అనూజ్, దేవదత్‌ సెంచరీలు | Indian openers Anuj Rawat, Devdutt Padikkal power team to 227-runs | Sakshi
Sakshi News home page

అనూజ్, దేవదత్‌ సెంచరీలు

Published Mon, Oct 1 2018 4:49 AM | Last Updated on Mon, Oct 1 2018 4:49 AM

Indian openers Anuj Rawat, Devdutt Padikkal power team to 227-runs - Sakshi

ఢాకా: అండర్‌–19 ఆసియా కప్‌లో యువ భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తుచేసిన భారత అండర్‌–19 జట్టు ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో యూఏఈపై 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు అనూజ్‌ రావత్‌ (102; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు), దేవదత్‌ పడిక్కల్‌ (121; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత శతకాలతో చెలరేగారు. ఫలితంగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన యువ భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు అనూజ్, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దేవదత్‌ 205 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి శుభారంభం అందించారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యఛేదనలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ సిద్ధార్థ్‌ దేశాయ్‌ (6/24) చెలరేగడంతో యూఏఈ 33.5 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది. తదుపరి మ్యాచ్‌లో భారత్‌ మంగళవారం అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement