
ఆసియా కప్‌లో విజేతగా నిలువడం ద్వారా అండర్–19 ప్రపంచకప్‌కు ముందు యువ భారత జట్టుకు కావాల్సినంత విశ్వాసం లభించిందని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆసియా కప్‌కు సరైన సన్నాహాలు లేకుండానే యువ భారత్ వెళ్లిందని... నిలకడగా రాణించి విజేతగా అవతరించదని లక్ష్మణ్ కొనియాడాడు. అండర్–19 ప్రపంచకప్ ఈనెల 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్‌లో జరుగుతుంది.
కాగా, శ్రీలంక అండర్–19 జట్టుతో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో యువ భారత్ 9 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును చిత్తు చేసి టైటిల్ చేజిక్కించుకుంది. భారత అండర్–19 టీమ్ ఆసియా కప్‌ను గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.
(చదవండి: భారత యువ ఆటగాళ్లకిది ఎనిమిదోసారి...)
Comments
Please login to add a commentAdd a comment