హాలీవుడ్ స్టంట్ టీమ్‌తో వరుణ్ తేజ్
అంతరిక్షం నేపథ్యంలో సాగే సినిమా అంటే మామూలు విషయం కాదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విజువల్స్ అండ్ స్టంట్స్ విషయాల్లో అయితే ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవాలి. ఇదే చేస్తున్నారు వరుణ్ తేజ్ అండ్ టీమ్. తొలి చిత్రం ‘ఘాజీ’తోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అదితీరావు హైదరీ, లావణ్య త్రిపాఠి కథానాయికలు. ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘వ్యోమగామి, అంతరిక్షం’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారని టాక్.
‘‘హాలీవుడ్ స్టంట్ టీమ్ బిబెక్, టోడోర్ లాజరవ్ (జూబి) అండ్ రోమన్ ఆధ్వర్వంలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. వీరు ‘ఎక్స్‌పాండబుల్ 2, ట్రాయ్, జీరో డార్క్ థర్టీ’ వంటి హాలీవుడ్ సినిమాలకు పని చేశారు. ఇప్పుడు హీరో వరుణ్ తేజ్‌తో సూపర్ స్టంట్స్ చేయించారు. డూప్ లేకుండా వరుణ్ ఈ స్టంట్స్ చేశారు. ఈ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. వరుణ్‌తేజ్, హైదరీలపై చేసిన 3డీ స్కాన్ సినిమాకు హెల్ప్ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘మా స్టంట్ టీమ్‌ని మిస్ అవుతున్నాను. వీళ్లతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్’’ అని వరుణ్ తేజ్ స్టంట్ క్రూతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment