
రన్నరప్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: మినీ సబ్ జూనియర్ జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు రాణించాయి. నెల్లూరులో జరిగిన ఈ టోర్నీలో అండర్–10, 12 వయో విభాగాల్లో ద్వితీయ, తృతీయ స్థానాల్ని దక్కించుకున్నాయి. శుక్రవారం జరిగిన అండర్–10 బాలికల ఫైనల్లో తెలంగాణ జట్టు 3–4తో మధ్యప్రదేశ్ చేతిలో పరాజయం పాలై రన్నరప్‌గా నిలిచింది.
ఈ విభాగంలో ఏపీకి మూడో స్థానం దక్కింది. బాలుర విభాగంలో ఏపీ 4–2తో రాజస్తాన్‌పై గెలుపొంది విజేతగా నిలిచింది. మధ్యప్రదేశ్ జట్టుకు మూడో స్థానం లభించింది. అండర్–12 బాలుర ఫైనల్లో ఏపీ 4–2తో రాజస్తాన్‌ను ఓడించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 8–7తో ఢిల్లీపై గెలుపొందింది. బాలికల విభాగంలో ఏపీ 3–1తో రాజస్తాన్‌పై గెలుపొందింది.