24 నుంచి అంతర్జాతీయ మారథాన్‌ | international marathon from 24 | Sakshi
Sakshi News home page

24 నుంచి అంతర్జాతీయ మారథాన్‌

Published Fri, Jan 20 2017 12:03 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

international marathon from 24

అనంతపురం న్యూసిటీ : రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (ఆర్డీటీ) మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేద పిల్లల అభ్యున్నతి కోసం అనంతపురంలో ఈ నెల 24 నుంచి రెండురోజుల పాటు అంతర్జాతీయ రిలే అల్ట్రా మారథాన్‌ నిర్వహిస్తోంది. స్పెయిన్‌ దేశానికి చెందిన జువాన్‌ మాన్యువల్‌ ఆధ్వర్యంలో ఈ మారథాన్‌ జరుగనుంది. గతేడాది ఆయనొక్కడే 140 కిలో మీటర్లు పరుగెత్తాడు. ఈ సారి 48 మంది సభ్యులతో మారథాన్‌ చేపడుతారు. రూ.18 లక్షలు సమకూర్చేందుకు 35 మంది స్పెయిన్‌ దేశస్తులు, 15 మంది ‘అనంత’వాసులు మారథాన్‌లో పరుగెత్తనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement