under 19
-
Gongadi Trisha: మహిళల క్రికెట్లో రైజింగ్ స్టార్
బ్యాటింగ్‌లో నిలకడ, షాట్లలో కచ్చితత్వం, క్రీజులో నిలిస్తే చక్కని ఇన్నింగ్స్‌లు ఆడగలిగే నేర్పరితనం... ఇవన్నీ ఆ అమ్మాయి సొంతం. మిథాలీ రాజ్ తర్వాత జాతీయ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సత్తా తనలో ఉందని ఆటద్వారా చాటి చెప్పుకుంటున్న టీనేజ్ సెన్సేషన్ గొంగడి త్రిష, తెలంగాణకు చెందిన 19 ఏళ్ల త్రిష ఆదివారం మలేసియాలో ముగిసిన ఆసియా అండర్–19 టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచేందుకు కీలకపాత్ర పోషించింది. దొరై రాజ్ (మిథాలీ రాజ్), హర్మేందర్ సింగ్ భుల్లర్ (హర్మన్‌ప్రీత్ కౌర్), శ్రీనివాస్ మంధాన (స్మృతి), ఇవాన్ రోడ్రిగ్స్ (జెమీమా), సంజీవ్ వర్మ (షఫాలీ వర్మ) వీరంతా తమ గారాల తనయల కోసం తపించారు. భారత్ క్రికెట్లో భాగమయ్యేందుకు కుమార్తెలతో పాటు కలలు కని శ్రమించి సాధించారు. వీరిలాగే తెలంగాణకు చెందిన గొంగడి రామిరెడ్డి కూడా తన ఒక్కగానొక్క బిడ్డ (త్రిష) కోసం పుట్టిన గడ్డ (భద్రాచలం)ను వీడి హైదరాబాద్ వచ్చారు. క్రికెట్లో ఓనమాలు మొదలు అకాడమీలో శిక్షణ కోసం తన స్తోమతకు మించే ఖర్చు చేశారు. తండ్రి కష్టం చూసిన తనయ త్రిష ఆ కళ్లలో ఆనందం నింపాలని నెట్స్‌లో సాధన చేసింది. క్రికెట్లో రాటుదేలింది. మైదానంలో రాణిస్తోంది. తాజాగా కౌలాలంపూర్‌లో బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన ఆసియా అండర్–19 మహిళల టి20 టోర్నీ ఫైనల్లో త్రిష (47 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో అదరగొట్టి భారత జట్టును విజేతగా నిలిపింది.అంతేకాకుండా ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు సొంతం చేసుకుంది. గతేడాది దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్–19 మహిళల తొలి టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులోనూ త్రిష సభ్యురాలిగా ఉంది. భద్రాచలంలో ఓ ఫిట్నెస్ ట్రెయినర్‌గా పనిచేసే రామిరెడ్డి తన కుమార్తెను అంతర్జాతీయ క్రికెటర్‌గా చూడాలనుకున్నారు. అందుకు భద్రాచలంలో ఉంటే సరిపోదని గుర్తించిన వెంటనే 2013లో సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లికి మకాం మార్చారు. అక్కడ్నుంచి కోచింగ్ సెంటర్‌కు తీసుకెళ్లడం... ఆమె ఆటపై పట్టుదల కనబరచడం, క్రమంగా ప్రతిభగల క్రికెటర్‌గా మారడం సజావుగా జరిగిపోయాయి. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న డబ్ల్యూపీఎల్ వేలమే ఆ తండ్రిని కాస్త నిరాశపరిచింది. క్రితంసారి మెగా వేలంలో అన్‌సోల్డ్ క్రికెటర్‌గా మిగిలిపోవడం... ఇటీవల జరిగిన మినీ వేలంలోనూ ఫ్రాంచైజీలు త్రిషను మరోసారి విస్మరించడంతో నిరుత్సాహం కలిగింది. అయితే త్రిష నిలకడగా ఆడుతున్న తీరును బట్టి భవిష్యత్‌లో ఆమెపై ఫ్రాంచైజీలు తప్పకుండా దృష్టి సారిస్తాయనడంలో సందేహం లేదు. హైదరాబాద్‌లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న ఆమె అచిరకాలంలోనే పిన్న వయసులో తెలంగాణ రాష్ట్ర అండర్–19 జట్టు తరఫున స్కూల్ గేమ్స్ సమాఖ్య పోటీల్లో రాణించిన ఆమె కీలక బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా రాణించింది. 2014–15 సీజన్లో హైదరాబాద్ అండర్–19 తరఫున ఇంటర్ స్టేట్ టోర్నమెంట్లో పాల్గొంది. అక్కడి నుంచి హైదరాబాద్, సౌత్‌జోన్ అండర్–19 జట్లలో రెగ్యులర్ ప్లేయర్‌గా మారింది.గత రెండేళ్లుగా భారత అండర్–19 జట్టులో ఓపెనర్‌గా రాణిస్తోంది. టాపార్డర్ బ్యాటర్ అయిన త్రిష లెగ్‌స్పిన్ బౌలర్ కూడా! క్రమం తప్పకుడా బౌలింగ్ కూడా వేస్తుంది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తుదిపోరులో వికెట్ తీయకపోయినా (3–0–10–0)తో కుదురుగా బౌలింగ్ చేసింది. 2023లో అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న త్రిష దురదృష్టవశాత్తూ మహిళల ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల కంటబడటం లేదు. గతేడాది ఆమెను మెగా వేలంలో ఎవరూ పట్టించుకోలేదు. మొన్న మినీ వేలంలోనూ విస్మరించారు. అయినా... త్రిష నిరాశలో కూరుకుపోలేదు. తనపని తాను చేసుకుపోతోంది. రైజింగ్ స్టార్‌గా ఎదుగుతున్న త్రిష హైదరాబాద్ నుంచి మరో మిథాలీ రాజ్ కావాలని ఆశిద్దాం. – సాక్షి క్రీడా విభాగం -
ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టిన భారత స్పిన్నర్
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 యూత్ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు గెలుపు దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో యంగ్ ఇండియా మరో 85 పరుగులు చేస్తే విజయతీరాలకు చేరుతుంది. భారత్ చేతిలో మరో ఐదు వికెట్లు ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ (1), విహాన్ మల్హోత్రా (11), నిత్య పాండ్యా (51), కేపీ కార్తికేయ (35), సోహమ్ పట్వర్ధన్ (10) ఔట్ కాగా.. అభిగ్యాన్ కుందు (11), నిఖిల్ కుమార్ (1) క్రీజ్‌లో ఉన్నారు. మూడో రోజు టీ విరామం సమయానికి భారత జట్టు స్కోర్ 127/5గా ఉంది. ఆసీస్ బౌలర్లలో ఎయిడెన్ ఓ కాన్నర్, విశ్వ రామ్‌కుమార్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. థామన్ బ్రౌన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టిన మొహమ్మద్ ఎనాన్అంతకుముందు యువ స్పిన్నక్ మొహమ్మద్ ఎనాన్ ధాటికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌటైంది. ఎనాన్ ఆరు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. సోహమ్ పట్వర్ధన్ 3, ఆదిత్య సింగ్ ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో రిలే కింగ్సెల్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.సూర్యవంశీ సుడిగాలి శతకంఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సుడిగాలి శతకంతో (62 బంతుల్లో 104) విరుచుకుపడటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు చేసింది. మరో ఓపెనర్ విహాన్ మల్హోత్రా (76) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో విశ్వ రామ్‌కుమార్ 4, థామస్ బ్రౌన్ 3, అడ్డిసన్ షెరిఫ్ 2 వికెట్లు పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 293 పరుగులకు ఆలౌటైంది. రిలే కింగ్సెల్ (53), ఎయిడెన్ ఓ కాన్నర్ (61) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సమర్థ్ నాగరాజ్, మొహమ్మద్ ఎనాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా..ఆదిత్య రావత్ 2, ఆదిత్య సింగ్, సోహమ్ పట్వర్దన్ తలో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: అగ్రపీఠాన్ని అధిరోహించిన బుమ్రా -
Ind vs Aus: భారత బ్యాటర్ రికార్డు.. ప్రపంచంలోనే తొలిసారి
U19 Ind vs Aus Day 1 Final Update: ఆస్ట్రేలియా అండర్–19 జట్టుపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత అండర్–19 జట్టు అనధికారిక టెస్టు సిరీస్‌ను కూడా మెరుగ్గా ఆరంభించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా సోమవారం తొలి అనధికారిక టెస్టు ప్రారంభమైంది. 293 పరుగులకు ఆసీస్ ఆలౌట్‌టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 71.4 ఓవర్లలో 293 పరుగులకు ఆలౌటైంది. రిలే కింగ్సెల్ (77 బంతుల్లో 53; 9 ఫోర్లు, ఒక సిక్సర్), ఎయిడెన్ ఓ కానర్ (70 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలు సాధించారు. భారత జట్టు బౌలర్లలో సమర్థ్ నాగరాజ్, మొహమ్మద్ ఇనాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 81 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), విహాన్ మల్హోత్రా (21 బ్యాటింగ్, 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న యువ భారత్... ప్రత్యర్థి స్కోరుకు 190 పరుగులు వెనుకబడి ఉంది. వైభవ్ రికార్డు అర్ధ శతకం అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా యువ భారత్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రికార్డుల్లోకెక్కాడు. వైభవ్ 13 సంవత్సరాల 187 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. ఏ స్థాయి క్రికెట్లోనైనా ఇదే అతి పిన్న వయసులో అంతర్జాతీయ అర్ధసెంచరీ. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ ప్లేయర్ నజ్ముల్ హసన్ షాంటో (14 సంవత్సరాల 231 రోజులు) పేరిట ఉంది. శ్రీలంకపై నజ్ముల్ ఈ రికార్డు నమోదు చేశాడు.సమిత్ ద్రవిడ్‌కు గాయం భారత అండర్–19 జట్టులో సభ్యుడైన క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ మోకాలి గాయం కారణంగా ఆ్రస్టేలియాతో అనధికారిక టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. రెండో మ్యాచ్ వరకూ అతడు కోలుకోవడం అనుమానమే. ప్రస్తుతం సమిత్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు. ఇటీవల యూత్ వన్డే సిరీస్‌కు కూడా గాయం కారణంగానే దూరమైన సమిత్... కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు భారత అండర్–19 జట్టు కోచ్ హృషికేశ్ కనిత్కర్ తెలిపాడు. అండర్–19 స్థాయిలో ఆడేందుకు సమిత్ ద్రవిడ్‌కు ఇదే చివరి అవకాశం కాగా... ఈ నెల 11న అతడు 19వ పడిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో 2026లో జరగనున్న అండర్–19 ప్రపంచకప్‌లో ఆడే అర్హత కోల్పోయాడు. -
ఆస్ట్రేలియా జట్టులో ముగ్గురు భారత మూలాలున్న క్రికెటర్లు
ఆస్ట్రేలియా మహిళల అండర్-19 జట్టుకు ముగ్గురు భారత మూలాలున్న క్రికెటర్లు (రిబ్యా స్యాన్, సమారా దుల్విన్, హస్రత్ గిల్) ఎంపికయ్యారు. ఈ ముగ్గురు న్యూజిలాండ్, శ్రీలంక అండర్-19 జట్లతో జరిగే ముక్కోణపు సిరీస్‌లో పాల్గొననున్నారు. టీ20, వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. 14 రోజుల పాటు జరిగే ఈ టోర్నీల్లో మూడు జట్లు నాలుగు టీ20లు, రెండు వన్డేలు ఆడతాయి. ఈ టోర్నీల కోసం 15 మంది సభ్యుల రెండు వేర్వేరు జట్లను ఆస్ట్రేలియా యూత్ సెలెక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది. ఈ జట్లకు ఆసీస్ మాజీ ప్లేయర్ క్రిస్టెన్ బీమ్స్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు.రిబ్యా స్యాన్- బౌలింగ్ ఆల్‌రౌండర్ సమారా దుల్విన్- బ్యాటర్హస్రత్ గిల్- బౌలర్ -
సీఎం జగన్‌ను కలిసిన టీమిండియా అండర్-19 వైస్ కెప్టెన్ షేక్ రషీద్
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని భారత క్రికెట్ అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా రషీద్‌ను సీఎం అభినందించారు. ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు, రూ. 10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయింపు, ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హమీ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన రూ.10 లక్షల చెక్ సీఎం చేతుల మీదుగా అందజేశారు. చదవండి: ఆ విధానాలను అధ్యయనం చేయండి: సీఎం జగన్ -
అండర్–19 జట్టుపై ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు
ఆసియా కప్‌లో విజేతగా నిలువడం ద్వారా అండర్–19 ప్రపంచకప్‌కు ముందు యువ భారత జట్టుకు కావాల్సినంత విశ్వాసం లభించిందని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆసియా కప్‌కు సరైన సన్నాహాలు లేకుండానే యువ భారత్ వెళ్లిందని... నిలకడగా రాణించి విజేతగా అవతరించదని లక్ష్మణ్ కొనియాడాడు. అండర్–19 ప్రపంచకప్ ఈనెల 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్‌లో జరుగుతుంది. కాగా, శ్రీలంక అండర్–19 జట్టుతో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో యువ భారత్ 9 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును చిత్తు చేసి టైటిల్ చేజిక్కించుకుంది. భారత అండర్–19 టీమ్ ఆసియా కప్‌ను గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. (చదవండి: భారత యువ ఆటగాళ్లకిది ఎనిమిదోసారి...) -
మద్యం సేవించేందుకు వెళ్లడంతో...
బీజింగ్: కరోనా వ్యాప్తి నియంత్రణ నిబంధనల్ని ఉల్లంఘించిన ఆరుగురు జాతీయ అండర్–19 క్రీడాకారులపై చైనీస్ ఫుట్‌బాల్ సంఘం (సీఎఫ్ఏ) సస్పెన్షన్ వేటు వేసింది. ఆరు నెలల పాటు ఎలాంటి మ్యాచ్‌ల్లో పాల్గొనకుండా వారిపై నిషేధం విధించింది. నిబంధనల్ని తుంగలో తొక్కుతూ జాతీయ శిక్షణా శిబిరం నుంచి అర్ధరాత్రి చెప్పాపెట్టకుండా మద్యం సేవించేందుకు బయటకు వెళ్లిన ఆరుగురు ప్లేయర్ల చర్యను సీఎఫ్ఏ తీవ్రంగా పరిగణించింది. ‘ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన. వారి చర్య కారణంగా మొత్తం జట్టుకు చెడ్డ పేరు వచ్చింది. అందుకే వారిని నవంబర్ 30 వరకు సస్పెండ్ చేస్తున్నాం’ అని సీఎఫ్ఏ పేర్కొంది. షాంఘైలో మే 17న ప్రారంభమైన జాతీయ ఫుట్‌బాల్ శిబిరం శనివారంతో ముగిసింది. కరోనా నేపథ్యంలో 35 మంది యువ ఫుట్‌బాలర్లు పాల్గొన్న ఈ శిక్షణా శిబిరంలో ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా సీఎఫ్ఏ పలు నిబంధనలు విధించింది. -
యువ భారత్ హ్యాట్రిక్ విజయం
డర్బన్: మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత యువ జట్టు అండర్–19 నాలుగు దేశాల క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో భారత్ 120 పరుగులతో ఘనవిజయం సాధించింది. వరుసగా మూడు విజయాలతో అజేయంగా నిలిచిన భారత్ ఆరు పాయింట్లతో ఫైనల్‌కు చేరింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, న్యూజిలాండ్ రెండేసి పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా దక్షిణాఫ్రికా ఈనెల 9న భారత్‌తో జరిగే ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. జింబాబ్వే, న్యూజిలాండ్ మూడో స్థానం కోసం తలపడతాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిరీ్ణత 50 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓపెనర్ తిలక్ వర్మ (59; 8 ఫోర్లు, సిక్స్), సిద్ధేశ్ వీర్ (71; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 135 పరుగులు జోడించారు. అనంతరం 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 35.5 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. సుశాంత్ మిశ్రా (3/35), అథర్వ (3/16), విద్యాధర్ పాటిల్ (2/31) న్యూజిలాండ్‌ను దెబ్బతీశారు. -
భారత అండర్–19 జట్ల శుభారంభం
తిరువనంతపురం: నాలుగు జట్ల అండర్–19 వన్డే సిరీస్‌లో ఆతిథ్య భారత్ ‘ఎ’... ‘బి’ జట్లు శుభారంభం చేశాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత అండర్–19 ‘ఎ’ జట్టు 157 పరుగుల తేడాతో... అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ‘బి’ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించాయి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత ‘ఎ’ బృందం సరిగ్గా 50 ఓవర్లలో 251 పరుగులు సాధించింది. కమ్రాన్ ఇక్బాల్ (60; 3 ఫోర్లు), శాశ్వత్ రావత్ (64; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు 35.4 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌటైంది. భారత ‘ఎ’ బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్ష దూబే మూడేసి వికెట్లు తీశారు. అఫ్గానిస్తాన్‌తో పోరులో భారత ‘బి’ జట్టు 107 పరుగుల లక్ష్యాన్ని 22.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. హైదరాబాద్ ఆటగాడు, ఓపెనర్ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ (70 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు), రాహుల్ చంద్రోల్ (51 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) రాణించారు. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో... తిలక్ వర్మ, రాహుల్ క్రీజులో నిలదొక్కుకొని అభేద్యంగా 102 పరుగులు జోడించి భారత్ విజయాన్ని ఖాయం చేశారు. అంతకుముందు అఫ్గానిస్తాన్ జట్టు 47.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. భారత ‘బి’ బౌలర్లలో పూర్ణాంక్ త్యాగి (4/36), ప్రయాస్ రే బర్మన్ (3/10), అథర్వ (2/18) ఆకట్టుకున్నారు. -
ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు
సాక్షి, అనంతపురం: బీసీసీఐ దేశవాళీ అండర్–19 టోర్నీ (కూచ్ బెహర్ ట్రోఫీ)లో అరుదైన ఘనత నమోదైంది. మణిపూర్ లెఫ్టార్మ్ పేస్ బౌలర్ రెక్స్ రాజ్‌కుమార్ సింగ్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఇక్కడి ఆర్డీటీ మైదానంలో అరుణాచల్‌ప్రదేశ్‌తో బుధవారం ముగిసిన మ్యాచ్‌లో రెక్స్ ఈ రికార్డు సాధించాడు. 9.5 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చిన రెక్స్ 10 వికెట్లు తీశాడు. వీటిలో 6 మెయిడెన్లు ఉన్నాయి. అతని ధాటికి అరుణాచల్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో కూడా కూడా రెక్స్ 5 వికెట్లు పడగొట్టడంతో ప్రత్యర్థి ఇన్నింగ్స్ 138కే ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 122కే ఆలౌటై 16 పరుగుల ఆధిక్యం కోల్పోయిన మణిపూర్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసి విజయాన్నందుకుంది. -
15 ఏళ్ల తర్వాత 'తొలి మ్యాచ్'!
సిడ్నీ: ఆస్ట్రేలియా అండర్ 19 మహిళా క్రికెట్ జట్టు సుదీర్ఘ విరామం తర్వాత తొలి మ్యాచ్ ఆడటానికి సన్నద్ధమవుతోంది. మరో రెండు నెలల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు రాబోతున్న ఆసీస్ అండర్ 19 మహిళా జట్టు.. సఫారీ, ఇంగ్లండ్ జట్లతో ట్రై సిరీస్‌లో తలపడనుంది.దాంతో 15 ఏళ్ల విరామానికి ఆసీస్ అండర్ 19 మహిళా జట్టు ఫుల్స్టాప్ పెట్టనుంది. చివరిసారి 2003లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో తలపడగా, ఆపై ఇంతకాలాని 'తొలి అంతర్జాతీయ మ్యాచ్'ను ఆడటానికి ఆసీస్ అండర్ 19 మహిళా జట్టు సన్నద్ధమైంది. మరొకవైపు ఆసీస్ అండర్ 19 మహిళలకు ఇదే తొలి విదేశీ పర్యటన కావడం ఇక్కడ విశేషం. ఇందులో 50 ఓవర్ల ట్రై సిరీస్‌తో పాటు, రెండు టీ 20 మ్యాచ్‌ల్లో ఆసీస్ జట్టు పాల్గొనుంది. ఈ మేరకు 14 మంది మహిళా క్రికెటర్లతో కూడిన ఆసీస్ జట్టును ప్రకటించారు. ఆసీస్ అండర్ 19 మహిళా వన్డే క్రికెట్ కెప్టెన్‌గా 16 ఏళ్ల రాచెల్ ట్రెనామన్ను ఎంపిక చేయగా, టీ 20 జట్టుకు సారథిగా సస్కియా హార్లీని నియమించారు. -
అందుకే ద్రవిడ్ అంటే ఇష్టం: కేటీఆర్
హైదరాబాద్: భారత యువ క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అంటున్నారు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్. ఒక క్రికెటర్‌గానే కాదు.. వ్యక్తిగా కూడా ద్రవిడ్ తనకు అత్యంత ఇష్టమని కేటీఆర్ పేర్కొన్నారు. అందుకు కారణం ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్ కప్‌లో భారత క్రికెట్ జట్టును విజేతగా నిలిచేందుకు తోడ్పడిన శిక్షణ సిబ్బందికి సమాన ప్రోత్సాహాకాన్ని ఇవ్వాలంటూ రాహుల్ ద్రవిడ్ కోరడమే. ఇందుకు బీసీసీఐ అంగీకరిస్తూ శిక్షణ సిబ్బందికి సమాన ప్రోత్సాహాకాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనిపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన వార్తపై కేటీఆర్ స్పందిస్తూ... ఒక క్రికెటర్‌గానే కాదు.. వ్యక్తిగా కూడా ద్రవిడ్ తనకు అత్యంత ఇష్టమని ట్వీట్ చేశారు. ప్రపంచకప్ గెలవగానే బోర్డు... ఆటగాళ్లకు రూ 30 లక్షలు, హెడ్ కోచ్ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున ప్రోత్సాహకాల్ని బీసీసీఐ ప్రకటించింది. దీనిపై ద్రవిడ్ అసంతృప్తి వెలిబుచ్చాడు. జట్టు కోసం తన సిబ్బంది అంతా సమష్టిగా శ్రమించారని, ఈ ఫలితంలో పేరొచ్చినా... ప్రోత్సాహకం వచ్చినా సమానంగా దక్కాల్సిందేనని డిమాండ్ చేశాడు. దిగ్గజ ఆటగాడి మాటకు విలువిచ్చిన బీసీసీఐ... ఏడాదికి పైగా యువ జట్టుకు సేవలందించిన కోచింగ్ సిబ్బందికి సమాన నజరానాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. This is why Rahul Dravid is not only my favourite cricketer but also my favourite person as well 🙏 https://t.co/xsSas8wdSV — KTR (@KTRTRS) 26 February 2018 -
అండర్ 19 క్రికెటర్ అరెస్ట్
లండన్: బహిరంగ ప్రదేశాల్లో మహిళల ఎదుట అభ్యంతకరంగా ప్రవర్తించిన ఇంగ్లండ్ అండర్ -19 క్రికెటర్ శివ్ థాకూర్‌ను అరెస్ట్ చేశారు. ఈ జూన్ నెలలో వరుస వేర్వేరు ఘటనల్లో శివ థాకూర్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు అభియోగాలు వచ్చాయి. ర్యాడ్ బోర్న్ లేన్, మ్యాక్ వర్త్ ప్రదేశాల్లో శివ్ థాకూర్ అసభ్యకర రీతిలో ప్రవర్తించినట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం ఆ యవ క్రికెటర్ ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో డెర్బీషైర్ ఒక ప్రకటన చేసింది.'అతను మా క్లబ్ కు గతంలో ఆడిన మాట వాస్తవమే. ఇప్పుడు సదరు క్రికెటర్ తో మాకు ఎటువంటి సంబంధం లేదు. అతను మా క్లబ్ తరపును ఆడటం లేదు' అని తెలిపింది. 2014 నుంచి 2016 వరకూ సదరు యువ క్రికెటర్ డెర్బీషైర్ తరపున ఆడాడు. -
ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత అండర్ -19 , భారత్ -ఎ క్రికెట్ జట్లకు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అండర్ -19, భారత్ -ఎ క్రికెట్ జట్టు కోచ్ ను ఎంపిక చేసే క్రమంలో కూడా ఇంటర్య్వూలో నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించే క్రమంలో ఎటువంటి ఇంటర్వ్వూలో నిర్వహించకుండానే అతన్ని ఎంపిక చేయాలని చూస్తున్నారు. భారత్ యువ క్రికెటర్లకు ద్రవిడ్ మార్గదర్శకం అవసరమని బీసీసీఐ భావిస్తోంది. దాంతో అతన్నే తిరిగే ఎంపిక చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కాగా, భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కోచ్ పదవిలో కుంబ్లేను కొనసాగిస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
అండర్–19 క్రీడా జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరిసర్కిల్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 18 నుంచి 20 వరకు నిర్వహించే జిల్లాస్థాయి క్రీడా పోటీలకు మండలస్థాయి అండర్–19 క్రీడా జట్ల ఎంపికలు గురువారం స్థానిక కొత్తూరు బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కబడ్డీ, అథ్లెటిక్స్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్ క్రీడల్లో పాల్గోనే బాల, బాలికల జట్లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో పీడీ శంకరన్న, పీఈటీలు వేణుగోపాల్, చంద్రశేఖర్, డీఎస్ఏ సిబ్బంది మనోహర్‌రెడ్డి, ఇస్మాయిల్, అనిల్, మంజుల, వాసంతి, శిరీష, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు కబడ్డీలో బాలురు : సురేష్, పృథ్వీ, కె.భరత్, మహమ్మద్‌రఫీ, సలీమ్‌మాలిక్ (ఎస్ఎస్బీఎన్), భరత్, కృష్ణ (ప్రభుత్వ పాలిటెక్నిక్), పవన్‌కుమార్, రాజు, షాకీర్, ఎస్.మహమ్మద్‌రఫీ, శర్మాస్వలీ(జెడ్పీ ఉన్నత పాఠశాల పాపంపేట), యశ్వంత్, పవన్‌కుమార్ (శ్రీ చైతన్య) బాలికలు : లక్ష్మీ, మానస, హరిత, రాజ్యలక్ష్మీ, లత, అనిత, దివ్య, వసంత, తేజస్విణి, పావని, భారతి, వైజయంతి (కేఎస్ఆర్ అనంతపురం), వై.తేజస్విణి, శివపార్వతి(ఎస్ఎస్బీఎన్) హ్యాండ్‌బాల్ : రవి, బాలరాజు, ఆసిఫ్, జాఫర్, అరుణ్‌కుమార్, మెహరాజ్, మహేష్‌బాబు, సన్నీ, ఆదిల్, యోగేంద్రరెడ్డి (ప్రభుత్వ ఉన్నత పాఠశాల అనంతపురం) అథ్లెటిక్స్ బాలురు : షాట్‌పుట్– సలీమ్, డిస్కస్‌త్రో–వినోద్, లాంగ్‌జంప్–అల్తాఫ్, 100మీ–మెహరాజ్, జావలిన్ త్రో–మహేష్‌బాబు, 400 మీ–రవి, 200మీ–లక్ష్మీనారాయణ బాలికలు : డిస్కస్‌త్రో–సుజాత, లాంగ్‌జంప్–అనిత, 100 మీ–గౌతమి, జావలిన్‌త్రో–రాజ్యలక్ష్మీ, 200 మీ–భార్గవి, 400 మీ–తేజస్విణి -
‘అండర్–19’ విజేత నారాయణ
ఒంగోలు: అండర్–19 సెంట్రల్ జోన్ విజేతగా ఒంగోలు నారాయణ జూనియర్ కాలేజీ జట్టు నిలిచింది. స్థానిక ఏబీఎం డిగ్రీ కాలేజీలో గురువారం సెంట్రల్ జోన్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఒంగోలు నారాయణ జట్టు మధ్య జరిగిన మ్యాచ్‌లో కందుకూరు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 59 పరుగులు చేసి టీఆర్ఆర్ జట్టు ఆలౌటయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నారాయణ జట్టు 11 ఓవర్లలో లక్షా్యన్ని ఛేదించి జయకేతనం ఎగురవేసింది. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన జట్లను ఆర్ఐఓ రమేశ్‌బాబు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటూ ఆటల్లోనూ రాణించి ఉజ్వల భవిష్యత్ సాధించాలని ఆకాంక్షించారు. అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎం హరనాథబాబు, ఏబీఎం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ మోజెస్ దయానందం, ఫిజికల్ డైరెక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటేశ్వరరావు, కార్యదర్శి నరసింహారావు, ఏబీఎం జూనియర్ కాలేజీ పీడీ కే డేవిడ్‌రాజు, రాజు, కాశీరత్నం పాల్గొన్నారు. -
హైదరాబాద్‌కు తొలి విజయం
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న వినూ మన్కడ్ ట్రోఫీ అండర్-19 సౌత్‌జోన్ వన్డే లీగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ విజయాల బోణీ చేసింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన హైదరాబాద్... కర్ణాటకతో శుక్రవారం స్థానిక జింఖానా మైదానంలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో హైదరాబాద్ 12 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 248 పరుగులు సాధించింది. పి. సారుు వికాస్ రెడ్డి (99 బంతుల్లో 105 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా... షేక్ సొహైల్ (50) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం కర్ణాటక జట్టు సరిగ్గా 50 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. దేవ్ పడికల్ (60), నికిన్ జోస్ (61), జయేశ్ (58) అర్ధ సెంచరీలు చేసినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ (3/42), వినీత్ (2/36) రాణించారు. ఆంధ్ర గెలుపు తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 34 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మొదట ఆంధ్ర జట్టు 40 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ కుమార్ రెడ్డి (58), గిరినాథ్ (63) అర్ధ సెంచరీలు సాధించారు. తమిళనాడు 43.3 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటై ఓడిపోరుుంది. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి మూడు వికెట్లు, ఆశిష్, ధ్రువ కుమార్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం హైదరాబాద్ ఖాతాలో నాలుగు, ఆంధ్ర ఖాతాలో ఎనిమిది పాయింట్లు ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. -
హైదరాబాద్ బాలికలకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అండర్-19 స్కూల్ గేమ్స్ సమాఖ్య (జూనియర్ కాలేజి) త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు సత్తాచాటుకున్నారు. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. బాలుర కేటగిరీలో హైదరాబాద్ రన్నరప్‌తో తృప్తిపడింది. సికింద్రాబాద్‌లోని పల్లవి మోడల్ స్కూల్ గ్రౌండ్సలో సోమవారం జరిగిన బాలికల ఫైనల్లో హైదరాబాద్ జిల్లా 15-8, 15-13తో రంగారెడ్డి జిల్లా జట్టుపై విజయం సాధించింది. దీంతో రంగారెడ్డి జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో వరంగల్ 15-11, 15-10తో ఖమ్మంపై నెగ్గింది. బాలుర విభాగంలో కరీంనగర్ విజేతగా నిలిచింది. ఫైనల్లో కరీంనగర్ 15-12, 12-15, 15-5తో హైదరాబాద్‌ను కంగుతినిపించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో నిజామాబాద్ 15-13, 15-11తో రంగారెడ్డిపై నెగ్గింది. అనంతరం జరిగిన కార్యక్రమానికి ట్రావెల్ పాయించ్‌ఆర్ సొల్యూషన్స మేనేజింగ్ డెరైక్టర్ ఖాజీ నజీముద్దీన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ట్రోఫీలు అందజేశారు. ఇందులో ఎస్‌జీఎఫ్‌టీఎస్ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, పల్లవి స్కూల్ జీఎం గోపాల్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. లక్ష్మయ్య, ఉమ, హన్నీ, రాము గౌడ్, రాజేంద్రప్రసాద్, జగన్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ అండర్-19 జట్టు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరుగనున్న సౌత్‌జోన్ అండర్-19 ‘వినూ మన్కడ్’ ట్రోఫీలో పాల్గొనే జట్టును హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సోమవారం ప్రకటించింది. హైదరాబాద్‌లో అక్టోబర్ 3 నుంచి 9 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ జట్టుకు మైకేల్ జైశ్వాల్ కెప్టెన్‌గా... నితీశ్ రెడ్డి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. అబ్దుల్ బరీ వహాబ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. జట్టు: మైకేల్ జైశ్వాల్, కె. నితీశ్ రెడ్డి, జి. వినీత్ రెడ్డి, ఎంఎస్ఆర్. చరణ్, అయూబ్, పి. సారుు వికాస్ రెడ్డి, అబ్దుల్ ఆల్ ఖురేషీ, చందన్ సహాని, టి. సంతోష్ గౌడ్, కె. భగత్ వర్మ, పి. నీలేశ్, రాజమణి ప్రసాద్, మొహమ్మద్ అజర్ అలీ (వికెట్ కీపర్), సోహైల్, అలంకృత్ అగర్వాల్, శ్రీచరణ్. -
సాఫ్ట్‌బాల్ పోటీలకు 13 మంది ఎంపిక
భాకరాపేట : అండర్ 19 బాలికల సాఫ్ట్‌బాల్ పోటీలకు జిల్లా నుంచి 13 వుందిని ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజర్ ఎ.జయరామయ్య తెలిపారు. బుధవారం చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని పలు కళాశాలల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 13 వుంది బాలికలను రాష్ట్రస్థాయిలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో జరిగే పోటీలకు ఎంపిక చేశారు. వారిలో ఎన్.పవనకువూరి(పీలేరు), ఎ.అఖిల(ఎస్పీడబ్ల్యూ), ఎస్.అనూష(చిత్తూరు), సీ.ఆదిలక్ష్మి(నగరి), పీ.హేవూవతి(పుత్తూరు), ఎం.నందిని(అంగళ్లు), ఎన్.స్వాతి(ఎస్పీడబ్ల్యూ), కె.విజయదుర్గ(పెనువుూరు), ఎం.జ్యోత్సS్న (చిన్నగొట్టిగల్లు), వి.భారతి (చిన్నగొట్టిగల్లు), ఎ.రోజా(పీలేరు), కె. వెంకటరవుణవ్ము (ఎస్పీడబ్ల్యూ), ఎ.రాశి(ఎస్పీడబ్ల్యూ) ఉన్నారు. ఈ కార్యక్రవుంలో చిన్నగొట్టిగల్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.సిద్దవుుని, పీ.డీ షాజహాన్, పీఈటీలు రావుకష్ణ రంగన్న, అన్సర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
గుంటూరుపై కృష్ణా జట్టు విజయం
వెంకటగిరి: పట్టణంలోని తారకరామా క్రీడాప్రాంగణంలో జరుగుతున్న అండర్–19 అంతర జిల్లాల ప్లేట్ క్రికెట్ మ్యా^Œ ల్లో రెండో రోజైన బుధవారం గుంటూరుపై కృష్ణా జట్టు 157 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. గుంటూరు–కృష్ణా జిల్లా జట్ల మధ్యన జరిగిన తొలిరోజు మ్యాచ్‌లో గుంటూరు జట్టు 29.1 ఓవర్లకు 78 పరుగులు చేసి ఆలౌట్ కాగా, కృష్ణా జిల్లా జట్టు ఆట ముగిసే సమయానికి 54.5 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 305 పరుగులు చేసింది. బుధవారం మ్యాచ్‌ను కొనసాగించి మొత్తం 375 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన గుంటూరు జట్టు 45.3 ఓవర్లలో 140 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కృష్ణా జట్టు 157 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. కొనసాగుతున్న వైఎస్సార్ కడప– పశ్చిమగోదావరి జట్ల పోరు వైఎస్సార్ కడప– పశ్చిమగోదావరి జట్ల మధ్యన పోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన తొలిరోజు మ్యాచ్‌లో పశ్చిమగోదావరి జట్టు 63 ఓవర్లలో 177 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వైఎస్సార్ కడప జట్టు ఆటముగిసే సమయానికి 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. బుధవారం ఆటను కొనసాగించి మొత్తం 212 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్సింగ్ ప్రారంభించిన పశ్చిమగోదావరి జట్టు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. గురువారం ఆట కొనసాగనుంది. -
హోరాహోరీగా క్రికెట్ పోటీలు
వెంకటగిరి : పట్టణంలోని తారక రామా క్రీడాప్రాంగణంలో గురువారం జరిగిన అండర్ –19 అంతర్ జిల్లాల ప్లేట్ క్రికెట్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. గురువారం కర్నూలు, కృష్ణా జట్లు మధ్య జరిగిన పోటీల్లో కృష్ణా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు జట్టు 43 ఓవర్లకు 116 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా జిల్లా జట్టు ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లల్లో ఆరు వికెట్లు నష్టానికి 202 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్నూలు జట్టు కంటే కృష్ణా జిల్లా జట్టు 86 పరుగుల ఆధిక్యత సాధించింది. శుక్రవారం మ్యాచ్ కొనసాగనుంది. తూర్పుగోదావరి, ప్రకాశం జట్లు మధ్య జరిగిన పోటీలో తూర్పుగోదావరి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 39.2 ఓవర్లల్లో 82 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రకాశం జట్టు ఆటముగిసే సమయానికి 46 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 146 పరుగులు చేసింది. శుక్రవారం ఆట కొనసాగించనున్నారు. -
క్రికెట్ మ్యాచ్‌లకు అంతరాయం
కడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహిస్తున్న అండర్–19 ఎలైట్ గ్రూపు క్రికెట్ పోటీలకు వర్షం అంతరాయం కలిగించింది. శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌లను మధ్యాహ్నం తర్వాత ప్రారంబించారు. కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో సాయంత్రం 4.05 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైంది. 92 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన గుంటూరు జట్టు 36 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. జట్టులోని నోవా 39, ప్రణీత్ 29 పరుగులు చేయగా మహీప్ 72 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. అనంతపురం బౌలర్లు గిరినాథ్, ముదాసిర్, సాంబశివా తలా ఒక వికెట్ తీశారు. దీంతో మూడోరోజు మ్యాచ్ ముగిసింది. కొనసాగుతున్నకడప బ్యాటింగ్.. కేఓఆర్ఎం క్రీడామైదానంలో మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో కడప–విశాఖ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. 20 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కడప జట్టు 63 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. జట్టులోని నూర్‌బాషా 52 పరుగులు చేశాడు. విశాఖ బౌలర్లు వంశీ 3, ప్రశాంత్ 1 వికెట్ తీశారు. దీంతో మూడోరోజు ఆట ముగిసింది. కాగా వర్షం తగ్గుముఖం పడితే శనివారం మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. -
క్రికెట్ మ్యాచ్‌లకు అంతరాయం
కడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహిస్తున్న అండర్–19 ఎలైట్ గ్రూపు క్రికెట్ పోటీలకు వర్షం అంతరాయం కలిగించింది. శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌లను మధ్యాహ్నం తర్వాత ప్రారంబించారు. కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో సాయంత్రం 4.05 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైంది. 92 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన గుంటూరు జట్టు 36 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. జట్టులోని నోవా 39, ప్రణీత్ 29 పరుగులు చేయగా మహీప్ 72 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. అనంతపురం బౌలర్లు గిరినాథ్, ముదాసిర్, సాంబశివా తలా ఒక వికెట్ తీశారు. దీంతో మూడోరోజు మ్యాచ్ ముగిసింది. కొనసాగుతున్నకడప బ్యాటింగ్.. కేఓఆర్ఎం క్రీడామైదానంలో మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో కడప–విశాఖ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. 20 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కడప జట్టు 63 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. జట్టులోని నూర్‌బాషా 52 పరుగులు చేశాడు. విశాఖ బౌలర్లు వంశీ 3, ప్రశాంత్ 1 వికెట్ తీశారు. దీంతో మూడోరోజు ఆట ముగిసింది. కాగా వర్షం తగ్గుముఖం పడితే శనివారం మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. -
'మన్కడింగ్'తో క్వార్టర్స్ బెర్త్!
అండర్-19 ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌కు చేరిక చిట్టగాంగ్: అత్యంత నాటకీయ పరిస్థితుల్లో వెస్టిండీస్ జట్టు అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేరింది. మంగళవారం జింబాబ్వేతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే వారు క్వార్టర్స్‌కు చేరతారు. అయితే 227 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే చివరి ఓవర్లో విజయానికి మూడు పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. అయితే చివరి ఓవర్ తొలి బంతికే విండీస్ బౌలర్ కీమో పాల్ నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ మటిగిమును మన్కడింగ్ ద్వారా అవుట్ చేశాడు. మటిగిము బ్యాట్ క్రీజులో కాకుండా లైన్ పైన ఉండడంతో మూడో అంపైర్ కూడా నిబంధనల ప్రకారం అవుట్‌గా ప్రకటించారు. దీంతో జింబాబ్వేకు ఊహించని షాక్ తగలగా... విండీస్ 2 పరుగుల తేడాతో నెగ్గింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 226 పరుగులు చేసింది. స్ప్రింగర్ (71 బంతుల్లో 61; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. మగరిరాకు మూడు, మధెవెరెకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 49 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్నిడెర్ (71 బంతుల్లో 52; 9 ఫోర్లు), కీఫే (47 బంతుల్లో 43; 5 ఫోర్లు) బ్యాటింగ్‌తో జట్టు విజయం వైపు పయనించినా చివర్లో దురదృష్టం వెంటాడింది. జోసెఫ్‌కు నాలుగు, స్ప్రింగర్‌కు రెండు వికెట్లు వచ్చాయి. భారత్ ప్రత్యర్థి నమీబియా అండర్-19 ప్రపంచకప్ గ్రూప్ ‘డి’లో టాపర్‌గా నిలిచిన భారత్... క్వార్టర్ ఫైనల్లో నమీబియాతో తలపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో ఈ జట్టు రెండో స్థానంలో నిలిచింది. శనివారం ఫతుల్లాలో భారత్ క్వార్టర్ ఫైనల్ ఆడుతుంది.