Antariksham
-
ఒలింపిక్ విన్నర్ ట్రైనింగ్‌లో వరుణ్ తేజ్
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్ తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో వరుణ్ బాక్సర్‌గా నటించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు మెగా ప్రిన్స్. ఈ సినిమా కోసం ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాత్మక చిత్రాలే చేస్తూ వస్తున్న వరుణ్ ఈ సినిమాతో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ జిగర్తాండ రీమేక్‌గా వాల్మీకీ సినిమాను స్టార్ట్ చేసిన వరుణ్ ఈ సినిమాను కూడా ప్యారలల్‌గా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. థ్రిల్లింగ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. -
సంకల్ప్.. ఈ సారి నేలమీదే, కానీ..!
రానా ప్రధాన పాత్రలో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమా ఘాజీ. తొలి అండర్‌వాటర్ వార్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఘాజీ తరువాత రెండో ప్రయత్నంగా మరో ప్రయోగం చేశాడు సంకల్ప్. వరుణ్ తేజ్ హీరోగా స్పేస్‌బ్యాక్ డ్రాప్లో అంతరిక్షం సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా సంకల్ప్ తన మూడో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. తొలి సినిమాను సముద్రంలో, రెండో సినిమాను అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కించిన సంకల్ప్ మూడో సినిమాను మాత్రం నేల మీదే చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఈ సినిమాలో కూడా తన మార్క్ కనిపించేలా అంటార్కిటికా మంచులో జరిగే పరిశోదనల నేపథ్యంలో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
అలా తీస్తే డాక్యుమెంటరీ అవుతుంది
‘‘పిల్లలతో పాటు పెద్దలను ‘అంతరిక్షం’ సినిమా మెప్పిస్తోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన తొలి తెలుగు స్పేస్ థ్రిల్లర్ సినిమా ఇది. దర్శకుడు సంకల్ప్ అద్భుతంగా రూపొందించారు’’ అని క్రిష్ అన్నారు. క్రిష్ సమర్పణలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్, అదితీరావ్ హైదరీ, లావణ్య ముఖ్య పాత్రలలో రూపొందిన చిత్రం ‘అంతరిక్షం 9000 కేయంపీహెచ్’. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రిష్ మాట్లాడుతూ –‘‘అంతరిక్షం’ సరికొత్త తెలుగు సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ‘గమ్యం, కంచె’ తర్వాత మా బ్యానర్లో మరో గొప్ప చిత్రంగా నిలిచింది’’ అన్నారు. ‘‘ఓ వినూత్న ప్రయతాన్ని అందరూ ఆదరించడం ఆనందంగా ఉంది. సినిమాపై కొన్ని విమర్శలు వచ్చాయి. వాటినీ స్వీకరిస్తున్నాం. భవిష్యత్తులో అవి పునరావృత్తం కాకుండా చూసుకుంటాం’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘మరికొన్ని వైవిధ్యమైన ప్రయోగాలు చేయడానికి ఈ విజయం స్ఫూర్తినిచ్చింది. మన బడ్జెట్లోనే కొత్త ఆలోచనలతో సినిమా తీయవచ్చని నిరూపించింది. కొన్ని లాజిక్కులు మిస్ అయ్యాయి అంటున్నారు. పూర్తి లాజిక్స్‌తో తీస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది’’ అన్నారు సంకల్ప్ రెడ్డి. ‘‘కొత్త ప్రయత్నంలో భాగం అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాన’’న్నారు అదితీరావ్ హైదరీ. -
బాక్సర్‌గా మెగా హీరో..!
అంతరిక్షం సినిమాతో మరోసారి ఆకట్టుకున్న వరుణ్ తేజ్, తదుపరి చిత్రంలోనే ప్రయోగానికే రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 2లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్లో నటిస్తున్న ఈ యంగ్ హీరో తరువాత ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించేందుకు ఓకె చెప్పాడు. కొత్త దర్శకుడు కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాతో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నాడట. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి వరుణ్ నటిస్తున్న ఎఫ్ 2 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కు జోడిగా మెహరీన్ నటిస్తోంది. -
‘అంతరిక్షం’ మూవీ రివ్యూ
టైటిల్ : అంతరిక్షం జానర్ : సైన్స్‌ఫిక్షన్ స్పేస్ థ్రిల్లర్ తారాగణం : వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, రెహమాన్, శ్రీనివాస్ అవసరాల సంగీతం : ప్రశాంత్ విహారి దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి నిర్మాత : క్రిష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి, మురళి ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి రెండో ప్రయత్నంగా తొలి తెలుగు స్పేస్ మూవీ అంతరిక్షంను తెరకెక్కించాడు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ విజువల్ వండర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండటంతో సంకల్ప్ మరోసారి మ్యాజిక్ చేస్తాడన్న నమ్మకం కలిగింది. మరి ఆ నమ్మకాన్ని సంకల్ప్ రెడ్డి నిలబెట్టుకున్నాడా..? వరుసగా రెండు సూపర్ హిట్లు అందుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్నాడా..? కథ : దేవ్ (వరుణ్ తేజ్) ఓ స్పేస్ సైంటిస్ట్. రష్యాలో ట్రైన్ అయిన వ్యోమగామి. ఎన్నో ఆశలతో చంద్రుడి మీద నీటి జాడలు తెలుసుకునేందుకు విప్రయాన్ అనే శాటిలైట్‌ను ప్రయోగిస్తాడు. కానీ ఆ మిషన్ ఫెయిల్ అవుతుంది. అదే సమయంలో తను ప్రేమించిన పారు (లావణ్య త్రిపాఠి) కూడా ప్రమాదంలో చనిపోతుంది. దీంతో దేవ్ స్పేస్ రిసెర్చ్‌కు దూరమవుతాడు. కానీ ఐదేళ్ల తరువాత రిసెర్చ్ సెంటర్‌కు దేవ్ అవసరం పడుతుంది. మిహిరా శాటిలైట్ కక్షనుంచి పక్కకు తప్పుకొని మరో శాటిలైట్‌ను డికొట్టబోతుందని తెలుస్తోంది. మిహిరాను దేవ్ మాత్రమే కరెక్ట్ చేయగలడని అతన్ని పిలిపిస్తారు. రియా(అదితిరావ్ హైదరి), కరణ్ (సత్యదేవ్), సంజయ్ (రాజా)లతో కలిసి స్పేస్‌లోకి వెళ్లిన దేవ్. మిహిరాను ఎలా సరిచేశాడు.? స్పేస్‌లో దేవ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమేంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాలు చేస్తూ వస్తున్న వరుణ్ తేజ్ ప్రతీ సినిమాతో నటుడిగాను ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో టెంపర్ కంట్రోల్ లేని సైంటిస్ట్‌గా, ప్రేమికుడిగా, స్పేస్‌లో సాహసాలు చేసే వ్యోమగామిగా అద్భుతంగా నటించాడు. దేవ్ పాత్రకు ప్రాణం పోశాడు. రియా పాత్రలో అదితిరావ్ హైదరి సూపర్బ్ అనిపించింది. లుక్స్ తో పాటు నటన పరంగానూ మంచి మార్కులు సాధించింది. లావణ్య త్రిపాఠిది దాదాపు అతిథి పాత్రే. ఉన్నంతలో అందంతో అభినయంతో ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో సత్యదేవ్, రాజా, రెహమాన్, అవసరాల శ్రీనివాస్ తమ పాత్రల పరిదిమేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ఘాజీ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంకల్ప్ మరోసారి అదే తరహా ప్రయోగం చేశాడు. అంతరిక్షం కోసం సంకల్ప్ తయారు చేసుకున్న కథనం దాదాపు ఘాజీలాగే సాగుతుంది. సినిమా ప్రారంభంలోనే మిహిరాకు సంబంధించిన డిటెయిల్స్ తో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన దర్శకుడు తొలి భాగాన్ని చాలా నెమ్మదిగా నడిపించాడు. ఎక్కువ భాగం పాత్రల పరిచయంతో పాటు స్పేస్ మిషన్ అవసరం ఏంటి అన్న విషయాలను వివరించేందుకు కేటాయించాడు. ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరి కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు. సెకండ్ హాఫ్ అంతా అంతరిక్షంలోనే నడుస్తూ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది. రాకెట్ ప్రయోగం ఎలా జరుగుతుంది. వ్యోమగామలు ఎలాంటి కోడ్స్ వాడతారు. ఎలా కమ్యూనికేట్ చేస్తారు లాంటి అంశాల్లో సంకల్ప్ చేసిన రిసెర్చ్ తెర మీద కనిపిస్తుంది. ద్వితియార్థంలో పెద్దగా కథ లేకపోయినా.. తన కథనంతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు దర్శకుడు. సినిమాకు మరో మేజర్ ప్లస్‌పాయింట్ సినిమాటోగ్రఫి. స్పేస్‌లో ఉండే పరిస్థితులను తెర మీద కళ్లకు కట్టినట్టుగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్. గ్రాఫిక్స్ అద్భుతమనే స్థాయిలో లేకపోయినా తమకున్న బడ్జెట్ పరిధిలో మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ప్రశాంత్ విహారి సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : లీడ్ యాక్టర్స్ నటన మ్యూజిక్ సినిమాటోగ్రఫి సెకండ్ హాఫ్ మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్‌లో కొన్ని బోరింగ్ సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
లైఫ్ ఈజీ అవ్వడానికి కారణం అదే
‘తొలిప్రేమ’ షూటింగ్ టైమ్‌లో సంకల్ప్ కలిశాడు. ‘అంతరిక్షం’ సినిమా లైన్ చెప్పక ముందే కొన్ని ఫొటోలు చూపించాడు. ఆ తర్వాత ‘అంతరిక్షం’ నేపథ్యంలో సినిమా అనుకుంటున్నా అని స్టోరీ చెప్పాడు. కొత్తగా ట్రై చేద్దామనుకుంటున్న నేను కథ వినగానే చాలా ఎగై్జట్ అయ్యాను’’ అని వరుణ్ తేజ్ అన్నారు. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా, లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ పంచుకున్న విశేషాలు. ► ‘అంతరిక్షం’ పూర్తి కథ రెడీ చేయడానికి, స్క్రీన్‌ప్లేకి సంకల్ప్ టైమ్ తీసుకున్నాడు. బెంగళూరులోని ఇస్రో మాజీ శాస్త్రవేత్తలను కలిసి వివరాలు సేకరించాడు. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడు లోపల చిన్న భయం ఉండేది. తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా? అని. అయితే ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. తప్పకుండా వారికి నచ్చు తుందనే నమ్మకంతో చేశా. ► ఇదొక వ్యోమగామి కథ. సినిమాలో కథ, ఎమోషన్స్ చాలా బాగున్నా దానికి అంతరిక్షం నేపథ్యం జోడించడం ఇందులో హైలైట్. సెకండ్ హాఫ్ మొత్తం స్పేస్ నేపథ్యంలోనే ఉంటుంది. వాస్తవ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని సంకల్ప్ హీరో పాత్ర సృష్టించాడు. ఇందులో దేవ్ అనే సైంటిస్ట్‌గా కనిపిస్తా. దేశానికి గొప్ప పేరు తీసుకురావాలనే అతని కల ఎలా నెరవేరిందన్నదే కథ. ఈ పాత్ర చేయడానికి నాకెలాంటి రిఫరెన్స్‌లు లేవు. స్పేస్ నేపథ్యంలోని కొన్ని హాలీవుడ్ సినిమాలు చూశా. తమిళ ‘టిక్ టిక్ టిక్’ సినిమా కూడా బాగుంది. ఆ సినిమా దర్శక, నిర్మాతల సూచనలు కూడా తీసుకున్నాం. ► వ్యోమగామి సూట్ వేసుకోవడానికే చాలా టైమ్ పట్టేది. సూట్, హెల్మెట్‌తో పాటు బ్యాక్ ప్యాక్ అన్నీ కలిపి దాదాపు 15 కిలోల బరువు ఉండేవి. ఆ సూట్ వేసుకున్నప్పుడు రెండు మూడు రోజులు ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత అలవాటైపోయింది. ఇప్పటి వరకూ నేను చేయని సరికొత్త పాత్ర ఇది. నటుడిగా నాకు సవాల్‌గా అనిపించింది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది. ► జీరో గ్రావిటీ ఎఫెక్ట్ కోసం వ్యాక్యూమ్ రూమ్స్ రెంట్‌కి తీసుకుని షూటింగ్ చేసుకోవచ్చు. హాలీవుడ్ సినిమాల్లాగా ఒక సర్టెన్ హైట్‌కి వెళ్లి చిత్రీకరించుకోవచ్చు. అలా చేయాలంటే బడ్జెట్ 400 నుండి 500 కోట్లు అవుతుంది. మా సినిమా బడ్జెట్ దాదాపు 25 కోట్లు. మాకున్న బడ్జెట్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్‌తో మంచి ఔట్పుట్ తెచ్చాం. షూటింగ్లో ఎక్కువ రోజులు తాడుతో గాల్లో వేలాడటం కోసం ముందుగానే ప్రాక్టీస్ చేశాం. ► తెలుగులో వస్తున్న మొదటి స్పేస్ థ్రిల్లర్ సినిమా ‘అంతరిక్షం’ కావడంతో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. పోస్టర్లు, ట్రైలర్ చూసి సినిమాకు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. మా సినిమా వారికి మంచి విజువల్ వండర్లా అనిపిస్తుంది. అంతరిక్షం అంటే ఏంటి? ఎలా ఉంటుంది? అని బి,సి తరగతుల ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా మా సినిమా ఉంటుంది. ► ఈ సినిమాలో పరిస్థితులే విలన్. టీమ్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ వాటిని ఎలా ఎదుర్కొన్నారన్నదే కథాంశం. మన లైఫ్ ఇంత ఈజీ అయిందంటే అది స్పేస్ రీసెర్చ్ వల్లే. నేను ప్రయోగాలు చేస్తున్నానని అనుకోవడం లేదు. రొటీన్ సినిమాల్లా కాకుండా సరికొత్త పాయింట్‌తో నా సినిమాలు ఉండాలనుకుంటా. ► సింపుల్‌గా సినిమా చేసేసి డబ్బులు సంపాదిద్దాం అనే ఆలోచన రాజీవ్రెడ్డిగారికి లేదు. వైవిధ్యమైన సినిమాలు చేయాలని ఆలోచిస్తారు. క్రిష్‌గారు కూడా అంతే. ఇందులో లావణ్య త్రిపాఠి టీచర్‌గా కనిపిస్తుంది. సినిమాలో నా పాత్రకి, అదితి పాత్రకి మధ్య లవ్ యాంగిల్ ఏం ఉండదు. ‘ఎఫ్ 2’ సినిమాలో వెంకటేశ్‌గారు, రాజేంద్రప్రసాద్‌గారితో పనిచేయడం వెరీ హ్యాపీ. వాళ్లు సింగిల్ టేక్‌లో సీన్ చేసేసేవారు. నేను ఒక్కోసారి రెండు మూడు టేక్‌లు తీసుకునేవాడిని. నా తర్వాతి సినిమా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఉంటుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్‌గారి తనయుడు అల్లు వెంకటేశ్ నిర్మిస్తారు. ఆ చిత్రం తర్వాత సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తా. హరీష్ శంకర్‌గారు ఓ సినిమా రీమేక్ గురించి చర్చించారు. ఇంకా ఫైనల్ కాలేదు. నా సినిమా కథలన్నీ నాన్నగారు (నాగబాబు) వినరు. చెల్లి నిహారిక నటించిన ‘సూర్యకాంతం’ సినిమా కథ నాకు తెలుసు. ప్రణీత్ యంగ్ డైరెక్టర్. వారిని ప్రోత్సహిద్దామనే ఆ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నా. -
ఆకాశమే హద్దుగా..!
-
‘అంతరిక్షం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
సంకల్ప్ సైజ్‌కి, విజన్‌కి సంబంధం లేదు: రామ్‌చరణ్
‘‘ఏడాదికి ఓ సినిమా చేస్తే చాలా గొప్ప. రెండు చేస్తే అది ఓ అదృష్టం. ఏడాదికి రెండు సినిమాలు చేయాలనే కోరిక మా అందరికీ ఉంటుంది. రెండుసార్లు మీ ముందుకు (ఫ్యాన్స్) రావాలనే ఆనందం సినిమా కన్నా ఎక్కువ సంతోషం ఇస్తుంది. ‘అంతరిక్షం’ లాంటి మంచి సినిమాతో వరుణ్ మీ ముందుకు వస్తున్నాడు’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా, లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ముఖ్య అతిథి రామ్‌చర ణ్ మాట్లాడుతూ– ‘‘వరుణ్ పిలవగానే నేనీ ఫంక్షన్‌కి వచ్చా. ఇది కేవలం తనపై ఉన్న ప్రేమ ఒక్కటే కాదు.. మొన్న ‘అంతరిక్షం’ ట్రైలర్ చూశా. దానిపై ఉన్న అభిమానం, గౌరవం.. ఇంతమంచి ట్రైలర్ ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. ఒక విజనరీతో కూడుకున్న ట్రైలర్. గ్రేట్ టీమ్ చాలా ప్యాషనేట్‌గా తీసిన సినిమాలాగా అనిపించింది. క్రిష్‌గారి ‘కంచె’ సినిమా ఫంక్షన్‌కి నేను వచ్చా. ఆ తర్వాత ఆ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా. మళ్లీ రాజీవ్‌గారు, క్రిష్‌గారు తీసిన ఈ సినిమా ఫంక్షన్‌కి రావడం అదృష్టంగా భావిస్తున్నా. తెలుగు నిర్మాతలుగా ధైర్యంగా మీరు ఇలాంటి సినిమా తీసినందుకు చాలా గర్వపడతున్నా. సంకల్ప్ సైజ్‌కి, విజన్‌కి సంబంధం లేదు. మనిషికన్నా గొప్పది వాళ్ల ఆలోచన. అలాంటి గ్రేట్ ఆలోచన ఉన్న వ్యక్తి ఎప్పటికీ దిగజారడు.. ఉన్నత స్థాయిలో ఉంటాడు. అది సినిమా ఇండస్ట్రీ అయినా, రాజకీయాలైనా. గ్రేట్ ఆలోచనలు ఉన్న మన డైరెక్టర్స్‌లో రాజమౌళిగారు, సుకుమార్‌గారు, క్రిష్‌గారు కావొచ్చు.. వీరికన్నా గొప్ప స్థాయికి సంకల్ప్ రావాలని కోరుతున్నా. వరుణ్ ఎప్పుడూ మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూనే వచ్చాడు. తన ఓ సినిమా చూసి ఆనందపడ్డా.. మరికొన్ని చూసి అసూయపడ్డా.. ‘అంతరిక్షం’ ట్రైలర్ చూసి జెలసీ ఫీలయ్యా. చాలా అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు మన వద్దకు రావు. మన డెడికేషన్, ఆలోచన తీరే మనకిష్టమైన 10 సినిమాలని కానీ, 10 మంది వ్యక్తులను కానీ దగ్గరకి చేరుస్తుంది. పాజిటివ్ ఆటిట్యూడ్, ఆలోచన ఉన్న వ్యక్తికి దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడని నేను నమ్ముతున్నా. వరుణ్ ఇకపైనా మంచి సినిమాలు చేస్తాడనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఘాజీ, అంతరిక్షం’ సినిమాలు గమనిస్తే తెలుగు సినిమాలను సంకల్ప్ కొత్త గమనంలోకి తీసుకెళ్తున్నాడని అర్థం అవుతోంది. క్రిష్–రాజీవ్ ఇద్దరూ కృష్ణార్జునులు. ఫ్రెష్ సినిమాలను ప్రేక్షకులకు అందించాలన్న సంకల్పానికి అభినందనలు’’ అని పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అన్నారు. చిత్ర సమర్పకుడు, డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ– ‘‘సంకల్ప్‌ని చూసి ఓ తెలుగు సినిమా దర్శకునిగా గర్వపడుతున్నా. తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్న నీ తోటి దర్శకునిగా నేనుండటం చాలా గర్వంగా ఉంది. ఒక తెలుగు దర్శకునిగా ఎంత గర్వంగా ఫీలవుతున్నానో ‘అంతరిక్షం’ వంటి సినిమాలో భాగస్వామ్యం అయినందుకు నిర్మాతగా కూడా గర్వపడుతున్నా. సినిమా చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులు కూడా చాలా గర్వంగా ఫీలవుతారు. మన తెలుగువాళ్ల సినిమా అని గర్వంగా చెప్పుకునే మరో సినిమా అవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత రాత్రి 10గంటలకి వరుణ్‌కి ఫోన్ చేశా. వెంటనే కలుసుకుని ఓ అరగంట మాట్లాడుకున్నాం. చరణ్ కూడా ‘రంగస్థలం’ వంటి చక్కటి కథ ఎంచుకున్నాడు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మీతోటి ఇంకా చాలా చాలా సినిమాలు తీయాలని కథలు రాసుకునేవారికి, డైరెక్టర్స్‌కి అనిపిస్తుంది. బ్రిలియంట్ యాక్టింగ్.. గ్రేట్ డైరెక్షన్.. సూపర్బ్ సినిమాటోగ్రఫీ... తెలుగు ప్రేక్షకులు, టెక్నీషియన్స్ అంతా గర్వంగా చెప్పుకునే సినిమా ‘అంతరిక్షం’ అవుతుంది’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘అంతరిక్షం’ కథ విన్నాక నేను నిజంగా మోటివేట్ అయ్యా.. కొత్త రకం సినిమా చేద్దామని. ప్రతి ఏడాది ప్రతి వారం మన వద్దకు చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ, ‘అంతరిక్షం’ లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. తొలి సినిమా ‘ఘాజీ’తోనే సంకల్ప్ జాతీయ అవార్డు కొట్టాడు. రెండో సినిమాని కూడా అద్భుతమైన పాయింట్‌తో చక్కగా తీశాడు. తర్వాతి సినిమా అయినా నేలపై నిలబడి తీస్తావని కోరుకుంటున్నా (నవ్వుతూ). ఇలాంటి సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? అనే డౌట్ ఉండేది. చరణ్ అన్న వద్దకు వెళ్లి డిస్కస్ చేస్తే నువ్వు నమ్ముకున్న కథ, డైరెక్టర్ కరెక్ట్.. ఇలాంటి సినిమా చేస్తే బావుంటుందని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్. ఈ సినిమా చూసిన తర్వాత నేనొక భారతీయుడు.. నేనొక తెలుగువాణ్ణి అని మీరందరూ గర్వపడతారు’’ అన్నారు. సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నేను డైరెక్ట్ చేసిన సినిమా గురించి నేను మాట్లాడితే బాగుండదు. సినిమా విడుదల తర్వాత మీరు చూసి మాట్లాడితే బాగుంటుంది. ఈ సినిమా మీకు ఎంత తొందరగా చూపించాలా అనే ఆత్రుతగా ఉంది. వీలైతే ఇక్కడే చూపించాలనేంత ఎగై్జట్‌మెంట్‌గా ఉన్నా’’ అన్నారు. కెమెరామేన్ జ్ఞానశేఖర్, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి, లావణ్యా త్రిపాఠి, అదితీరావ్ హైదరీ, పాటల రచయిత అనంత్ శ్రీరామ్, నటులు సత్యదేవ్, రాజ తదితరులు పాల్గొన్నారు. -
లిప్‌స్టిక్ వేసుకుంటేనే హీరోయిన్ కాదు!
‘‘సినిమాలో పాత్ర చిన్నదా, పెద్దదా అనే తేడా చూడను. ‘కెరీర్ స్టార్టింగ్‌లో మీరు చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు లీడ్ రోల్స్ చేస్తున్నారు’ అని కొందరు అంటున్నారు. హాలీవుడ్ సినిమాలో అది చాలా కామన్. చిన్నా, పెద్దా అనే ట్యాగ్ కాదు.. ట్యాలెంట్ ముఖ్యం. ఏ పాత్ర చేసినా ప్రేక్షకులకు గుర్తిండిపోయేలా, తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లేలా ఉండాలి. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో భాగమవ్వాలని భావిస్తుంటాను’’ అని అదితీ రావ్ హైదరీ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా అదితీ రావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన స్పేస్ మూవీ ‘అంతరిక్షం 9000కేయంపీహెచ్’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై క్రిష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మించారు. ఈ నెల 21న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా అదితీ రావ్ హైదరీ పంచుకున్న విశేషాలు. ► ‘అంతరిక్షం’ సినిమాలో రియా అనే వ్యోమగామి (ఆస్ట్రోనాట్) పాత్ర పోషించాను. ఈ పాత్రకు సంబంధించి శిక్షణ కోసం చాలా కష్టపడ్డాం. శిక్షణలో భాగంగా పిల్లిమొగ్గలేయడం (ముందుకు,వెనక్కి) గాల్లో స్విమ్ చేయడం నేర్చుకున్నాను. శిక్షణ తీసుకునేప్పుడు ‘నవాబ్’ సినిమా షూటింగ్ కూడా జరిగేది. పొద్దునే ప్రాక్టీస్, సాయంత్రం చెన్నె వెళ్ళి షూటింగ్ చేసేదాన్ని. చిన్నప్పుడు మా స్కూల్‌కి ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ వచ్చి, తన అనుభవాలు షేర్ చేసుకునేవారు. ఈ సినిమా చేస్తుంటే అవన్నీ గుర్తొచ్చాయి. ► సినిమాలో వ్యోమగామి (ఆస్టోనాట్) అవుదాం అని స్పేస్ సెంటర్లో ఇన్‌టర్న్‌గా జాయిన్ అవుతాను. ఆ తర్వాత ఆస్ట్రోనాట్‌గా ట్రెయిన్ అవుతాను. సినిమాలో పాత్రల గురించి పూర్తిగా చెప్పేయడానికి ఇష్టపడను. ఎందుకంటే.. ఇదివరకు ప్రేక్షకులకు సినిమా గురించి ఎక్కువగా తెలిసేది కాదు. సినిమాలో అన్నీ ఆశ్చర్యంగా తోచేవి. ఇప్పుడు అన్నీ ముందే తెలుస్తుంటే ‘సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్’ తగ్గుతుందని నా ఫీలింగ్. ► జీరో గ్రావిటీ సన్నివేశాలన్నీ కూడా తాళ్లతో కట్టేసుకుని షూట్ చేశాం. నేను, వరుణ్, సత్యదేవ్, రాజా నలుగురం స్పేస్ సీన్స్‌లో ఎక్కువగా పాల్గొన్నది. వాళ్లందరిలో నేనే చాలా తక్కువ వెయిట్. నాలా తక్కువ బరువుంటే ఏ ఇబ్బందీ ఉండదు అని వాళ్లతో అనేదాన్ని (నవ్వుతూ). నాకైతే నా హెల్మెట్ చాలా బరువుగా ఉండేది. అది ధరించేప్పుడు చాలా నొప్పిగా ఉండేది. ఒకసారి హెల్మెట్ పెట్టుకుంటే మెడ దగ్గర ‘టక్’మని సౌండ్ వినిపించింది. గాయమైంది. డాక్టర్ సుమారు 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. నా కోసం టీమ్ అన్ని రోజులు ఎదురుచూడటం కరెక్ట్ కాదనుకున్నాను. సీరియస్‌గా ఫిజియోథెరపీ చేయించుకుని రోజుకు 4 పెయిన్ కిల్లర్స్ తీసుకొని జస్ట్ 2 రోజుల్లో షూటింగ్లో జాయినయ్యా. ► సంకల్ప్ రెడ్డి స్క్రిప్ట్ చెపినప్పుడు బాగా నచ్చింది. ఈ సినిమా చేయాలంటే ముంబై, హైదరాబాద్ వస్తూ పోతుండాలి. అది ప్రొడక్షన్‌కు ఇబ్బంది అన్నాను. ఆ తర్వాత ‘సమ్మోహనం’ చేస్తున్న సమయంలో పూర్తి కథ రెడీ అన్నారు. ఇప్పటి వరకూ అంతరిక్షానికి వెళ్లిన మహిళా ఆస్ట్రోనాట్స్ మన దేశానికి చెందిన వారే. అప్పుడే ఈ పాత్ర చేయాలనుకున్నాను. ► ఇందులో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెబుదాం అనుకున్నాను. కానీ మా టీమ్ వేరే వాళ్లతో డబ్ చేయించేశారు. వరుణ్ తేజ్ ప్రాజెక్ట్స్ ఎంపిక బావుంది. లావణ్యతో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. వరుణ్ తేజ్‌కి సంబంధించిన లవ్‌స్టోరీలో ఆమె ఉంటారు. ► నా దృష్టిలో యాక్టర్స్ అనేవాళ్లు చిన్నపిల్లలు. కెమెరా ఆన్ అయితే చాలా ఆనందం వచ్చేస్తుంది. వేరే ప్రపంచంలోకి వెళ్లిపోతాం. చిన్నపిల్లల్ని ప్లే గ్రౌండ్లో వదిలిపెట్టినట్లే. ఎంతసేపు అక్కడున్నా అలసిపోరు. మేం కూడా అంతే. కెమెరా ముందు నుంచి బయటకు రాగానే అలసిపోతాం. ► నాకు నటించడం రాదు. ఆ టైమ్‌లో ఆ సందర్భానుసారం ఫీల్ అవ్వడమే వచ్చు. డ్యాన్స్ మాత్రమే నేర్చుకున్నాను. యాక్టింగ్‌కు సంబంధించిన రూల్స్ కూడా నాకు తెలియవు. నటనకు సంబంధించిన ప్రాసెస్ వివరించడం కష్టం అనుకుంటున్నాను. ► మన సేఫ్టీని మనమే క్రియేట్ చేసుకోవాలి. అది ఏ ఇండస్ట్రీ అయినా సరే. నా అదృష్టమేంటంటే 99 శాతం చాలా మంచి మనుషులతో వర్క్ చేశాను. ‘సమ్మోనం’ తర్వాత మళ్లీ గ్లామర్ పాత్ర ఎందుకు చేయలేదని కొందరు అడిగారు. నా దృష్టిలో ఆస్ట్రోనాట్‌ని మించిన హీరోయిన్ లేదు. దేశం కోసం అంత దూరం ప్రయాణించడం గ్రేట్. వాళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలి. లిప్‌స్టిక్ వేసుకుంటేనే హీరోయిన్ కాదు. కేవలం అందమైన ముఖం ఉంటే కొన్ని రోజుల్లో బోర్ కొట్టేయొచ్చు. టాలెంట్‌కి ప్రాధాన్యం ఇచ్చి కొత్త కొత్త పాత్రలు చేస్తూ ఉంటే చాలా ఏళ్లు కొనసాగొచ్చు. మన యాటిట్యూడ్, వర్క్ మనల్ని హీరోయిన్ని చేస్తుంది. ► నెక్ట్స్ ధనుశ్‌తో ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. ధనుశ్ నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్నారు. నాగార్జునగారు కూడా ఉన్నారు ఆ సినిమాలో. తమిళంలో దర్శకుడు మిస్కిన్‌తో ‘సైకో’ అనే సినిమా చేస్తున్నాను. -
అంతరిక్షానికి చిట్టిబాబు
స్టార్ హీరోలు తోటి హీరోల ఈవెంట్లలో పాల్గొనడం ఇటీవల ఓ ట్రెండ్‌గా మారింది. పరిశ్రమలో హీరోల మధ్య, వారి అభిమానుల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉందనడానికి ఆడియో ఆవిష్కరణ వేడుకలు, ప్రీ రిలీజ్, సినిమా సక్సెస్మీట్లు వేదికలుగా మారుతున్నాయి. తాజాగా తమ్ముడు వరుణ్ తేజ్ సినిమా ఫంక్షన్‌కు అన్న రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం అంతరిక్షం 9000 kmph. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుంది. డిసెంబర్ 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షం 9000 kmph సినిమాను తెరకెక్కించారు సంకల్ప్ రెడ్డి. తాజాగా విడుదలైన ఆడియో.. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. జ్ఞాన శేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ లో క్రిష్ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
అతిథులండోయ్!
ముందు అల్లు అర్జున్, తర్వాతి రోజు రామ్‌చరణ్ మనకు అతిథులుగా కనిపించబోతున్నారు. ఏదైనా సినిమాలో గెస్ట్ రోల్స్ చేశారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. రెండు వేరు వేరు ఫంక్షన్స్‌కి ఈ ఇద్దరూ అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఈ ఆదివారం జరగనునున్న శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కి అల్లు అర్జున్ అతిథి. ఆ మర్నాడు జరగనున్న వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కి రామ్‌చరణ్ అతిథి. శర్వానంద్, సాయిపల్లవి జంటగా ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన స్పేస్ చిత్రం ‘అంతరిక్షం’ 9000 కెయమ్పిహెచ్. ‘ఘాజీ’ చిత్రంతో మంచి పేరును సొంతం చేసుకున్న దర్శకుడు సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాల వేడుకలకు అల్లు అర్జున్, రామ్‌చరణ్ అతిథులుగా రావడం హీరోల మధ్య ఉన్న ఫ్రెండ్లీ వాతావరణానికి ఓ నిదర్శనం. అన్నట్లు... ఈ రెండు చిత్రాలూ ఈ నెల 21న విడుదల కానున్నాయి. -
‘అంతరిక్షం’కు క్లీన్ ‘యు’
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తొలి తెలుగు స్పేస్ చిత్రం అంతరిక్షం. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ వ్యోమగామిగా నటిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అంతరిక్షం సినిమా క్లీన్ యు సర్టిఫికేట్ సాదించింది. వరుణ్ సరసన అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, క్రిష్(దర్శకుడు) సంయుక్తంగా నిర్మించారు. -
అంతరిక్షం 2 చేయాలనుంది
‘‘ఘాజీ రిలీజైన మూడు నెలల తర్వాత స్పేస్‌కు సంబంధించిన ఆర్టికల్ చదువుతుంటే ‘అంతరిక్షం’ చిత్రం తీయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆర్టికలేంటో చెబితే సినిమా కథ తెలిసిపోతుంది, ప్రస్తుతానికైతే చెప్పను (నవ్వుతూ). ‘గ్రావిటీ, ఇంటర్స్టెల్లార్’, తమిళంలో వచ్చిన ‘టిక్ టిక్ టిక్’ లాంటి ఏ సినిమాకు మా చిత్రం సంబంధం లేదు. కొత్తగా ఉంటుంది’’ అని దర్శకుడు సంకల్ప్ రెడ్డి అన్నారు. వరుణ్‌తేజ్ హీరోగా సంకల్ప్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అంతరిక్షం’. అదితీరావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై క్రిష్, జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌రెడ్డి నిర్మించారు. యు సర్టిఫికెట్తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి పంచుకున్న విశేషాలు... ► వైజాగ్‌లో మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఎలా ‘ఘాజీ’ సినిమా తీయాలనే ఆలోచన వచ్చిందో.. ఏదో స్పేస్ ఆర్టికల్ చదువుతుంటే ఈ సినిమా చేయాలనిపించింది. ఇప్పటి వరకూ వచ్చిన స్పేస్ సినిమాలతోపోలుస్తారని తెలుసు. కానీ వాటి నుంచి ఇన్స్పెర్ అవ్వలేదు. ► నా ఫస్ట్, సెకండ్ రెండు సినిమాలు ఏదో ఓ ఈవెంట్ రిలేటెడ్ ఐడియాలే ఉన్నాయి. ఫ్యూచర్లో ఎప్పుడైనా కొత్త ఐడియాలు రాకపోతే ఫార్ములా సినిమాలే తీస్తానేమో. ఇప్పుడే కాదు ఫ్యూచర్లో. ► ‘ఘాజీ’ చిత్రానికి నేషనల్ అవార్డ్ ఈ ఏడాది మే 1న వచ్చింది. తర్వాతి రోజే సినిమాను స్టార్ట్ చేశాం. 1500 సీజీ షార్ట్స్ ఉన్నాయి. అయినా కూడా 70 రోజులు షూటింగ్ పూర్తి చేశాం. అందులో30 రోజులు జీరో గ్రావిటీ సీన్స్ చిత్రీకరించాం. సినిమా షూట్ చేయడానికి సమయం ఎక్కువ తీసుకోలేదు. ► సినిమాకు సంబంధించి బాగానే రీసెర్చ్ చేశాను. నెట్లోనే మనకు కావల్సిన కంటెంట్ ఉంది. యుట్యూబ్లోనూ చాలా మ్యాటర్ ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలతో మాట్లాడాను. ► స్పేస్‌లో ఉన్నది ఉన్నటుగా తీస్తే డాక్యుమెంటరీ అవుతుంది. వీలైనంత ల్యాజిక్ ఉండేలా చూసుకున్నాం. ఒక్కసారి ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అయితే లాజిక్ పట్టించుకోడు. బోర్ కొట్టిస్తున్నాం అంటే లాజిక్స్ వెతికే పనిలో పడతారు. ► దేవ్ అనే పాత్రకు వరుణ్ తేజ్ అయితేనే బావుంటుంది అనిపించింది. కథేంటో అని క్లుప్తంగా చెప్పాను. తర్వాత నాలుగు నెలల్లో కథ పూర్తి చేశా. ► ఘాజీలో లవ్‌స్టోరీ ఉండదు. కానీ ఇందులో ప్రేమతో పాటు దేశభక్తి లవ్‌స్టోరీ అన్నీ ఉంటాయి. ► స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న సమయంలో, ప్రీ–ప్రొడక్షన్ చేస్తున్న సమయంలో క్రిష్‌గారు సహాయం చేశారు. నిర్మాతల సహకారం కూడా బావుంది. షూటింగ్లో నాకు పెద్ద చాలెంజ్‌లు ఎదురవ్వలేదు కానీ, యాక్టర్స్ మాత్రం చాలెంజెస్ ఫేస్ చేశారు. ‘రంగస్థలం’లో ఆర్ట్‌వర్క్ చూసి రామకృష్ణ, మోనికాలను ఎంపిక చేసుకున్నాను. ► బాలీవుడ్లో రెండు ఆఫర్స్ ఉన్నాయి. టిని పూర్తి చేయాలి. టాలీవుడ్‌కు టెంపరరీగా బ్రేక్ తీసుకుంటున్నాను. నిర్మాతలకు కథ కూడా చెప్పాను. అక్కడికి వెళ్తే 2 ఏళ్ల సమయం కేటాయించాలి. మరీ ఆలస్యం అయితే ఇక్కడే సినిమాలు చేస్తాను. ‘అంతరిక్షం 2’ కూడా చేయాలనుంది. -
అద్భుతం అనే పదం ఈ సినిమాకు కరెక్ట్
‘‘క్రిష్, రాజీవ్ అద్భుతాలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ‘ప్రయత్నించి విఫలం అయినా ఫర్వాలేదు. ప్రయత్నించకుండా ఉండకూడదు’ అని ట్రైలర్లో ఉన్న డైలాగ్ చాలా బాగా నచ్చింది. కొత్త ఆలోచనలు, సాంకేతికంగా కొత్త సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. వరుణ్‌తేజ్, అదితీరావ్, లావణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్లుగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అంతరిక్షం’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దర్శకుడు క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘మా కుటుంబంలో వరుణ్ తేజ్ డైమండ్. వరుసగా సినిమాలు చేసేయాలి, డబ్బు సంపాదించాలి అనుకోకుండా ఆగి.. ఆలోచించి మంచి సినిమాలు చేస్తున్నాడు. ‘సమ్మోహనం’లో అదితీ నటనను చాలా ఎంజాయ్ చేశాను’’ అన్నారు. ‘‘అద్భుతం అనే పదం చాలా తక్కువసార్లు నప్పుతుంది. ఈ సినిమాకు ఆ పదం సరిగ్గా సరిపోతుంది. సంకల్ప్ ఫస్ట్ సినిమాతో నీళ్లలోకి వెళ్లిపోయాడు. నెక్ట్ ఏంటా? అనుకున్నాను. అంతరిక్షానికి వెళ్లిపోయాడు. వరుణ్ ట్రై చేస్తే అంతరిక్షం అందుతుంది (వరుణ్ ఎత్తుని ఉద్దేశిస్తూ). సంకల్ప్ క్రమశిక్షణ చూస్తే ఆశ్చర్యం వేసింది. క్రిష్, నేను, సంకల్ప్ దగ్గర అసిస్టెంట్‌గా చేస్తాం (నవ్వుతూ). సంకల్ప్.. ‘బాహుబలి’ లాంటి సినిమాలు కూడా చేయాలి. చేయగలడు. ‘వరుణ్ స్క్రిప్ట్‌ని ఎంచుకునే తీరు బావుంటుంది’ అని రామ్‌చరణ్ నాతో అన్నాడు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు సుకుమార్. ‘‘దర్శకులు ఎన్ని కథలైనా రాసుకోవచ్చు. కానీ హీరో ఓకే అన్నాకే సినిమా మొదలవుతుంది. కథను నమ్మిన వరుణ్‌కు థ్యాంక్స్. ఈ విజయంలో అగ్రతాంబూలం అతనికే ఇస్తాను. ఇలాంటి సినిమాతో నేనూ అసోసియేట్ అవ్వడం గర్వంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని ఈ సినిమా కూడా ఒక అడుగు ముందుకు తీసుకెళ్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు క్రిష్. ‘‘సినిమా చాలా కష్టపడి చేశాం. చాలా నమ్మకంగా కూడా ఉన్నాం. ఈ సినిమా మీ అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘ఇలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలో భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన టీమ్‌కు కృతజ్ఞతలు’’ అన్నారు లావణ్య. ‘‘రెండో సినిమాతో మళ్లీ మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్’’ అన్నారు అదితీరావ్. ‘‘ఇలాంటి సినిమా ఎప్పుడో ఒకసారి వస్తుంది. ‘ఘాజీ’ కంటే రెండింతల నమ్మకంగా ఉన్నాను. ప్రేక్షకులు ఓ కొత్త అనుభూతికి లోనవుతారని నమ్ముతున్నాను. ’’ అన్నారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సత్యదేవ్, రాజా, కిట్టు విస్సాప్రగడ, ఆర్ట్ డైరెక్టర్ మోనికా, రామకృష్ణ, సహ నిర్మాత బిబో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘అంతరిక్షం 9000 KMPH’ ట్రైలర్ లాంచ్
-
‘గెలవాలంటే ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి’
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో వ్యోమగామిగా నటిస్తున్నాడు. ‘అంతరిక్షం 9000 KMPH’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది డిసెంబర్ 21న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా టైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మిరా అనే శాటిలైట్ దారి తప్పటంతో ప్రపంచంలోని కంమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు అంతరిక్షంలో ఆఫీసర్ దేవ్ చేసిన సాహసమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. తెలుగులో తొలి స్పేస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆస్ట్రోనాట్‌గా కనిపించేందుకు వరుణ్ తేజ్ ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. స్పేస్ షటిల్‌తో పాటు ఓ ఉపగ్రహం, ఇస్రో వాతావరణాన్ని ప్రత్యేకంగా సెట్ వేశారు. వరుణ్ సరసన అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, క్రిష్(దర్శకుడు) సంయుక్తంగా నిర్మించారు. -
మహేష్ థియేటర్లో ‘అంతరిక్షం’ ఈవెంట్
సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్‌లో ఏఎంబీ పేరుతో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రారంభమైన థియేటర్లలో సినిమా ప్రదర్శనతో పాటు సినిమా ఈవెంట్లను కూడా నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌లో తొలి ఈవెంట్ నిర్వహించుకోబోతున్న సినిమా అంతరిక్షం. ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న అంతరిక్షం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఏఎంబీ సినిమాస్‌లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 9 ఉదయం 11 గంటలకు చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినిమా ప్రముఖల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. దర్శకుడు నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, అదితిరావ్ హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
ఎంతో దూరంలో లేదు
అంతరిక్షాన్ని చేరుకోవడానికి తాను చేసిన ప్రయత్నాన్ని విజువల్‌గా చూపించడానికి రెడీ అయ్యారు హీరో వరుణ్ తేజ్. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్, అదితీరావు హైదరీ, లావణ్యాత్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పిహెచ్’. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 9న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో వరుణ్‌తేజ్, అదితీ ఆస్ట్రోనాట్స్‌గా కనిపించనున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ వేడుక ఏఎమ్బి మల్టీఫ్లెక్స్‌లో జరిపేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పుడు ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందించారు. రాధాకృష్ణ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదల ఎంతో దూరంలో లేదు... ఈ నెల 21న విడుదల కానుంది. -
మెగా హీరో గ్యాప్‌లేకుండా వస్తున్నాడే!
మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తైతే.. ఆ స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడం ఒక సవాల్. అలా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఫిదా, తొలిప్రేమతో కూల్ హిట్స్ కొట్టిన వరుణ్.. తాజాగా ‘అంతరిక్షం’, ‘ఎఫ్2’లతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. సబ్ మెరైన్ కాన్సెప్ట్‌తో ‘ఘాజీ’ తెరకెక్కించిన సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వరుణ్ నటించిన ‘అంతరిక్షం’ డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో వరుణ్‌కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ అయిన తరువాత తక్కువ గ్యాప్‌లోనే ‘ఎఫ్2’ చిత్రం కూడా విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఒకటి సైన్స్ ఫిక్షన్ కాగా, రెండోది మాస్ ఎంటర్టైనర్ కాబట్టి రెండింటికి విజయావకాశాలు ఎక్కువే. సో.. ఈ మెగా హీరో బ్యాక్‌టుబ్యాక్ హిట్స్ కొట్టబోతున్నాడని అభిమానులు సంబరపడిపోతున్నారు. -
డబ్బింగ్ షురూ
జనరల్‌గా ఆస్ట్రోనాట్ అంటే రాకెట్ లాంచింగ్ స్టేషన్లో బిజీ బిజీగా ఉంటారు. కానీ టాలీవుడ్ ఆస్ట్రోనాట్ వరుణ్ తేజ్ చెన్నై, హైదరాబాద్‌లోని స్కూల్స్‌కి వెళ్లొచ్చారు మరి.. స్టూడెంట్స్‌కు రాకెట్ గురించి ఏమైనా పాఠాలు చెప్పారా? లేక చిన్ననాటి జ్ఞాపకాలను వెతుక్కుంటూ వెళ్లారా? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’. లావాణ్యా త్రిపాఠి, అదితీరావ్ హైదరీ కథానాయికలుగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు వరుణ్ తేజ్. ‘‘ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు ప్రశాంత్ విహారి స్వరకర్త. క్రిష్ సమర్పణలో సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. -
అంతరిక్షంలో ఏం జరిగింది?
‘ఫిదా, తొలిప్రేమ’ వంటి హిట్ చిత్రాల తర్వాత వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ కథానాయికలు. తొలి చిత్రం ‘ఘాజీ’తో జాతీయ అవార్డు అందుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని దసరా సందర్భంగా విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నారు. ఈ టీజర్‌లోని సన్నివేశాలు సినిమాపై ఉత్కంఠ పెంచేస్తున్నాయి. అంతరిక్షంలో ఏం జరిగిందన్నది తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయాలనుకుంటున్నారు. -
అంచనాలను పెంచేస్తున్న అంతరిక్షం టీజర్
మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే పలు చిత్రాలలో విలక్షణ నటనతో ఆకట్టుకున్న వరుణ్, ఈ ట్రైలర్‌తో మరింత ఆకర్షిస్తున్నారు. హై టెక్నికల్ వాల్యూస్, హాలీవుడ్ నిపుణుల సారధ్యంలో యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ మేళవింపుతో వస్తున్న ఈ సినిమా వరుణ్ కరియర్లో మరో కీలక చిత్రంగా మారనుంది. వరుణ్ తేజ్, అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న చిత్రం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది. మొదటి సినిమా ‘ఘాజి’(ఫస్ట్ సబ్‌మెరైన్ ఫిలిం) తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందించగా, డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంది. తెలుగులో పూర్తిస్థాయి ‘అంతరిక్షం’ నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట చిత్ర నిర్మాతలు. &rel=0 -
ప్రయాణం ముగిసింది
అంతరిక్షానికి ప్రయాణం చేసిన వరుణ్ తేజ్ ఆ జర్నీని ముగించేశారు. ఆ జర్నీని ప్రేక్షకులకు చూపించడమే ఆలస్యం అంటున్నారు. వరుణ్ తేజ్ హీరోగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కేయంపీహెచ్’. అదితీరావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించారు. తొలి స్పేస్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ సోమవారంతో పూర్తయింది. ‘‘అంతరిక్షం’ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశాం. ఈ సినిమా షూటింగ్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్’’ అని వరుణ్ తేజ్ పేర్కొన్నారు. డిసెంబర్ 21న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి. -
‘అంతరిక్షం’లో పిల్లలతో మెగాహీరో
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో హిట్లు కొట్టాడు మెగాహీరో వరుణ్ తేజ్. తన మొదటి సినిమాతోనే విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తన మొదటి సినిమాను సబ్ మెరైన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి.. వరుణ్ తేజ్‌తో కలసి స్పేస్ కాన్సెప్ట్‌తో ‘అంతరిక్షం’ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. వరుణ్ ఫస్ట్‌లుక్, టైటిల్ ప్రకటించినప్పటినుంచీ ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా లావణ్య త్రిపాఠి, అదితీ రావు హైదరీ నటిస్తున్నారు. శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రషూటింగ్కు సంబంధించిన ఫోటోను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయా గ్రాహకుడు. ఈ డిసెంబర్ 21న సినిమాను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. Our @IAmVarunTej & @Itslavanya on the sets of #Antariksham9000Kmph #అంతరిక్షం9000kmph#AntarikshamOnDec21st pic.twitter.com/dU9Pnq6Fts — First Frame Entertainments (@FirstFrame_Ent) September 24, 2018