rdt
-
వైఎస్ఆర్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డ్: రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్
-
కరోనాను జయించిన అన్నే ఫెర్రర్
బత్తలపల్లి: ఆర్డీటీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నేఫెర్రర్ కరోనాను జయించారు. వైరస్ నుంచి కోలుకున్న ఆమె గురువారం ఆర్డీటీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం కరోనా సోకడంతో ఆమెను బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మెరుగైన వైద్యంతో త్వరగా కోలుకున్నారు. ఈ సందర్భంగా అన్నే ఫెర్రర్ మాట్లాడుతూ ‘మరోసారి నేను ఇంటికి వచ్చేశాను, మళ్లీ పని కొనసాగిస్తున్నాను. నేను కోలుకోవాలని, నా ఆరోగ్యం బాగుండాలని ఎన్నో సందేశాలు, ప్రార్థనలు చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. ప్రజల దీవెనలు, బత్తలపల్లి ఆసుపత్రి వైద్యుల బృందం అంకితభావంతో చేసిన సేవల వల్ల తాను త్వరగా కోలుకున్నట్లు వివరించారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలోనూ, కోవిడ్ చికిత్సా కేంద్రాలను ప్రజలకు సౌకర్యవంతంగా చేయడంలోనూ అనంతపురం అధికార యంత్రాంగం చేస్తున్న అవిశ్రాంతి కృషిని కొనియాడారు. ఆమె వెంట ఆర్డీటీ డైరెక్టర్ విశాలా ఫెర్రర్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, వైద్యులు పాల్, రీజనల్ డైరెక్టర్ మల్లిఖార్జున, ఏటీఎల్ వేమయ్య తదితరులున్నారు. అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్‌ను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గురువారం సాయంత్రం పరామర్శించారు. కరోనా నుంచి కోలుకున్న నేపథ్యంలో ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ పాల్గొన్నారు. -
జీవితాలను మార్చిన ఒక్క ప్రయత్నం
ఇది సామాన్యుడు చిందించిన స్వేదం. ఆ స్వేదమే వేల కుటుంబాల జీవితాల్లో అక్షర వెలుగులు విరజిమ్మేందుకు కారణమైంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆశయాలకు అనుగుణంగా సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ పిలుపు మేరకు ‘స్పందించు సాయమందించు’ అనే కార్యక్రమానికి ఆ స్వేదమే కొత్త ఊపిరిని అందించింది. స్పందించే హృదయముంటే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఎందరో అభాగ్యులను ఆదుకోవచ్చని నిరూపించింది. హుండీ ఉద్యమం విప్లవంలా ఎగిసి పడేందుకు ఆ స్వేదమే కారణమైంది. చేసే సాయం చిన్నదా పెద్దదా అని ఎవరూ ఆలోచించ లేదు. ఒక్క రూపాయి మొదలు... వందల రూపాయలను హుండీలో వేస్తూ నిరుపేద కుటుంబాల్లో అక్షర జ్యోతులు వెలిగించేందుకు ఎందరో గ్రామీణులు ముందుకు వచ్చారు. సేవ చేయడమే జీవన సారంగా భావించిన ఆర్డీటీ వ్యవస్థాపకుల స్ఫూర్తితో సాగుతున్న ఈ హుండీ మహాయజ్ఞం గురించి ‘సాక్షి ఫోకస్’ మీ కోసం. – అనంతపురం సప్తగిరి సర్కిల్ సేవకు ప్రతిరూపంగా నిలిచిన ఆర్డీటీ సంస్థ జిల్లాలో 1969 నుంచి కార్యకలాపాలను ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకూ జిల్లా వ్యాప్తంగా పేదలను ఆదుకునేందుకు ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తోంది. ఇందుకు సంబంధించిన ఆర్థిక వనరులను స్పెయిన్ దేశస్తులు సమకూరుస్తూ వచ్చారు. ఆ దేశంలోని ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇక్కడి ఆర్డీటీ కార్యకలాపాలపై పూర్తి స్థాయి అవగాహన ఉందంటే సంస్థ ఎంత పారదర్శకంగా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. సంస్థ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, సొంతింటి కల సాకారం, వ్యవసాయం, క్రీడా, సామాజిక కార్యక్రమాలు నిర్వఘ్నంగా సాగిపోతున్నాయంటే అక్కడి వారి సహాయ సహకారాలు ఎంత గొప్పవో ఊహించుకోవచ్చు. మేము నిజం చేశాం.. హుండీ ఉద్యమం ప్రారంభించిన తొలిరోజుల్లో దీని గురించి ఎక్కడా ప్రచారం అనేది లేదు. గ్రామాల్లో ఆర్డీటీ చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సమయంలో మాత్రమే కేవలం మాటల రూపంగా చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతిని పురస్కరించుకుని 2012, ఏప్రిల్ 9న పెద్దవడుగూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, డైరెక్టర్ సుధీంద్రరావు హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడ ఫాదర్ విగ్రహం చుట్టూ గ్రామస్తులు తమ ఇళ్లలో ఉంచుకున్న హుండీలను తీసుకువచ్చి ఉంచారు. ఇలా మొత్తం 127 హుండీలు అక్కడ ఉండడాన్ని గమనించిన మాంఛో ఫెర్రర్ ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ.. ఏమిటిది అని స్థానికులను ప్రశ్నించారు. ‘మీరు చెప్పారు.. మేము నిజం చేశాం’ అంటూ స్థానికులు సమాధానమిస్తూ.. రోజు వారి కూలి పనుల ద్వారా తాము సంపాదించిన మొత్తంలో నుంచి కొంత హుండీలో వేస్తూ వచ్చినట్లు వివరించారు. అలా ప్రారంభమైన ఈ ఉద్యమం తర్వాతి కాలంలో జిల్లా అంతటా పాకింది. జిల్లా వ్యాప్తంగా తొలిసారి రూ. 84 లక్షలు సమకూరాయి. ఈ బృహత్తర కార్యక్రమానికి ‘ఇండియా ఫర్ ఇండియా’ అంటూ ఆ రోజున మాంఛో ఫెర్రర్ నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ హుండీ ఉద్యమం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ విస్తరించింది. గ్రామీణుల నుంచి ఉద్యోగుల వరకూ.. ఇలా ప్రజల నుంచి సేకరించిన నిధుల వినియోగంపై గ్రామాల్లో కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించి స్థానికులతో మాంఛో ఫెర్రర్ నేరుగా చర్చించారు. అనాథ పిల్లలను ఆదుకోవాలని జిల్లా వ్యాప్తంగా అందరూ ప్రతిపాదించడంతో, ప్రజానిధి వినియోగంపై ఓ ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశారు. హుండీల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రత్యేకమైన ఖాతాలో జమా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో పొగైన మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమా చేసి, ఆ రసీదును ఆర్డీటీ కార్యాలయంలో అందజేస్తే ఆ విరాళానికి సంబంధించిన రసీదును అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లనూ చేశారు. సమాజంలో ఇది ఎంత మార్పు తెచ్చిందంటే ప్రతి ఒక్కరూ తమ కార్యాలయంలో, వ్యాపార సముదాయాల వద్ద, ఇళ్లలోనూ హుండీలు ఉంచుకునేలా చేసింది. తర్వాతి రోజుల్లో ఉద్యోగులు ప్రతి నెలా తమ వ్యక్తిగత ఖాతా నుంచి కొంత మొత్తాన్ని నేరుగా ఆర్డీటీ ప్రజానిధి ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ ఉద్యమంలో 10,032 మంది ఉద్యోగులు భాగస్వాములయ్యారు. వీరిలో 2,518 మంది ఆర్డీటీ సంస్థలో పనిచేస్తున్నవారే ఉన్నారు. ఏటా ఉద్యోగులు తమ వ్యక్తిగత ఖాతాల్లోంచి ప్రతి నెలా రూ.9 లక్షలను అందిస్తున్నారు. సమకూరుతున్న రూ. కోట్లు 2012లో 127 హుండీలతో ప్రారంభమైన ఈ ఉద్యమం 2013 నాటికి 43,817కు చేరుకుంది. ఈ సంఖ్య 2015 నాటికి లక్ష హుండీలకు చేరుకుంది. 2013లో హుండీల ద్వారా రూ.97,63,021 పోగయ్యాయి. 2012 నాటికి ఇది రూ. 2 కోట్లకు దాటింది. గత ఏడాది ఏకంగా రూ. 6,58,72,775 కోట్లకు చేరుకుంది. 2013–18 ఆర్థిక సంవత్సరాలకు కలిపి ఇండియా ఫర్ ఇండియా కార్యక్రమానికి రూ, 24,94,16,578 కోట్లు సమకూరాయి. గత ఐదేళ్లలో వివిధ సేవకార్యక్రమాలకు రూ.18,87,40,036 కోట్లు ఖర్చు చేశారు. 2013లో 289 మందికి పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు సమకూర్చారు. 2014లో 413కు మందికి సేవలను విస్తరింపజేశారు. 2015 నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లోని చెంచులకు పౌష్టికాహారాన్ని అందించడం ప్రారంభించారు. ఆ ఏడాది 701మంది అనాథలను ఆదుకుంటూనే, ఐదు వేల మందికి పౌష్టికాహారాన్ని అందించారు. 2018 నాటికి 1,590 మంది అనాథలను, 5,550 మందికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. జీవితాలను మార్చిన ఒక్క ప్రయత్నం ఆర్టీటీ నిర్వాహకులు అందిస్తున్న స్ఫూర్తిదాయక సేవాకార్యక్రమాలను చూసిన స్పెయిన్ దేశస్తుల్లో కొత్త ఆలోచనా విధానం రేకెత్తింది. దానిని వారు ఆర్డీటీ వ్యవస్థాపకులతో పంచుకున్నారు. పేదరికంతో మగ్గిపోతున్న అనంతపురం జిల్లా వాసుల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలంటే కేవలం చదువు ఒక్కే మార్గమని భావించి ఆ దిశగా రూపొందించిన కార్యాచరణపై తొలుత పెద్ద ఎత్తున మల్లాగుల్లాలు పడ్డారు. చివరకు ‘మీ ప్రయత్నం మీరు చేయండి. ఇది కార్యరూపం దాలుస్తుందో లేదో తర్వాత చూద్ధాం’ అంటూ స్పెయిన్ దేశస్తులు భరోసానివ్వడంతో హుండీ కార్యక్రమానికి ఆర్డీటీ వ్యవస్థాపకులు రూపకల్పన చేశారు. తర్వాతి రోజుల్లో ఈ కార్యక్రమం ఓ విప్లవమై ఎగిసిపడింది. మా ఇద్దరికీ మీరందరూ.. కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు, వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వారిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె జన్మించారు. తమ బాధ్యత తీరిపోయిందనుకుని మురిసిపోతున్న ఆ వృద్ధ దంపతుల జీవితంలో అనుకోను పెనుదూమారం రేగింది. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ బాధ భరించలేక కోడలు ఎటో వెళ్లిపోయింది. వ్యవసాయ పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న అల్లుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మనస్థాపంతో కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. వృద్ధులపై ఆ ఇద్దరు చిన్నారుల భారం పడింది. పూరిగుడిసెలో అత్యంత దయనీయంగా బతుకీడుస్తున్న ఆ వృద్ధ దంపతులు.. చిన్నారుల పొట్ట నింపేందుకు నానా తిప్పలు పడ్డారు. సాయమందించే వారు లేక అర్ధాకలితో జీవించసాగారు. అలాంటి సమయంలోనే వారికి ఆర్డీటీ గురించి తెలిసింది. అయితే ఆర్టీటీ సంస్థ నుంచి సాయం ఎలా పొందాలో కూడా తెలియదు. చెప్పేవారూ లేరు. దీంతో తన దీనస్థితిని వివరిస్తూ ఓ కార్డు ముక్క రాసి ఆర్డీటీ చిరునామాకు పోస్టు చేశారు. స్పందించిన సంస్థ నిర్వాహకులు వెంటనే తన ప్రతినిధులను పోరుమామిళ్లకు పంపింది. వృద్ధ దంపతులను అక్కున చేర్చుకుంది. చిన్నారులను అనంతపురం నగర శివారులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పించింది. వీరిద్ధరే కాదు.. ఆ స్కూల్లో మరో 128 మంది అనాథలను ఆర్డీటీ సంస్థ చేర్పించి విద్యాబుద్ధులు చెప్పిస్తోంది. ప్రస్తుతం ఆ చిన్నారులను కదిపితే.. ‘నాకు నా తమ్ముడు.. వాడికి నేను.. మా ఇద్దరికీ మీరందరూ’ అంటూ చెమర్చిన కళ్లతో అంటుంటే చూసే వారి హృదయాలు ద్రవించిపోతున్నాయి. మేము అనాథలం కాదు.. మాది కదిరి. నాన్న ఆనంద్... విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తూ మూడున్నరేళ్ల క్రితం కిడ్నీల వ్యాధితో మరణించారు. అమ్మ బాలాజీమణి మానసికరోగి. ఆమె ఎక్కడ ఉంటుందో కూడా మాకు తెలియదు. నాన్న మరణించిన రోజు.. మా చేతిలో చిల్లిగవ్వ లేదు. బంధువులందరూ కలిసి అంత్యక్రియలు జరిపించి వెళ్లిపోయారు. ఇంటిలో నేను, నా చెల్లి సాయిశరణ్య తప్ప ఎవరూ లేరు. దిక్కు తోచలేదు. ఆ సమయంలో ఆర్డీటీ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి మమ్మల్ని ఆదుకున్నారు. మా విషయం తెలుసుకున్న తర్వాత మమ్మల్ని సంస్థ ద్వారా చదివిస్తున్నారు. నేను హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్నా.. నా చెల్లి పీజీలో జాయిన్ కావాల్సి ఉంది. ఇప్పుడు మేము అనాథలం కాదు.. మాకు ఓ మహోన్నత కుటుంబం ఉందనే భరోసాతో జీవిస్తున్నాం. – సాయికృప, హౌస్ సర్జన్, అనంతపురం ఆర్డీటీనే చదివిస్తోంది మాది యాడికి మండలం పుప్పాలగుత్తి. నాన్న గుండెపోటుతో 1998లో మరణించాడు. తల్లి అశ్వత్థమ్మ 2008లో కిడ్నీ వ్యాధితో మరణించింది. పెద్దవడుగూరుకు చెందిన మారుతీప్రసాద్ అప్పటి నుంచి సాయం చేస్తూ వచ్చారు. డిగ్రీ వరకూ ఆయనే చదివించారు. ఆర్డీటీ వారికి ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారు ఇండియా ఫర్ ఇండియా పథకం ద్వారా సాయం చేస్తామన్నారు. గత ఏడాది నుంచి వర్సిటీ ఫీజులు, హాస్టల్ ఫీజు వారే చెల్లించారు. ల్యాప్‌టాప్ కూడా ఇచ్చారు. ప్రతి నెలా ఖర్చుల కోసం రూ.2,500 ఇస్తున్నారు. ఆర్డీటీ సంస్థ లేకుంటే మాలాంటి వారికి బతుకు ఉండేది కాదు. – రాజశేఖర్, ఎంసీఏ విద్యార్థి, జేఎన్టీయూ, అనంతపురం పేదలూ సాయం చేయగలరు స్పందించే హృదయాన్ని కదిలిస్తే ఎదుటి వారి గుండెల్ని కదిలిస్తుందనడానికి ఈ మహత్కార్యామే నిదర్శనం. పేదలకు సాయం పొందడమే తెలుసు అని అంటారు కానీ వారు సాయం చేయగలరని ఈ హుండీ ఉద్యమం ద్వారా బహిర్గతమైంది. వారు అందించింది ఒక్క రూపాయే అయినా.. అది వేలమందికి చేయూతనందించడంలో తిరుగులేనిదిగా నిరూపితమైంది. ఓ మెరుగైన సమాజ నిర్మాణానికి కారణమైంది. – సుధీంద్రరావు, ఆర్డీటీ డైరెక్టర్ ఉప్పెనలా మారింది సాయం చేసేందుకు అవధుల్లేని సమాజాన్ని రూపొందించాం. ఇది చినుకుగా మొదలై నేడు ఉప్పెనలా మారింది. ఇది ఫాదర్ ఫెర్రర్ ఆశయం. ఈ ఆశయానికి రూపునిచ్చింది ఈ జిల్లా వాసులే. దీనిని మహావృక్షంగా భావిస్తే ఆ వృక్షానికి నీటిని అందిస్తోంది సాయం చేస్తున్న వారే. సాయం పొందుతున్న వారందరూ ఆ వృక్షం నీడలో ఉన్నవారే. – మాంఛోఫెర్రర్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ సాయం చేసేందుకు సంప్రదించాల్సిన చిరునామా డైరెక్టర్, ఇండియా ఫర్ ఇండియా, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, బెంగుళూరు హైవే, అనంతపురం–515001, సెల్ : 98496 42334 -
విదేశీ భాషల్లో డిప్లొమో కోర్సులు
ఎస్కేయూ: ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు) సహకారంతో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో డిప్లొమో కోర్సులు అందించడానికి ఎస్కేయూతో ఆర్డీటీ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆర్డీటీ ప్రతినిధులు సోమవారం ఎస్కేయూను సందర్శించారు. ఈ కోర్సులు ఆర్డీటీ నిర్వహిస్తుంది. పరీక్షలు, సర్టిఫికెట్లు ఎస్కేయూ నిర్వహిస్తుంది. ఆర్టీటీ, ఎస్కేయూల మధ్య బుధవారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిసింది. -
అనంత, కర్నూలు జట్ల విజయం
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్–16 బాలికల అంతర్ జిల్లా క్రికెట్ పోటీల్లో అనంతపురం, కర్నూలు జట్లు విజయం సాధించాయి. మంగళవారం అనంత క్రీడా గ్రామంలోని బీ- గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌ల్లో ఈరెండు జట్లు అన్ని విభాగాల్లో రాణించి విజేతలుగా నిలిచాయి. స్కోరు వివరాలు మొదటి మ్యాచ్‌లో అనంతపురం, వైఎస్సార్ కడప జట్లు తలపడగా, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అనంత జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 159 పరుగులు చేసి కేవలం 1 వికెట్‌ను కోల్పోయింది. జట్టులో పల్లవి 56 పరుగులు చేసి జట్టుకు భారీ ఆధిక్యతను అందించింది. మరో ఆల్‌రౌండర్ అనూష 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వైఎస్సార్ కడప జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంత జట్టు బౌలర్లు హిమజ 2, అఖిల 1 వికెట్లు సాధించారు. దీంతో అనంతపురం జట్టు 61 పరుగులతో విజయాన్ని సాధించింది. చిత్తూరు చిత్తు మరో మ్యాచ్‌లో చిత్తూరు, కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 34 పరుగులు మాత్రమే సాధించింది. కర్నూలు జట్టు బౌలర్లు అరుణ 4 వికెట్లు, లక్ష్మి 3 వికెట్లు తీసి చిత్తూరు జట్టును చిత్తు చేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కర్నూలు జట్టు 4.1 ఓవర్లలోనే వికెట్లు కోల్పోకుండా 37 పరుగులు సాధించింది. దీంతో కర్నూలు జట్టు 10 వికెట్లతో భారీ విజయాన్ని నమోదు చేసింది. -
మనుషుల్లో దేవుడు
చేతిలో ఓ గొడుగు... ఎవరూ వెంట రాకపోయినా ఒంటరిగా వెళుతున్న స్పెయిన్‌కు చెందిన ఆ వ్యక్తిని చూసిన వారు ఆశ్చర్యపోయేవారు. కనిపించిన అందరినీ అప్యాయంగా పలకరిస్తూ.. తన స్పర్శ ద్వారా ప్రేమతత్వాన్ని పంచుతున్న ఆయన పట్ల ప్రజల్లో రానురాను భక్తి భావం పెరిగింది. ఏ ప్రాంతానికి వెళ్లిన చిన్న పిల్లలకు చాక్లెట్లు అందిస్తూ వారితో సన్నిహితంగా మెలిగిన ఆయనే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. క్రైస్తవ మిషనరీలో భాగంగా ఇక్కడకు వచ్చిన ఆయన.. ఏనాడూ ప్రజల్లో మత వ్యాప్తికి సంబంధించిన అంశాలు మాట్లాడేవారు కారు. బహిరంగంగా తన ఆరాధ్య దైవాన్ని కొలిచేందుకు కూడా ఇష్టపడని ఆయన 1920 ఏప్రిల్ 9న స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో జన్మించారు. తన యుక్త వయసులో స్పానిష్ సైన్యంలో చేరి దేశానికి సేవ చేశారు. క్రిస్టియన్ మిషనరీని ఏర్పాటు చేసేందుకు 1952లో భారతదేశంలో అడుగు పెట్టిన ఆయన ఎన్నో చేదు అనుభవనాలను ఎదుర్కొన్నారు.ఆయన సేవా కార్యక్రమాలకు ఆకర్షితురాలైన నాటి ప్రముఖ పాత్రికేయురాలు అన్నే.. ఆయన వెన్నంటి నడిచారు. అప్పటి ఆంధ్రరాష్ట ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానందరెడ్డి ఆహ్వానం మేరకు రాష్ట్రానికి వచ్చిన ఆయనను అనంత కరువు కదిలించింది. 1969లో జిల్లా కేంద్రం అనంతపురానికి చేరుకున్న ఫెర్రర్‌కు ఎమ్మా బిల్డింగ్‌లో వసతి కల్పించారు. దానినే కార్యాలయంగా మార్చుకుని జిల్లాలో సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక్కడకు వచ్చిన తర్వాత ఆయన అన్నేను వివాహమాడారు. 1977 నుంచి అనంతలో ఆర్థిక వనరులను అభివృద్ధి పరిచేందుకు స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేశారు. చిన్నపిల్లలకు బలవర్ధక ఆహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. తాము చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులను చేయడం ద్వారా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ప్రజల మనిషిగా నిలిచిపోయారు. 2009లో జనవరి 8న ఆయన మహానిష్ర్కమణ అనంతరం ఆయన ఆశయసాధనలో ఆర్డీటీ సంస్థ ముందుకెళుతోంది. - అనంతపురం సప్తగిరి సర్కిల్ -
పదేళ్ల ప్రయాణం ఉల్లాసంగా సాగింది
అనంతపురం సప్తగిరిసర్కిల్ : ఆర్డీటీ ఆధ్వర్యంలో పదేళ్లుగా నిర్వహిస్తున్న ఫుట్‌బాల్ కోచింగ్ క్యాంపు ప్రయాణం ఉల్లాసంగా సాగుతోందని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం అనంత క్రీడా గ్రామంలో సెయింట్ విన్సెంట్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన స్పెయిన్ బృందం వేసవి ఫుట్‌బాల్ శిక్షణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు జిల్లాలో 1600 మంది క్రీడాకారులు ఫుట్‌బాల్ ఆడుతున్నారంటే దానికి కారణం ఆనాడు సెయింట్ విన్సెంట్ ఫుట్‌బాల్ క్లబ్ వారు చేసిన కృషి వల్లనే సాధ్యపడిందన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా 24 మంది సభ్యులతో కూడిన బృందం పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ బృందం జిల్లాలోని అన్ని కేంద్రాల్లోనూ ఈ నెల 2 నుంచి 10 వరకు శిక్షణ అందించి క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తుందన్నారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ పదేళ్ల ప్రయాణం సందర్భంగా కేక్‌ను కట్ చేసి, బ్రోచర్ విడుదల చేశారు. కార్యక్రమంలో స్పెయిన్ మేయర్ మైఖెల్, క్లబ్ వైస్ చైర్మన్ పటావు, స్పెయిన్ బృందం సభ్యుడు పెరీఫెర్రర్, ఆర్డీటీ డైరెక్టర్లు నిర్మల్‌కుమార్, దశరథరామయ్య, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, కార్యదర్శి నాగరాజు, ఆర్డీటీ వైద్యుడు సయ్యద్ హుస్సేన్, శాప్ ఫుట్‌బాల్ కోచ్ జాకీర్, అకాడమీ కోచ్‌లు దాదాఖలందర్, రియాజ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
‘అనంత’ ఆశాజ్యోతి
ఆయన ఎక్కడో ఉన్న స్పెయిన్‌లో పుట్టారు. చిన్నప్పటి నుంచే పేదలకు సేవ చేయాలనే తపన మెండుగా ఉండేది. ఇందుకు సరైన ప్రాంతం కోసం అన్వేషించారు. మన దేశంలోని పేదరికం గురించి తెలిసింది. మరో ఆలోచన లేకుండా ఇక్కడికొచ్చేశారు. అందులోనూ అనంతపురం జిల్లా వెనుకబాటుతనం, కరువు ఆయన్ను కదిలించాయి. దీంతో జిల్లాలోనే స్థిరపడిపోయి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదల పాలిట ఆశాజ్యోతి అయ్యారు. ‘అనంత’ ప్రజల హృదయాల్లో ‘ఫాదర్’గా స్థిరపడిపోయారు. ఆయనే రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. నేడు ఆయన జయంతి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. - కరువు నేలకు ఆపన్నహస్తం అందించిన మహనీయుడు - పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆపద్బాంధవుడు - నేడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి అనంతపురం సప్తగిరి సర్కిల్ : రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) గురించి జిల్లాలో తెలియనివారు ఉండరు. జిల్లాతో పాటు కర్నూలు, ప్రకాశం, గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోనూ ఈ సంస్థ సేవలందిస్తోంది. పేదరిక నిర్మూలన, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజలకు విద్య, వైద్యం తదితర రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సంస్థ స్థాపనకు మూలకారకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. ఈయన 1920 ఏప్రిల్ 9న స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో జన్మించారు. స్పానిష్ ఆర్మీలో సైనికుడిగా పనిచేశారు. 1952లో మనదేశానికి వచ్చారు. 1958లో రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ పేరుతో ఉత్తర బొంబాయిలోని మన్మాడ్ ప్రాంతంలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు.12 ఎకరాల్లో పాఠశాలను నెలకొల్పడంతో పాటు బావులను తవ్వించారు. అప్పట్లో ఆయన సేవా కార్యక్రమాలకు కొందరు ఆటంకాలు సృష్టించారు. 1968లో ‘గోబ్యాక్ ఫెర్రర్’ నినాదంతో ఆందోళనలు జరిగాయి. దీంతో ఆయన అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని కలిశారు. అదే సమయంలో అక్కడున్న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి.. ఫెర్రర్‌తో మాట్లాడుతూ అనంతపురం జిల్లా దుర్భిక్ష పరిస్థితుల గురించి వివరించారు. దీంతో ఫెర్రర్ 1969లో ఆర్డీటీ ద్వారా ‘అనంత’లో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పటికీ ఈ సంస్థ సేవలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి. - బత్తలపల్లి, కళ్యాణదుర్గం, కణేకల్లు, అనంతపురంలోని ఆర్డీటీ ఆస్పత్రులు నిత్యం వేలాది మందికి వైద్యసేవలు అందిస్తున్నాయి. - అనంతపురం నగర శివారులో 32 ఎకరాల విస్తీర్ణంతో 2002లో ప్రారంభించిన స్పోర్ట్స్ సెంటర్ (అనంత క్రీడాగ్రామం) క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, జూడో, టెన్నిస్ తదితర క్రీడల్లో జాతీయ, అంర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తోంది. - 1,433 సప్లిమెంటరీ విద్యాలయాల ద్వారా 2,801 ప్రాజెక్ట్ గ్రామాల్లో ఆర్డీటీ విద్యను అందిస్తోంది. అలాగే పేద విద్యార్థుల ఉన్నత చదువుకు తోడ్పాటునిస్తోంది. - 8,122 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోంది. - దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు, వికలాంగులకు వేలసంఖ్యలో పక్కాగృహాలను నిర్మించి ఇచ్చింది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా జిల్లా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 2009లో ‘అనంత’లో కన్నుమూశారు. ప్రస్తుతం ఆర్డీటీ నిర్వహణను ఆయన సతీమణి అన్నే ఫెర్రర్, కుమారుడు మాంఛో ఫెర్రర్ చూస్తున్నారు. ‘ఫాదర్’ చూపిన బాటలోనే సంస్థ సేవలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఫాదర్ ఫెర్రర్‌ను వరించిన అవార్డులు - 1998లో ప్రిన్స్ ఆఫ్ స్పెయిన్ అవార్డు. అదే ఏడాది ‘యూనివర్సల్ మ్యాన్ ఆఫ్ ది పీస్’ అవార్డు. - 2000లో జనరల్ ఇటాట్ ఆఫ్ క్యాటలోనియా అవార్డును సెయింట్ జార్జ్ క్రాస్ అందించింది. - 2001లో యూనెస్కో ‘లీడింగ్ ఫిగర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది 20 సెంచరీ’ అవార్డుతో సత్కరించింది. - 2009లో స్పానిష్ ప్రభుత్వం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ సివిల్ మెరిట్’ అవార్డుతో సత్కరించింది. -
సౌత్‌జోన్ దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ఐదుగురి ఎంపిక
సౌత్‌జోన్ దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ఐదుగురు ఎంపికయినట్లు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మధుసూదన్‌నాయక్ తెలిపారు. వీరిలో అనంతపురం నుంచి సయ్యద్ నూరుల్ హుదా, రోశిరెడ్డి ఎంపికయ్యారన్నారు. వీరితోపాటు క్రాంతి (వైఎస్సార్ కడప), విజయ్(ప్రకాశం), సుబ్బారావు (ప్రకాశం)లు ఎంపికయ్యారన్నారు. జట్టుకు జిల్లాకు చెందిన సయ్యద్ నూరుల్ హుదా కెప్టెన్‌గా వ్యవహరిస్తారన్నారు. ఈ నెల 12 నుంచి 14 వరకు అనంతపురంలో జరిగిన సౌత్ ఇండియా క్రికెట్ టోర్నీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సౌత్‌జోన్ జట్టుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 1 వరకు ముంబయ్‌లో జరిగే జాతీయ స్థాయి దివ్యాంగుల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్రం నుంచి ఐదుగురు ఎంపిక పట్ల రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, మధుసుధన్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. -
సత్తా చాటిన అకాడమీ జట్లు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అనంత క్రీడా మైదానంలోని విన్సెంట్ క్రీడా మైదానంలో ఆర్డీటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీలో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ అండర్–12, 14 జట్లు తొలి రోజు సత్తా చాటాయి. ఉదయం జరిగిన మ్యాచ్‌లో అండర్–12 జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జైన్ స్కూల్ జట్టు అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ ధాటికి కుప్పకూలింది. అనంతపురం జట్టులో సుమంత్, కరీమ్ చెరో నాలుగు వికెట్లు తీసి జట్టును కుప్పకూల్చారు. సునీల్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని అనంతపురం జట్టు 7 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో నిక్షిప్త మనోహర్ 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. మధ్యాహ్నం అండర్–14 మ్యాచ్‌లో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ, బెంగళూరు జైన్ స్కూల్ జట్లు తలపడ్డాయి. అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టులో బాలురతో సమానంగా పల్లవి, అనూష క్రికెట్ ఆడడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు నిర్ణీత 30 ఓవర్లలో 215 పరుగులు చేసింది. జట్టులో విఘ్నేష్ దినకర్ చెలరేగిపోయాడు. 70 బంతుల్లో 93 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మెన్ పల్లవి 75 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జైన్ స్కూల్ నిర్ణీత 30 ఓవర్లలో 150 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. జట్టులో సుయాస్ 50 పరుగులు సాధించాడు. అనంతపురం జట్టు బౌలర్లు ప్రణయ్ 4, మహేశ్ 3 వికెట్లు తీసి జట్టును 65 పరుగుల తేడాతో గెలిపించారు. ఆదివారం కూడా మ్యాచ్‌లు కొనసాగుతాయని కోచ్ యుగంధర్‌రెడ్డి ప్రకటించారు. -
సమాజ సేవలోనే సంతృప్తి
ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ ఆత్మకూరురూరల్: తోటి మనిషికి సహయం చేయడంలోనే సంతృప్తి దాగి ఉంటుందని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ స్పష్టం చేశారు. ‘ఇండియా ఫర్ ఇండియా’ అన్న తమ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సేవా హుండీల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆయన బుధవారం ఆత్మకూరు వచ్చారు.ఈ సందర్భంగా రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఎప్పుడూ విదేశీ నిధులతోనే సేవ చేయాలా? మనల్ని మనం ఆదుకుందామనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమమే సేవా హుండీలని ఆయన చెప్పారు . చాలా మంది ఈ హుండీలో రోజుకొక రూపాయ చొప్పున వేసి ఏడాది తర్వాత తిరిగి తమ సంస్థ సేవాకార్యక్రమాలకు అందజేస్తున్నారన్నారు. 2014లో మొదలైన ఈ ఉద్యమంతో ఇప్పటికి కోట్లాది రూపాయలు సంస్థకు అందాయన్నారు. గత సంవత్సరం 1,44,596 సేవా హుండీల ద్వారా రూ.4,12,71,077 సమకూరిందన్నారు. ఈ డబ్బును నల్లమలలో అత్యంత దుర్భర జీవనం గడుపుతున్న చెంచుల సంక్షేమానికి వెచ్చిస్తునా్నమని చెప్పారు. అనంతరం ఆయన ఎంపిక చేసిన వలంటీర్లకు సేవా హుండీలను అందించి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మకూరు సీఐ కృష్ణయ్య పాల్గొని ప్రసంగించారు.ఆర్డీటీ సిబ్బంది వన్నూరప్ప, బాషాతదితరులు పాల్గొన్నారు. -
23 నుంచి ఫాదర్ క్రికెట్ టోర్నీ
అనంతపురం సప్తగిరిసర్కిల్ : రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్మారకార్థం 23వ తేదీ నుంచి జిల్లాలోని జర్నలిస్టులకు క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐపీఎల్ తరహాలో జేపీఎల్ టోర్నీ ఉంటుందన్నారు. జిల్లాకు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చేసిన సేవలకు గుర్తింపుగా టోర్నీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టు క్రీడాకారులు నియోజకవర్గాల వారీగా జట్లుగా ఏర్పడి తమ పేర్లను 18వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 90597 57771 నంబరు సంప్రదించాలని కోరారు. -
అంతర్జాతీయ అథ్లెట్లుగా ఎదగాలి
– ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ అనంతపురం సప్తగిరిసర్కిల్ : అంతర్జాతీయ అథ్లెట్లుగా ఎదగాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్, స్పెయిన్ మారథాన్ రన్నర్ జువాన్ మానువెల్ కోరారు. ఆదివారం అనంత క్రీడా మైదానంలో ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ రన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మానువెల్ మాట్లాడుతూ పరుగుతో మానవుల ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు. గతేడాది జిల్లాలో ఆర్డీటీ ప్రోత్సాహంతో 140 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నట్టు తెలిపారు. ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చేసిన సేవా కార్యక్రమాలు ఎంతగానో ఆకర్షించాయన్నారు. గ్రామీణ స్థాయి అథ్లెట్లను ప్రోత్సహించేందుకు పరుగు పందెం దోహదపడుతుందన్నారు. ఈ నెల 24, 25న జిల్లాలో అల్ట్రా మారథాన్ పరుగు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆదివారం జరిగిన కమ్యూనిటీ పరుగు పందెంలో 35 మంది స్పెయిన్ మారథాన్లు, జిల్లాకు చెందిన క్రీడాకారులు, బధిరులు, వయోజనులు, పిల్లలు పాల్గొన్నారన్నారు. 120 మంది క్రీడాకారులు 15 జట్లుగా ఏర్పడి 4.6 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి, హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్, డైరెక్టర్లు జేవియర్, దశరథ్, నిర్మల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
24 నుంచి అంతర్జాతీయ మారథాన్
అనంతపురం న్యూసిటీ : రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేద పిల్లల అభ్యున్నతి కోసం అనంతపురంలో ఈ నెల 24 నుంచి రెండురోజుల పాటు అంతర్జాతీయ రిలే అల్ట్రా మారథాన్ నిర్వహిస్తోంది. స్పెయిన్ దేశానికి చెందిన జువాన్ మాన్యువల్ ఆధ్వర్యంలో ఈ మారథాన్ జరుగనుంది. గతేడాది ఆయనొక్కడే 140 కిలో మీటర్లు పరుగెత్తాడు. ఈ సారి 48 మంది సభ్యులతో మారథాన్ చేపడుతారు. రూ.18 లక్షలు సమకూర్చేందుకు 35 మంది స్పెయిన్ దేశస్తులు, 15 మంది ‘అనంత’వాసులు మారథాన్‌లో పరుగెత్తనున్నారు. -
ఆర్డీటీ మాజీ చైర్మన్ ఇన్నయ్య మృతి
అనంతపురం సప్తగిరి సర్కిల్: రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) మాజీ చైర్మన్ ఇన్నయ్య ఫాదర్(85) బుధవారం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం బెంగుళూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 10 గంటలకు మృతి చెందారు. గురువారం ఆయన మృతదేహాన్ని ఆర్డీటీ కార్యాలయానికి తరలించగా, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్, డైరెక్టర్లు చంద్రశేఖర్ నాయుడు, దశరథ్, జేవియర్, మల్లారెడ్డి, డోరిన్‌రెడ్డి, మోహన్ మురళి తదితరులు నివాళులర్పించారు. -
ఆర్డీటీ ఫుట్‌బాల్ అకాడమీకి జాతీయ గుర్తింపు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆర్డీటీ ఫుట్‌బాల్ అకాడమీకి జాతీయ గుర్తింపు లభించిందని ఆర్డీటీ ఫుట్‌బాల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయభాస్కర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్డీటీ ఫుట్‌బాల్ అకాడమీ స్థాపించి రాయలసీమ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులను ఫుట్‌బాల్ క్రీడలో వారిని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 24 మండల స్థాయి ఫుట్‌బాల్ అనుబంధ అకాడమీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్డీటీ చేస్తున్న కషికి ఫలితంగా ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) జాతీయ స్థాయిలో గుర్తింపును కల్పిస్తూ ఏఐఎప్‌ఎఫ్ కార్యదర్శి కుషల్దాస్, టెక్నికల్ డైరెక్టర్ స్కాట్ ఓ డోనెల్లు అక్రిడిటేషన్‌ను జారీ చేశారన్నారు. జాతీయస్థాయి గుర్తింపు లభించినందుకు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్, స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, ఫుట్‌బాల్ ప్రాజెక్ట్ టెక్నికల్ డైరెక్టర్ మైఖెల్లిడో హర్షం వ్యక్తం చేశారు. -
సాఫ్ట్‌బాల్ అభివృద్ధికి కృషి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల అభివద్ధి పై దష్టి పెట్టాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ తెలిపారు. శనివారం స్థానిక ఆర్డీటీ ఆడిటోరియంలో జరిగిన 38వ సాఫ్ట్‌బాల్ క్రీడా సావనీర్ విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్‌ను విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. సాఫ్ట్‌బాల్ క్రీడను జాతీయస్థాయిలో అభివద్ధి చేసేందుకు ఆర్డీటీ సంస్థ తన వంతు సహకారాన్ని అందజేస్తుందన్నారు. అనంతరం రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశులు మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ సహకారంతోనే జాతీయస్థాయి టోర్నీని నిర్వహించామని తెలిపారు. మాంచో ఫెర్రర్ అందించిన సహకారం ఎనలేనిదన్నారు. ఆయన రాష్ట్రంలోని 13 జిల్లాల సాఫ్ట్బాల జట్లకు ఆయన అందించిన కిట్ల ద్వారా రాష్ట్రంలో సాఫ్ట్‌బాల్ మరింత ముందుకు సాగుతుందన్నారు. త్వరలో అంతర్జాతీయ స్థాయి పోటీలకు అనంతను వేదిక చేసేందుకు కషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, ఆర్డీటీ క్రికెట్ చీఫ్ కోచ్ షాబుద్దీన్, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ ట్రెజరర్ నరసింహారెడ్డి, జిల్లా అ«ధ్యక్షులు నాగరాజు, పీఈటీల సంఘం నాయకులు ప్రభాకర్, ఆంజినేయులు తదితరులు పాల్గొన్నారు. -
బాక్సింగ్ శిక్షణకు మేటి
చదువు అంతంత మాత్రమే... పేదరికం అతన్ని చదువుల తల్లికి దూరం చేసింది. అదే సమయంలో జీవితంలో నిలదొక్కుకునేందుకు పడిన తపన... యుద్ధ క్రీడల్లో నిష్ణాతుడిగా మార్చింది. కరాటేతో మొదలైన ప్రస్థానం వివిధ క్రీడలతో కొనసాగుతూ... బాక్సింగ్ వరకు చేరుకుంది. తన అనుభవాలను పది మందికి పంచుతూ వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు శ్రమిస్తున్నాడు. ఈ సుధీర్ఘ ప్రస్థానంలో ఎదురైన ఆటుపోట్లకు వెరవకుండా జిల్లాలో బాక్సింగ్ క్రీడాభివద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. పాలకులు, అధికారులు గుర్తించని అభివన ద్రోణాచార్యుడిగా మిగిలిన అతనే మహేష్ కుమార్ ఉరఫ్ మహేష్. బాక్సింగ్‌లాంటి యుద్ధ కళను అభ్యసించడం సామాన్యులకు అందని ద్రాక్షే. ఖర్చుతో కూడుకున్న ఈ క్రీడను అభ్యసించేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అంతేకాక ప్రత్యర్థి ముష్టిఘాతాలను తట్టుకోలేకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుండడంతో బాక్సింగ్ క్రీడ అంటే చాలా మంది భయపడుతుంటారు. ఇలాంటి తరుణంలో సాధారణ యుద్ధ విద్యలకంటే వ్యక్తిగత ఆత్మరక్షణకు బాక్సింగ్ చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని మహేష్ గుర్తించాడు. అప్పటి వరకు కరాటేకే పరిమితమైన అతను బాక్సింగ్ నేర్చుకునేందుకు ఈ క్రీడలో ద్రోణాచార్య అవార్డు పొందిన విశాఖపట్నంలోని వెంకటేశ్వరరావు వద్దకు చేరుకున్నాడు. అక్కడే ఈ క్రీడను అభ్యసించాడు. ఉచిత శిక్షణతో.. విశాఖ పట్నం నుంచి తిరిగి వచ్చిన మహేష్... 2009 నుంచి వివిధ పాఠశాలల విద్యార్థులకు బాక్సింగ్ నేర్పిస్తూ వచ్చాడు. బాక్సింగ్ పట్ల చాలామందిలో ఉన్న అపోహలను తొలగిస్తూ క్రీడాభివద్ధికి కషి చేస్తూ వచ్చాడు. ప్రధానంగా బాలికల ఆత్మరక్షణలో బాక్సింగ్ ఎంత బాగా ఉపయోపడుతుందో తెలుసుకున్న చాలా మంది అమ్మాయిలు ప్రత్యేకంగా మహేష్ వద్ద శిక్షణ పొందుతున్నారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అతను ఉచితంగానే ఈ క్రీడను నేర్పిస్తూ వస్తున్నారు. చదువు లేకపోవడం... ఆర్థికంగా ఉన్నత స్థానంలో లేకపోవడంతో జిల్లా స్థాయి అధికారుల దష్టిని మహేష్ ఆకర్షించలేకపోతున్నాడు. అయితే అతని కషిని గుర్తిస్తూ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శిగా గుర్తింపును రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ ఇచ్చింది. వందకు పైగా పతకాలు జిల్లాలో బాక్సింగ్ క్రీడ నేర్పించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వందకు పైగా పతకాలను మహేష్ శిష్యులు సాధించారు. పైకా, ఏపీ స్కూల్ గేమ్స్‌తో పాటు అసోసియేషన్ క్రీడా పోటీలకు సైతం జిల్లా నుంచి చాలా మంది క్రీడాకారులు వెళ్తున్నారు. 2011లో జిల్లాలో బాక్సింగ్ క్రీడాభివద్ధి కోసం అప్పటి డీఎస్డీవో లక్ష్మినారాయణరెడ్డి కిట్లను సమకూర్చారు. 2015లో ఆర్డీటీ సహకారంతో రాస్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఛాపింయన్ షిప్ పోటీలను నిర్వహించారు. అదే ఏడాది జిల్లా క్రీడాకారులకు బాక్సింగ్ కిట్లను ఆర్డీటీ సంస్థ అందజేసి ప్రోత్సహించింది. ప్రభుత్వ ప్రోత్సహం ఉంటే ఈ క్రీడను మరింత అభివద్ధి చేస్తామంటూ ఈ సందర్భంగా మహేష్ పేర్కొంటున్నారు. -
అమ్మాయిలకు క్రీడలతోనే భవిష్యత్తు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అమ్మాయిలకు చదువుతోపాటు క్రీడలూ అవసరమని, తద్వారా బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛోఫెర్రర్ పిలుపునిచ్చారు. గురువారం అమ్మాయిలకు అనంత క్రీడాగ్రామంలో అమ్మాయిలకు అథ్లెటిక్స్ మీట్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి మాంఛోఫెర్రర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రియో ఒలంపిక్స్‌లో సాక్షి మాలిక్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు కూడా మంచి ప్రదర్శన చూపెడుతోందని, ఆమెకు పతకం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీపా జిమ్నాస్టిక్స్‌లో చూపిన ప్రతిభ అసమానమైనదన్నారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు చదువు, క్రీడల్లో రాణించేందుకు ఆర్డీటీ ఎనలేని కృషి చేస్తోందన్నారు. అమ్మాయిలకు హాకీ, ఫుట్‌బాల్, టెన్నిస్, సాఫ్ట్‌బాల్, క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చే సినట్లు చెప్పారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ‘బేటీబచావో – బేటీ పడావో’ అనే నినాదాన్ని ఆయన తెలిపారు. స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, యుగంధర్‌రెడ్డి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలనే లక్ష్యం
– ఆర్డీటీ డైరెక్టర్ మంచో ఫెర్రర్ – విన్సెంట్ ఫెర్రర్ విగ్రహావిష్కరణ ఆలూరు: ఆర్థికంగా, సామాజికంగా చితికిపోయిన కుటుంబాలకు చేయూతనిచ్చి పేదరికాన్ని నిర్మూలించడమే ధ్యేయంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు పనిచేస్తోందని సంస్థ డైరెక్టర్ మంచో ఫెర్రర్ అన్నారు. మండల పరిధిలోని ఎం.కొట్టాల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ఆర్డీటీ డైరెక్టర్ మంచో ఫెర్రర్ ప్రసంగించారు. 47 ఏళ్ల కాలంలో రాయలసీమ జిల్లాల పరిధిలో 70 వేల మంది పేదలకు గహాలు నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. 20 వేల మంది నిరుపేద విద్యార్థులకు చేయూతనిచ్చామన్నారు. ప్రస్తుతం 80 మంది ఎంబీబీఎస్, 8 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్పెయిన్‌కు చెందిన స్వచ్చంధ సంస్థ నిర్వాహకుడు కార్లేస్, ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ షణ్ముఖరావు, ఏటీఎల్ శివశంకర్, గ్రామ పెద్దలు ఆంజనేయులు, ప్రభుదాస్, రామాంజనేయులు, ఆర్డీటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వరల్డ్ స్పెషల్ ఒలింపిక్స్‌కు బుద్ధిమాంద్యులు
అనంతపురం స్పోర్ట్స్: వరల్డ్ స్పెషల్ ఒలింపిక్స్‌కు ఆర్డీటీ నుంచి 13 మంది బుద్ధిమాంద్యులను పంపుతున్నట్లు ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అన్నే ఫెర్రర్ తెలిపారు. గత ఆరేళ్లుగా స్పెషల్ ఒలింపిక్స్‌లో బుద్ధిమాంద్యులు సాధిస్తున్న విజయాలపై 'బంగారు పండిస్తున్న ఆర్డీటీ స్పెషల్ ఒలింపిక్స్' అనే పుస్తకాన్ని అన్నే ఫెర్రర్ మెయిన్ క్యాంపస్‌లో బుధవారం ఆవిష్కరించారు. అమెరికాలోని లాస్ఏంజిల్స్లో ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు వరల్డ్ స్పెషల్ ఒలింపిక్స్ జరుగుతాయని ఆమె తెలిపారు. 'ప్రతి ఏడాదిలాగే మా సంస్థలో శిక్షణ పొందుతున్న బుద్ధిమాంద్యులకు అవకాశం కల్పిస్తున్నాం. సకలాంగులకు ధీటుగా బుద్ధిమాంద్యులు సాధిస్తున్న విజయాలు అందరికీ స్పూర్తిని నింపుతున్నాయి. వారిని దృష్టిలో ఉంచుకునే పుస్తకాన్ని ఆవిష్కరించాం. పిల్లలతో పాటు ఆరు మంది కోచ్‌లను పంపుతున్నాం. త్వరలో జరిగే స్పెషల్ ఒలింపిక్స్‌లోనూ విజయాలు సాధిస్తారు' అని అన్నే ఫెర్రర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీటీ సీబీఆర్ సెక్టార్ డెరైక్టర్ దశరథ్, డిప్యూటీ డెరైక్టర్ చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఇక నిమిషాల్లో ఎబోలా నిర్థారణ..
న్యూయార్క్: ప్రాణాంతక వ్యాధి ఎబోలా మహమ్మారిపై శాస్త్రవేత్తలు ఓ ముందడుగు వేశారు. ఎబోలా వ్యాధి సోకిందా లేదా అనే విషయం ఇక నిమిషాల్లో తేలనుంది. ఇందుకోసం వారు చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. సాధారణంగా ఎబోలా వైరస్ డిసీజ్(ఈవీడీ) సోకిన వ్యక్తులకు అంతకుముందు దానిని నిర్థారించేందుకు ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్(ఆర్డీటీ) చేసేశారు. ఇది ఎంతో ప్రయాసతో కూడుకున్న పనే కాక.. గంటల తరబడి సమయం వృధా అయ్యేది. కానీ అమెరికాలోని బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్ కు చెందిన నిరా పొల్లాక్ మాత్రం తాము చేసిన సర్వేలు, పరీక్షల్లో ఎబోలా వైరస్‌ను నిమిషాల్లో గుర్తించే వీలుకలిగిందని చెప్ఆరు. ఇందుకోసం ఆర్ఈఈబీఓవీ యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట, కార్జెనిక్స్ అనే పరీక్ష నిర్వహించామని, దీనిద్వారా గతంలో కన్నా వేగంగా ఎబోలాను గుర్తించడం జరిగిందని తెలిపారు. -
'అనంత'లో పిల్లల ఉత్సవాలు
అనంతపురం: రెండు రోజుల పాటు అనంతపురంలో పిల్లల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఆవరణలో శుక్రవారం ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో స్కూలు విద్యార్థులు హాజరై పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
'అనంత' శ్రేయోభిలాషి
అనంతపురం కల్చరల్ : సేవే మార్గం..మానవత్వమే మతంగా సామాన్యుల పెన్నిధిగా జిల్లా వాసుల గుండెల్లో చిరస్మరణీయుడిగా విన్సెంట్ ఫెర్రర్ మిగిలిపోయారు. ఫెర్రర్ స్ఫూర్తితో ఊపిరిపోసుకున్న పలు సేవా సంస్థలు సేవా కార్యక్రమాలతో ఆయన 96వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన స్మృత్యర్థం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఫై జీవిత చరిత్ర ఆయన 1920లో స్పెయిన్‌లోని బార్సిలోనాలో జన్మించారు.న్యాయశాస్త్ర పట్టభద్రుడై తన సేవా కార్యక్రమాలు విస్తరించడానికి 1962లో తొలిసారి భారతదేశానికి వచ్చారు. నేరుగా మహారాష్ట్రలో అడుగుపెట్టి ‘మహారాష్ట్ర సేత్కారి సేవా మండల్’ను స్థాపించి పేద రైతులకు సేవ చేశారు. అక్కడ కొందరు ఛాందసవాదులు ఆయనను అడ్డుకోవడంతో 1969లో ఆయన భార్య అన్నే ఫైతో కలసి 1969లో 'అనంత' చేరుకున్నారు.ఆర్డీటి అనే స్వచ్చంధ సంస్థను స్థాపించి దాదాపు 58 మండలాలతో పాటు కర్నూలు జిల్లాలో కూడా విస్త్రుత సేవలందించారు. అవార్డులు రివార్డులు అతికొద్ది మంది మాత్రమే అవార్డులకు పేరు ప్రఖ్యాతులు తెస్తారు. ఆ కోవకు చెందిన ఫైను తన స్పూర్తిదాయకమైన జీవితంలో ఎన్నో పురస్కారాలు వచ్చి వరించాయి. స్పెయిన్ దేశం ఇచ్చే అత్యున్నత పురస్కారమైన ‘లాగ్రాన్ క్రేజ్‌డీల్ మోటోపివిల్ అవార్డు, ప్రిన్స్ ఆఫ్ స్పెయిన్ అవార్డు, యూనివర్శిల్ మాన్ ఆప్ పీస్ పురస్కారం, కాటరాన్ ప్రభుత్వం ఇచ్చిన క్రాస్ ఆఫ్ సెయింట్ జార్జ్, యునెస్కో అవుట్ స్టాండింగ్ పర్శన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ 20ఎత్ సెంచరీ, ఒలంపిక్ స్పిరిట్ ఫ్రీడ్ వంటి పురస్కారాలే కాకుండా పలు సంస్థలు, దేశాలు ఇచ్చే ఉత్తమ పురస్కారాలన్నింటిని ఫెర్రర్ కు ప్రదానం చేశారు. కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు ధీనజనోధ్దారణే ధ్యేయంగా కరువు బారిన పడిన అనంతను ఆదుకోవడాకి ప్రతి రంగంలో సేవా భావాన్ని జొప్పించిన విన్నెంట్ ఫెర్రర్ మరణించినా ఆయన కుటుంబ సభ్యులు మాంచో ఫెర్రర్, అన్నే ఫెర్రర్, విశాలా ఫై ఆ మహానీయుని సేవా కార్యక్రమాలను పుణికిపుచ్చుకుని కొనసాగిస్తున్నారు. ప్రతి గుండె ఆయన కోసం పరితపిస్తోందని గుర్తించిన ఆయన కుటుంబ సభ్యులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అక్షరాశ్యత, శాశ్వత గృహనిర్మాణం, పాఠశాలలు, క్రీడలు, ఆసుపత్రులు, వాటర్‌షెడ్ తదితర వాటిల్లో ప్రభుత్వాలతో సమాంతర సేవలందిస్తున్నారు. వారి స్పూర్తితో ఏర్పాటైన మరి కొన్ని సేవా సంస్థలు ఉడుతా సాయంగా అనంత కరువును తమ త్యాగమనే చేతులడ్డుపెట్టి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. విన్సెంట్ ఫై జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని గత రెండు రోజులుగా అనాథలకు సేవలందిస్తున్న కొన్ని స్వచ్ఛంధ సంస్థల ఫైకు ఘన నివాళులర్పిస్తున్నారు. జీవితాన్ని పేదలకు అంకితం చేసిన మహనీయుడు - తరిమెల రమణారెడ్డి, అమ్మ స్వచ్చంధ సంస్థ భగవంతుడు తాను అన్ని చోట్ల ఉండలేక ఫై లాంటి వారి రూపాల్లో కనిపిస్తాడనడంలో అతిశయోక్తి లేదు. ఆయనే అనంతకు రాకుంటే బడుగు బలహీన వర్గాల వారి బ్రతుకులు ఎలా ఉండేవో కూడా ఊహించుకోలేము. తన జీవితాన్ని పేదలకు అంకితం చేసిన మహనీయుని గాథను పాఠ్యపుస్తకాలలో చేర్చాలి. ఆయన స్పూర్తితోనే ‘అమ్మ’ సంస్థ రూపొందింది. వికలాంగులకు, అనాథలకు ఆయన జయంతి సాక్షాత్తు పర్వదినమే. సేవా కార్యక్రమాలలో యువత మరింత ముందుకు రావాలి. అనంత నిర్ధేశకులు సత్యసాయి, ఫెర్రర్ - విజయ్‌సాయి కుమార్, సాయి సంస్థ అనంత పేరు చెప్పగానే ప్రపంచానికి గుర్తుకు వచ్చే రెండే రెండు పేర్లు భగవాన్ సత్యసాయిబాబా...ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఇద్దరివే. ముఖ్యంగా సేవా తత్పరతకు మారుపేరుగా నిలచిన ఫెర్రర్ ఆదర్శంతోనే సాయి సంస్థ వెలసింది. సత్యసాయి ప్రభోధించినట్టు మేము అనాథలకు అన్నార్థులకు అన్నం పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము. విన్సెంట్ ఫై స్పూర్తితోనే సేవకు మారుపేరుగా నిలచే ఎన్నో సంస్థలు అనంతలో వెలవడం ఆనందదాయకం.