అతిథులండోయ్‌! | ram charan allu arjun chief guests in padi padi leche manasu, antariksham pre release | Sakshi
Sakshi News home page

అతిథులండోయ్‌!

Published Sun, Dec 16 2018 1:47 AM | Last Updated on Sun, Dec 16 2018 1:47 AM

ram charan allu arjun chief guests in padi padi leche manasu, antariksham pre release - Sakshi

అల్లు అర్జున్, రామ్‌చరణ్‌

ముందు అల్లు అర్జున్, తర్వాతి రోజు రామ్‌చరణ్‌ మనకు అతిథులుగా కనిపించబోతున్నారు. ఏదైనా సినిమాలో గెస్ట్‌ రోల్స్‌ చేశారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. రెండు వేరు వేరు ఫంక్షన్స్‌కి ఈ ఇద్దరూ అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఈ ఆదివారం జరగనునున్న శర్వానంద్‌ ‘పడి పడి లేచె మనసు’ ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌కి అల్లు అర్జున్‌ అతిథి. ఆ మర్నాడు జరగనున్న వరుణ్‌ తేజ్‌ ‘అంతరిక్షం’ ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌కి రామ్‌చరణ్‌ అతిథి.

శర్వానంద్, సాయిపల్లవి జంటగా ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన స్పేస్‌ చిత్రం ‘అంతరిక్షం’ 9000 కెయమ్‌పిహెచ్‌. ‘ఘాజీ’ చిత్రంతో మంచి పేరును సొంతం చేసుకున్న దర్శకుడు సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాల వేడుకలకు అల్లు అర్జున్, రామ్‌చరణ్‌ అతిథులుగా రావడం హీరోల మధ్య ఉన్న ఫ్రెండ్లీ వాతావరణానికి ఓ నిదర్శనం. అన్నట్లు... ఈ రెండు చిత్రాలూ ఈ నెల 21న విడుదల కానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement