తెలంగాణకు మిశ్రమ ఫలితాలు | mixed results for telangana in softball championship | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మిశ్రమ ఫలితాలు

Published Thu, Aug 10 2017 10:26 AM | Last Updated on Mon, Oct 22 2018 8:11 PM

mixed results for telangana in softball championship

సాక్షి, హైదరాబాద్‌: మినీ సబ్‌ జూనియర్‌ జాతీయ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నెల్లూరులో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ బాలుర జట్టు గెలుపొందగా, బాలికల జట్టుకు ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన అండర్‌–12 బాలుర లీగ్‌ మ్యాచ్‌లో తెలంగాణ 12–0తో గుజరాత్‌ జట్టుపై విజయం సాధించింది. బాలికల మ్యాచ్‌ల్లో తెలంగాణ 0–2తో రాజస్తాన్‌ జట్టు చేతిలో పరాజయం పాలైంది.

 

ఇతర మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్‌ 10–0తో కేరళపై, ఢిల్లీ 3–1తో యూపీపై, ఏపీ 10–0తో హరియాణాపై గెలుపొందాయి. బాలుర మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌ 12–0తో కేరళపై, మధ్యప్రదేశ్‌ 6–0తో పాండిచ్చేరిపై, ఏపీ 8–0తో కర్ణాటకపై విజయం సాధించాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ క్రీడామంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ సంఘం కార్యదర్శి కె. శోభన్‌ బాబు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement