ఫాదర్‌ అడుగుజాడల్లో నడవాలి | ram laxman statement on ferrer | Sakshi
Sakshi News home page

ఫాదర్‌ అడుగుజాడల్లో నడవాలి

Published Thu, Aug 25 2016 10:34 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

ఫాదర్‌ అడుగుజాడల్లో నడవాలి - Sakshi

ఫాదర్‌ అడుగుజాడల్లో నడవాలి

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఫాదర్‌ ఫెర్రర్‌ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఫైట్‌ మాస్టర్స్‌ రామ్, లక్ష్మణ్‌ పేర్కొన్నారు. గురువారం వారు స్థానిక ఆర్డీటీ ప్రధాన కార్యాలయానికి విచ్చేసి ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచోఫెర్రర్‌ను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఆర్డీటీ చేస్తున్న  కృషి ఎనలేనిదన్నారు. ఈ ప్రాంతంలో విద్య, క్రీడల అభివృద్ధికి చేస్తున్న సేవలను వారు అభినందించారు.

ఇక్కడి హాకీ క్రీడాకారులకు స్పెయిన్‌ ఆటగాళ్లతో శిక్షణ ఇప్పించడం  గొప్ప విషయమని వారు కొనియాడారు. తాము కూడా చిన్న నాటి నుంచి కష్టపడి ఉన్నత స్థానానికి చేరామన్నారు. అనంతరం మాంచో ఫెర్రర్‌ ఇండియా ఫర్‌ ఇండియా ప్రాజెక్ట్‌ హుండీల విశిష్టతలను గురించి వివరించి, వారికి అందజేశారు.  కార్యక్రమంలో కోచ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement