stunt masters
-
టైగర్ యాక్షన్ ఊహాతీతంగా ఉంటుంది: రామ్ లక్ష్మణ్
‘‘రవితేజగారితో ఎన్నో చిత్రాలు చేశాం. కానీ ‘టైగర్ నాగేశ్వర రావు’ మాత్రం కొత్త అనుభూతినిచ్చింది. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్‌ని ప్రేక్షకులు నిజంగా జరుగుతున్నట్లు భావిస్తారు’’ అన్నారు ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్. రవితేజ హీరోగా, నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్స్‌గా చేసిన రామ్–లక్ష్మణ్ మాట్లాడుతూ– ‘‘మేం స్టూవర్ట్‌పురం ప్రాంతంలోనే పుట్టి పెరిగాం. ‘టైగర్ నాగేశ్వరరావు’ గారి గురించి ఊహకు అందని విషయాలు విన్నాం. రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారని, దొంగతనం చేస్తానని చెప్పి మరీ చేసేవారని, చెట్లపై కూడా పరిగెత్తెవారని.. ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు వినేవాళ్ళం. సవాల్ చేసి దొంగతనం చేయడం అంత ఈజీ కాదు. అందరికీ చెప్పి దొంగతనం చేసి అక్కడ నుంచి తప్పించుకునే ఒక పాత్రని చూస్తున్నపుడు రియల్ హీరోయిజం కనిపిస్తుంది. ఆయన చెన్నై జైలు నుంచి ఎస్కేప్ అయ్యారు. ఆయనకి టైగర్ అనే బిరుదు పోలీసులు ఇచ్చారు. ఒక దొంగకి పోలీసులు బిరుదు ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరమైన అంశం. మేము ఒక ఫైట్ తీసినప్పుడు రోఫ్ కడతాం, బోలెడు ఏర్పాట్లు చేస్తాం. అలాంటిది టైగర్ నాగేశ్వరరావు ఏ సాయం లేకుండా అంత ఎత్తు జైలు గోడలు ఎలా ఎక్కగలిగారు, ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ వచ్చి ఉంటుందనేది నిజంగా ఆశ్చర్యకరం. ఒక దొంగ ఇంత పాపులర్ అయ్యారంటే దాని వెనుక నేచర్ సపోర్ట్, ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అసలు ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు ? అని ఒక ప్రధాన మంత్రి దగ్గర కూడా గుర్తింపు పొందడం మామూలు విషయం కాదు. ఇంత పవర్ ఫుల్ బయోపిక్ తీసిన దర్శకుడు వంశీకి థాంక్స్ చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్ లో రవితేజ గారి సినిమా వెళ్ళబోతుంది. తప్పకుండా ‘టైగర్ నాగేశ్వరరావు’ అందరినీ అలరిస్తుంది. ఈ చిత్రానికి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాం’ అన్నారు. -
అదిరిపోయేలా ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్.. 1000 మంది ఫైటర్స్‌తో యాక్షన్ సీక్వెన్స్
దాదాపు వెయ్యిమంది ఫైటర్స్‌తో పోరాడటానికి రెడీ అవుతున్నారట రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘గేమ్ చేంజర్’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. తాజాగా ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్ చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలిసింది. (చదవండి: పెళ్లెప్పుడంటే! వడివేలు స్టైల్లో విషయం చెప్పేసిన కీర్తి.. ఎంతైనా మహానటి కదా!) హైదరాబాద్ శివార్లలో ఆల్రెడీ ఈ ఫైట్ కోసం సెట్ వర్క్ కూడా పూర్తి చేశారట. ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్న ఈ క్లైమాక్స్ చిత్రీకరణ వచ్చే నెల తొలి వారం వరకూ జరుగుతుందని సమాచారం. కాగా ఈ ఫైట్ చిత్రీకరణలో దాదాపు వెయ్యిమంది స్టంట్మ్యాన్లు పాల్గొంటారట. అలాగే ‘కేజీఎఫ్’ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బు అండ్ అరివు ఈ క్లైమాక్స్ ఫైట్‌ను కొరియోగ్రాఫ్ చేయనున్నట్లు సమాచారం. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇద్దరు స్టంట్ డైరెక్టర్లపై వేటు
దక్షిణ భారత సినీ స్టంట్ దర్శకుల సంఘానికి చెందిన ఇద్దరు స్టంట్ దర్శకుల సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షుడు వెల్లడించారు. వివరాలు.. దక్షిణ భారత సినీ స్టంట్ దర్శకుల సంఘం కార్యాలయం స్థానిక వడపళనిలో ఉంది. ఈ సంఘంలో 650 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఘానికి సుప్రీం సుందర్ అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్న ఎంఏఈ.అన్బుమణి, ఎంఎం.అరివుమణి సంఘ నిబంధనలకు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కారణంగా వారిద్దరి సంఘం నుంచి తొలగిస్తున్నట్లు వారి సభ్యుత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు సోమవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. దీని గురించి సంఘం అధ్యక్షుడు సుప్రీంసుందర్ తెలుపుతూ అన్బుమణి, అరివుమణి శిక్షణ పేరుతో నటులను ప్రాణాపాయంతో కూడిన రోప్ షాట్స్ చేయిస్తున్నారని, ఈ విషయమై ఆరోపణలు రావడంతో గత నెల 9న జరిగిన సంఘ సమావేశంలో వారిద్దరిని పిలిచి వివరణ కోరినట్లు తెలిపారు. దీంతో సంఘ సభ్యులపై బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. కాగా గత 18న సమావేశంలో చర్చించి అన్బుమణి, అరివుమణిలను సంఘం నుంచి శాశ్వతంగా తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే వారు ఈ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించారని, దీంతో తాము న్యాయవాది ద్వారా వారికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో ఉన్నట్లు సుప్రీంసుందర్ చెప్పారు. -
నో డూప్
అంతరిక్షం నేపథ్యంలో సాగే సినిమా అంటే మామూలు విషయం కాదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విజువల్స్ అండ్ స్టంట్స్ విషయాల్లో అయితే ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఇదే చేస్తున్నారు వరుణ్ తేజ్ అండ్ టీమ్. తొలి చిత్రం ‘ఘాజీ’తోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అదితీరావు హైదరీ, లావణ్య త్రిపాఠి కథానాయికలు. ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘వ్యోమగామి, అంతరిక్షం’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారని టాక్. ‘‘హాలీవుడ్ స్టంట్ టీమ్ బిబెక్, టోడోర్ లాజరవ్ (జూబి) అండ్ రోమన్ ఆధ్వర్వంలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. వీరు ‘ఎక్స్‌పాండబుల్ 2, ట్రాయ్, జీరో డార్క్ థర్టీ’ వంటి హాలీవుడ్ సినిమాలకు పని చేశారు. ఇప్పుడు హీరో వరుణ్ తేజ్‌తో సూపర్ స్టంట్స్ చేయించారు. డూప్ లేకుండా వరుణ్ ఈ స్టంట్స్ చేశారు. ఈ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. వరుణ్‌తేజ్, హైదరీలపై చేసిన 3డీ స్కాన్ సినిమాకు హెల్ప్ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘మా స్టంట్ టీమ్‌ని మిస్ అవుతున్నాను. వీళ్లతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్’’ అని వరుణ్ తేజ్ స్టంట్ క్రూతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. -
ఇష్టంతో చదవాలి
• వేలిముద్రగాళ్లం అయినందునే ఎంతో నష్టపోయాం • 150 సినిమాల్లో పని చేశాం • ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ తాడిపత్రి టౌన్ : "మా జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాం. మరెన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాం. ఎన్నో అనుభూతులు, అనుభవాలు చవి చూశాం. అయితే చదువులేక వేలిముద్రగాళ్లుగా ఎంతో నష్టపోయాం. మా మాదిరి ఎవరూ కాకూడదు. కష్టమైనా ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే ఇష్టంతో చదవాలి’ అని సినిమా ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ అన్నారు. తాడిపత్రి కాల్వగడ్డ వీధిలోని సాయి సిద్దార్ధ కళాశాలలో ఉద్యోగ, ఉపాధ్యాయ సామాజిక సేవా సంఘం, సాయి సిద్దార్ధ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ‘బాలికలు–బంగారు భవిష్యత్’ అనే అంశంపై బుధవారం ఏర్పాటు చేసిన సదస్సులో వారు మాట్లాడారు. సేవా సంస్థ అధ్యక్షుడు శంకర్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగిన కార్యక్రమంలో వారు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ... దేవుని దయ, మా కష్టంతో సినీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరామన్నారు. ఐదు సినిమాల్లో హీరోగా, 150 సినిమాల్లో ఫైట్ మాస్టర్లుగా పని చేసినట్లు పేర్కొన్నారు. ఐదు నంది అవార్డులు సొంతం చేసుకున్నట్లు తెలిపారు. నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి సహా ఇతర హీరోల సినిమాల్లో ఫైట్మాస్టర్లుగా పని చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం చిరంజీవి 150 చిత్రానికి, బాలకృష్ట 100 చిత్రానికి ఫైట్ మాస్టర్లుగా పని చేస్తున్నామన్నారు. ఫైట్ మాస్టర్లుగా ఎన్నో దేశ విదేశాలు చుట్టొచ్చామని, చదువు రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డామని బాధపడ్డారు. సెల్, కంప్యూటర్ మోజులో జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. తల్లిదండ్రులు, గురువులను పూజించాలని పేర్కొన్నారు. -
కష్టపడే మనస్తత్వం అలవర్చుకోవాలి
బుక్కరాయసముద్రం : సమాజంలో ప్రతి ఒక్కరూ కష్టపడే మనస్థత్వం అలవర్చు కోవాలని ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్‌లు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ సినిమా ప్రపంచం రంగుల వలయమన్నారు. సినిమా జీవితంతో ఎవ్వరూ పోల్చుకోరాదన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి పలితాలు సాధిస్తారన్నారు. ప్రస్తుతం విద్యార్థులు పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమన్నారు. మంచి విజయాలు సాధించే ందుకు సమయం చాలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.