అనంతపురం సప్తగిరి సర్కిల్ : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల అభివద్ధి పై దష్టి పెట్టాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ తెలిపారు. శనివారం స్థానిక ఆర్డీటీ ఆడిటోరియంలో జరిగిన 38వ సాఫ్ట్‌బాల్ క్రీడా సావనీర్ విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్‌ను విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. సాఫ్ట్‌బాల్ క్రీడను జాతీయస్థాయిలో అభివద్ధి చేసేందుకు ఆర్డీటీ సంస్థ తన వంతు సహకారాన్ని అందజేస్తుందన్నారు.
అనంతరం రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశులు మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ సహకారంతోనే జాతీయస్థాయి టోర్నీని నిర్వహించామని తెలిపారు. మాంచో ఫెర్రర్ అందించిన సహకారం ఎనలేనిదన్నారు. ఆయన రాష్ట్రంలోని 13 జిల్లాల సాఫ్ట్‌బాల జట్లకు ఆయన అందించిన కిట్ల ద్వారా రాష్ట్రంలో సాఫ్ట్‌బాల్ మరింత ముందుకు సాగుతుందన్నారు. త్వరలో అంతర్జాతీయ స్థాయి పోటీలకు అనంతను వేదిక చేసేందుకు కషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, ఆర్డీటీ క్రికెట్ చీఫ్ కోచ్ షాబుద్దీన్, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ ట్రెజరర్ నరసింహారెడ్డి, జిల్లా అ«ధ్యక్షులు నాగరాజు, పీఈటీల సంఘం నాయకులు ప్రభాకర్, ఆంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
సాఫ్ట్‌బాల్ అభివృద్ధికి కృషి
Published Sat, Oct 22 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM
Advertisement