ram laxman
-
సూపర్ స్టార్ మహేశ్ గ్లామర్ వెనుకున్న సీక్రెట్ ఇదే..
సూపర్ స్టార్ మహేశ్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు పదుల వయసులో 25ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు మహేశ్. సినిమా, సినిమాకి సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారు. ఆయన గ్లామర్ వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని హీరో,హీరోయిన్లు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా మహేశ్ అంత హ్యండ్సమ్గా కనిపించడం రహస్యాన్ని ఫైట్ మాస్టర్స్ రామ్ –లక్ష్మణ్‌లు బయటపెట్టారు. పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ నటించిన సర్కారు వారి పాట మే12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్‌గా పనిచేసిన రామ్ –లక్ష్మణ్‌లు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ ఛార్మింగ్ లుక్ సీక్రెట్‌ను లీక్ చేశారు. “మహేష్ ఇంత అందంగా, కూల్ గా, ఛార్మింగ్ గా కనిపించడానికి కారణం ప్రతి రోజు ధ్యానం చేయడమే. ఆయన రోజూ మూన్ ద్యానం చేస్తారు. దీనివల్ల చాలా కూల్‌గా కనిపిస్తారు. ఈ మూన్ ధ్యానం వల్ల సుదీర్ఘ కాలంగా చేయడం వలన మహేష్ ఇంత ఛార్మింగ్‌గా ఉన్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ యోగా, వర్కవుట్స్‌తో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుంటారు. ఇదే ఆయన గ్లామర్‌కి సీక్రెట్ అంటూ చెప్పుకొచ్చారు. -
సీఎం జగన్‌కు థ్యాంక్స్... ఫైట్ మాస్టర్లు
సాక్షి, కనిగిరి (ప్రకాశం): తమకు రాజకీయం అంతగా తెలియదని, పేపర్లు, టీవీలు చూడమని, కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు వేగవంతంగా ప్రవేశ పెడుతున్నందుకు థ్యాంక్యూ జగనన్న..అంటూ సినీ ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ అన్నారు. స్థానిక చిల్ట్రన్స్ హోమ్‌లో గురువారం వారు ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బెల్ట్‌షాపుల నిషేధం తమకెంతో నచ్చిందన్నారు. తమ స్వగ్రామం, చుట్టుపక్కల గ్రామాల వారు బెల్ట్‌షాపుల్లో రోజూ మద్యం తాగి పొలం పనుల్లో వచ్చే డబ్బులు ఖర్చు చేస్తున్నారని, అంతిమంగా ఆ కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్‌షాపుల తొలగింపునకు తమవంతు ప్రయత్నం చేశామని, వాటి నిర్వాహకులతో కూరగాయల అంగళ్లు, కిరాణాకొట్లు పెట్టించినా తమ లక్ష్యం నెరవేరలేదన్నారు. అది పూర్తి స్థాయిలో అమలు కాకపోగా తమపై కొందరు వ్యతిరేకత పెంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మధ్యపాన నిషే ధంలో భాగంగా బెల్ట్‌షాపు ల రద్దుకు చర్యలు తీసుకోవడంతో తమ లక్ష్యం నెరవేరుతోందన్నారు. జగనన్నకు తాము థ్యాంక్స్ చెబుతున్నామని రామ్‌లక్ష్మణ్‌లు వెల్లడించారు. -
ఫైటింగ్.. షూటింగ్
మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని ముప్పిరెడ్డి గ్రామ శివారులో గల బీఎస్ స్టీల్ పరిశ్రమలో ఫైటింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. సోమవారం ‘సవ్యసాచి’ అనే సినిమా షూటింగ్లో భాగంగా హీరో నాగచైతన్య పై పైటింగ్ సన్నివేశాలను ఫైటింగ్ మాస్టర్లు రామ్– లక్ష్మణ్‌లు చిత్రీకరించారు. ఈ సందర్భంగా సినిమా ఫైట్ మాస్టర్లూ మాట్లాడుతూ చందు మోండేటీ దర్శకత్వంలో సినిమాను చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ఇట్టి సినిమా భాగంలో భాగంగా ఫైటింగ్ సన్నివేశాలను తీస్తున్నామన్నారు. ఈ సినిమాలో నాగచైతన్య హీరో, లైన్ ప్రోడక్షన్ పీటీ గిరిధర్∙తదితరులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
రంగస్థలంలో సుకుమార్ డ్యాన్స్
-
రంగస్థలంలో సుకుమార్ డ్యాన్స్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా రంగస్థలం సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా షూటింగ్ లోకెషన్లో జరిగిన ఓ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎప్పుడూ కెమెరా వెనక నిలబడి యాక్షన్, కట్ చెప్పే సుకుమార్ సరదాగా డ్యాన్స్ చేస్తూ సెట్లో సందడి చేశాడు. సుకుమార్‌తో పాటు యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్, లక్ష్మణ్‌లు కూడా డ్యాన్స్ చేశారు. తీన్ మార్ బీట్‌కు వీరు చేసిన డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వేసవి కానుకగా మార్చి 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో చరణ్ లో వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడు. తొలిసారి చరణ్ ఓ పల్లెటూరి కుర్రాడి పాత్రలో నటిస్తుండటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. -
వీడిన బేల్దార్ హత్యకేసు మిస్టరీ
వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య హత్యాస్థలిలో వదిలేసిన పిడిబాకు కోసం వచ్చి దొరికిన నిందితుడు తనకల్లు : చీకటిమానిపల్లి వద్ద జరిగిన బేల్దార్ ఆంజనేయులు (30) హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తేలింది. నిందితుడు హత్యాస్థలిలో వదిలేసిన పిడిబాకును తీసుకునేందుకు వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలను కదిరి రూరల్ సీఐ శ్రీధర్ శనివారం మీడియాకు వెల్లడించారు. చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలం చెన్నమగారిపల్లికి చెందిన ఆంజినేయులు అలియాస్ అంజి (30) తన సోదరి మంజులను తనకల్లు మండలం చీకటిమానుపల్లికి చెందిన సోమశేఖర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆంజనేయులు తన సోదరిని చూడడానికి తరచూ గ్రామానికి వచ్చేవాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన రామలక్ష్మణ్ కుటుంబంతో పరిచయం అయ్యింది. రామలక్ష్మణ్ను మామా అని, అతని భార్య అంజలిని అక్క అంటూ చనువుతో మెలిగేవాడు. ఈ చనువు రానురాను అంజలితో వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు రామ్‌లక్ష్మణ్ దృష్టికి తీసుకెళ్లగా భార్యపై ఉన్న నమ్మకంతో పెద్దగా పట్టించుకోలేదు. ఓరోజు ఆంజనేయులు దగ్గర రామ్‌లక్ష్మణ్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా తనకు ఇది వరకే పెళ్లి అయిన మహిళతో సంబంధం ఉందని, తననే వివాహం చేసుకుంటానని చెప్పాడు. అడ్డు వస్తే ఆమె భర్తను హతమార్చి అయినా పెళ్లి చేసుకుంటానని అనడంతో రామ్‌లక్ష్మణ్‌కు అనుమానం వచ్చింది. ఈ నెల 18న తెల్లవారుజామున బహిర్భుమికి వెళ్లివస్తానని భర్తతో చెప్పి అంజలి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. అనుమానంతో ఉన్న భర్త ఆమెకు తెలియకుండా అనుసరించాడు. అప్పటికే అంగన్వాడీ కేంద్రం దగ్గర ఆంజనేయులు వేచి ఉన్నాడు. ఆమె రాగానే ఇద్దరు సన్నిహితంగా మెలగడం కళ్లారా చూసిన రామలక్ష్మణ్ అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. భార్య ఇంటికి రాగానే నిలదీయగా ఆమె తప్పు చేశానని, ఇంకెప్పుడూ అలాంటి పని చేయనని భర్త కాళ్లు పట్టుకుంది. దీంతో ఆమెను క్షమించి బుద్ధిగా ఉండాలని హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోమంటే నిర్లక్ష్య సమాధానం ఆంజనేయులు కుటుంబ సభ్యులను రామ్‌లక్ష్మణ్ కలిసి అతన్ని తమ గ్రామానికి రాకుండా చూడాలని కోరాడు. ఈ నెల 19న రామ్‌లక్ష్మణ్ స్నేహితుడైన మాధవతో కలిసి మద్యం తాగడానికి గ్రామంలోని పాత శివాలయం వద్దకు వెళ్లారు. అక్కడికి ఆంజనేయులు కూడా వచ్చాడు. ముగ్గురూ కలిసి పూటుగా మద్యం తాగారు. అక్కడి నుండి ఆంజినేయులు ద్విచక్ర వాహనంలో శశ్మానం వైపు బయల్దేరారు. అక్కడ మాధవ్ బహిర్భుమికి వెళ్లాడు. పక్కన ఎవ్వరూ లేకపోవడంతో తన భార్యతో వివాహేతర సంబంధం మానుకోవాలని ఆంజనేయులును కోరగా.. అతను చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడంతో ఓర్చుకోలేకపోయిన రామలక్ష్మణ్ తన వెంట తెచ్చుకున్న పిడిబాకుతో మెడ భాగంలో బలంగా పొడిచాడు. కింద పడిపోయిన ఆంజనేయులుపై మరో ఐదు చోట్ల విచక్షణారహితంగా పొడవడంతో అతను అక్కడిక్కడే చనిపోయాడు. పిడిబాకును దగ్గర్లోని చెట్ల పొదల్లో పారేసి రామ్‌లక్ష్మణ్ పరారయ్యాడు. పిడిబాకు కోసం వచ్చి పట్టుబడ్డ నిందితుడు పిడిబాకును హత్యాస్థలి వద్ద పడేయడం వల్ల దానిపై తన వేలిముద్రలు ఉంటాయని, వాటి ద్వారా తనను పోలీసులు పట్టుకుంటారని భయపడిన రామ్‌లక్ష్మణ్ పిడిబాకు కోసం శుక్రవారం శివాలయం వద్దకు వచ్చాడు. అప్పటికే అక్కడ కాపు కాచి ఉన్న పోలీసులు అతడిని పట్టుకొని అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ బాలరాజు, కానిస్టేబుళ్లు రాము, సురేష్, అంజినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇష్టంతో చదవాలి
• వేలిముద్రగాళ్లం అయినందునే ఎంతో నష్టపోయాం • 150 సినిమాల్లో పని చేశాం • ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ తాడిపత్రి టౌన్ : "మా జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాం. మరెన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాం. ఎన్నో అనుభూతులు, అనుభవాలు చవి చూశాం. అయితే చదువులేక వేలిముద్రగాళ్లుగా ఎంతో నష్టపోయాం. మా మాదిరి ఎవరూ కాకూడదు. కష్టమైనా ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే ఇష్టంతో చదవాలి’ అని సినిమా ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ అన్నారు. తాడిపత్రి కాల్వగడ్డ వీధిలోని సాయి సిద్దార్ధ కళాశాలలో ఉద్యోగ, ఉపాధ్యాయ సామాజిక సేవా సంఘం, సాయి సిద్దార్ధ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ‘బాలికలు–బంగారు భవిష్యత్’ అనే అంశంపై బుధవారం ఏర్పాటు చేసిన సదస్సులో వారు మాట్లాడారు. సేవా సంస్థ అధ్యక్షుడు శంకర్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగిన కార్యక్రమంలో వారు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ... దేవుని దయ, మా కష్టంతో సినీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరామన్నారు. ఐదు సినిమాల్లో హీరోగా, 150 సినిమాల్లో ఫైట్ మాస్టర్లుగా పని చేసినట్లు పేర్కొన్నారు. ఐదు నంది అవార్డులు సొంతం చేసుకున్నట్లు తెలిపారు. నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి సహా ఇతర హీరోల సినిమాల్లో ఫైట్మాస్టర్లుగా పని చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం చిరంజీవి 150 చిత్రానికి, బాలకృష్ట 100 చిత్రానికి ఫైట్ మాస్టర్లుగా పని చేస్తున్నామన్నారు. ఫైట్ మాస్టర్లుగా ఎన్నో దేశ విదేశాలు చుట్టొచ్చామని, చదువు రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డామని బాధపడ్డారు. సెల్, కంప్యూటర్ మోజులో జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. తల్లిదండ్రులు, గురువులను పూజించాలని పేర్కొన్నారు. -
జ్యోతి ఫౌండేషన్ కు రామ్-లక్షణ్ సాయం
-
కష్టపడే మనస్తత్వం అలవర్చుకోవాలి
బుక్కరాయసముద్రం : సమాజంలో ప్రతి ఒక్కరూ కష్టపడే మనస్థత్వం అలవర్చు కోవాలని ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్‌లు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ సినిమా ప్రపంచం రంగుల వలయమన్నారు. సినిమా జీవితంతో ఎవ్వరూ పోల్చుకోరాదన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి పలితాలు సాధిస్తారన్నారు. ప్రస్తుతం విద్యార్థులు పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమన్నారు. మంచి విజయాలు సాధించే ందుకు సమయం చాలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. -
ఫాదర్ అడుగుజాడల్లో నడవాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఫాదర్ ఫెర్రర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ పేర్కొన్నారు. గురువారం వారు స్థానిక ఆర్డీటీ ప్రధాన కార్యాలయానికి విచ్చేసి ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచోఫెర్రర్ను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఆర్డీటీ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. ఈ ప్రాంతంలో విద్య, క్రీడల అభివృద్ధికి చేస్తున్న సేవలను వారు అభినందించారు. ఇక్కడి హాకీ క్రీడాకారులకు స్పెయిన్ ఆటగాళ్లతో శిక్షణ ఇప్పించడం గొప్ప విషయమని వారు కొనియాడారు. తాము కూడా చిన్న నాటి నుంచి కష్టపడి ఉన్నత స్థానానికి చేరామన్నారు. అనంతరం మాంచో ఫెర్రర్ ఇండియా ఫర్ ఇండియా ప్రాజెక్ట్ హుండీల విశిష్టతలను గురించి వివరించి, వారికి అందజేశారు. కార్యక్రమంలో కోచ్‌లు పాల్గొన్నారు.