ధ్రువ్ జురేల్ (57) ఫర్వాలేదనిపించగా... ఎనిమిది మంది ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. అనంతరం భారత లెఫ్టార్మ్ స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అథర్వ అంకోలేకర్ (5/28) ధాటికి బంగ్లాదేశ్ 33 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. కెపె్టన్ అక్బర్ అలీ (23), మృత్యుంజయ్ (21) కొంత పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. చివర్లో విజయానికి 29 పరుగులు చేయాల్సిన దశలో తన్జీమ్ (12), రకీబుల్ (11 నాటౌట్) తొమ్మిదో వికెట్‌కు 23 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువగా తీసుకొచ్చారు. గెలుపు కోసం మరో 6 పరుగులు చేయాల్సి ఉండగా... ఒకే ఓవర్లో అథర్వ రెండు వికెట్లు పడగొట్టడంతో బంగ్లా ఆట ముగిసింది. -
ఆసియా కప్ టీమిండియాదే..
కొలంబొ : డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా మరోసారి టైటిల్ నిలబెట్టుకుంది. శ్రీలంక వేదికగా జరుగుతున్న అండర్-19 అసియా కప్‌ను యువ భారత జట్టు మరోసారి కైవసం చేసుకుంది. శనివారం ప్రేమదాస స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో ఐదు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. మ్యాచ్‌పై ఎలాంటి ఆశలు లేని సమయంలో లెగ్ స్పిన్నర్ అధర్వ అంకోలేకర్ ఐదు వికెట్లతో చెలరేగడంతో టీమిండియా విజయం అందుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 32.4 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ ధృవ్ (33), కరణ్ లాల్(37) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. బంగ్లా బౌలర్లలో షామిమ్ హుస్సేన్ (3/8), చౌదరి(3/18) చెలరేగిపోయారు. అనంతరం 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ అధర్వ బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. దీంతో 33 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటై ఓటమి చవిచూసింది. అధర్వతో పాటు ఆకాశ్ సింగ్ మూడు వికెట్లతో అదరగొట్టాడు. విజయం అసాధ్యమనుకున్న మ్యాచ్‌లో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన అధర్వకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆసాంతం తన బ్యాటింగ్‌తో టీమిండియాకు ఎదురేలేని విజయాలు అందించిన అర్జున్ ఆజాద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది. -
అనూజ్, దేవదత్ సెంచరీలు
ఢాకా: అండర్–19 ఆసియా కప్‌లో యువ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తుచేసిన భారత అండర్–19 జట్టు ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో యూఏఈపై 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు అనూజ్ రావత్ (102; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్ (121; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత శతకాలతో చెలరేగారు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు అనూజ్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దేవదత్ 205 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి శుభారంభం అందించారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యఛేదనలో లెఫ్టార్మ్ స్పిన్నర్ సిద్ధార్థ్ దేశాయ్ (6/24) చెలరేగడంతో యూఏఈ 33.5 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది. తదుపరి మ్యాచ్‌లో భారత్ మంగళవారం అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. -
కుర్రాళ్లు ‘ఆసియా’ను కొట్టేశారు
-
కుర్రాళ్లు ‘ఆసియా’ను కొట్టేశారు
అండర్–19 ఆసియా కప్ క్రికెట్ విజేత భారత్ ఫైనల్లో 34 పరుగులతో శ్రీలంక చిత్తు కొలంబో: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో భారత యువ జట్టు వరుసగా మూడోసారి విజేతగా నిలి చింది. శుక్రవారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 34 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ముందుగా భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేయగా... ఆ తర్వాత శ్రీలంక 48.4 ఓవర్లలో 239 పరుగులకే ఆలౌటైంది. హిమాన్షు రాణా (71; 6 ఫోర్లు, 1 సిక్స్), శుభ్‌మన్ గిల్ (70; 4 ఫోర్లు) భారత ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించగా... శ్రీలంక ఆటగాళ్లు రెవెన్ కెల్లీ (62; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ కామిందు మెండిస్ (53; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. తన లెఫ్టార్మ్ స్పిన్‌తో కీలక వికెట్లు పడగొట్టిన భారత కెప్టెన్ అభిషేక్ శర్మ (4/37) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా... టోర్నీలో 5 మ్యాచ్‌లలో కలిపి 283 పరుగులు చేసిన హిమాన్షు రాణా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును గెలుచుకున్నాడు. గెలుపు కోసం 75 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచిన శ్రీలంక, 43 పరుగుల వ్యవధితో తమ చివరి 7 వికెట్లు కోల్పోయి పరాజయంపాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు హిమాన్షు రాణా, పృథ్వీ షా (39; 6 ఫోర్లు) శుభారంభం అందించారు. ముందుగా పృథ్వీ వరుస బౌండరీలతో చెలరేగాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 67 పరుగులు, రెండో వికెట్‌కు హిమాన్షు, శుభ్‌మన్ 88 పరుగులు జత చేశారు. మిడిలార్డర్లో కెప్టెన్ అభిషేక్ శర్మ (29), సల్మాన్ ఖాన్ (26) మరికొన్ని పరుగులు జోడించగా, కమలేశ్ నాగర్కోటి (14 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) చివర్లో చెలరేగాడు. లక్ష్యఛేదన చేస్తూ శ్రీలంక ఆరంభంలోనే చతురంగ (13) వికెట్ కోల్పోయింది. అయితే కెల్లీ, బోయగోడ (37; 5 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 15 ఓవర్లలోనే 78 పరుగులు జోడించడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ చకచకా సాగింది. అయితే అభిషేక్ బౌలింగ్‌లో బోయగోడ అవుట్ కాగా ... మూడో వికెట్‌కు కెల్లీ, మెండిస్ 53 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా అభిషేక్ విడదీశాడు. ఆ తర్వాత లంక కోలుకోలేకపోయింది.