Softball
-
హ్యాట్సాఫ్ ప్రవల్లిక: జీవితాన్ని మలుపు తిప్పిన సాఫ్ట్ బాల్
సాఫ్ట్ బాల్ క్రీడ ఆమె జీవితాన్నే మార్చేసింది. నాల్గో తరగతి నుంచే సాఫ్ట్ బాల్ పట్ల మక్కువ పెంచుకున్న ఆమె అంతటితో ఆగిపోలేదు.. నిరంతర సాధనతో ఆ క్రీడపై పట్టు సాధించారు. అంతేకాదు పదో తరగతిలోపే నాలుగు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. దీంతోపాటు బాల క్రీడాకారుల కోటాలో అంతర్జాతీయ విజ్ఞాన పర్యటనలకు ఎంపికయ్యారు. 2017లో అంతర్జాతీయ విమానం ఎక్కే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. 20 రోజులు అమెరికాలో పర్యటించే భాగ్యాన్ని దక్కించుకున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా)ను సందర్శించారు సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ప్రవల్లిక. 15 జాతీయ, రెండు అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆమె కనబరిచిన ప్రతిభ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని చేజిక్కించుకున్నారు. సాఫ్ట్‌బాల్ వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్ సాధించడం, సివిల్ సరీ్వసెస్‌లో చేరడం వంటి లక్ష్యాలతో కసరత్తు చేస్తున్న ప్రవల్లిక ‘సాక్షి’తో పంచుకున్న పలు విశేషాలు... సికింద్రాబాద్ వారాసిగూడలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నవీన్‌గౌడ్, కవిత దంపతుల కుమార్తె ప్రవల్లిక. నాల్గో తరగతి చదువుతున్న సమయంలోనే క్రీడల పట్ల ప్రవల్లిక ఆసక్తి చూపేది. కుమార్తె ఆసక్తికి తగ్గట్టుగా ప్రోత్సహించిన తల్లిదండ్రులు బాల్యం నుంచే సాఫ్ట్ బాల్ క్రీడలో శిక్షణ ఇప్పించారు. శిక్షణలో చేరింది మొదలు అకుంటిత దీక్షతో సాధన చేసిన ఆమె క్రమేణ ఉన్నత శిఖరాలు అధిరోహించారు. తను చదువుతున్న సికింద్రాబాద్ సెయింటాన్స్ స్కూల్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణిగా అండర్ –17 విభాగంలో రాష్త్ర స్థాయి క్రీడాకారిణిగా ఎదిగారు. తెలంగాణ జట్టు తరపున మధ్యప్రదేశ్, మహారాష్త్ర తదితర రాష్ట్రాల్లో జరిగిన సాఫ్ట్ బాల్ జాతీయ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇప్పటి వరకూ వరుసగా 15 జాతీయ స్థాయి పోటీల్లో దక్షిణ భారత దేశం తరపున పాల్గొని పలు పతకాలు గెలుచుకున్నారు. ఇండోనేషియా, సౌత్ కొరియా దేశాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో భారత్ నుంచి పాల్గొని వెండి పతకాన్ని సాధించారు.లవ్లీ యూనివర్శిటీ తోడ్పాటు.. నగరంలో ఇంటరీ్మడియట్ పూర్తిచేసి దక్షిణాది రాష్ట్రాల నుంచి సాఫ్ట్‌బాల్‌లో రాణిస్తున్న తనను పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ చేరదీసింది. స్పోర్ట్స్ కోటాలో తనకు అన్ని వసతులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే అవకాశాన్ని కల్పించిందని ప్రవల్లిక తెలిపారు. అంతేకాదు తను అక్కడకు వెళ్లిన తర్వాత యూనివర్శిటీ తరపున ఇండోనేíÙయా, దక్షిణ కొరియాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్నీ కలి్పంచారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ షిప్లో పాల్గొనేందుకు శిక్షణతోపాటు సివిల్స్ పోటీ పరీక్షలకు కోచింగ్ కూడా లవ్లీ యూనివర్శిటీ యాజమాన్యమే ఇప్సిస్తుండడం గమనార్హం.14 ఏళ్లకే నాసా సందర్శన.. అతి తక్కువ మందికి లభించే అరుదైన నాసా సందర్శన అవకాశం ప్రవల్లికకు 14 ఏళ్ల ప్రాయంలోనే అందివచి్చంది. దేశంలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచే బాలలకు విజ్ఞాన పర్యటనలు ఉంటాయి. ఏ రంగానికి చెందిన బాలలైనా విజ్ఞాన పర్యటనల జాబితాలో చేరడం కోసం రాత పరీక్ష రాయాల్సిందే. ఆ పరీక్షను నెగ్గిన ప్రవల్లిక యూఎస్ఏ ఫ్లోరిడాలోని నాసాను సందర్శించారు. 2017లో అంతర్జాతీయ విమానం ఎక్కి ఏకంగా 20 రోజుల పాటు అమెరికాను చుట్టి వచ్చారు.. నాసా పరిశోధకులు, వ్యోమగాములతో కరచాలనాలు, సంభాషణలు చేసే అరుదైన అవకాశం దక్కడం జీవితంలో గొప్ప అనుభూతి అని ఆమె చెబుతున్నారు. సివిల్స్, వరల్డ్ కప్ సాధించాలి.. సాఫ్ట్‌బాల్ క్రీడలో ఇప్పటికీ నిరంతర సాదన చేస్తున్నాను. ఉత్తమ కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకుంటున్నాను. భారత్ తరపున ప్రపంచ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్ షిప్లో గోల్డ్ కప్ సాధించాలన్నదే లక్ష్యం. కొద్ది నెలల క్రితమే వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సివిల్స్‌కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. సివిల్స్ సాధించడం మరో లక్ష్యం. బాల్యంలోనే అమెరికా పర్యటన అవకాశం రావడం నా అదృష్టం. నన్ను ప్రోత్సహించిన అప్పటి రాష్త్ర మాజీ క్రీడాశాఖ మంత్రి టీ.పద్మారావు గౌడ్, తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు కే.శోభన్ బాబు, నవీన్ కుమార్, ఇండియన్ కోచ్ చిన్నాకృష్ణ సహకారంతో ఈ స్థాయికి ఎదిగాను. –ప్రవల్లిక, సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణి -
భారత సాఫ్ట్‌బాల్ జట్టులో తెలంగాణ అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేయనున్న సాఫ్ట్‌బాల్ క్రీడాంశంలో పాల్గొనే భారత మహిళల సాఫ్ట్‌బాల్ జట్టును సోమవారం ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి మమత గుగులోత్‌కు చోటు దక్కింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మమత గత ఎనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోంది. అండర్–14, అండర్–17, అండర్–19 వయో విభాగాల్లో కలిపి మొత్తం 18 సార్లు జాతీయ పోటీల్లో పాల్గొన్న ఆమె పలుమార్లు ‘ఉత్తమ క్యాచర్’గా అవార్డులు అందుకుందని తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి కె. శోభన్ బాబు తెలిపారు. నిజామాబాద్ సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ స్పోర్ట్స్ అకాడమీలో నీరజ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న మమత ప్రస్తుతం భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆసియా చాంపియన్íÙప్లో భారత జట్టు రెగ్యులర్ గా పోటీపడుతుండటంతో ఆసియా సాఫ్ట్‌బాల్ సంఘం భారత జట్టుకు వైల్డ్ కార్డు ఎంట్రీ కేటాయించింది. ఆసియా క్రీడలు సెపె్టంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌలో జరుగుతాయి. -
సాఫ్ట్‌బాల్‌లో సిక్కోలు ఆశాకిరణం
దారంతా కష్టాలు కనిపించాయి. చెమట్లు చిందించాడు. అడుగడుగునా అవరోధాలు ఎదురయ్యాయి. అంతులేని పట్టుదల ప్రదర్శించాడు. పేదరికం పెద్ద అడ్డుగోడలా నిలిచింది. ప్రతిభను నమ్ముకుని ముందుకు కదిలాడు. ఆ కష్టాలు ఇప్పుడతనికి అనుభవాలయ్యాయి. అవరోధాలు మైలురాళ్లుగా మారాయి. పేదరికం తన గమ్యాన్ని గుర్తు చేసే సాధనమైంది. సాఫ్ట్‌బాల్‌లో సిక్కోలు ఆశాకిరణమై కనిపిస్తున్న రమణమూర్తి క్రీడా ప్రయాణం ఆసాంతం ఆదర్శ ప్రాయం. ఇప్పటికే జాతీయ పోటీలకు రిఫరీగా ఎంపికైన ఈ డిగ్రీ కుర్రాడు జాతీయ జట్టుకు ఆడడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. శ్రీకాకుళం న్యూకాలనీ: కఠోర శ్రమ, సాధన, పట్టుదలకు ప్రతిభ తోడయితే ఎలా ఉంటుందో నిరూపిస్తున్నాడు అంపోలు రమణమూర్తి. సాఫ్ట్‌బాల్‌లో జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. ఇదే సమయంలో జాతీయ స్థాయి లో నిర్వహించే పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా కూడా అర్హత సాధించడం విశేషం. ఆమదాలవలస మండల పరిధిలోని కొత్తవలస గ్రామానికి అంపోలు రమణమూర్తి తల్లిదండ్రులు సత్యనారాయణ, కృష్ణవేణి. రమణమూర్తికి అక్క రాజేశ్వరి కూడా ఉంది. రమణమూర్తి తల్లిదండ్రులిద్దరూ దినసరి కూలీలే. 2010–11లో జెడ్పీహెచ్ స్కూల్ తొగరాం(ఆమదాలవలస మండలం)లో 6వ తరగతి చదువుతున్న సమయంలో రమణమూర్తిలో ఉన్న ప్రతిభను అక్కడి ఫిజికల్ డైరెక్టర్, సాఫ్ట్‌బాల్ సంఘ జిల్లా ముఖ్య ప్రతినిధి మొజ్జాడ వెంకటరమణ గుర్తించారు. అలాగే పీడీ ఎంవీ రమణ అతడిని ఉన్నతంగా తీర్చిదిద్దారు. జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన రమణమూర్తి రాష్ట్రపోటీలకు ఎంపికయ్యాడు. స్లగ్గింగ్తోపాటు ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 2012లో మాచర్లలో తాను ప్రాతినిధ్యం వహించిన తొలి రాష్ట్ర పోటీలోనే సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. పాల్గొనే ప్రతి మీట్లోను సత్తాచాటుకున్నాడు. త్రోబాల్ లో కూడా ప్రవేశం ఉన్న రమణమూర్తి జాతీయ పోటీల్లో రాణించాడు. అనతి కాలంలోనే జాతీయస్థాయిలో మెరుపులు మెరిపించాడు. సౌత్‌జోన్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో బంగారు పతకం, ఫెడరేషన్ కప్‌లో రజత పతకం సాధించాడు. ఇంటర్, ఐటీఐ పూర్తిచేసిన రమణమూర్తి ప్రస్తుతం డిగ్రీ బీఎస్సీ సీబీజెడ్ ఫైనలియర్ చదువుతున్నాడు. 2020 రిపబ్లిక్ డే వేడుకల్లో ఉత్తమ క్రీడాకారుడిగా నాటి కలెక్టర్ చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. కోచ్‌గా, రిఫరీగా కూడా అర్హత.. ఒకవైపు ఆటతోపాటు మరోవైపు కోచ్‌గా, రిఫరీగా కూడా అర్హత సాధించిన రమణమూర్తి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2020లో జాతీయ పోటీలకు టెక్నికల్ అఫీషియల్స్‌గా/రిఫరీగా వ్యవహరించే రిఫరీ టెస్టులో అర్హత సాధించాడు. పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ప్లేట్ అంపైర్‌గా, టెక్నికల్ అఫీషియల్స్‌గా కూడా వ్యవహరించి మెప్పించాడు. అలాగే 2021–22లో ఎన్ఐఎస్ సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసి కోచ్‌గా కూడా అర్హత సాధించాడు. రమణమూర్తి సాధించిన విజయాలు.. ► 2016–17లో మహారాష్ట్రలో జరిగిన ఆలిండియా స్కూల్‌గేమ్స్ అండర్–17 సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించాడు. ► 2016–17లో వైఎస్సార్ కడపలోని పుల్లంపేటలో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో నిలవ డంలో కీలక భూమిక పోషించాడు. ► 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జరిగిన ఫెడరేషన్ కప్ సీనియ ర్ నేషనల్స్ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో రజతం సాధించాడు. ఈ పోటీల్లో ఏపీ రన్నరప్ గా నిలిచింది. ► 2020లో ఆలిండి యా సౌత్‌జోన్ సీనియ ర్స్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. ఈ పోటీ ల్లో ఏపీ విజేతగా నిలిచింది. ► 2022 మార్చిలో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఆలిండియా యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో బీఆర్‌ఏయూ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ పోటీ ల్లో బీఆర్‌ఏయూ సెమీస్‌లో ఓటమిపాలైంది. జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యం.. మాది నిరుపేద కుటుంబం. మా అమ్మనాన్న కూలికి వెళ్తే తప్ప జరగని పరిస్థితి. నేను జాతీయస్థాయి క్రీడాకారునిగా గుర్తింపు పొందాను. ఎన్ఐఎస్ పూర్తి చేసి కోచ్‌గాను, రిఫరీ టెస్టులో క్వాలిఫై అయి టెక్నికల్ అఫీషియల్‌గా ఎంపికయ్యాను. నా ప్రతి విజయంలోను నా గురువు ఎంవీ రమణ సర్ ప్రోత్సాహం ఉంది. జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాను. – అంపోలు రమణమూర్తి, సాఫ్ట్‌బాల్ జాతీయస్థాయి క్రీడాకారుడు నిరంతరం కష్టపడతాడు అంపోలు రమణమూర్తి పాఠశాల స్థాయి నుంచి కష్టపడే మనస్తతత్వాన్ని అలవర్చుకున్నాడు. ఉత్తమ లక్షణాలు, నడవడిక కలిగిన రమణమూర్తి ఉన్నత స్థాయికి చేరుకుంటాడని ఆనాడే గుర్తించాను. జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం తరఫున బాసటగా నిలిచాం. పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాడు. – ఎంవీ రమణ, ఫిజికల్ డైరెక్టర్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ముఖ్య ప్రతినిధి -
భారత జూనియర్ సాఫ్ట్‌బాల్ జట్టులో అర్చన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్)కు చెందిన విద్యార్థిని పైడి అర్చన గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆసియా జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు అర్చన ఎంపికైంది. ఫిలిప్పీన్స్‌లోని క్లార్క్‌లో మే 12 నుంచి 18 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆర్సీవో సింధు అర్చనను అభినందించారు. -
హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గజ్వేల్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ గ్రౌండ్లో జరుగుతోన్న ఈ టోర్నీలో హైదరాబాద్ బాలికల జట్టు గెలుపొందగా, బాలుర జట్టు ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ డి. భాస్కర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. బాలుర తొలి మ్యాచ్‌లో వరంగల్ జట్టు 12–2తో హైదరాబాద్‌ను చిత్తగా ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో మెదక్ 11–0తో మేడ్చల్‌పై, కొత్తగూడెం 12–0తో రంగారెడ్డిపై గెలుపొందాయి. బాలికల మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 8–7తో రంగారెడ్డిపై, నిజామాబాద్ 10–0తో వరంగల్‌పై, మేడ్చల్ 11–1తో కరీంనగర్‌పై, వరంగల్ 6–5తో మేడ్చల్‌పై విజయం సాధించాయి. -
రన్నరప్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ సీనియర్ జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు ఆకట్టుకున్నాయి. కేరళలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో రెండో స్థానంలో నిలిచి రన్నరప్ ట్రోఫీలను సాధించాయి. ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో కేరళ జట్టు 7–5తో తెలంగాణపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ జట్టుకు మూడో స్థానం లభించింది. మహిళల టైటిల్ పోరులో కేరళ 6–2తో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. మూడో స్థానాన్ని గోవా జట్టు కైవసం చేసుకుంది. -
దొంగాట
⇔ ప్రతిభకు పాతరేస్తూ సర్టిఫికెట్ల ప్రదానం ⇔ ఫెన్సింగ్.. జూడో.. సాఫ్ట్‌బాల్ ⇔ అసోసియేషన్ల పాత్రపై అనుమానం ⇔ ఈ ఏడాది స్పోర్ట్స్ కోటాలో మెడిసిన్‌కు 15 మంది విద్యార్థులు ⇔ నేతల జోక్యంతో గుట్టుగా వ్యవహారం ⇔ ఉన్నత స్థాయి విచారణతో కలకలం మెడిసిన్ కోటా లక్ష్యంగా క్రీడలు ⇔ జూడో ఓపెన్ కేటగిరీ కింద జిల్లాకు చెందిన రెడ్డప్పరెడ్డి 100 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని సాధిస్తే.. దీన్ని చిత్తూరు జిల్లాకు చెందిన రుత్విక్ అనే విద్యార్థికి కట్టబెట్టారు. ప్రస్తుతం ఈ విద్యార్థి ఎస్వీ మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదువుతుండటం గమనార్హం. ⇔ క్రీడా వ్యాపారం అనంతను కుదిపేస్తోంది. దొడ్డిదారిలో మెడిసిన్ సీటు దక్కించుకునేందుకు ఆడిన ‘ఆట’.. ప్రతిభ కలిగిన విద్యార్థుల కంట తడి పెట్టిస్తోంది. గెలుపొందిన క్రీడాకారులకు.. సర్టిఫికెట్‌లోని పేర్లకు పొంతన లేకుండా సాగించిన దొంగాట క్రీడాలోకంలో చర్చనీయాంశంగా మారింది. స్పోర్ట్స్ అసోసియేషన్ నాయకులు.. ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లోనిదే ఈ తంతు. అనంతపురం సప్తగిరి సర్కిల్: ప్రతిభకు స్పోర్ట్స్ కోటా పాతరేసింది. మెడిసిన్ సీటు సాధించడమే లక్ష్యంగా కొందరు తల్లిదండ్రులు, స్పోర్ట్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో పాటు నేతలు రంగ ప్రవేశం చేయడంతో సర్టిఫికెట్ల వ్యాపారం మొదలైంది. అనంతపురంలోనే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. క్రీడాకారుడు ఒకరయితే.. సర్టిఫికెట్‌ను మరో విద్యార్థి పేరిట ఇవ్వడం ద్వారా దొంగాటకు తెర తీశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రధాన క్రీడా మైదానం కేంద్రంగా ఈ తంతు సాగింది. చిత్తూరుకు చెందిన రుత్విక్ విషయంలో ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, యూత్ అఫైర్స్‌కు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బట్టబయలయింది. ఇంటర్ పూర్తి చేసిన ఈ విద్యార్థి సీనియర్ నేషనల్ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు అనర్హుడు. అయితే ధనార్జనే ధ్యేయంగా ఇతనికి సర్టిఫికెట్‌ను ప్రదానం చేయడం గమనార్హం. గతేడాది తెలంగాణలో నిర్వహించిన స్పోర్ట్స్ కోటా సీట్ల విషయంలో ఆ ప్రాంత రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ధన్కిషన్ను దోషిగా తేల్చారు. ఈ ఏడాది అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రధాన క్రీడాంశాలైన ఫెన్సింగ్.. జూడో.. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ల రాష్ట్ర కార్యదర్శుల పాత్ర జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నకిలీ ధ్రువీకరణ పత్రాల జారీ వెనుక వీరి హస్తం ఉందనే అనుమానం పలువురు క్రీడాకారులతో పాటు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. నలుగురు బోగస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్‌లో మెడిసిన్‌కు 0.05 స్పోర్ట్స్ కోటాలో 16 మెడిసిన్, 4 డెంటల్ సీట్లు కేటాయిస్తుం ది. ఇందులో మిగతా క్రీడాంశాలతో పోలిస్తే ఫెన్సింగ్, జూడో, సాఫ్ట్‌బాల్ క్రీడాకారులకే అధిక లబ్ధి చేకూర్చడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయమై గత ఏడాది పలువురు తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో విచారణకు ఈ ఏడాది ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటయింది. ఆ మేరకు నలుగురు క్రీడాకారులు బోగస్ అని వెల్లడయింది. ఈ ఏడాది స్పోర్ట్స్ కోటాలో 15 మంది రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల నిర్వహణకు సంబం ధించి స్పోర్ట్స్ అథారిటీకి, ఒలంపిక్స్ అసోసియేషన్‌కు పూర్తి నివేదికలను, రెఫరీల వివరాలను అం దించాల్సి ఉంది. అయితే అంతర్జాతీయ క్రీడలకు వెళ్లే క్రీడాకారులకు ఇండియా ఫెడరేషన్, యూత్ అఫైర్స్ నుంచి ఎలాంటి అప్రూవల్ ఉండదు. అ యినప్పటికీ అంతర్జాతీయ క్రీడలకు ఆయా జిల్లా ల నుంచి క్రీడాకారులను పంపుతుండటం గమనార్హం. గత ఏడాది వరకు ఎంసెట్‌కు ఎంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారనే వివరాలు కూడా ఆయా జిల్లాల క్రీడా ప్రాధికార సంస్థ వద్ద లేకుండానే క్రీడాకారులకు హైదరాబాద్, విజయవాడలోని ప్రధాన కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ఏడాది అనంతపురం జిల్లా నుంచి 15 మంది క్రీడాకారులు ఎంసెట్‌కు స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో ఎంత మంది అర్హులనే విషయం విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. నేతకు సలాం క్రీడల్లో రాజకీయ జోక్యం మీతిమిరితే ప్రతి భ పక్కకు తప్పుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మంత్రి పరిటాల సునీ త కుమారుడు శ్రీరాంను జిల్లా ఒలంపిక్స్ సంఘం అడ్హాక్ కమిటీ అధ్యక్షునిగా గత జూలైలో ఎన్నుకోవడంలో ఫెన్సింగ్, జూ డో, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ల రాష్ట్ర కార్యదర్శులు కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో క్రీడా ప్రతినిధులు దూకుడు ప్రదర్శించినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన ముఖ్య ప్రభుత్వ శాఖల అధికారుల పిల్లలకు నకిలీ సర్టిఫికెట్లను కట్టబెట్టిన నేపథ్యంలో ఈ దొంగాట గుట్టుగా సాగినట్లు సమాచారం. -
రన్నరప్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: మినీ సబ్ జూనియర్ జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు రాణించాయి. నెల్లూరులో జరిగిన ఈ టోర్నీలో అండర్–10, 12 వయో విభాగాల్లో ద్వితీయ, తృతీయ స్థానాల్ని దక్కించుకున్నాయి. శుక్రవారం జరిగిన అండర్–10 బాలికల ఫైనల్లో తెలంగాణ జట్టు 3–4తో మధ్యప్రదేశ్ చేతిలో పరాజయం పాలై రన్నరప్‌గా నిలిచింది. ఈ విభాగంలో ఏపీకి మూడో స్థానం దక్కింది. బాలుర విభాగంలో ఏపీ 4–2తో రాజస్తాన్‌పై గెలుపొంది విజేతగా నిలిచింది. మధ్యప్రదేశ్ జట్టుకు మూడో స్థానం లభించింది. అండర్–12 బాలుర ఫైనల్లో ఏపీ 4–2తో రాజస్తాన్‌ను ఓడించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 8–7తో ఢిల్లీపై గెలుపొందింది. బాలికల విభాగంలో ఏపీ 3–1తో రాజస్తాన్‌పై గెలుపొందింది. -
తెలంగాణకు మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: మినీ సబ్ జూనియర్ జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నెల్లూరులో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ బాలుర జట్టు గెలుపొందగా, బాలికల జట్టుకు ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన అండర్–12 బాలుర లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 12–0తో గుజరాత్ జట్టుపై విజయం సాధించింది. బాలికల మ్యాచ్‌ల్లో తెలంగాణ 0–2తో రాజస్తాన్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఇతర మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్ 10–0తో కేరళపై, ఢిల్లీ 3–1తో యూపీపై, ఏపీ 10–0తో హరియాణాపై గెలుపొందాయి. బాలుర మ్యాచ్‌ల్లో రాజస్తాన్ 12–0తో కేరళపై, మధ్యప్రదేశ్ 6–0తో పాండిచ్చేరిపై, ఏపీ 8–0తో కర్ణాటకపై విజయం సాధించాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ క్రీడామంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం కార్యదర్శి కె. శోభన్ బాబు పాల్గొన్నారు. -
ముగిసిన సాఫ్ట్‌బాల్ శిక్షణ
అనంతపురం న్యూసిటీ : ఆర్డీటీ స్టేడియంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న జూనియర్ సాఫ్ట్‌బాల్ జిల్లా జట్ల శిక్షణా శిబిరం బుధవారంతో ముగిసింది. ఈ నెల 7 నుంచి 9 వరకు కదిరిలో రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంఫియన్‌షిప్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లకు సాఫ్ట్‌బాల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశులు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిబిరంలో నేర్చుకున్న మెళకువలు తూచా తప్పక పాటించాలన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపితే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారని, అంతా సమష్టిగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ స్కూల్ గేమ్స్ మాజీ కార్యదర్శి కేశవమూర్తి, పీఈటీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, కోచ్ ఓబులేసు, క్రిస్టఫర్ స్కూల్ ఛైర్మన్ మాలిణ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా జట్లు ఇవే.. బాలుర జట్టు : పీ కిరణ్‌కుమార్, ఎం ఆనంద్(గుంతకల్లు), డీ షాషావలి, బీ రాము, వీ నవీన్‌కుమార్(రొద్దం), సీ లక్ష్మినారాయణ(ఆకుతోటపల్లి), బీ పృథ్వీరాజ్(ఎస్కేయూ), ఎం శివకుమార్(గుట్టూరు), బీ రాజశేఖర్, బీ షాకీర్(కణేకల్), ఎం రాకేష్‌నాయక్(పెదపప్పూరు), కే డేనియల్, కే రోహిత్(కదిరి), సీ బాలాజీ(రామగిరి), హర్షవర్ధన్,జగదీష్(అనంతపురం), బీ భానుదత్తా(రాప్తాడు. బాలికల జట్టు : టీ లక్ష్మి(ముద్దినేనిపల్లి), జే రాధిక(అనంతపురం), బీ లావణ్య(ముదిగుబ్బ), పీ షకీల(కదిరి), కే అఖిలాబాయి(అనంతపురం), పీ మనీష(పెనుకొండ), పీ శ్రావణి(గోరంట్ల), కే జయశ్రీ(కుంటిమిద్దె), కే చంద్రిక(బత్తలపల్లి), జీ సుష్మా(పెరవళి), పీ శ్రీదేవి(పెద్దపప్పూరు), హెచ్ మాధవి(రామగిరి), ఎం ముంతాజ్(కురుగుంట), ఏ నానికుమారి(మన్నీల), పీ రాజ్యలక్ష్మి(రాప్తాడు), వై పవిత్ర(ఎస్కేయూ), అశ్రిత(అనంతపురం), పవిత్ర(ధర్మవరం). -
రేపు జిల్లా సాఫ్ట్‌బాల్ జూనియర్ జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లా బాల, బాలికల జూనియర్ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, వెంకటేశులు తెలిపారు. ఈ ఎంపిక స్థానిక అనంత క్రీడా గ్రామంలోని విన్సెంట్ డీ పాల్ క్రీడా మైదానంలో ఉదయం 9 గంటలకు జరుగుతుందన్నారు.ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు 1999 జనవరి 1 తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు, జనన ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఏప్రిల్ 7 నుంచి 9 వరకు కదిరిలో జరిగే రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీల్లో జిల్లా నుంచి పాల్గొనడం జరుగుతుందన్నారు. ఎంపికైన క్రీడాకారులకు ఏప్రిల్ 1 నుంచి 6 వరకు ఆర్డీటీ క్రీడా మైదానంలో కోచింగ్ క్యాంపు నిర్వహించనున్నట్లు చెప్పారు. -
సాఫ్ట్‌బాల్ కెప్టెన్‌గా అభిరామ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర బాలబాలికల జట్లను గురువారం ప్రకటించారు. బాలుర జట్టుకు అభిరామ్ రెడ్డి, బాలికల జట్టుకు అంజలి కెప్టెన్లుగా ఎంపికయ్యారు. శనివారం నుంచి ఈనెల 11 వరకు ఒడిశాలోని కటక్‌లో జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతుంది. జట్ల వివరాలు బాలురు: పి. అభిరామ్ రెడ్డి (కెప్టెన్), తిరుపతి, పి. మణికంఠ, ఆర్. బంతిలాల్, బి.సేవాలాల్, ఆర్. ప్రవీణ్, కె. గోపాల్, జె. కృష్ణారెడ్డి, కె. సురేందర్, ఆర్. హేమంత్, బి. బాలాజీ, బి. తరుణ్, ఎన్. శివప్రసాద్, ఏ. నితీశ్, జి.ధనుశ్, ఏ రాజ్‌కిషోర్, కె. నిఖిల్, బి. గౌత్మ్ కుమార్, ఎం. శ్రీకాంత్, బి. సంతోష్ (కోచ్). బాలికలు: బి. అంజలి (కెప్టెన్), జి. మమత, మయూరి, కె. సంస్కృతి, జి. ప్రమీల, ఎం. ప్రియరచన, వి. సరోజ, పి. అర్చన, జి. వినీల, కె. మౌనిక, పి. భాగ్యశ్రీ, బి. స్రవంతి, ఎస్కే హసియా బేగం, వై. నూతన, ఎం. జానవి, జి. నాగజ్యోతి, ఎం. ఝాన్సీ, ఎల్.అంజలి, ఎన్. కపిల్ వర్మ, రాజ్ కుమార్ (కోచ్). -
తెలంగాణకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు రాణించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఈ టోర్నీలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించారు. గురువారం జరిగిన అండర్-10 బాలికల మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 9-1తో మహారాష్ట్ర జట్టుపై గెలిచి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో మధ్యప్రదేశ్ జట్టు టైటిల్‌ను దక్కించుకోగా... ఆంధ్రప్రదేశ్ రన్నరప్‌గా నిలిచింది. బాలుర విభాగంలోనూ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ జట్లు తొలి రెండు స్థానాలను సంపాదించుకోగా... మహారాష్ట్ర మూడోస్థానాన్ని దక్కించుకుంది. అండర్-12 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ జట్టు మొదటి మూడు స్థానాలను సంపాదించారుు. బాలికల విభాగంలో మధ్యప్రదేశ్ టైటిల్‌ను దక్కించుకోగా... ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ జట్లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. -
సాఫ్ట్‌బాల్ జట్టు కెప్టెన్లుగా జలంధర్, యశశ్రీ
సాక్షి, హైదరాబాద్: నేటి (మంగళవారం) నుంచి జరుగనున్న మినీ జూనియర్ జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర బాలబాలికల జట్లకు జలంధర్, యశశ్రీ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం వరకు ఈ టోర్నీ జరుగుతుంది. అండర్-12 బాలుర జట్టుకు జలంధర్, బాలికల జట్టుకు యశశ్రీ ... అండర్-10 బాలుర జట్టుకు టి. గంగా చరణ్, బాలికల జట్టుకు కౌసర్ భాను కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. జట్ల వివరాలు అండర్-12 బాలురు: బి. జలంధర్, బి. సంజీవ్, ఆర్. కార్తీక్, ఎ. చరణ్, జి. ప్రవీణ్ సారుు, జి. మల్లేశ్, జి. శివ కుమార్, బి.భువిన్ సాయి, ఎ. హర్షిత్‌గౌడ్, ఎం. వరుణ్, పి. దేవదాస్, రాహుల్, ఎల్. సురేశ్, కె. మహేశ్, గౌతమ్, డి. శ్రీకాంత్, సమీరుద్దీన్, జి. మహేశ్. బాలికలు: పి. యశశ్రీ, జి. మమత, బి. కవిత, టి. నందిని, జి. జాస్య రెడ్డి, జె. రెబిక, ఎ. శ్రుతి, నిత్య, హర్షవర్థిని, ప్రియాంక, ఎన్. సృజన, గీత, సునీత, వంశీప్రియ, కృష్ణప్రియ, వైశాలి, కె. తేజ. అండర్-10 బాలురు: కె. స్వరూప్ అక్షయ్, జి.ప్రతాప్ రెడ్డి, కె. యశ్వంత్, బి. వికాస్, జి. విష్ణు సాయి, పి. ఉల్లాస్ రాజ్, సి. ప్రణవ్ చందర్, ఎ. సాయికృష్ణ, వంశీప్రకాశ్, ఎ. కీర్తన్ రెడ్డి, ఎస్కే శుభన్, టి. సంజయ్, పి.నవనీత్, సాయి మహేశ్, డి. ధనుశ్ కుమార్, పి. విఘ్నేశ్. బాలికలు: కౌసర్ భాను, జె. స్వప్న, వైష్ణవి, జె. పూజ, కె. శైలజ, నిత్య, టి. తానియా, జునైరా, టి.నేహ, తెహసీన్ ఫాతిమా, కె. వైష్ణవి, ఎ. మణికీర్తి, ఎల్. రాణి, ఎ. నందిని, ఎ. ఇందు, కె. హారిక, పి. శ్రావ్య. -
హైదరాబాద్‌కు మూడోస్థానం
సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు రాణించింది. ఆర్మూర్‌లోని నరేంద్ర హైస్కూల్లో జరిగిన ఈ టోర్నీలో బాలికల విభాగంలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన బాలికల ఫైనల్లో మెదక్ జట్టు 7-5తో నిజామాబాద్‌పై గెలిచి విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో నిజామాబాద్ జట్టు 3-2తో మెదక్ జట్టును ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. రంగారెడ్డి జట్టుకు మూడో స్థానం దక్కింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ సాఫ్ట్‌బాల్ సంఘం ప్రతినిధులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: మినీ జూనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్లో నిజామాబాద్ బాలబాలికల జట్లు సత్తా చాటాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచాయి. ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో నిజామాబాద్ విజేతగా నిలవగా... వరంగల్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాకు మూడోస్థానం దక్కింది. బాలికల విభాగంలో నిజామాబాద్ టైటిల్‌ను కై వసం చేసుకోగా... హైదరాబాద్, ఆదిలాబాద్ వరుసగా రెండు, మూడు స్థానాల్ని సంపాదించుకున్నాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం చైర్మన్ సాంబశివరావు, సెక్రటరీ శోభన్ బాబు పాల్గొన్నారు. -
హైదరాబాద్ జట్ల శుభారంభం
సాక్షి, హైదరాబాద్: మినీ జూనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలబాలికల జట్లు శుభారంభం చేశాయి. విక్టరీ ప్లేగ్రౌండ్‌లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో బాలికల జట్టు 10-0తో ఖమ్మం జట్టుపై గెలుపొందగా... బాలుర విభాగంలో హైదరాబాద్ జట్టు 12-6తో ఆదిలాబాద్ జట్టును ఓడించింది. ఇతర బాలికల మ్యాచ్‌ల్లో నిజామాబాద్ జట్టు 6-0తో మెదక్‌పై, వరంగల్ 15-0తో కరీంనగర్‌పై, మహబూబ్‌నగర్ 15-5తో రంగారెడ్డిపై గెలిచారుు. బాలుర మ్యాచ్‌ల్లో వరంగల్ 10-1తో మహబూబ్‌నగర్‌పై, మెదక్ 18-4తో కరీంనగర్‌పై, నిజామాబాద్ 11-1తో రంగారెడ్డిపై విజయం సాధించారుు. ఈ టోర్నీని రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం ఉపాధ్యక్షుడు జి. శంకర్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ సంఘం కార్యదర్శి కె.శోభన్ బాబు, కోశాధికారి డి. అభిషేక్ గౌడ్ పాల్గొన్నారు. -
జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు ముగ్గురి ఎంపిక
ఈ నెల 21 నుంచి ఔరంగాబాద్‌లో పోరు శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర పోటీల్లో కనబర్చిన పోరాట స్ఫూర్తినే జాతీయ పోటీల్లో చూపించి సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింపజేయాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్ ఆకాంక్షించారు. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు వైఎస్సాఆర్ కడప జిల్లాలో జరిగిన రాష్ట్రస్థారుు స్కూల్‌గేమ్స్ అండర్-19 (ఇండర్మీడియెట్ స్థారుు) సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీ ల్లో సిక్కోలు జట్టు తృతీయ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ జ ట్టుకు ఇప్పిలి పీడీ కె.రవికుమార్ కోచ్‌గా వ్యవహరించారు. అరుుతే చిన్నచిన్న తప్పిదాల కారణంగా ఫైనల్ బెర్తును కోల్పోరుున శ్రీకాకుళం జట్టు టోర్నీ అంతటా రాణించడం శుభసూచికం. అరుుతే ఇదే పోటీల్లో జిల్లా తరఫున అత్యద్భుతంగా రాణించిన ముగ్గురు క్రీడాకారులు జాతీయ పో టీలకు ఎంపికకావడం విశేషం. జి.హరిప్రసాద్(ఇప్పిలి), టి.శ్రీను(ఇప్పి లి), ఎ.రమణమూర్తి(తొగరాం) క్రీడాకారులు ఎంపికై నవారిలో ఉన్నారు. జాతీయ పోటీలకు నేడు పయనం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్కూల్‌గేమ్స్ పోటీల్లో వీరుముగ్గురు ఏపీ రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ పోటీల కోసం వీరు శుక్రవారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కోడిరామ్మూర్తి స్టేడియంలో గురువారం జరిగిన అభినందన, వీడ్కోలు కార్యక్రమంలో డీఎస్డీఓ మాట్లాడుతూ అనతికాలంలో రాష్ట్రస్థారుు సాఫ్ట్‌బాల్ పోటీల్లో సిక్కోలు క్రీడాకారులు చెరగని ముద్ర వేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షులు, సాఫ్ట్‌బాల్ సంఘ జిల్లా ప్రధా న కార్యదర్శి ఎం.వి.రమణ, కార్యనిర్వహన కార్యదర్శి ఆర్.రవికుమార్ పీఈటీలు పాల్గొన్నారు. కాగా సాఫ్ట్‌బాల్ సంఘ జిల్లా చైర్మన్, ప్రభుత్వ విప్ కె.రవికుమార్, అధ్యక్షులు బి.హరిధరరావు, కన్వీనర్ కె.అరుణ్‌కుమార్‌గుప్త, ఆనంద్‌కిరణ్, ఎస్జీఎఫ్ అండర్-19 జిల్లా కార్యదర్శి కృష్ణ, ఒలింపిక్ సంఘ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, కార్యదర్శి సుందరరావు, పీఈటీలు క్రీడాకారును అభినందించారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
పుల్లంపేట: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. శనివారం రాష్ట్రస్థాయి అండర్–19 సాఫ్ట్‌బాల్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగం సులభంగా సాధించుకోవచ్చన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమని చెప్పారు. పుల్లంపేటలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయుడు మాట్లాడుతూ క్రీడల్లో బాలికలు రాణిస్తున్నారని, తల్లిదండ్రులు దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థినులను ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు మెమొంటో అందజేశారు. విజేతలు వీరే.. : అండర్–19 సాఫ్ట్‌బాల్ బాలుర విభాగంలో గుంటూరు జట్టు ప్రథమ, కడప జట్టు ద్వితీయ, శ్రీకాకుళం తృతీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో కృష్ణాజట్టు ప్రథమ, విజయనగరం జట్టు ద్వితీయం, కడప జట్టు తృతీయ స్థానాల్లో నిలిచాయి. గెలుపొందిన జట్లు ఔరంగాబాద్‌లో ఈనెల 21–25వ తేదీ వరకు జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొననున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రి¯Œ్సపల్ రేణుకాప్రసాద్, సర్పంచ్ సుమతి, ఆర్ఐ పీఈటీ భానుమూర్తిరాజు, అండర్–19 స్టేట్ ప్రెసిడెంట్ సుబ్బరాజు, సోముబాలాజీ బాబు తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లు
– సాఫ్ట్‌బాల్‌లో గుంతకల్లు.. క్రికెట్లో శ్రీసత్యసాయి జట్ల విజయం గుంతకల్లు టౌన్ : ఏడీజేసీఏఏ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ క్రీడామైదానంలో మంగళవారం జరిగిన పలు క్రీడల ఫైనల్ మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. సాఫ్ట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీ సత్యసాయి(అనంతపురం) పై ప్రభుత్వ జూనియర్ కాలేజీ(గుంతకల్లు) జట్టు 4–2 రన్స్ తేడాతో విజయం సాధించింది. – క్రికెట్ ఫైనల్స్‌లో శ్రీసత్యసాయి(అనంతపురం), ప్రభుత్వ జూనియర్ కాలేజీ(గుంతకల్లు) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుంతకల్లు జట్టు నిర్ణీత 8 ఓవర్లలో కేవలం 36 పరుగులే చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీ సత్యసాయి జట్టులోని ఓపెనర్లు కేవలం 4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి జట్టును విజయతీరాలకు చేర్చారు. – షటిల్ ఫైనల్ మ్యాచ్‌లో ఎల్‌ఆర్‌జీ(హిందూపురం), శ్రీసత్యసాయి(అనంతపురం) జట్లు తలపడ్డాయి. ఇందులో ఎల్‌ఆర్‌జీ జట్టు విజయం సాధించి విన్నర్స్‌గా నిలిచింది. – బాల్‌బ్యాడ్మింటన్ ఫైనల్మ్యాచ్లో శ్రీసత్యసాయి(అనంతపురం) జట్టుపై కేఎస్ఆర్(అనంతపురం) జట్టు విజయం సాధించి విజేతగా నిలిచింది. – హ్యాండ్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌తో పాటు అథ్లెటిక్స్ పోటీలు బుధవారం జరుగుతాయని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, ఏడీజేసీసీ జిల్లా కార్యదర్శి నాగార్జున ప్రసాద్ తెలిపారు. -
ఇదా క్రీడాభివృద్ధి ?
అనంతపురం సప్తగిరి సర్కిల్ : చిరిగిన దుస్తులు.. ఒట్టి కాళ్లు! ఇది మన గ్రామీణ క్రీడాకారుల దుస్థితి. క్రీడాభివృద్ధికి రూ. కోట్లు వెచ్చిస్తున్నట్లు గొప్పలు పోతున్న ప్రభుత్వ వైఖరిని ఎత్తి చూపుతూ అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. మూడు రోజుల పాటు సాగిన ఈ క్రీడా పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన అండర్–14, అండర్–17 విభాగాల్లో దాదాపు 1,200 మంది స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో అత్యధిక క్రీడాకారులకు సరైన దుస్తులు లేవు. కాళ్లకు షూ కూడా లేకుండా ఒట్టికాళ్లతోనే తమ క్రీడా ప్రతిభను చాటుకునేందుకు తపనపడ్డారు. కనీసం దాతలతోనైనా క్రీడాకారులకు షూ ఇప్పించే అవకాశమున్నా... ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు కనిపించలేదు. ఇదే పరిస్థితి జాతీయ స్థాయిలోనూ పునరావృతమైతే... రాష్ట్రపరువు గంగలో కలిసినట్లేనంటూ పలువురు వ్యాఖ్యానించారు. -
బాలికల సాఫ్ట్‌బాల్ విజేత అనంత జట్టు
అనంతపురం సప్తగిరి సర్కిల్: అండర్–17 బాలికల సాఫ్ట్‌బాల్ పోటీల్లో అనంత బాలికల జట్టు విజేతగా నిలించింది. విజయనగరం జట్టుపై 5–0తో గెలుపొందింది. అండర్–17 విభాగంలో గుంటూరు జట్టు ( 4–2తో) ప్రథమ స్థానంలో నిలవగా, అనంత జట్టు ద్వితీయ స్థానం పొందింది. అండర్–14 విభాగంలో అనంత బాలుర జట్టు మూడవ స్థానాన్ని దక్కించుకుంది. అండర్–14 బాలికల విభాగంలో అనంత జట్టు విజయనగరం జట్టు చేతిలో 3–0తో ఓటమి పాలవడంతో రెండవ స్థానానికి చేరింది. మూడు రోజులుగా సాగుతున్న సాఫ్ట్‌బాల్ పోటీలు సోమవారం సాయంత్రం ముగిశాయి. అనంతరం జాతీయస్థాయిలో పాల్గోనే రాష్ట్రస్థాయి అండర్–14, అండర్–17 బాల, బాలికల జట్లను ఎంపిక చేశారు. క్రీడల ద్వారా ఉన్నత స్థానం.. క్రీడల ద్వారా ఉన్నతమైన స్థానానికి చేరవచ్చునని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన 62వ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ క్రీడా ముగింపు కార్యక్రమానికి స్కూల్ గేమ్స్ అధ్యక్షుడు అంజయ్య, ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గెలుపోటములు సమానంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. క్రీడలు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయన్నారు. రాష్ట్ర సాఫ్ట్‌బాల్ కార్యదర్శి వెంకటేశులు, స్కూల్‌గేమ్స్ కార్యదర్శి నారాయణ, జిల్లా సాఫ్ట్‌బాల్ అధ్యక్షుడు నాగరాజు, రాష్ట్ర అబ్జర్వర్లు సత్యనారాయణ, చంద్రశేఖర్, పీఈటీ ల సంఘం నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అండర్–14 రాష్ట్ర బాలికల జట్టు వివరాలు : లావణ్య, మిస్సీ, సాయి (విజయనగరం), కోమలి (పశ్చిమ గోదావరి), చంద్రిక, మాధవి, దుర్గ, గౌతమి (అనంతపురం), దీపిక, రాజకుళ్లాయమ్మ (కడప), గౌతమి, నాగలక్ష్మి (కృష్ణా), వరలక్ష్మి (విశాఖ), అఖిల (చిత్తూరు), షాఫియా (కర్నూలు), సత్యనారాయణమ్మ (తూర్పు గోదావరి), స్టాండ్ బైస్ – సుజాత (నెల్లూరు), లిఖిత (శ్రీకాకుళం), పవిత్ర (అనంతపురం), హారిక (గుంటూరు). అండర్–14 రాష్ట్ర బాలుర జట్టు : శివ, మంజునాథ్, మణికంఠ, పైడిరాజు, భూషణ (విజయనగరం), వెంకట బాలాజి, శ్రీనివాసరావు, వెంకటేష్ (గుంటూరు), శర్మాస్‌వలి, మహబూబ్‌బాష (అనంతపురం), మహేష్, అప్పన్న (శ్రీకాకుళం), ఖాదర్ (నెల్లూరు), నాగబాబు (తూర్పు గోదావరి), నవీన్ (కడప) స్టాండ్ బైస్ – మనోజ్ (కర్నూలు), లోకేష్, చిన్నారావు (చిత్తూరు), నరేష్ (ప్రకాశం) అండర్–17 రాష్ట్ర బాలుర జట్టు : ఫృథ్వీ, శివ, శ్రీనివాసులు, రాము (అనంతపురం), శ్రీధర్‌బాబు, శ్రీనివాస్, గోపి, కృష్ణ, టి.శ్రీనివాస్ (గుంటూరు), మణికంఠ, శివ (విజయనగరం), అనిల్‌కుమార్ (కడప), ఆకాశ్, నాగమల్లేశ్వరరావు (కృష్ణా), భానుతేజ (చిత్తూరు), శ్రీను (శ్రీకాకుళం), పవన్ (ప్రకాశం), సుభాష్‌చంద్రబోస్ (చిత్తూరు) స్టాండ్ బైస్ – సత్యరావు (విజయనగరం), తేజ (నెల్లూరు), జగదీష్ (విశాఖ), నరేష్ (శ్రీకాకుళం) అండర్–17 రాష్ట్ర బాలికల జట్టు లావణ్య, మనీషా, జయశ్రీ, సుష్మా (అనంతపురం), గౌతమి, రాజేశ్వరి, పవిత్ర (విజయనగరం), శోభ (చిత్తూరు), సుప్రజ, విమోచన (కర్నూలు), గంగోత్రి, జాస్మిత (కడప), నాగమణి (నెల్లూరు), త్రివేణి (ప్రకాశం), కీర్తి (గుంటూరు) స్టాండ్ బైస్ – సుధామణి (విజయనగరం), మమత (అనంతపురం), మనీషా (కృష్ణా), ప్రియాంక (గుంటూరు), ఓంశ్రీ (చిత్తూరు) -
సత్తాచాటిన ‘అనంత’
– సాఫ్ట్‌బాల్ పోటీల్లో ముందజలో జిల్లా క్రీడాకారులు – రసవత్తరంగా సాగుతున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నీ అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రస్థాయి 62 సాఫ్ట్‌బాల్ పోటీల్లో అనంత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ఆదివారం జరిగిన సాఫ్ట్‌బాల్ పోటీల్లో వివిధ విభాగాల్లో అనంత క్రీడాకారులు తరువాతి రౌండ్లకు అర్హత సాధించారు. ముందుగా పోటీలు జరుగుతున్న నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో సాఫ్ట్‌బాల్ క్రీడా కోచ్‌లు, నిర్వాహకులు, స్టేట్ అబ్జర్వర్లతో జిల్లా స్కూల్‌గేమ్స్ అధ్యక్షుడు అంజయ్య సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం ముగింపు కార్యక్రమంలో క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాఫ్ట్‌బాల్ పోటీలు జరుగుతున్న తీరును కార్యదర్శి నారాయణను అడిగి తెలుసుకున్నారు. ఇక.. ఉదయం జరిగిన మ్యాచ్‌లను కూడా అంజయ్య ప్రారంభించారు. సెమీస్‌కు చేరిన అనంత బాలుర జట్లు రెండోరోజు సాఫ్ట్‌బాల్ పోటీలు రసవత్తరంగా సాగాయి. అండర్–14 క్వార్టర్స్ మ్యాచులో అనంత జట్టు నెల్లూరు జట్టును 10–0తో ఓడించి, సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచులో అనంత క్రీడాకారుడు మహబూబ్‌బాషా –1 హోమర్ షాట్‌తో అలరించాడు. అండర్–17 క్వార్టర్స్‌లో అనంత జట్టు వైఎస్సార్ కడప జట్టును 12–1తో చిత్తు చేసింది. అనంత జట్టులో రాకేష్‌కుమార్–1, శివకుమార్–1 హోమర్ షాట్లు కొట్టి జట్టు విజయానికి దోహద పడ్దారు. క్వార్టర్స్ విజేతలు వీరే అండర్–17 బాలుర విభాగంలో వైఎస్సార్ జిల్లా జట్టును అనంత జట్టు 12–1తో ఓడించింది. చిత్తూరును విజయనగరం జట్టు 6–0 తో ఓడించింది. అండర్–14 విజేతలు వీరే తూర్పుగోదావరి జట్టును గుంటూరు జట్టు 9–0తో ఓడించింది. నెల్లూరును అనంత జట్టు 10–0తో ఓడించింది. వైఎస్సార్ జిల్లాను విజయనగరం జట్టు 15–2తో ఓడించింది. పశ్చిమగోదావరి జట్టును శ్రీకాకుళం జట్టు 8–1తో ఓడించింది. లీగ్ విజేతలు వీరే.. అండర్–14 బాలికల విభాగంలో తూర్పుగోదావరి జట్టును అనంత జట్టు 7–1తో ఓడించింది. వైఎస్సార్ జిల్లా జట్టును కష్ణ జట్టు 6–4తో ఓడించింది. నెల్లూరును విజయనగరం జట్టు 10–1తో ఓడించింది. చిత్తూరును కర్నూలు జట్టు 29–28తో ఓడించింది. విశాఖను విజయనగరం జట్టు 8–1తో ఓడించింది. నెల్లూరును విశాఖ జట్టు 10–4తో ఓడించింది. అండర్–17 బాలికలు పశ్చిమగోదావరి జట్టును వైఎస్సార్ జిల్లా జట్టు 10–0తో ఓడించింది. నెల్లూరును ప్రకాశం జట్టు 9–3తో ఓడించింది. శ్రీకాకుళంను ప్రకాశం జట్టు 3–2తో ఓడించింది. తూర్పుగోదావరి జట్టును విజయనగరం జట్టు 7–0తో ఓడించింది. గుంటూరును చిత్తూరు జట్టు 19–4తో ఓడించింది. పశ్చిమగోదావరి జట్టును విశాఖ జట్టు 11–0తో ఓడించింది. అండర్–17 బాలురు ప్రకాశం జట్టును అనంత జట్టు 2–0తో ఓడించింది. కష్ణను విజయనగరం జట్టు 5–0తో ఓడించింది. విశాఖను నెల్లూరు జట్టు 2–0తో ఓడించింది. -
సాఫ్ట్‌బాల్ అభివృద్ధికి కృషి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల అభివద్ధి పై దష్టి పెట్టాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ తెలిపారు. శనివారం స్థానిక ఆర్డీటీ ఆడిటోరియంలో జరిగిన 38వ సాఫ్ట్‌బాల్ క్రీడా సావనీర్ విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్‌ను విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. సాఫ్ట్‌బాల్ క్రీడను జాతీయస్థాయిలో అభివద్ధి చేసేందుకు ఆర్డీటీ సంస్థ తన వంతు సహకారాన్ని అందజేస్తుందన్నారు. అనంతరం రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశులు మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ సహకారంతోనే జాతీయస్థాయి టోర్నీని నిర్వహించామని తెలిపారు. మాంచో ఫెర్రర్ అందించిన సహకారం ఎనలేనిదన్నారు. ఆయన రాష్ట్రంలోని 13 జిల్లాల సాఫ్ట్బాల జట్లకు ఆయన అందించిన కిట్ల ద్వారా రాష్ట్రంలో సాఫ్ట్‌బాల్ మరింత ముందుకు సాగుతుందన్నారు. త్వరలో అంతర్జాతీయ స్థాయి పోటీలకు అనంతను వేదిక చేసేందుకు కషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, ఆర్డీటీ క్రికెట్ చీఫ్ కోచ్ షాబుద్దీన్, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ ట్రెజరర్ నరసింహారెడ్డి, జిల్లా అ«ధ్యక్షులు నాగరాజు, పీఈటీల సంఘం నాయకులు ప్రభాకర్, ఆంజినేయులు తదితరులు పాల్గొన్నారు. -
గెలుపే లక్ష్యంగా ఆడండి
కణేకల్లు : రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో గెలుపే లక్ష్యంగా ఆడాలని తహసీల్దార్ ఆర్.వెంకటశేషు క్రీడాకారులకు సూచించారు. అండర్–14, అండర్–17 క్రీడాకారులకు జిల్లా కేంద్రం అనంతపురంలో ఈ నెల 22, 23, 24 తేదీల్లో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా జట్టుకు కణేకల్లులో ప్రత్యేకశిక్షణ ఇచ్చింది. శుక్రవారం శిక్షణ ముగింపు సందర్భంగా ఏర్పాటైన సభలో తహసీల్దార్ మాట్లాడుతూ శిక్షణలో ఎటువంటి లోటుపాట్లురాకుండా చూసిన పీడీ గోపాల్‌రెడ్డి కషిని అభినందించారు. ఎస్ఐ యువరాజు మాట్లాడుతూ ఈ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించి తిరిగి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశులు, పీడీ గోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు వేలూరు మరియప్ప, సాఫ్ట్‌బాల్ అసోషియేషన్ జిల్లా ట్రెజరర్ కేశవమూర్తి, సాఫ్ట్‌బాల్ కోచింగ్ పర్యవేక్షకులు సత్యనారాయణ, హెచ్ఎం సూర్యనారాయణ, ఆర్డీటీ ఉరవకొండ రీజనల్ డైరెక్టర్ హనుమంతరాయుడు, ఏటీఎల్ సురేంద్ర, కోచ్‌లు షాకీర్, మల్లికార్జునలు పాల్గొన్నారు.