అంతరిక్షం 2 చేయాలనుంది | Director sankalp reddy interview about antariksham movie | Sakshi
Sakshi News home page

అంతరిక్షం 2 చేయాలనుంది

Published Sat, Dec 15 2018 2:02 AM | Last Updated on Sat, Dec 15 2018 2:02 AM

Director sankalp reddy interview about antariksham movie - Sakshi

సంకల్ప్‌ రెడ్డి

‘‘ఘాజీ రిలీజైన మూడు నెలల తర్వాత స్పేస్‌కు సంబంధించిన ఆర్టికల్‌ చదువుతుంటే ‘అంతరిక్షం’ చిత్రం తీయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆర్టికలేంటో చెబితే సినిమా కథ తెలిసిపోతుంది, ప్రస్తుతానికైతే చెప్పను (నవ్వుతూ). ‘గ్రావిటీ, ఇంటర్‌స్టెల్లార్‌’, తమిళంలో వచ్చిన ‘టిక్‌ టిక్‌ టిక్‌’ లాంటి ఏ సినిమాకు మా చిత్రం సంబంధం లేదు. కొత్తగా ఉంటుంది’’ అని దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి అన్నారు. వరుణ్‌తేజ్‌ హీరోగా సంకల్ప్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అంతరిక్షం’. అదితీరావ్‌ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై క్రిష్, జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌రెడ్డి నిర్మించారు. యు సర్టిఫికెట్‌తో సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి పంచుకున్న విశేషాలు...

► వైజాగ్‌లో మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఎలా ‘ఘాజీ’ సినిమా తీయాలనే ఆలోచన వచ్చిందో.. ఏదో స్పేస్‌ ఆర్టికల్‌ చదువుతుంటే ఈ సినిమా చేయాలనిపించింది.  ఇప్పటి వరకూ వచ్చిన స్పేస్‌ సినిమాలతోపోలుస్తారని తెలుసు. కానీ వాటి నుంచి ఇన్‌స్పెర్‌ అవ్వలేదు.

► నా ఫస్ట్, సెకండ్‌ రెండు సినిమాలు ఏదో ఓ ఈవెంట్‌ రిలేటెడ్‌  ఐడియాలే ఉన్నాయి. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కొత్త ఐడియాలు రాకపోతే ఫార్ములా సినిమాలే తీస్తానేమో. ఇప్పుడే కాదు ఫ్యూచర్‌లో.

► ‘ఘాజీ’ చిత్రానికి నేషనల్‌ అవార్డ్‌ ఈ ఏడాది మే 1న వచ్చింది. తర్వాతి రోజే సినిమాను స్టార్ట్‌ చేశాం. 1500 సీజీ షార్ట్స్‌ ఉన్నాయి. అయినా కూడా 70 రోజులు షూటింగ్‌ పూర్తి చేశాం. అందులో30 రోజులు జీరో గ్రావిటీ సీన్స్‌ చిత్రీకరించాం. సినిమా షూట్‌ చేయడానికి సమయం ఎక్కువ తీసుకోలేదు.

► సినిమాకు సంబంధించి బాగానే రీసెర్చ్‌ చేశాను. నెట్‌లోనే మనకు కావల్సిన  కంటెంట్‌ ఉంది. యుట్యూబ్‌లోనూ చాలా మ్యాటర్‌ ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలతో మాట్లాడాను.

► స్పేస్‌లో ఉన్నది ఉన్నటుగా తీస్తే డాక్యుమెంటరీ అవుతుంది. వీలైనంత ల్యాజిక్‌ ఉండేలా చూసుకున్నాం. ఒక్కసారి ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్‌ అయితే లాజిక్‌ పట్టించుకోడు. బోర్‌ కొట్టిస్తున్నాం అంటే లాజిక్స్‌ వెతికే పనిలో పడతారు.

► దేవ్‌ అనే పాత్రకు వరుణ్‌ తేజ్‌ అయితేనే బావుంటుంది అనిపించింది. కథేంటో అని క్లుప్తంగా చెప్పాను. తర్వాత నాలుగు నెలల్లో కథ పూర్తి చేశా.

► ఘాజీలో లవ్‌స్టోరీ ఉండదు. కానీ ఇందులో ప్రేమతో పాటు దేశభక్తి లవ్‌స్టోరీ అన్నీ ఉంటాయి.

► స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న సమయంలో, ప్రీ–ప్రొడక్షన్‌ చేస్తున్న సమయంలో క్రిష్‌గారు సహాయం చేశారు. నిర్మాతల సహకారం కూడా బావుంది. షూటింగ్‌లో నాకు పెద్ద చాలెంజ్‌లు ఎదురవ్వలేదు కానీ, యాక్టర్స్‌ మాత్రం చాలెంజెస్‌ ఫేస్‌ చేశారు. ‘రంగస్థలం’లో ఆర్ట్‌వర్క్‌ చూసి రామకృష్ణ, మోనికాలను ఎంపిక చేసుకున్నాను.

► బాలీవుడ్‌లో రెండు ఆఫర్స్‌ ఉన్నాయి. టిని పూర్తి చేయాలి. టాలీవుడ్‌కు టెంపరరీగా బ్రేక్‌ తీసుకుంటున్నాను. నిర్మాతలకు కథ కూడా చెప్పాను. అక్కడికి వెళ్తే 2 ఏళ్ల సమయం కేటాయించాలి. మరీ ఆలస్యం అయితే ఇక్కడే సినిమాలు చేస్తాను. ‘అంతరిక్షం 2’ కూడా చేయాలనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement