Ferrer
-
ఫాదర్ అడుగుజాడల్లో నడవాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఫాదర్ ఫెర్రర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ పేర్కొన్నారు. గురువారం వారు స్థానిక ఆర్డీటీ ప్రధాన కార్యాలయానికి విచ్చేసి ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచోఫెర్రర్ను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఆర్డీటీ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. ఈ ప్రాంతంలో విద్య, క్రీడల అభివృద్ధికి చేస్తున్న సేవలను వారు అభినందించారు. ఇక్కడి హాకీ క్రీడాకారులకు స్పెయిన్ ఆటగాళ్లతో శిక్షణ ఇప్పించడం గొప్ప విషయమని వారు కొనియాడారు. తాము కూడా చిన్న నాటి నుంచి కష్టపడి ఉన్నత స్థానానికి చేరామన్నారు. అనంతరం మాంచో ఫెర్రర్ ఇండియా ఫర్ ఇండియా ప్రాజెక్ట్ హుండీల విశిష్టతలను గురించి వివరించి, వారికి అందజేశారు. కార్యక్రమంలో కోచ్‌లు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలనే లక్ష్యం
– ఆర్డీటీ డైరెక్టర్ మంచో ఫెర్రర్ – విన్సెంట్ ఫెర్రర్ విగ్రహావిష్కరణ ఆలూరు: ఆర్థికంగా, సామాజికంగా చితికిపోయిన కుటుంబాలకు చేయూతనిచ్చి పేదరికాన్ని నిర్మూలించడమే ధ్యేయంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు పనిచేస్తోందని సంస్థ డైరెక్టర్ మంచో ఫెర్రర్ అన్నారు. మండల పరిధిలోని ఎం.కొట్టాల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ఆర్డీటీ డైరెక్టర్ మంచో ఫెర్రర్ ప్రసంగించారు. 47 ఏళ్ల కాలంలో రాయలసీమ జిల్లాల పరిధిలో 70 వేల మంది పేదలకు గహాలు నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. 20 వేల మంది నిరుపేద విద్యార్థులకు చేయూతనిచ్చామన్నారు. ప్రస్తుతం 80 మంది ఎంబీబీఎస్, 8 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్పెయిన్‌కు చెందిన స్వచ్చంధ సంస్థ నిర్వాహకుడు కార్లేస్, ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ షణ్ముఖరావు, ఏటీఎల్ శివశంకర్, గ్రామ పెద్దలు ఆంజనేయులు, ప్రభుదాస్, రామాంజనేయులు, ఆర్డీటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
హెవిట్ గుడ్ బై
ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండోరౌండ్లో ఫెరర్ చేతిలో ఓడిన తర్వాత ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పాడు. మ్యాచ్ అనంతరం ఆసీస్ జాతీయ పతాకంతో రూపొందించిన షర్ట్‌ను ధరించిన హెవిట్... తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి కోర్టులోకి వచ్చాడు. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.