ఓ జపాన్ వ్యక్తి ఇటీవల కుక్కలా మారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి ఓ ప్రముఖ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో.. కుక్కలా మారిన తర్వాత తన అసాధారణ జీవితం ఎలా ఉందో వివరిస్తూ..చాలా షాకింగ విషయాలు చెప్పాడు. అతడు చెప్పిన విషయాలు చూస్తే వామ్మో ఇవేం కోరికలు అనిపించేలా ఉన్నాయి.
వివరాల్లోకెళ్తే..ఇటీవలే జపాన్‌కి చెందిన వ్యక్తి తనకెంతో ఇష్టమైన "కోలీ" అనే కుక్కలా మారి ఆశ్చర్యపర్చాడు. అందుకోసం ఎన్నో కంపెనీలు సంప్రదించగా ఓ కంపెనీ ముందుకు వచ్చి కుక్కను తలిపించే కాస్ట్యూమ్ డిజైన్ చేసేందుకు ముందుకు వచ్చింది. . ఇటీవలే అచ్చం కుక్కలా కనిపించే ఆ కాస్ట్యూమ్‌ని ధరించి వీధుల్లో హల్‌చల్ చేసి నెట్టింట వైరల్‌గా మారాడు కూడా. ఇప్పుడా వ్యక్తి తనకు ఇలా కుక్క జీవితం ఎంతో నచ్చిందని చెబుతున్నాడు. కుక్క మాదిరిగా నాలుగు కాళ్లపై నడవడం ఇబ్బందిగా ఉన్నా సంతృప్తిగా ఉందని చెప్పడం విశేషం.
ఆ వ్యక్తి ఆ కుక్కలా కనిపించే కాస్ట్యూమ్స్ కోసం ఒకటి, రెండు కాదు ఏకంగా రూ. 12 లక్షలు ఖర్చుపెట్టాడు. అంత ఖర్చుపెట్టాడు కాబట్టి ఇష్టపడక ఏం చేస్తాడులే! అని అనుకోకండి. పైగా కుక్కలా అసాధారణ జీవితం గడుపుతున్న అతడికి కలుగుతున్న కోరికలు వింటే మాత్రం ఓర్నీ ఇవేం కోరికలు అని నోరెళ్లబెట్టడం ఖాయం. ఇంతకీ ఆ కుక్కలా మారిన వ్యక్తి తనలానే కుక్కలా మారాలనుకునే స్త్రీ కూడా ఉంటే బాగుండనని, ఆమెతో ప్రేమలో పడాలని అనుకుంటున్నాడట.
అంతేకాదు కుక్కలా ఉన్న తనకు సినిమాలో నటించే అవకాశం వస్తే బావుండనని అంటున్నాడు. ఒక్క అవకాశం ఇస్తే తానేంటో చూపించుకుంటానని చెబుతున్నాడు. ఇలా జీవితం గడపడం ఎంత అసౌకర్యంగా అసాధారణంగా ఉన్నా తనకు అలా ఉండటమే ఇష్టమని తేల్చి చెప్పాడు. కోలీ జాతి కుక్కలంటే తనకెంతో ఇషమని అలా ఉండాలన్న కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉందని మరీ చెబుతున్నాడు. ఓర్నీ వెర్రీ వెయ్యి రకాలు అంటే ఏంటో అనుకున్నాం. ఇలానే ఉంటుందేమో కదా!.
Comments
Please login to add a commentAdd a comment