కష్టపడే మనస్తత్వం అలవర్చుకోవాలి
బుక్కరాయసముద్రం : సమాజంలో ప్రతి ఒక్కరూ కష్టపడే మనస్థత్వం అలవర్చు కోవాలని ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్‌లు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ సినిమా ప్రపంచం రంగుల వలయమన్నారు.
సినిమా జీవితంతో ఎవ్వరూ పోల్చుకోరాదన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి పలితాలు సాధిస్తారన్నారు. ప్రస్తుతం విద్యార్థులు పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమన్నారు. మంచి విజయాలు సాధించే ందుకు సమయం చాలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.