పేదరిక నిర్మూలనే లక్ష్యం
పేదరిక నిర్మూలనే లక్ష్యం
Published Thu, Aug 18 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
– ఆర్డీటీ డైరెక్టర్ మంచో ఫెర్రర్
– విన్సెంట్ ఫెర్రర్ విగ్రహావిష్కరణ
ఆలూరు: ఆర్థికంగా, సామాజికంగా చితికిపోయిన కుటుంబాలకు చేయూతనిచ్చి పేదరికాన్ని నిర్మూలించడమే ధ్యేయంగా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు పనిచేస్తోందని సంస్థ డైరెక్టర్ మంచో ఫెర్రర్ అన్నారు. మండల పరిధిలోని ఎం.కొట్టాల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ఆర్డీటీ డైరెక్టర్ మంచో ఫెర్రర్ ప్రసంగించారు. 47 ఏళ్ల కాలంలో రాయలసీమ జిల్లాల పరిధిలో 70 వేల మంది పేదలకు గహాలు నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. 20 వేల మంది నిరుపేద విద్యార్థులకు చేయూతనిచ్చామన్నారు. ప్రస్తుతం 80 మంది ఎంబీబీఎస్, 8 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్పెయిన్‌కు చెందిన స్వచ్చంధ సంస్థ నిర్వాహకుడు కార్లేస్, ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ షణ్ముఖరావు, ఏటీఎల్ శివశంకర్, గ్రామ పెద్దలు ఆంజనేయులు, ప్రభుదాస్, రామాంజనేయులు, ఆర్డీటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement