చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 యూత్ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు గెలుపు దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో యంగ్ ఇండియా మరో 85 పరుగులు చేస్తే విజయతీరాలకు చేరుతుంది. భారత్ చేతిలో మరో ఐదు వికెట్లు ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ (1), విహాన్ మల్హోత్రా (11), నిత్య పాండ్యా (51), కేపీ కార్తికేయ (35), సోహమ్ పట్వర్ధన్ (10) ఔట్ కాగా.. అభిగ్యాన్ కుందు (11), నిఖిల్ కుమార్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
మూడో రోజు టీ విరామం సమయానికి భారత జట్టు స్కోర్ 127/5గా ఉంది. ఆసీస్ బౌలర్లలో ఎయిడెన్ ఓ కాన్నర్, విశ్వ రామ్‌కుమార్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. థామన్ బ్రౌన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టిన మొహమ్మద్ ఎనాన్
అంతకుముందు యువ స్పిన్నక్ మొహమ్మద్ ఎనాన్ ధాటికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌటైంది. ఎనాన్ ఆరు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. సోహమ్ పట్వర్ధన్ 3, ఆదిత్య సింగ్ ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో రిలే కింగ్సెల్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
సూర్యవంశీ సుడిగాలి శతకం
ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సుడిగాలి శతకంతో (62 బంతుల్లో 104) విరుచుకుపడటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు చేసింది. మరో ఓపెనర్ విహాన్ మల్హోత్రా (76) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో విశ్వ రామ్‌కుమార్ 4, థామస్ బ్రౌన్ 3, అడ్డిసన్ షెరిఫ్ 2 వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 293 పరుగులకు ఆలౌటైంది. రిలే కింగ్సెల్ (53), ఎయిడెన్ ఓ కాన్నర్ (61) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సమర్థ్ నాగరాజ్, మొహమ్మద్ ఎనాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా..ఆదిత్య రావత్ 2, ఆదిత్య సింగ్, సోహమ్ పట్వర్దన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
చదవండి: అగ్రపీఠాన్ని అధిరోహించిన బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment