రంగం సిద్ధం | Varun Tej next movie First look released date fix | Sakshi
Sakshi News home page

రంగం సిద్ధం

Published Mon, Aug 13 2018 12:42 AM | Last Updated on Mon, Aug 13 2018 12:46 AM

Varun Tej next movie First look released date fix - Sakshi

వరుణ్‌ తేజ్‌

తన అంతరిక్ష ప్రయాణాన్ని వెండితెరపై చూపించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు హీరో వరుణ్‌ తేజ్‌. ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా అంతరిక్షం నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అదితీరావు హైదరీ, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ అండ్‌ రిలీజ్‌ డేట్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15 ఉదయం 9.30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. సత్యదేవ్, శ్రీనివాస్‌ అవసరాల తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందిస్తున్నారు. వి.ఎస్‌. జ్ఞానశేఖర్‌ ఛాయాగ్రాహకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement