Padi Padi Leche Manasu
-
అందుకు ఓకే...కానీ
తమిళసినిమా: అందుకు సిద్ధమైతే కండిషన్స్ అప్లై అంటోంది నటి సాయిపల్లవి. ప్రేమమ్ చిత్రంతో మలయాళంలో కథానాయకిగా పరిచయమైన ఈ తమిళ అమ్మాయి కోలీవుడ్‌కు మాత్రం కొంచెం ఆలస్యంగానే ఎంట్రీ ఇచ్చింది. డాక్టరు కాబోయి యాక్టర్ అయిన ఈ సహజ నటి మలయాళం తరువాత తెలుగులో పరిచయమై అక్కడి ప్రేక్షకులను ‘ఫిదా’ చేసి సక్సెస్ఫుల్ కథానాయకిగా పేరు తెచ్చుకుంది. ఆ సమయంలోనే కోలీవుడ్‌లో పలు అవకాశాలు వచ్చినా నిరాకరిస్తూ వచ్చిన సాయిపల్లవి ఎట్టకేలకు విజయ్ దర్శకత్వంలో దయా చిత్రంతో పరిచయమైంది. అయితే ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఆ తరువాత ధనుష్‌తో మారి–2 చిత్రంలో జత కట్టింది. ఆ చిత్రం కూడా సోసో అనిపించుకున్నా, అందులో రౌడీ బేడీ పాట వీర లెవల్లో హిట్ అయిపోయ్యింది. ప్రభుదేవా నృత్యరీతులను సమకూర్చిన ఈ పాటకు ధనుష్‌తో పాటు సాయిపల్లవి డాన్స్‌లో ఇరగదీసింది. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో అత్యధిక లైక్‌లు పొందుతూ ప్రపంచస్థాయితో దుమ్మురేపుతోంది. ఆలా పాపులర్ అయిన సాయిపల్లవి కొత్త చిత్రాలను అంగీకరించడంలో మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. ప్రస్తుతం తమిళంలో సూర్యతో జత కట్టిన ఎన్జీకే చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. అదీ చిత్రీకరణను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇక మలయాళంలో పాహద్ పాజిత్ సరసన ఒక చిత్రం, తెలుగులో రానాతో ఒక చిత్రం చేస్తోంది. అయితే పారితోషికం విషయంలో ఈ అమ్మడు చాలా లిబరల్గా వ్యవహరిస్తోంది. ఆ మధ్య తెలుగు చిత్రం పడిపడి లేచే మనసు విజయానికి దూరం అయితే ఈ అమ్మడు ఆ చిత్ర నిర్మాత ఇవ్వాల్సిన రూ.40 లక్షలు వదిలేసిందట. ఇకపోతే తాజాగా ఒక నిర్ణయం తీసుకుందట. తనకు పారితోషికం ముఖ్యం కాదని, దాన్ని ఇంకా తగ్గించడానికి సిద్ధమేనని అంటోందట. అయితే ఒక కండిషన్ అని కథ చాలా బలంగా ఉండాలని అప్పుడే పారితోషికం తగ్గించి నటించడానికి సిద్ధమని సాయిపల్లవి అంటోందట. ఇది మంచి కథా చిత్రాల దర్శక నిర్మాతలకు ఆమె ఇచ్చే మంచి ఆఫర్‌నే అవుతుంది. -
సహజీవనం చేయాలనుకోవడం లేదు!
‘‘స్టార్ హీరోయిన్.. స్టార్డమ్..నటనలో హీరోలని డామినేట్ చేస్తున్నారు...వంటి వాటి గురించి నేను ఆలోచించను. ప్రేక్షకులకు అలా అనిపిస్తుందేమో? నా వరకూ నా పాత్రకి 100శాతం న్యాయం చేయాలని మాత్రమే ఆలోచిస్తా’’ అని సాయిపల్లవి అన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సాయిపల్లవి పంచుకున్న విశేషాలు... ► ‘ప్రేమమ్, ఫిదా, పడిపడి లేచె మనసు’ చిత్రాల్లో ప్రేమించడం.. విడిపోవడం.. మళ్లీ కలవడం వంటి పాత్రలు చేశారని అడుగుతున్నారు. ఆ విషయం నేను ఆలోచించనే లేదు. నా తర్వాతి సినిమాలో అలాంటి పాత్ర లేకుండా చూసుకుంటా (నవ్వుతూ). అయితే ప్రతి స్టోరీలో ఎంతో కొంత ప్రేమ కథ ఉంటుంది. అది కామన్ కదా. ► నేను నటించిన ‘పడి పడి లేచె మనసు, మారి 2’ సినిమాలు ఒకే రోజు విడుదలవడం సంతోషంగా ఉంది. ‘పడి పడి లేచె మనసు’ లో డాక్టర్‌గా నా పాత్ర కూల్‌గా ఉంటుంది. ‘మారి 2’లో ఆటో డ్రైవర్‌గా రఫ్‌గా, మాస్‌గా ఉంటుంది. ► ‘పడి పడి లేచె మనసు’ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం కోల్‌కత్తాలో జరిగింది. నేను కోల్‌కత్తాకి వెళ్లడం అదే ఫస్ట్ టైమ్. హనుగారు ఈ కథ చెప్పినప్పుడు హార్ట్‌ఫుల్‌గా ఫీలయ్యా. సినిమాను తెరపై చూసుకున్నప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది. ► ఈ సినిమాలో నాకు, శర్వాకి మంచి కెమిస్ట్రీ కుదిరిందని అంటున్నారు. ఆ పాత్రల్లో మేము కాదు.. సూర్య, వైశాలి మాత్రమే కనిపిస్తారు. శర్వా మంచి సహనటుడు. చక్కగా మాట్లాడతాడు. మా మధ్య మంచి స్నేహం కుదిరింది. ఎటువంటి ఈగోలు మాకు లేవు. అందుకే ఆ సన్నివేశాలు అంత బాగా వచ్చాయి. హనుగారు చాలా హార్డ్ వర్కర్. ఆయన ఆలోచనలన్నీ ఎప్పుడూ సినిమా గురించే ఉంటాయి. ► వరుసగా సినిమాలు చేయాలనే ఆలోచన నాకు లేదు. ఓ 20ఏళ్ల తర్వాత కూడా ‘ఆ అమ్మాయి బాగా నటించింది’ అంటే చాలు. డాక్టర్ వృత్తిని వదిలేసి ఇండస్ట్రీకి వచ్చా. నా సినిమాలు, నా పాత్రలు చూసినప్పుడు నా తల్లిదండ్రులు సంతోష పడటంతో పాటు గర్వపడాలి. అందుకే మంచి పాత్రలు ఎంచుకుంటున్నా. చిట్టి పొట్టి డ్రెస్సులు నాకు అంత కంఫర్ట్‌గా ఉండవు. అందుకే వాటికి దూరం. ‘ఫిదా’ సినిమాలో ఓ సన్నివేశంలో అవసరం కాబట్టి వేసుకోక తప్పలేదు (నవ్వుతూ). ► సినిమాల్లో నా పాత్రలో లవ్.. బ్రేకప్స్ ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా అయితే ప్రస్తుతానికి లేవు. స్కూల్ డేస్‌లో అబ్బాయిలు నావైపు చూసేవారు కానీ ధైర్యంగా మాట్లాడేవారు కాదు. నా మొహంపైన అప్పుడు కూడా మొటిమలు ఉండేవి. అయినా అబ్బాయిలు చూస్తున్నారంటే నాకు సంతోషంగా అనిపించేది. కాలేజ్ డేస్‌లో ప్రేమలో పడే టైమ్‌లేదు. పుస్తకాలతో ప్రేమలో పడిపోయా. ఇప్పుడు నా ప్రేమ సినిమాలతోనే. అవును.. సినిమాలతో ప్రేమలో ఉన్నా (నవ్వుతూ). నిజ జీవితంలో సహజీవనం చేయాలనుకోవడం లేదు. పెళ్లి చేసుకుంటా. సహజీవనం గురించి నేను తప్పుగా మాట్లాడటంలేదు. ఎవరిష్టం వారిది. ► నేను బయట ఎక్కడైనా కనిపిస్తే సాయిపల్లవి అనడం లేదు.. భానుమతి అంటున్నారు. అంతలా ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు. ఇదొక బాధ్యతగా భావించి, ప్రాధాన్యం ఉన్న, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటున్నా. నేను ఎక్కువగా మాట్లాడలేను. ఇప్పుడిలా మాట్లాడుతున్నానంటే కారణం డైరెక్టర్ శేఖర్ కమ్ములగారు, భానుమతి పాత్రే కారణం. నేను టైమ్‌కి షూటింగ్ రాననడం కరెక్ట్ కాదు. టైమ్‌కి సెట్లో ఉంటా. హిట్టు, ఫ్లాపు అనేది పెద్దగా మైండ్‌కి ఎక్కించుకోను. మన ప్రయత్న లోపం ఉండకూడదనుకుంటా. ఆ తర్వాత దేవుడి, ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలి. రిజల్ట్ ఏదైనా మన మంచికే అనుకుంటాను. ► నేనెప్పుడూ హీరోయిన్గా ఫీలవ్వను. ఓ సాధారణ అమ్మాయిలానే ఉంటా. ఇంట్లోవాళ్లు, నా ఫ్రెండ్స్, బంధువులు కూడా నన్ను హీరోయిన్గా ట్రీట్ చేయరు. ఇంట్లో నా పనులు నేనే చేసుకుంటా. కమర్షియల్ యాడ్స్ చేయడం ఇష్టం ఉండదు. చారిటీ కార్యక్రమం అయితే డబ్బులు తీసుకోకుండా చేస్తా. ► తెలుగులో వేణు ఊడుగుల దర్శకత్వంలో ఓ సినిమాకి చర్చలు జరిగాయి. ఇంకా సైన్ చేయలేదు. ఇందులో అందరూ అనుకుంటున్నట్లు నాది నక్సలైట్ పాత్ర అయితే కాదు. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్నా. తమిళంలో సూర్యతో ‘ఎన్జీకే’ మూవీలో నటిస్తున్నా. -
‘పడి పడి లేచె మనసు’ మూవీ రివ్యూ
టైటిల్ : పడి పడి లేచె మనసు జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : శర్వానంద్, సాయి పల్లవి, మురళీశర్మ, సుహాసిని సంగీతం : విశాల్ చంద్రశేఖర్ దర్శకత్వం : హను రాఘవపూడి నిర్మాత : ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి టాలీవుడ్లో మంచి ఫాంలో ఉన్న హీరో శర్వానంద్, అందమైన ప్రేమ కథల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా పడి పడి లేచె మనసు. టైటిల్ ఎనౌన్స్మెంట్ దగ్గర నుంచే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ఆడియన్స్‌ను మరింతగా ఆకట్టుకుంది. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా. శర్వానంద్, సాయి పల్లవిల జంట ఏ మేరకు ఆకట్టుకుంది.? కథ; సినిమా కథ నేపాల్‌లో ప్రారంభమవుతుంది. తను ప్రేమించిన అమ్మాయికి దూరమైన సూర్య(శర్వానంద్) తన ప్రేమకథను చెప్పటం ప్రారంభిస్తాడు. కొల్కతాలో వైశాలి (సాయి పల్లవి) అనే మెడికల్ స్టూడెంట్‌తో ప్రేమలో పడ్డ సూర్య, ఆమె వెంటపడుతుంటాడు. వైశాలి కూడా సూర్యని ఇష్టపడుతుంది. కానీ తన గతం కారణంగా కలిసుందాం గాని పెళ్లి వద్దని సూర్య అంటాడు. దీంతో ఇద్దరు విడిపోతారు సూర్య, వైశాలీలు తిరిగి ఎలా కలిశారు. ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన ఇబ్బందులు ఏంటీ అన్నదే మిగతా కథ. నటీనటులు; శర్వానంద్ మరోసారి తనదైన మెచ్యూర్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్, లవ్ సీన్స్‌తో పాటు కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి కూడా తన మీద ఉన్న అంచనాలకు తగ్గ స్థాయిలో పర్ఫామ్ చేసింది. వైశాలి పాత్రలో జీవించింది. శర్వా, సాయి పల్లవిల నటన సినిమా స్థాయిని పెంచింది. ఇద్దరు నేచురల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. సినిమా అంతా ఈ రెండు పాత్రల చుట్టూనే తిరగటంతో ఇతర పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఉన్నంతలో ప్రియదర్శి, సునీల్, వెన్నెల కిశోర్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు. మురళి శర్మ, ప్రియా రామన్ తమ పాత్రల పరిది మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ; హను రాఘవపూడి మరోసారి తన మార్క్ పొయటిక్ ప్రేమకథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కథా కథనాలు కాస్త నెమ్మదిగా సాగిన విజువల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కామెడీ, సాంగ్స్ ఇలా అన్ని తొలి భాగాన్ని ఇంట్రస్టింగ్‌గా మార్చేశాయి. కానీ ఇంటర్వెల్ సీన్ విషయంలో కాస్త తడబడ్డట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల విడిపోవడానికి కారణం కన్విన్సింగ్‌గా అనిపించదు. తొలి భాగాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించి ద్వితీయార్థంలో మాత్రం దర్శకుడు ఇబ్బంది పడ్డాడు. సినిమా రొటీన్ సీన్స్ తో సాగటంతో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. అక్కడక్కడా సునీల్ కామెడీ వర్క్ అవుట్ అయినా ఫస్ట్ హాఫ్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.క్లైమాక్స్ సన్నివేశాలు కూడా హడావిడిగా ముగించేసినట్టుగా అనిపిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ తన సంగీతంతో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రఫి, ఆర్ట్ సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి. కొన్ని ఫ్రేమ్స్ మణిరత్నం సినిమాలను గుర్తు చేస్తాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్; శర్వా, సాయి పల్లవి నటన మ్యూజిక్ మైనస్ పాయింట్స్; స్లో నరేషన్ సెకండ్ హాఫ్‌లో బోరింగ్ సీన్స్ ఇంటర్వెల్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
అదొక్కటే నా బలం కాదు
‘‘జీవితంలో మనకు దగ్గరగా ఉన్న వాటిని మనం అంతగా పట్టించుకోం. మన దగ్గర లేని దానిపైనే మనకి ఎప్పుడూ ఆసక్తి, ఆలోచన ఉంటాయి. అలా నా జీవితంలో ప్రేమకథలు లేవు. కాకపోతే ఇలా ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలు ఉన్నాయి. వాటినే కథలుగా రాస్తున్నా’’ అని హను రాఘవపూడి అన్నారు. ఆయన దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా హను రాఘవపూడి చెప్పిన విశేషాలు. ► ‘పడి పడి లేచె మనసు’ ఒక ప్రేమ కథ. ఇలా చెబితే రొటీన్‌గానే ఉంటుంది. కానీ, కొత్త ప్రేమ కథ అంటూ ఏదీ లేదని నమ్ముతాను. కాకపోతే ఒక్కో దర్శకుడి పాయింటాఫ్ వ్యూ వేరుగా ఉంటుంది. వారు పెరిగిన వాతావరణం కావొచ్చు, వారు చూసిన జీవితం కావొచ్చు.. వాటిని బట్టే ప్రేమకథలని తెరకెక్కించే విధానం వేర్వేరుగా ఉంటుంది. నా విజన్‌కి తగ్గట్లు ఈ ప్రేమకథని తీశా. ► నా బలం ప్రేమకథలు అని బయట టాక్ ఉంది. అయితే మన బలం మనకెప్పుడూ తెలియదు. ఎదుటివాళ్లు చెబితేనే తెలుస్తుంది. నా సినిమాలు చూశాక నా బలం లవ్ స్టోరీస్ అని వాళ్లకి అనిపించి ఉండొచ్చు. అయితే ప్రేమకథలు మాత్రమే నా బలం కాదు. మిగతా వాటిలో కూడా నేను బలంగానే ఉన్నాననుకుంటున్నాను. ► శర్వానంద్ నాకెప్పటి నుంచో తెలుసు. ఒకసారి నా కథను రామ్‌చరణ్‌కి కూడా చెప్పించాడు. ఎప్పటి నుంచో శర్వ, నేను సినిమా చేయాలని అనుకుంటున్నాం. తనకోసం రెండు, మూడు లైన్స్ చెప్పాను. తను మాత్రం లవ్ స్టోరీ చేద్దామన్నాడు. అలా శర్వానంద్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ లవ్ స్టోరీ రాశా. దర్శకులు మణిరత్నం, సుకుమార్‌గార్లతో నన్ను పోల్చడం ప్రశంసగా భావిస్తా. సంజయ్‌లీలా భన్సాలీ సినిమాలో షాట్స్ అన్నీ రిచ్‌గా ఉంటాయి. నాకు మణిరత్నం, భన్సాలీ, రాజు హిరాణీ, రాజమౌళిగార్ల సినిమాలంటే చాలా ఇష్టం. ► ఒకసారి వెంకట్ సిద్ధారెడ్డి, నేను కూర్చుని ‘పదహారేళ్ల వయసు.. పడి పడి లేచె మనసు’ పాట వింటున్నాం. ఈ పదాల్లోనే ఏదో కథ ఉందనిపించింది. ‘పడి పడి లేచె మనసు’ టైటిల్ అనుకున్నాం. దాని నుంచి పుట్టిన కథే ఇది. కథ రాస్తున్నప్పుడే సాయి పల్లవిని హీరోయిన్గా అనుకున్నాను. శర్వా, సాయిపల్లవి పోటీపడి నటించారు. తెరపై నటీనటులు కాదు.. ప్రేక్షకులకు వారి పాత్రలే కనిపిస్తాయి. ► ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే 15 శాతం ఎక్కువ అయింది. కోల్‌కత్తాలో ఎక్కువ లైవ్ లొకేషన్స్‌లో షూట్ చెయ్యటం వల్లే ఆలస్యమైంది. కానీ, సుధాకర్‌గారు ఎక్కడా బడ్జెట్‌కి వెనకాడలేదు. నేను కోల్‌కత్తాలో ఉన్నప్పుడు అక్కడ ఓ సినిమా తీయాలనుకున్నా. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. ► నా వద్ద ఔట్ ఆఫ్ ద బాక్స్ కథలూ ఉన్నాయి. వాటిని తీయడానికి సమయం, సందర్భం కావాలి. నాపై ప్రేక్షకుల్లో నమ్మకం వచ్చినప్పుడే వాటిని తీస్తా. ‘అందాల రాక్షసి’ సినిమా ఫస్ట్ డే ఫ్లాప్ అన్నారు. ఆ తర్వాత ఆ సినిమా నాకు తెచ్చిన గుర్తింపు వేరు. ‘లై’ని అనుకున్నట్టు తీయలేకపో యా. అయితే ఆ సినిమాకి రైటర్‌గా సక్సెస్ అయ్యాను. టేకింగ్‌లోనే పొరపాటు జరిగింది. ► నాని కోసం మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కథ రెడీ చేశా. ప్రాజెక్ట్ కూడా ఓకే అయింది. అయితే నాని గెటప్‌ని టోటల్‌గా మార్చాలి. మా ఇద్దరి వీలు చూసుకొని ఆ సినిమా చెయ్యాలి. ‘పడి పడి లేచె మనసు’ తర్వాత మైత్రి మూవీస్‌లో సినిమా ఉంటుంది. హీరో హీరోయిన్లు ఎవరని ఇంకా అనుకోలేదు. వచ్చే ఏడాది వేసవిలో ఆ సినిమా ప్రారంభమవుతుంది. -
ఎవరూ ఎవరికీ పోటీ కాదు
‘‘కేవలం డబ్బు సంపాదించాలనే ఆశ ఉంటే ఓ సినిమా తర్వాత మరో సినిమా వెంటవెంటనే చేసేవాణ్ణి. కానీ, నాకు ఆ ఆశ లేదు. నేను సినిమాని, కథల్ని, డైరెక్టర్స్‌ని నమ్ముతాను. తోటి హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నారు.. నేను చేయకపోతే ఎలా? అనే అభద్రతాభావం నాకు లేదు. బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే నేను షూటింగ్‌కి వెళతాను. అందుకే సినిమా సినిమాకీ కొంత గ్యాప్ వస్తుంటుంది’’ అని శర్వానంద్ అన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శర్వానంద్ చెప్పిన విశేషాలు. ► హను 15 ఏళ్లుగా మంచి ఫ్రెండ్. ఎప్పటినుంచో ఓ సినిమా చేయమని అడుగుతున్నా. సుధాకర్‌గారు, నేను సినిమా చేద్దామనుకున్నప్పుడు హనుని అనుకున్నాం. తను మూడు కథలు చెబితే ‘పడి పడి లేచె మనసు’ కథని ఓకే చేశాం. ఈ చిత్రానికి ముందు హను చేసిన ‘లై’ సినిమా సరిగ్గా ఆడలేదు. కానీ, తను ఓ మంచి టెక్నీషియన్. అందరూ జూనియర్ సుకుమార్, తెలుగు మణిరత్నం అని అంటుంటారు. హనూని ఎవరితోనూ పోల్చలేం. తనపై మణిరత్నం ఇన్స్పిరేషన్ ఉందేమో? ► చక్కని ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఇందులో ఫుట్‌బాల్ కెప్టెన్ సూర్య పాత్రలో కనిపిస్తా. సినిమా అంతా ఫుట్‌బాల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండదు. కోల్కత్తా నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. గతంలో ఈ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘చూడాలని వుంది, ఖుషి, లక్ష్మీ’ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ప్రేమకథలోనూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వాలనే కోల్‌కత్తాలో షూటింగ్ చేశాం. ► అందరూ కనెక్ట్ అవుతారనే ‘పడి పడి లేచె మనసు’ టైటిల్ పెట్టాం. నా సినిమా ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లవ్‌స్టోరీ అయినా ఓల్డర్ సెక్షన్‌కి కనెక్ట్ అయ్యింది. కానీ, ఈ సినిమా మాత్రం యువతతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కనెక్ట్ అవుతుంది. ఇందులో నేను సూర్య, సాయిపల్లవి వైశాలి పాత్ర చేశాం. సాయిపల్లవి వెరీ స్వీట్. ఈ సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ హైలైట్. ఇప్పటి వరకూ ఏ హీరోయిన్‌తోనూ ఇంత బాగా కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదని అందరూ నాతో అంటున్నారు. ► డబ్బులు ఎవరైనా ఖర్చు పెడతారు. కానీ, టేస్ట్ ఉన్న నిర్మాతలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో సుధాకర్‌గారు ఒకరు. కథకి అవసరం మేరకు ఖర్చు పెట్టారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. జయకృష్ణ గుమ్మడి చక్కని విజువల్స్ ఇచ్చారు. విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన పాటలిచ్చారు. ► నా కెరీర్లో ఇప్పటి వరకూ ఏదీ ప్లాన్ చేయలేదు. అన్ని జోనర్ కథలు వింటున్నా. వెంట వెంటనే ఒకే జోనర్లో సినిమాలు చేయకూడదనుకుంటున్నా. నా సినిమాలే నా మార్కెట్‌ని పెంచుతున్నాయి. అవార్డులు రావాలని సినిమా చేయను. ఓ సినిమాని నా వరకు 100 శాతం ప్రేమించి చేస్తా. తమిళం నుంచి అవకాశాలొస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి తెలుగులో హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు సినిమాలు నిర్మించే టైమ్ లేదు. ► బన్నీ (అల్లు అర్జున్), మేము కలిసి చిన్నప్పటి నుంచి సినిమాలు చూసేవాళ్లం.. ఫంక్షన్స్‌కి వెళ్లేవాళ్లం. నేను అడగ్గానే తను మా ఫంక్షన్‌కి వచ్చి యూనిట్‌ని ఆశీర్వదించినందుకు హ్యాపీ. మా సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న తమ్ముడు వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ సినిమా కూడా బాగా ఆడాలి. ఇండస్ట్రీలో ఎవరి స్పేస్ వారికి ఉంటుంది. ఎవరూ ఎవరికీ పోటీ కాదు. అందరం బాగుంటాం. అందరి సినిమాలూ ఆడాలి. ► ‘రన్ రాజా రన్’ సినిమాతో సుజిత్ నన్ను పూర్తిగా మార్చేశారు. అప్పటి నుంచి సినిమా సినిమాకి నా లుక్, స్టైల్ మారుతోంది. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమా 50 శాతం పూర్తయింది. 1980నాటి గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇది ‘ప్రస్థానం’ సినిమాలా మాస్‌గా ఉంటుంది. తమిళ ‘96’ మూవీ తెలుగు రీమేక్‌పై చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వివరాలు చెబుతా. ► ‘గతంలో మీరు ప్రేమలో ఉన్నానని అన్నారు. ఎవరితో?’ అనే ప్రశ్నకు– ‘‘అప్పుడు ఉన్నానని చెప్పాను. ఇప్పుడు కాదు. టైమ్ వచ్చినప్పుడు చెబుతా’ అన్నారు శర్వానంద్ (నవ్వుతూ). -
‘పడి పడి లేచె మనసు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
అది చూసి ఆ దర్శకుడికి పిచ్చెక్కిపోయింది: బన్నీ
‘‘ఆ మధ్య ఓ దర్శకుడు నాతో ‘శర్వా చాలా లిమిటెడ్ యాక్టర్’ అని అన్నారు. ‘స్కోప్ వస్తే ఏదైనా చేసే కెపాసిటీ తనకుంది’ అని నేను అన్నాను. తర్వాత ‘రన్ రాజా రన్’ రిలీజైంది. అది చూసి పిచ్చెక్కిపోయింది ఆ దర్శకుడికి. ఆయన నాకు ఫోన్ చేసి ‘స్వామీ.. నేను ఒప్పుకుంటాను. శర్వా ఏదైనా చేయగలడు’ అన్నారు. శర్వా సెల్ఫ్‌మేడ్ హీరో. అతని ఫంక్షన్‌కు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అల్లు అర్జున్ అన్నారు. శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ట్రైలర్ నాకు చాలా నచ్చింది. బేసిక్‌గా లవ్ స్టోరీలంటే నాకు చాలా ఇష్టం. (ప్రేక్షకులు అరుస్తుంటే) ఏంటి అరుస్తున్నారు? నాకు పెళ్లి అయిపోయిందనా? ‘ఇంద్ర’ సినిమా స్టైల్లో చెప్పాలంటే ‘అదే యూత్.. అదే ఎనర్జీ’. ఈ చిత్రం ట్రైలర్లో మ్యాజిక్ కనిపించింది. మంచి సినిమాతో నిర్మాతగా మారిన సుధాకర్‌గారికి ఆల్ ది బెస్ట్. సాహిత్యం అందించిన కేకేగారికి, రచించిన హనుగారికి నా రెస్పెక్ట్. రచయితలను గౌరవించుకోవాలి. సాంకేతిక నిపుణులందరికీ నా శుభాకాంక్షలు. ఈ మధ్యకాలంలో నా కార్లో మ్యాగ్జిమమ్ విన్నది ‘పడి పడి..’ పాటలే. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్‌గారు పెద్ద పెద్ద హిట్లు ఇవ్వాలి. ‘ప్రేమమ్’, ఎంసీఏ, ఫిదా’లో సాయిపల్లవిని చూశాను. తనతో ఒకవేళ సినిమాలు చేస్తే సీన్స్ కన్నా కూడా సాంగ్స్ ఎప్పుడు చేస్తానా? అని వెయిట్ చేస్తున్నా. ‘ఫిదా’లో ‘వచ్చిండే..’ సాంగ్‌ని నేను చూసినన్నిసార్లు సాయిపల్లవి కూడా చూసుకొని ఉండదు. నా ఫేవరెట్ హీరోయిన్స్, డ్యాన్సర్స్, పెర్ఫార్మర్స్‌లో సాయి పల్లవి ఒకరు. మీకో (సాయి పల్లవిని ఉద్దేశించి) పెద్ద స్టార్ హీరో ఫ్యాన్ ఉన్నారు. ఆయన ఎవరో మాత్రం నేను చెప్పను. ‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై’ సినిమాల్లో లవ్‌ట్రాక్‌లు చాలా బావుంటాయి. హనుతో ఓ లవ్‌స్టోరీ చేయాలి అనుకున్నాను. కానీ శర్వా ఆ ఛాన్స్ కొట్టేశాడు. మన బలం మీద ముందుకు వెళ్తే ఇంకా బావుంటుంది అంటారు. హను బలం ప్రేమ కథలు. ఈ సినిమా ఆయనకు పెద్ద హిట్‌గా నిలుస్తుంది అనుకుంటున్నాను. మాతో కూడా లవ్‌స్టోరీలు తీయండి. శర్వా నాకంటే చిన్నోడు. పార్టీలో కలుస్తుంటాం. కానీ శర్వాగారు అంటాను. ఆయన చేసిన సినిమాలు, ఆయనకీ గౌరవం, స్థాయిని తెచ్చాయి. అందుకే గారు అంటున్నాను. ఈ మధ్యలో టీవీల్లోను, సమాజంలో సినిమా, రాజకీయ నాయకులని కూడా పేర్లు పెట్టి పిలిచేస్తున్నారు. ‘గారు’ అని ఒక గౌరవం ఇవ్వండి. ఒకసారి టీవీలో చూస్తుంటే ఎవరో చిరంజీవిని పిలు అన్నారు. చిరంజీవి ఏంట్రా? చిరంజీవిగారు, పవన్ కళ్యాణ్‌గారు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా గౌరవించాలి. వినడానికి కొంచెం ఆర్టిఫీఫియల్గా ఉన్నా మంచి విషయం కాబట్టి అలవాటు చేసుకోండి. ‘గమ్యం’ నుంచి చూస్తున్నాను శర్వాగారిని. మాకు బ్యాగ్రౌండ్ ఉంది. నెపోటిజమ్‌కు (బంధుప్రీతి) బ్రాండ్ అంబాసిడర్లం (నవ్వుతూ). ఇలాంటి సెల్ఫ్ మేడ్ హీరోలంటే ఒకలాంటి అడ్మిరేషన్ నాకు. మనస్ఫూర్తిగా సినిమా ఆడాలి. అలాగే అదే రోజు విడుదలవుతున్న నా సొంత తమ్ముడు వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ సినిమా కూడా ఆడాలి’’ అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘హిట్ కొట్టనేమో అని టెన్షన్ పడకండి. హిట్ కొట్టే బాధ్యత నాది. దానికి కారణం ఏంటో చెప్పనా? ఈ మధ్యన ఇండస్ట్రీలో ‘గోల్డెన్ హ్యాండ్’ అంటున్నారు బన్నీని. మొన్న బన్నీకు ఫోన్ చేసి ‘ఇండస్ట్రీలో రెండు హిట్స్ విజయ్ దేవరకొండకు ఇచ్చారు. నన్ను టచ్ చేసి నాకు ఓ హిట్ ఇవ్వొచ్చు కదా?’ అని అడిగాను. బన్నీ నాకు ఇన్స్పిరేషన్. మేమందరం మంచి సినిమాలు చేస్తాం, డిఫరెంట్ సినిమాలు చేస్తాం. కానీ బన్నీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సినిమాకు వంద కాదు నూట యాభై శాతం శ్రమిస్తాడు. ఇండస్ట్రీలో మంచి సినిమా వస్తే అది తీసిన టీమ్‌కు ఫస్ట్ కాల్ బన్నీ నుంచే వెళ్తుంది. ఈ సినిమా విషయానికి వస్తే హను ఫ్లాప్ దర్శకుడు, సాయి పల్లవి, శర్వాకు ఇంతెందుకు ఖర్చు పెట్టారు? అని అడుగుతున్నారు. దానికి కారణం సినిమాలోని కంటెంట్. ఈ సినిమా నిర్మాత బ్రదర్‌లా అయిపోయారు నాకు. ఇప్పటి వరకూ ఏ దర్శకుడితో ఈ మాట చెప్పలేదు. హను నాకో గురువు అయిపోయాడు. సాయి పల్లవి చాలా డెడికేటెడ్. సంగీతదర్శకుడు విశాల్‌గారి నాన్నగారు పదిరోజుల క్రితం చనిపోయారు. ఆయినా కానీ సినిమాకు రీరీకార్డింగ్ చేశారు. రాసిపెట్టుకోండి.. నన్ను జేకే చూపించినంత అందంగా ఎవ్వరూ చూపించలేరు. 21న వస్తున్నాం. మా తమ్ముడు వరుణ్‌తేజ్ ‘అంతరిక్షం’ సినిమా కూడా వస్తోంది. క్రిస్మస్ సెలవల్లో మా రెండు సినిమాలు చూసి తెలుగు సినిమాను హిట్ చేయండి’’ అన్నారు.‘‘అల్లు అర్జున్‌గారి డ్యాన్స్‌కి నేను పెద్ద అభిమానిని. స్కూల్లో కూడా ఆయన పాటలకు డ్యాన్స్ చేసేద్దాన్ని. హనుగారికి థ్యాంక్స్. నన్ను నమ్మినందుకు. శర్వాగారు గురించి చాలా మంది హీరోయిన్స్ గొప్పగా చెప్పారు. నేనూ అదే చెబుతాను. ఆయన మంచి కో స్టార్. నటిగా నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేశారు’’ అన్నారు సాయి పల్లవి. ‘‘ఇది నాకు చాలా స్పెషల్ సినిమా. ఈ సినిమాకి ముందు నాకు సక్సెస్ లేదు. ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నాను. నన్ను నమ్మారు శర్వానంద్. ప్రేమకథ చెప్పడానికి ముఖ్యంగా కావల్సింది సంగీతం, కథ, మంచి నటీనటులు. ఈ మూడు ఈ సినిమాకు బాగా కుదిరాయి. సుధాకర్‌గారికి సినిమాలంటే పిచ్చి. ఒక నిర్మాతకు అంత పిచ్చి ఉండటం ఫస్ట్ టైమ్ చూస్తున్నాను’’ అన్నారు హను రాఘవపూడి. ఈ కార్యక్రమంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు. -
అతిథులండోయ్!
ముందు అల్లు అర్జున్, తర్వాతి రోజు రామ్‌చరణ్ మనకు అతిథులుగా కనిపించబోతున్నారు. ఏదైనా సినిమాలో గెస్ట్ రోల్స్ చేశారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. రెండు వేరు వేరు ఫంక్షన్స్‌కి ఈ ఇద్దరూ అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఈ ఆదివారం జరగనునున్న శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కి అల్లు అర్జున్ అతిథి. ఆ మర్నాడు జరగనున్న వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కి రామ్‌చరణ్ అతిథి. శర్వానంద్, సాయిపల్లవి జంటగా ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన స్పేస్ చిత్రం ‘అంతరిక్షం’ 9000 కెయమ్పిహెచ్. ‘ఘాజీ’ చిత్రంతో మంచి పేరును సొంతం చేసుకున్న దర్శకుడు సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాల వేడుకలకు అల్లు అర్జున్, రామ్‌చరణ్ అతిథులుగా రావడం హీరోల మధ్య ఉన్న ఫ్రెండ్లీ వాతావరణానికి ఓ నిదర్శనం. అన్నట్లు... ఈ రెండు చిత్రాలూ ఈ నెల 21న విడుదల కానున్నాయి. -
గీతాంజలి, ఫిదాలా హిట్ అవ్వాలి
‘‘తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త నిర్మాతలు వస్తుంటారు. కానీ కొంతమందే సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో ‘పడి పడి లేచే మనసు’ నిర్మాత సుధాకర్ ఒకరు అనిపిస్తోంది. తను 14 రీల్స్, మైత్రీ మూవీస్‌లో చేస్తున్నప్పటి నుంచి ఐదేళ్లుగా నాకు పరిచయం. తొలి సినిమానే శర్వానంద్, హను వంటి మంచి కాంబినేషన్లో నిర్మించడం హ్యాపీ’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని ‘దిల్’ రాజు రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘హను ఫస్ట్ సినిమా ‘అందాల రాక్షసి’ చాలా మంచి సినిమా. కానీ, ఎందుకు హిట్ అవ్వలేదో తెలీదు. ప్రేమకథలు తీయడంలో మణిరత్నంగారి టేకింగ్ హను సినిమాల్లో కనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే ‘పడి పడి లేచె మనసు’తో 100 శాతం హిట్ సాధిస్తాడనే నమ్మకం ఉంది. శర్వానంద్, సాయి పల్లవిల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ సినిమా ‘గీతాంజలి, ఫిదా’ సినిమాల్లా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘లై’ సినిమా రిజల్ట్ తర్వాత డిప్రెషన్లో ఉన్నా. అలాంటి టైమ్‌లో శర్వాని కలిసి లవ్‌స్టోరీ చేద్దామనడంతో ఓకే అన్నాడు. తను చక్కని సపోర్ట్ ఇచ్చాడు. శర్వా, నిర్మాత సుధాకర్ లేకుంటే ఈ సినిమా వచ్చేది కాదు. కోల్కత్తా, నేపాల్‌లో షూటింగ్ చేశాం. చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. చాలాకాలం గుర్తుండిపోతుంది’’ అన్నారు హను రాఘవపూడి. ‘‘మా సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశాం. సినిమా గురించి ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడతా’’ అని శర్వానంద్ అన్నారు. ‘‘రెండున్నర గంటల పాటు అందర్నీ అలరించే మంచి లవ్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు నటుడు సునీల్. ఈ కార్యక్రమంలో సుధాకర్ చెరుకూరి, నిర్మాత సునీల్ నారంగ్, నటీనటులు శత్రు, కల్పిక, పాటల రచయిత కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పడి పడి లేచే మనసు.. మ్యాజిక్ ఆఫ్ లవ్
విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. కోల్‌కత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్రయూనిట్ టైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే సినిమా హను రాఘవపూడి మార్క్ అందమైన ప్రేమకథగా తెరకెక్కిన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో మరోసారి సాయి పల్లవి ఫిదా చేసేందుకు రెడీ అవుతోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. -
‘పడి పడి లేచె మనసు’ వర్కింగ్ స్టిల్స్
-
రీషూట్‌లో ‘పడి పడి లేచే మనసు’!
శర్వానంద్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పడి పడి లేచే మనసు. కోల్‌కత బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ డిసెంబర్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సంతృప్తిగా లేని చిత్రయూనిట్ రీషూట్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే రీషూట్‌కు డేట్స్ కేటాయించేందుకు సాయి పల్లవి అదనపు పారితోషికం అడుగుతున్నారట. నిర్మాతలు కూడా ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేందుకు అంగీకరించారన్న టాక్ వినిపిస్తోంది. -
‘పడి పడి లేచె మనసు’ మూవీ స్టిల్స్
-
శర్వా.. ఆ సినిమా ఏమైంది..?
యంగ్ జనరేషన్లో డిఫరెంట్ మూవీస్‌తో ఆకట్టుకుంటున్న హీరో శర్వానంద్. కెరీర్ స్టార్టింగ్ నుంచే డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్న శర్వానంద్ కమర్షియల్ హీరోగానూ ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు శర్వానంద్. అయితే గత ఏడాది నవంబర్ లో శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఓ సినిమా ప్రారంభమైంది. అయితే ఓపెనింగ్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినా తరువాత సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏవీ బయటకు రాలేదు. ఇటీవల కొరియాలో భారీ షెడ్యూల్ ప్లాన్‌చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. తరువాత మరే న్యూస్ రాలేదు. అవుట్‌పుట్ అనుకున్న స్థాయిలో రాకపోవటంతో స్క్రీప్ట్ రీరైట్ చేయాల్సిందిగా దర్శకుడు సుధీర్ వర్మకు సూచించాడట శర్వానంద్. అందుకే సినిమా ఆలస్యం అయిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం చిత్రయూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. శర్వా హీరోగా తెరకెక్కుతున్న పడి పడి లేచే మనసు డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తెలిసిపోయిందా!
ఏంటీ.. ఫాలో చేస్తున్నావా? అని ఓ అబ్బాయిని ఫేస్ మీద అడిగేసిందో అమ్మాయి. ‘అరే మీకు తెలిసిపోయిందా? అయినా మీరు ఇలా దగ్గరకి వచ్చి మాట్లాడటం ఏం బాగోలేదండి. ఏదో నా పాటికి నేను అర కిలోమీటర్ దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే..’ అని చమత్కారంగా డైలాగ్ చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడా స్మార్ట్ కుర్రాడు. మరి.. నెక్ట్స్ ఏంటీ? అంటే ‘పడి పడి లేచె మనసు’ సినిమా చూడాల్సిందే. శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను ఈ నెల 12న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. టైటిల్ సాంగ్‌ను సోమవారం రిలీజ్ చేయనున్నాం’’ అని పేర్కొన్నారు చిత్రబృందం. మురళీ శర్మ, సునీల్, ప్రియదర్శి, అభిషేక్ మహర్షి కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాను వచ్చే నెల 21న విడుదల చేయాలనుకుంటున్నారు. -
క్రిస్మస్ బరిలో ఇంట్రస్టింగ్ సినిమాలు
టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి, దసరాలతో పాటు క్రిస్టమస్ సీజన్ మీద కూడా భారీ అంచనాలు ఉంటాయి. అందుకే చాలా సినిమాలు ఈ సీజన్లో రిలీజ్‌కు క్యూ కడుతుంటాయి. ఈ ఏడాది కూడా మూడు ఇంట్రస్టింగ్ సినిమాలు బరిలో దిగుతున్నాయి. మూడు విభిన్న కథలతో తెరకెక్కుతున్న చిత్రాలు ఈ క్రిస్మస్కు పోటి పడుతున్నాయి. శర్వానంద్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రేమకథ పడి పడి లేచే మనసు డిసెంబర్ 21న రిలీజ్ అవుతున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అదే సమయంలో ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న స్పేస్ మూవీ అంతరిక్షం కూడా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు బయోపిక్‌గా తెరకెక్కుతున్న యాత్ర (వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో)సినిమా కూడా అదే సీజన్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలు మూడు విభిన్న నేపథ్యంలో తెరకెక్కుతున్నవి కావటంతో పోటి ఉండదని భావిస్తున్నారు నిర్మాతలు. అయితే మూడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం థియేటర్ల సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
‘పడి పడి లేచే మనసు’ షూటింగ్ పూర్తి!
యంగ్ హీరో శర్వానంద్, ‘ఫిదా’ భామ సాయి పల్లవి జంటగా ‘పడి పడి లేచే మనసు’ అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. శర్వానంద్, సాయి పల్లవి కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలెట్ కానుందని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. చిత్రయూనిట్ అంతా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే హను రాఘవపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానున్న విషయం తెలిసిందే. -
హను మార్క్ ప్రేమకథ ‘పడి పడి లేచే మనసు’
విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. కోల్‌కత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే సినిమా హను రాఘవపూడి మార్క్ అందమైన ప్రేమకథగా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో మరోసారి సాయి పల్లవి ఫిదా చేసేందుకు రెడీ అవుతోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. -
మనసు పడి...
ప్రేయసిని చూడగానే శర్వానంద్ మనసు పడి పడి లేచిందట. ఆమె కోసం కోల్కత్తా, నేపాల్ మొత్తం తిరిగేసి ప్రేమ ప్రయాణం కూడా చేశారట. ఆ జర్నీ ఎలా ఉండబోతోందో కొంచెం రుచి చూపించబోతున్నాం అంటున్నారు శర్వానంద్. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను రేపు (అక్టోబర్ 10) విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘పడి పడి లేచె మనసు’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఆల్రెడీ కోల్కత్తా, నేపాల్ వంటి అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. శర్వానంద్, సాయి పల్లవి నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్ర శేఖర్, కెమెరా: జయకృష్ణ గుమ్మడి. -
అక్టోబర్ 10న పడిపడి లేచే మనసు టీజర్!
శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘పడిపడి లేచే మనసు’ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య విజయాలు లేక వేగం తగ్గించిన శర్వానంద్, ఫుల్ ఫామ్‌లో ఉన్న సాయి పల్లవి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. డిఫరెంట్ టేకింగ్‌తో సినిమాను తెరకెక్కించే హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. అక్టోబర్ 10న ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర కీలకపాత్రల్లో నటించగా.. విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
శర్వా సినిమా వాయిదా పడిందా..?
విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కొల్‌కత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పడి పడి లేచే మనసు. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ నెలాఖరున రిలీజ్ చేయాలని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం పడి పడి లేచే మనసు రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కారణాలేంటన్నది బయటకు రాకపోయినా అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కావటం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. ఒక వేళ వాయిదా పడితే సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తారా లేక ఇంకాస్త ఆలస్యంగా జనవరి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తారా చూడాలి. -
ఏ మాయ చేశాడో
హీరోయిన్ సాయిపల్లవి అలిగారట. అందుకే ఆమెను బుజ్జగించే పనిలో పడ్డారట హీరో శర్వానంద్. మరి.. ఏ మాయ చేసి సాయిపల్లవి ముఖంలో చిరునవ్వు తెప్పించారనేది సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’. సాయిపల్లవి కథానాయిక. చుక్కపల్లి ప్రసాద్, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వానంద్, సాయిపల్లవిలపై లవ్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యేలా చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 21న ఈ చిత్రం రిలీజ్‌ను ప్లాన్ చేశారు. -
నవ్వుల వైద్యం
ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్‌లో కమెడియన్‌గా నటించి, మంచి పేరు సంపాదించుకున్నారు సునీల్. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకుని ‘మర్యాద రామన్న, పూలరంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు’ వంటి సినిమాల్లో నటించారు. ఇప్పుడు యు–టర్న్ తీసుకుని ఆయన కమెడియన్ కూడా దృష్టి పెట్టారు. రీసెంట్గా ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన ‘సిల్లీఫెలోస్’లో ఓ ముఖ్య పాత్ర చేసి ఆకట్టుకున్నారు సునీల్. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవిందç సమేత వీరరాఘవ’, రవితేజ నటిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటొని’, శర్వానంద్ ‘పడిపడి లేచె మనసు’ చిత్రాల్లో కమెడియన్‌గా నటిస్తున్నారు. శర్వానంద్ సినిమాలో డాక్టర్ పాత్రలో కనిపిస్తారట. మరి.. ఆడియన్స్ టెన్షన్స్‌కు థియేటర్లో సునీల్ ఎలా నవ్వుల వైద్యం చేస్తారో చూడాలంటే ఈ డిసెంబర్ 21వరకు ఆగాల్సిందే. -
శర్వాతో గొడవ.. సాయిపల్లవి క్లారిటీ!
ఫిదా సినిమాతో టాలీవుడ్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సాయి పల్లవి. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ, వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. నటిగా మంచి పేరున్న సాయి పల్లవిపై హీరోలతో గొడవ పెట్టుకుంటుందన్న అపవాదు కూడా ఉంది. ఎమ్సీఏ సినిమా సమయంలో నానితో, కణం షూటింగ్లో నాగశౌర్యతో సాయి పల్లవి గొడవ పడినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా సాయిపల్లవి మరో హీరోతో గొడవ పడట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో నటిస్తున్నారు సాయి పల్లవి. అయితే శర్వా, సాయిపల్లవికి మధ్య గొడవ కావటంతో షూటింగ్ కు బ్రేక్ పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన సాయి పల్లవి షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వటంపై స్పందించారు. ‘శర్వానంద్, పడి పడి లేచే మనసు సినిమాతో పాటు మరో సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవ’ని ఆమె క్లారిటీ ఇచ్చారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడి పడి లేచే మనసు డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. -
నేడే పాడండి!
టైటిల్ సాంగులు విన్నాం. ఇప్పుడు సాంగులే టైటిళ్లు అవుతున్నాయి!అవును.పాటను వినేవాళ్లం.ఇప్పుడు పాటను చూస్తున్నాం. నేడే పాడండి. కథ.. హీరో.. హీరోయిన్.. డైరెక్టర్.. ప్రొడ్యూసర్.. నటీనటులు.. సాంకేతిక నిపుణులు అంతా ఓకే. మరి టైటిల్ ఏంటి? గతంలో అయితే కథను స్ట్రయిట్‌గా చెప్పేసే టైటిల్స్ పెట్టేవారు. క్రమంగా ట్రెండ్ మారింది. కథను అంతర్లీనంగా చెబుతూనే క్యాచీ టైటిల్ పెడుతున్నారు దర్శక–నిర్మాతలు. కొత్త టైటిల్స్ పెట్టడం కంటే ఇప్పటికే బాగా పాపులర్ అయిన, జనం నోళ్లలో నానుతున్న పాటల పల్లవులను టైటిల్స్‌గా కొందరు వాడుకుంటున్నారు. మరికొందరేమో తమ అభిమాన హీరోలు నటించిన హిట్ సినిమాల్లో పాటల పల్లవులను టైటిళ్లుగా పెట్టేసుకుంటున్నారు. ఎందుకిలా అంటే.. జనాల నోళ్లలో నానిన వి అయితే ఈజీగా ప్రేక్షకులకు చేరువవుతాయనేది నమ్మకం. ప్రేక్షకాదరణ పొందిన పాటలో పల్లవి అయితే సెంటిమెంట్‌గా కూడా వర్కవుట్ అవుతాయనేది మరికొందరి నమ్మకం. ఇలా.. ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి సెంటిమెంట్ వారిది. ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న రామ్ ‘హలో గురు ప్రేమకోసమే’, శర్వానంద్ ‘పడి పడి లేచే మనసు’, సుధీర్‌బాబు ‘నన్ను దోచుకుందువటే’, జొన్నలగడ్డ హరికృష్ణ ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’ చిత్రాల టైటిల్స్ పాటల పల్లవుల్లోంచి తీసుకున్నవే. వీటిపై ఓ లుక్కేద్దాం. హలో గురు ప్రేమ కోసమే ‘హలో గురు ప్రేమకోసమేరోయ్ ఈ జీవితం.. మగాడితో ఆడదానికేలా పౌరుషం’ అంటూ నాగార్జున పాట పాడుతూ తన ప్రేమను అమలకు చెబుతాడు. 1991లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ‘నిర్ణయం’ సినిమాలోని ఈ పాట ఎంత పాపులరో తెలిసిందే. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ టైమ్‌లో ఈ పాటను కుర్రాళ్లంతా తెగ పాడుకున్నారు. ఇప్పుడు ‘హలో గురు ప్రేమకోసమే’ అంటూ రామ్.. అనుపమా పరమేశ్వరన్ వెంటపడుతున్నారు. రామ్, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరో హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘హలో గురు ప్రేమకోసమే’ టైటిల్ నిర్ణయించారు. టైటిల్ ప్రకటించినప్పటి నుంచే సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పడి పడి లేచే మనసు ‘పదహారేళ్ల వయసు.. పడి పడి లేచే మనసు’ అంటూ చిరంజీవి, రాధ వేసిన స్టెప్పులను అంత సులువుగా మరచిపోలేరు ప్రేక్షకులు. 1989లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘లంకేశ్వరుడు’ చిత్రంలోని ఆ పాటకు స్టెప్పులేయని కుర్రకారు అప్పట్లో లేరంటే అతిశయోక్తి కాదేమో. రాజ్–కోటి, సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు. ఈ సినిమా విడుదలై 28ఏళ్లు అయినా ఇప్పటికీ ఆ పాట ఎక్కడ వినపడ్డా చిరంజీవి–రాధ మన కళ్లముందు మెదులుతారు.. అంతేనా.. మనకీ కాలు కదపాలనిపిస్తుంటుంది. అంతలా హిట్ అయిన ఆ పాటతో ఇప్పుడు శర్వానంద్‌కి, సాయిపల్లవికీ లింక్ కుదిరింది. వారిద్దరూ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రానికి ‘పడి పడి లేచే మనసు’ టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్ అవుతోంది. సంగీతం విశాల్ చంద్రశేఖర్. నన్ను దోచుకుందువటే ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని.. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ’ అంటూ ఎన్టీఆర్–జమునలు పాడుకున్న పాట వింటుంటే ఇప్పటికీ మనసుకి ఎంత హాయిగా ఉంటుందో. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1962లో వచ్చిన ‘గులేబకావళి కథ’ చిత్రంలోని ఆ పాట ఎవర్గ్రీన్. విజయ్ కృష్ణమూర్తి, జోసెఫ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ మనోహరంగా ఉంటాయి. ఇప్పుడు సుధీర్ బాబు కూడా నభా నతేశ్తో ‘నన్ను దోచుకుందువటే’ అంటున్నారు. వారిద్దరూ జంటగా ఆర్.ఎస్.నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ హీరోగా నటించి, సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం నిర్మించారు. ఈ టైటిల్ ప్రకటించగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నారు. అజనీష్ బి.లోకనా«థ్ స్వరాలు సమకూర్చారు. ప్రేమెంత పనిచేసె నారాయణ చిన్న హీరో. కానీ ట్యూన్ క్యాచీగా ఉంటే పెద్ద పాపులార్టీ వస్తుంది. ‘ప్రేమెంత పనిచేసె నారాయణ.. సత్యనారాయణ’ పాట ఈ లిస్ట్‌లోకే వస్తుంది. రోహిత్, అనితా పాటిల్ పాడుకున్న ఈ పాట యువతని ఉర్రూతలూగించింది. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 2002లో వచ్చిన ‘గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలోనిది ఇది. ‘వందేమాతరం’ శ్రీనివాస్ సంగీతం అందించిన ఆ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఇప్పుడదే టైటిల్‌తో దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ జొన్నలగడ్డ హీరోగా పరిచయం అవుతున్నారు. హరికృష్ణ, అక్షిత జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’ చిత్రం టైటిల్ ఇప్పటికే అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. యాజమాన్య స్వర పరచిన ఈ చిత్రం పాటలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేయడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ నెలకొంది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. దట్ ఈజ్ మహాలక్ష్మి ‘దట్ ఈజ్ మహాలక్ష్మి...’ అంటూ ‘100% లవ్’ చిత్రంలో బాలు (నాగచైతన్య) ఎదుట కాలేజీలో కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతుంది మహాలక్ష్మి (తమన్నా). నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో 2011లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. బావా మరదళ్లుగా చైతూ, మిల్కీ బ్యూటీ చేసిన సందడి మరచిపోలేం. ఆ చిత్రంలోని ‘దట్ ఈజ్ మహాలక్ష్మి...’ పాట పేరుతో ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘క్వీన్’ సినిమాకి రీ–మేక్‌గా తయారవుతున్న ఈ చిత్రంలో తమన్నా లీడ్ రోల్ చేస్తుండటం విశేషం. యూరప్‌లో జరిగిన షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. పెదవి దాటని మాటొకటుంది ‘పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా’ అంటూ ‘తమ్ముడు’ సినిమాలో తన ప్రేమను పవన్ కళ్యాణ్‌కి చెప్పకనే చెబుతుంటుంది ప్రీతి జింగానియా. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1999లో విడుదలై మంచి హిట్ అందుకుంది. రమణ గోగుల సంగీతం ఈ చిత్రానికి మరో ఎస్సెట్. అంత హిట్ అయిన ఆ పాటతో తాజాగా ‘పెదవి దాటని మాటొకటుంది’ సినిమా తెరకెక్కింది. రావణ్ రెడ్డి, పాయల్ వాద్వా జంటగా టి.గురుప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్ననే (శుక్రవారం) విడుదలైంది. ఈ చిత్రాన్ని ముగ్గురు స్నేహితులు (హీరో రావణ్ రెడ్డి, డైరెక్టర్ గురుప్రసాద్, సంగీత దర్శకుడు జీనిత్ రెడ్డి) కలసి తీశారు. పల్లవుల టైటిల్స్‌తో వచ్చిన చిత్రాలు ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం (అభినందన) సాహసం శ్వాసగా సాగిపో (ఒక్కడు) ఆటాడుకుందాం రా (సిసింద్రీ) సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (శుభసంకల్పం) మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (రాక్షసుడు) శ్రీరస్తు.. శుభమస్తు (పెళ్లి పుస్తకం) కళ్యాణ వైభోగమే (సీతారాముల కళ్యాణం) వెన్నెల్లో హాయ్ హాయ్ (ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు) సోగ్గాడే చిన్నినాయనా (ఆస్తిపరులు) ఎక్కడికి పోతావు చిన్నవాడా (ఆత్మబలం) నన్ను వదలి నీవు పోలేవులే (మంచి మనసులు) వీరి వీరి గుమ్మడి పండు (జయం) భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ (మనీ) ప్రేమంటే సులువు కాదురా (ఖుషి) చందమామ రావే (సిరివెన్నెల) చంద్రుళ్లో ఉండే కుందేలు (నువ్వొస్తానంటే నేనొద్దంటానా) కన్నుల్లో నీ రూపమే (నిన్నే పెళ్ళాడతా) బంతిపూల జానకి (బాద్షా) – ఇన్పుట్స్ : డేరంగుల జగన్