సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థినులు
భాకరాపేట : అండర్ 19 బాలికల సాఫ్ట్‌బాల్ పోటీలకు జిల్లా నుంచి 13 వుందిని ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజర్ ఎ.జయరామయ్య తెలిపారు. బుధవారం చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని పలు కళాశాలల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 13 వుంది బాలికలను రాష్ట్రస్థాయిలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో జరిగే పోటీలకు ఎంపిక చేశారు. వారిలో ఎన్.పవనకువూరి(పీలేరు), ఎ.అఖిల(ఎస్‌పీడబ్ల్యూ), ఎస్.అనూష(చిత్తూరు), సీ.ఆదిలక్ష్మి(నగరి), పీ.హేవూవతి(పుత్తూరు), ఎం.నందిని(అంగళ్లు), ఎన్.స్వాతి(ఎస్‌పీడబ్ల్యూ), కె.విజయదుర్గ(పెనువుూరు), ఎం.జ్యోత్సS్న (చిన్నగొట్టిగల్లు), వి.భారతి (చిన్నగొట్టిగల్లు), ఎ.రోజా(పీలేరు), కె. వెంకటరవుణవ్ము (ఎస్‌పీడబ్ల్యూ), ఎ.రాశి(ఎస్‌పీడబ్ల్యూ) ఉన్నారు. ఈ కార్యక్రవుంలో చిన్నగొట్టిగల్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.సిద్దవుుని, పీ.డీ షాజహాన్, పీఈటీలు రావుకష్ణ రంగన్న, అన్సర్, అధ్యాపకులు పాల్గొన్నారు.