VVS Laxman As NCA Director: టీమిండియా మాజీ ఆటగాడు, హైదరాబాదీ సొగసరి బ్యాటర్, మణికట్టు మాంత్రికుడు వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్(వీవీఎస్ లక్ష్మణ్) కొత్త బాధ్యతలను చేపట్టాడు. భారత క్రికెట్‌కు అనుసంధాన సంస్థ అయిన జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) చీఫ్‌గా సోమవారం ఛార్జ్ తీసుకున్న లక్ష్మణ్.. బెంగళూరులోని ఎన్‌సీఏ ప్రధాన కార్యాలయంలో తొలి రోజు విధులను నిర్వర్తించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను అతనే స్వయంగా సోషల్‌మీడియాలో షేర్ చేశాడు.
కాగా, లక్ష్మణ్‌కు ముందు ఎన్‌సీఏ చీఫ్ పదవిని ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నిర్వర్తించేవాడన్న విషయం తెలిసిందే. ద్రవిడ్‌కు ప్రమోషన్ రావడంతో లక్ష్మణ్ ఎన్‌సీఏ బాధ్యతలను చేపట్టాడు. ద్రవిడ్‌ను టీమిండియా హెడ్‌కోచ్‌గా నియమించడంలో కీలకపాత్ర పోషించిన బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీనే.. లక్ష్మణ్‌ను సైతం ఒప్పించి మరీ బాధ్యతలు చేపట్టేలా చేశాడు. కొత్త బాధ్యతల్లో లక్ష్మణ్.. భారత యువ ఆటగాళ్లకు దిశానిర్ధేశం చేయడంతో పాటు ఆటగాళ్లను సానబెట్టే పనిలో ఉంటాడు.
కంగ్రాట్స్ బ్రదర్.. :కేటీఆర్
ఎన్‌సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ‘కొత్త బాధ్యతలు చేపట్టిన సోదరుడు లక్ష్మణ్‌కు అభినందనలంటూ ట్వీట్ చేశారు. మీరు, రాహుల్ ద్రవిడ్ కలిసి భారత క్రికెట్‌ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తారనే నమ్మకం నాకుంది’ అంటూ కేటీఆర్ ట్వీటారు.
Congratulations on the new responsibility brother @VVSLaxman281 👏
— KTR (@KTRTRS) December 14, 2021
I am sure with gentlemen like you and #RahulDravid at the helm of affairs, future Indian cricket will scale newer/greater heights https://t.co/92nxVA6Rz1
Comments
Please login to add a commentAdd a comment