అనంతపురం సప్తగిరిసర్కిల్ : రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్మారకార్థం 23వ తేదీ నుంచి జిల్లాలోని జర్నలిస్టులకు క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐపీఎల్ తరహాలో జేపీఎల్ టోర్నీ ఉంటుందన్నారు. జిల్లాకు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చేసిన సేవలకు గుర్తింపుగా టోర్నీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టు క్రీడాకారులు నియోజకవర్గాల వారీగా జట్లుగా ఏర్పడి తమ పేర్లను 18వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 90597 57771 నంబరు సంప్రదించాలని కోరారు.