![Sunil To Play Key Role in Sharwanand padi padi Leche Manasu - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/15/sunil-to-do-a-role-in-pawan.jpg.webp?itok=z6U9g6yq)
సునీల్
ఎన్నో సక్సెస్‌ఫుల్ మూవీస్‌లో కమెడియన్‌గా నటించి, మంచి పేరు సంపాదించుకున్నారు సునీల్. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకుని ‘మర్యాద రామన్న, పూలరంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు’ వంటి సినిమాల్లో నటించారు. ఇప్పుడు యు–టర్న్ తీసుకుని ఆయన కమెడియన్ కూడా దృష్టి పెట్టారు.
రీసెంట్‌గా ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన ‘సిల్లీఫెలోస్’లో ఓ ముఖ్య పాత్ర చేసి ఆకట్టుకున్నారు సునీల్. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవిందç సమేత వీరరాఘవ’, రవితేజ నటిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటొని’, శర్వానంద్ ‘పడిపడి లేచె మనసు’ చిత్రాల్లో కమెడియన్‌గా నటిస్తున్నారు. శర్వానంద్ సినిమాలో డాక్టర్ పాత్రలో కనిపిస్తారట. మరి.. ఆడియన్స్ టెన్షన్స్‌కు థియేటర్‌లో సునీల్ ఎలా నవ్వుల వైద్యం చేస్తారో చూడాలంటే ఈ డిసెంబర్ 21వరకు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment