సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గజ్వేల్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ గ్రౌండ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో హైదరాబాద్ బాలికల జట్టు గెలుపొందగా, బాలుర జట్టు ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ డి. భాస్కర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. బాలుర తొలి మ్యాచ్‌లో వరంగల్ జట్టు 12–2తో హైదరాబాద్‌ను చిత్తగా ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో మెదక్ 11–0తో మేడ్చల్‌పై, కొత్తగూడెం 12–0తో రంగారెడ్డిపై గెలుపొందాయి. బాలికల మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 8–7తో రంగారెడ్డిపై, నిజామాబాద్ 10–0తో వరంగల్‌పై, మేడ్చల్ 11–1తో కరీంనగర్‌పై, వరంగల్ 6–5తో మేడ్చల్‌పై విజయం సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment