mancho ferrer
-
క్రీడాభిరుచులను ఆస్వాదించండి
ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అనంతపురం సప్తగిరి సర్కిల్ : క్రీడలు అభిరుచులని, వాటిని ఆస్వాదించాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ సూచించారు. స్థానిక అనంత క్రీడా గ్రామంలో సోమవారం ఏషియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్(ఏఎఫ్సీ) గ్రాస్ రూట్స్ ఫెస్టివల్ - 2017ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెర్రర్ మాట్లాడుతూ అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ ఆల్ ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్‌లో ఒక భాగమన్నారు. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న గ్రాస్ రూట్స్‌డేను మన అనంత క్రీడా గ్రామంలో నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఫుట్‌బాల్‌పై ఆసక్తి కలిగించేందుకు ఉద్దేశించిన గ్రాస్‌రూట్స్‌డేను నిర్వహించేందుకు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్ దక్షిణ భారతదేశంలో అనంతకే అవకాశం కల్పించిందన్నారు. అనంతలో ఇలాంటి రోజును ఇంతమంది క్రీడాకారుల సమక్షంలో జరుపుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ అండర్ - 10, 12 విభాగాలకు జిల్లాలోని 20 మండలాల నుంచి 600 మంది క్రీడాకారులను ఎంపిక చేశామని, అండర్ - 14, 16 విభాగాలకు చేరే సమయానికి వారిని ఉన్నతమైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. క్రీడాకారులకు మెలకువలు చాలా అవసరమని, వాటిని వివరిస్తే వారి ఆటతీరును మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అ«ధ్యక్షుడు గోపాలకృష్ణ, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, ఏపీ కోచ్ జాకీర్ హుస్సేన్, అకాడమీ కోచ్‌లు దాదా ఖలందర్, రియాజ్, విజయభాస్కర్, వైద్యులు సయ్యద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
సమాజ సేవలోనే సంతృప్తి
ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ ఆత్మకూరురూరల్: తోటి మనిషికి సహయం చేయడంలోనే సంతృప్తి దాగి ఉంటుందని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ స్పష్టం చేశారు. ‘ఇండియా ఫర్ ఇండియా’ అన్న తమ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సేవా హుండీల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆయన బుధవారం ఆత్మకూరు వచ్చారు.ఈ సందర్భంగా రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఎప్పుడూ విదేశీ నిధులతోనే సేవ చేయాలా? మనల్ని మనం ఆదుకుందామనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమమే సేవా హుండీలని ఆయన చెప్పారు . చాలా మంది ఈ హుండీలో రోజుకొక రూపాయ చొప్పున వేసి ఏడాది తర్వాత తిరిగి తమ సంస్థ సేవాకార్యక్రమాలకు అందజేస్తున్నారన్నారు. 2014లో మొదలైన ఈ ఉద్యమంతో ఇప్పటికి కోట్లాది రూపాయలు సంస్థకు అందాయన్నారు. గత సంవత్సరం 1,44,596 సేవా హుండీల ద్వారా రూ.4,12,71,077 సమకూరిందన్నారు. ఈ డబ్బును నల్లమలలో అత్యంత దుర్భర జీవనం గడుపుతున్న చెంచుల సంక్షేమానికి వెచ్చిస్తునా్నమని చెప్పారు. అనంతరం ఆయన ఎంపిక చేసిన వలంటీర్లకు సేవా హుండీలను అందించి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మకూరు సీఐ కృష్ణయ్య పాల్గొని ప్రసంగించారు.ఆర్డీటీ సిబ్బంది వన్నూరప్ప, బాషాతదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ అథ్లెట్లుగా ఎదగాలి
– ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ అనంతపురం సప్తగిరిసర్కిల్ : అంతర్జాతీయ అథ్లెట్లుగా ఎదగాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్, స్పెయిన్ మారథాన్ రన్నర్ జువాన్ మానువెల్ కోరారు. ఆదివారం అనంత క్రీడా మైదానంలో ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ రన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మానువెల్ మాట్లాడుతూ పరుగుతో మానవుల ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు. గతేడాది జిల్లాలో ఆర్డీటీ ప్రోత్సాహంతో 140 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నట్టు తెలిపారు. ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చేసిన సేవా కార్యక్రమాలు ఎంతగానో ఆకర్షించాయన్నారు. గ్రామీణ స్థాయి అథ్లెట్లను ప్రోత్సహించేందుకు పరుగు పందెం దోహదపడుతుందన్నారు. ఈ నెల 24, 25న జిల్లాలో అల్ట్రా మారథాన్ పరుగు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆదివారం జరిగిన కమ్యూనిటీ పరుగు పందెంలో 35 మంది స్పెయిన్ మారథాన్లు, జిల్లాకు చెందిన క్రీడాకారులు, బధిరులు, వయోజనులు, పిల్లలు పాల్గొన్నారన్నారు. 120 మంది క్రీడాకారులు 15 జట్లుగా ఏర్పడి 4.6 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి, హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్, డైరెక్టర్లు జేవియర్, దశరథ్, నిర్మల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్‌బాల్ అభివృద్ధికి కృషి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల అభివద్ధి పై దష్టి పెట్టాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ తెలిపారు. శనివారం స్థానిక ఆర్డీటీ ఆడిటోరియంలో జరిగిన 38వ సాఫ్ట్‌బాల్ క్రీడా సావనీర్ విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్‌ను విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. సాఫ్ట్‌బాల్ క్రీడను జాతీయస్థాయిలో అభివద్ధి చేసేందుకు ఆర్డీటీ సంస్థ తన వంతు సహకారాన్ని అందజేస్తుందన్నారు. అనంతరం రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశులు మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ సహకారంతోనే జాతీయస్థాయి టోర్నీని నిర్వహించామని తెలిపారు. మాంచో ఫెర్రర్ అందించిన సహకారం ఎనలేనిదన్నారు. ఆయన రాష్ట్రంలోని 13 జిల్లాల సాఫ్ట్బాల జట్లకు ఆయన అందించిన కిట్ల ద్వారా రాష్ట్రంలో సాఫ్ట్‌బాల్ మరింత ముందుకు సాగుతుందన్నారు. త్వరలో అంతర్జాతీయ స్థాయి పోటీలకు అనంతను వేదిక చేసేందుకు కషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, ఆర్డీటీ క్రికెట్ చీఫ్ కోచ్ షాబుద్దీన్, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ ట్రెజరర్ నరసింహారెడ్డి, జిల్లా అ«ధ్యక్షులు నాగరాజు, పీఈటీల సంఘం నాయకులు ప్రభాకర్, ఆంజినేయులు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా సంస్కృతి పెంపొందించడమే లక్ష్యం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని తేవడమే ఆర్డీటీ ప్రధాన లక్ష్యమని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నీ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనlదేశంలో ఎందరో ‘సింధు’లను తయారు చేయవచ్చన్నారు. ఏదైనా సాధించాలంటే తనపై తనకు నమ్మకం రావాలని చెప్పారు. రాష్ట్రంలో చాలా చోట్ల పాఠశాలలు ఉన్నాయి. కానీ ఆట స్థలాలు లేవు. అయినా అందిన అవకాశాలను వినియోగించుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. హాజరైన క్రీడాకారులు మంచి ఆట తీరుతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం మాంచో ఫెర్రర్, డీఎస్డీఓ బాషామోహిద్దీన్‌ను సన్మానించారు. టోర్నీలో పాల్గొనేందుకు రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో టేబుల్æటెన్నిస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అక్బర్‌సాహెబ్, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, ఎస్ఎస్బీఎన్ కరస్పాండెంట్ పీఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర క్రికెట్ ప్రాబబుల్స్‌కు ఆరుగురు ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్ర క్రికెట్ ప్రాబబుల్స్‌కు జిల్లా నుంచి ఆరుగురు ఎంపికైనట్లు జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు మాంఛో ఫెర్రర్, కార్యదర్శి బి.ఆర్. ప్రసన్న ఓ ప్రకటన లో తెలిపారు. ఇటీవల కడపలో జరిగిన ఆంధ్ర అండర్–19 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీలో అనంతపురం జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఈ టోర్నీలో రాణించిన జిల్లా క్రీడాకారులు గిరినాథ్‌రెడ్డి (ఆల్‌రౌండర్), మహబుబ్పీరా(ఓపెనింగ్ బ్యాట్స్‌మన్), రాజశేఖర్ (మిడిలార్డర్ బ్యాట్స్‌మన్), ప్రవీన్‌కుమార్‌రెడ్డి (మిడిలార్డర్ బ్యాట్స్‌మన్), సంతోష్ (లెఫ్ట్ ఆర్మ్ పేస్), ముదస్సీర్ (లెఫ్ట్ ఆర్మ్ స్పిన్)ఎంపికయ్యారు. ప్రాబబుల్స్ మ్యాచ్‌లు విజయవాడ లోని ముళ్లపాడులో నిర్మించిన మైదానంలో ఈ నెల 29 నుంచి 31 వరకు జరుగుతాయన్నారు. జిల్లా నుంచి ఆరుగురు ఎంపిక కావడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. -
అమ్మాయిలకు క్రీడలతోనే భవిష్యత్తు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అమ్మాయిలకు చదువుతోపాటు క్రీడలూ అవసరమని, తద్వారా బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛోఫెర్రర్ పిలుపునిచ్చారు. గురువారం అమ్మాయిలకు అనంత క్రీడాగ్రామంలో అమ్మాయిలకు అథ్లెటిక్స్ మీట్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి మాంఛోఫెర్రర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రియో ఒలంపిక్స్‌లో సాక్షి మాలిక్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు కూడా మంచి ప్రదర్శన చూపెడుతోందని, ఆమెకు పతకం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీపా జిమ్నాస్టిక్స్‌లో చూపిన ప్రతిభ అసమానమైనదన్నారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు చదువు, క్రీడల్లో రాణించేందుకు ఆర్డీటీ ఎనలేని కృషి చేస్తోందన్నారు. అమ్మాయిలకు హాకీ, ఫుట్‌బాల్, టెన్నిస్, సాఫ్ట్‌బాల్, క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చే సినట్లు చెప్పారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ‘బేటీబచావో – బేటీ పడావో’ అనే నినాదాన్ని ఆయన తెలిపారు. స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, యుగంధర్‌రెడ్డి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.