Suneel
-
రాజమౌళి సినిమాను త్రిష తిరస్కరించిందా.. కారణం ఆ హీరోనేనా..?
సౌత్ ఇండియాలో 25 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గుర్తింపును త్రిష కొనసాగిస్తుంది. మోడలింగ్ నుంచి హీరోయిన్గా 'జోడి' (తమిళ్) సినిమాతో 1999లో ఎంట్రీ ఇచ్చింది. అందులో హీరోయిన్ సిమ్రన్‌కు స్నేహితురాలిగా మెప్పించింది. ఈ సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించింది. 'నీ మనసు నాకు తెలుసు' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. తెలుగులో స్టార్ హీరోలతో నటించిన త్రిషకు కొన్నేళ్ల తర్వాత అవకాశాలు తగ్గాయి. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి భారీ అవకాశాలను దక్కించుకుంటుంది.డైరెక్టర్ రాజమౌళి సినిమాను త్రిష కాదన్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. వరుస హిట్లతో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న రాజమౌళి.. 2009లో 'మగధీర' చిత్రం తర్వాత 'మర్యాద రామన్న' తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ చిత్రంలో సునీల్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించే ఛాన్స్‌ను మొదట త్రిషకు రాజమౌళి ఆఫర్ చేశారట. అప్పటికే త్రిష స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. దీంతో కమెడియన్‌గా కొనసాగిన సునీల్‌తో నటించడం వల్ల తన మార్కెట్ పడిపోతుందని సున్నితంగా తిరస్కరించిందట. అయితే, ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన సలోని పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో వచ్చిన అవకాశాన్ని కాదని పెద్ద తప్పు చేశానే అని ఆలోచనలో త్రిష పడిపోయిందట. ఇదే విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. -
'నిరూపించు.. లేదంటే ముక్కు నేలకు రాయి' : మేయర్ సునీల్‌రావు ఫైర్!
కరీంనగర్: స్మార్ట్ సిటీలో రూ.130 కోట్ల కుంభకోణం జరిగిందని, రోడ్డు వేయకుండానే బిల్లులు తీసుకున్నారని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలు నిరూపించాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు సవాల్ విసిరారు. నిరూపించకపోతే క్షమాపణలు చెప్పి, టవర్‌సర్కిల్ వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ సిటీలో భాగంగా రూ.934 కోట్లతో పనులు ప్రారంభించామని.. అవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు రూ.539 కోట్లు నగరపాలకసంస్థకు వచ్చాయని... రూ.514 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. ప్రతీ పని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్ పరిధిలో జరుతుతుందన్నారు. మూడు సంస్థల రిపోర్ట్ తర్వాతే బిల్లులు చెల్లిస్తారన్నారు. గత పాలకవర్గం హయాంలోనే టెండర్లు పూర్తయినా.. రవీందర్ సింగ్ తనకు నచ్చిన ఏజెన్సీకి టెండర్లు దక్కలేదని ఏడాది పాటు పనులు పెండింగ్‌లో పెట్టారన్నారు. టవర్ సర్కిల్ ఆధునీకరణ పేరిట నిర్మాణాలు కూలగొట్టాలనే ఆలోచన చేసిన గొప్ప మేధావి అని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో రవీందర్ సింగ్ లాంటి వెన్నుపోటుదారులు వ్యతిరేకంగా పని చేసినప్పటికీ బీఆర్ఎస్ గెలిచిందన్నారు. కార్పొరేటర్, సివిల్సప్లై చైర్మన్‌గా ఏకకాలంలో రెండు జీతాలు తీసుకున్నారని విమర్శించారు. రవీందర్ సింగ్ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. సమావేశంలో కార్పొరేటర్లు గందే మాధవి మహేశ్, గంట కళ్యాణి, కంసాల శ్రీనివాస్, ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేశ్, చాడగొండ బుచ్చిరెడ్డి, వాల రమణారావు, నాంపల్లి శ్రీనివాస్, జంగిలి సాగర్, కుర్ర తిరుపతి, సల్ల శారద రవీందర్, ఎడ్ల సరిత అశోక్, వంగల శ్రీదేవి పవన్, పిట్టల వినోద శ్రీనివాస్ ఉన్నారు. ఇవి చదవండి: యాదాద్రి ప్రాజెక్టులో 10వేల కోట్లు తిన్నావ్ -
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్
భోపాల్: ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గెలుపు వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాజీ సహచరుడు సునీల్ కనుగొలును కాంగ్రెస్ రంగంలోకి దించింది. ఆయన ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. సునీల్ గతంలో ఈయన ప్రధాని మోదీతో కలిసి బీజేపీ ప్రచార వ్యూహాన్ని రచించారు. 2017లో యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ గెలుపునకు బాటలు వేశారు. అనంతరం కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం వెనుక సునీల్ కృషి ఉంది. సునీల్ కనుగొలు(39) తండ్రి కర్ణాటక, తల్లి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. ఈయన విద్యాభ్యాసం తమిళనాడులో సాగింది. ఎంబీఏ, ఎంఎస్ అమెరికాలో పూర్తి చేశారు. -
జై సేన సూపర్‌హిట్ అవ్వాలి
‘‘జై సేన’ సినిమా కథాంశం కొత్తగా ఉంది. ఆరుగురు యంగ్‌స్టర్స్‌తోపాటు శ్రీకాంత్, సునీల్ మంచిపాత్రలు చేశారు. ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు బి.గోపాల్. శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వి, ప్రవీణ్, కార్తికేయ ముఖ్య తారలుగా వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జై సేన’. వి.విజయలక్ష్మి సమర్పణలో వి.సాయి అరుణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘సేన జైసేన... యుద్ధం చెయ్...’ అంటూ సాగే మొదటి పాటను బి.గోపాల్ రిలీజ్ చేశారు. సునీల్ మాట్లాడుతూ– ‘‘జై సేన’లో సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశాను. అప్పట్లో టి.కృష్ణగారు మంచి సందేశంతో సినిమాలు తీసేవారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘రేపటిపౌరులు’ సినిమా చాలా బాగుంటుంది. ఆ కోవలో మంచి మెసేజ్‌తో చేసిన ‘జై సేన’ కూడా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. వి.సముద్ర మాట్లాడుతూ– ‘‘బి.గోపాల్‌గారి చేతుల మీదుగా మొదటి పాట విడుదల కావడం సంతోషం. ఈ పాటను, సునీల్ అన్నయ్య పాత్ర డైలాగ్స్‌ను చందు బాగా రాశాడు. ఇండస్ట్రీలో మంచి వ్యక్తి అంటే కృష్ణగారి గురించి చెబుతాం.. శ్రీకాంత్ కూడా కృష్ణగారి అంత మంచి వ్యక్తి. పొలిటికల్ లీడర్స్‌ని, యూత్‌తో పాటు అందర్నీ ఆలోచింపజేసే సినిమా ఇది’’ అన్నారు. సహ నిర్మాత శిరీష్‌రెడ్డి, నటీనటులు ప్రీతి శర్మ, నీతు గౌడ, ప్రవీణ్, అభిరామ్, కార్తికేయ, హరీష్ గౌతమ్, రచయిత చందు తదితరులు మాట్లాడారు. -
జై సేన విజయం సాధించాలి
శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ప్రధాన తారాగణంగా వి. సముద్ర దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘జై సేన’. వి. విజయలక్ష్మీ సమర్పణలో వి. సాయి అరుణ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. శ్రీకాంత్‌గారితో పాటు కొంతమంది కుర్రాళ్లు నటించారు. సునీల్‌ది స్పెషల్ రోల్. ఈ సినిమా విజయం సాధించాలి. సముద్ర ఇంకా మంచి సినిమాలు చేయాలి’’ అన్నారు. ‘‘శ్రీకాంత్, సునీల్ పాత్రలు హైలైట్‌గా ఉంటాయి. నలుగురు యువహీరోలు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. వారి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది’’ అన్నారు సముద్ర. ‘‘త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు సహ–నిర్మాత పి. శిరీష్ రెడ్డి. -
రివ్యూల వల్ల అసంతృప్తి ఉంది
‘‘ప్రస్తుతం సమాజంలోని పరిస్థితులకి అనుగుణంగా తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ 2019’. ఈ మధ్యకాలంలో నేను నటించిన చిత్రాల్లో నాకు నచ్చిన చిత్రమిది. మా సినిమాని ఇంత హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని శ్రీకాంత్ అన్నారు. శ్రీకాంత్, మంచు మనోజ్, సునీల్ ముఖ్య తారలుగా కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ 2019’. అలివేలమ్మ ప్రొడక్షన్స్ సమర్పణలో టి. అలివేలు నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. నిర్మాత, బయ్యర్లు అందరూ సేఫ్. కానీ కొన్ని రివ్యూస్ వల్ల మాకు కొంచెం అసంతృప్తిగా ఉంది. మేము వారి అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం. కానీ, ఒక రివ్యూ రాసేటప్పుడు కొంచెం ఆలోచించాలి. ప్రొడ్యూసర్ చాలా కష్టపడి చిత్రాన్ని నిర్మిస్తాడు. ఎంతోమంది టెక్నీషియన్లకి పని దొరుకుతుంది. కేవలం రేటింగ్స్ చూసి సినిమాకి వెళ్లేవారు చాలా మంది ఉంటారు. ఒక సక్సెస్ వస్తే ఇండస్ట్రీలో చాలా మంది టెక్నీషియన్లకి పని దొరికినట్లేనని గుర్తించాలి’’ అన్నారు. ‘‘ఓ డైరెక్టర్‌గా ఫీల్ అయి ఈ సినిమా తీయ లేదు.. డబ్బుల కోసం కూడా కాదు.. ఓ బాధ్యత గల పౌరుడిగా తీశా. ప్రేక్షకుల ఆదరణ చాలా బావుంది’’ అన్నారు కరణం బాబ్జీ’. ‘‘ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే మంచి కథాంశంతో వచ్చిన చిత్రమిది. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు అలివేలు. నటుడు శివకృష్ణ పాల్గొన్నారు. -
ఆయన పెద్ద కాంత్... నేను చిన్న కాంత్
‘‘ఆపరేషన్ 2019’ నా 125వ చిత్రం. పాత్ర బావుంటే ఏ సినిమా అయినా ఓకే. మల్టీస్టారర్ సినిమాలు, విలన్ పాత్రలూ చేస్తాను. కేవలం హీరోగానే సినిమాలు చేయాలనుకోవడం లేదు. కానీ, లైఫ్ లాంగ్ సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అని శ్రీకాంత్ అన్నారు. ఆయన హీరోగా కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్ 2019’. మంచు మనోజ్, సునీల్ కీలక పాత్రలు చేశారు. అలివేలమ్మ ప్రొడక్షన్స్ సమర్పణలో అలివేలు నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ పంచుకున్న విశేషాలు... ► ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రం తరహాలోనే ఈ ‘ఆపరేషన్ 2019’ కూడా పొలిటికల్ సెటైర్‌గా ఉంటుంది. ఏ పార్టీనో విమర్శించాలని చేసింది కాదు. నాయకులు, ప్రజలకు కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. ఓటు విలువని కూడా చూపించాం. పదునైన డైలాగ్స్ ఉన్నాయి. ► చిన్న రైతు కుటుంబంలో పుట్టి విదేశాలు వెళ్లి తిరిగొచ్చిన హీరో సొంత రాష్ట్రానికి ఏదైనా చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో రాజకీయ నాయకుడిగా ఎలా మారాడు? తను అనుకున్నది సాధించాడా? లేదా? అన్నదే చిత్రకథ. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాను. మంచు మనోజ్ పోలీస్ ఆఫీసర్‌గా చేశారు. సునీల్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ► ప్రతి సినిమా హిట్ అవ్వాలనే చేస్తాం. కొన్ని ప్రేక్షకులను అలరించవు.. బాధగా ఉంటుం ది. ‘యుద్ధం శరణ ం’ సినిమాలో విలన్‌గా నటించా. అది సూపర్ హిట్ అయ్యుంటే విలన్‌గా బిజీ అయిపోయేవాడినేమో?. ► 2019 ఎలక్షన్స్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రం స్టార్ట్ చేశాం. ఈ లోపు ఎలక్షన్స్ ముందుకు వచ్చాయి. అందుకే త్వరగా రిలీజ్ చేస్తున్నాం. నేను, బాబ్జీ కలిసి ‘మెంటల్ పోలీస్’ సినిమా చేశాం. అతని స్టైల్ నచ్చింది. అందుకే మళ్లీ పని చేశాం. సినిమాలు సొసైటీని మారుస్తాయి అని అనుకోకూడదు. కానీ, వాటి ప్రభావం మాత్రం ఉంటుంది. ► రజనీకాంత్‌గారి ‘2.0’కి పోటీగా వస్తున్నా అంటున్నారు. ఆయనతో పోటీ ఏంటండి? ఆయన పెద్ద కాంత్, నేను చిన్న కాంత్ (నవ్వుతూ). ఏ సినిమా బాగుంటే ఆ థియేటర్స్‌కి ప్రేక్షకులు వస్తారు. ► చిన్న అబ్బాయి రోహన్ ప్రభుదేవాగారితో ఓ సినిమా చేస్తున్నాడు. పెద్దబ్బాయి రోషన్‌ని వచ్చే ఏడాది లాంచ్ చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం నేను ‘తెలంగాణ దేవుడు, మార్షల్’ అనే సినిమాల్లో నటిస్తున్నాను. -
నవ్వుల వైద్యం
ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్‌లో కమెడియన్‌గా నటించి, మంచి పేరు సంపాదించుకున్నారు సునీల్. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకుని ‘మర్యాద రామన్న, పూలరంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు’ వంటి సినిమాల్లో నటించారు. ఇప్పుడు యు–టర్న్ తీసుకుని ఆయన కమెడియన్ కూడా దృష్టి పెట్టారు. రీసెంట్గా ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన ‘సిల్లీఫెలోస్’లో ఓ ముఖ్య పాత్ర చేసి ఆకట్టుకున్నారు సునీల్. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవిందç సమేత వీరరాఘవ’, రవితేజ నటిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటొని’, శర్వానంద్ ‘పడిపడి లేచె మనసు’ చిత్రాల్లో కమెడియన్‌గా నటిస్తున్నారు. శర్వానంద్ సినిమాలో డాక్టర్ పాత్రలో కనిపిస్తారట. మరి.. ఆడియన్స్ టెన్షన్స్‌కు థియేటర్లో సునీల్ ఎలా నవ్వుల వైద్యం చేస్తారో చూడాలంటే ఈ డిసెంబర్ 21వరకు ఆగాల్సిందే. -
ఆపరేషన్ దుర్యోధన తరహాలో..
శ్రీకాంత్ హీరోగా అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణం బాబ్జి దర్శకత్వంలో అలివేలు నిర్మించిన చిత్రం ‘ఆపరేషన్ 2019’. మంచు మనోజ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా ర్యాప్ రాక్ షకీల్ స్వరపరచిన ఓ పాటను సునీల్‌పై తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు కరణం బాబ్జి దర్శకత్వంలో ‘మెంటల్ పోలీస్’ సినిమా చేశా. తాజాగా రాజకీయ నేపథ్యంలో చేస్తున్న ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘ఆపరేషన్ దుర్యోధన’ తర్వాత మళ్లీ మంచి పాత్ర చేశాననే తృప్తి కలిగింది’’ అన్నారు. సునీల్ మాట్లాడుతూ– ‘‘శ్రీకాంత్ అన్నయ్య నటించిన ‘ఆపరేషన్ దుర్యోధన’ నా ఫేవరేట్ సినిమా. 2019లో ఎలా ఉండాలనుకుంటున్నామన్నది 2018లోనే తెలియచేస్తున్నామని శ్రీకాంత్ అన్నయ్య నాతో అన్నారు. నేనీ సినిమాలో కనిపించే సందర్భం ప్రేక్షకులకు షాకింగ్‌గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేసే అవకాశం కలిగించిన చిత్రమిది’’ అన్నారు. ‘‘చెన్నైలో జరిగిన ఘటన ఆధారంగా సినిమా స్టార్ట్ చేశాను. సునీల్ గారు కథ వినగానే ఓకే అన్నారు. మనోజ్ కథ వినగానే ‘పెదరాయుడు’లో రజనీకాంత్‌గారి పాత్రలా ఉంది. చేస్తా’ అన్నారు. ‘ఆపరేషన్ దుర్యోధన’ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో కనబడుతుంది’’ అన్నారు కరణం బాబ్జీ. -
నవ్వుకునే చిత్రాలను ఆదరించాలి
‘‘సిల్లీ ఫెలోస్’ చిత్రంలో నాలుగైదు రోజుల పాత్ర చేశాను. భీమనేని శ్రీనివాస్‌తో 26 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. తను హార్డ్ వర్కర్ కాబట్టే సినిమాలన్నీ సూపర్ హిట్స్ అవుతున్నాయి. నరేశ్, సునీల్.. ఎవరో ఒకరుంటేనే కామెడీ పరంగా తట్టుకోవడం కష్టం. అలాంటిది ఇద్దరూ కలిసి నటించారంటే కామెడీ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. హాయిగా నవ్వుకునే సినిమాలను ఆదరించాలి’’ అని నటుడు డా. బ్రహ్మానందం అన్నారు. ‘అల్లరి’ నరేశ్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ, నందినీరాయ్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘16 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ‘సుడిగాడు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన భీమనేనిగారితో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సునీల్‌గారు, నేను ఈగోస్ లేకుండా నటించాం. ప్రేక్షకులు ‘సుడిగాడు’ రేంజ్ హిట్ అందిస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘నరేష్‌గారు, నేను అన్నదమ్ముల్లా కలిసిపోయాం. ‘తొట్టిగ్యాంగ్’ సినిమాకు ఎంత ఎంజాయ్ చేశానో ‘సిల్లీ ఫెలోస్’కి కూడా అంతే ఎంజాయ్ చేశా. ఇందులో ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్ర చేశా’’ అన్నారు సునీల్. ‘‘సిల్లీ ఫెలోస్’ సినిమా వెనుక చాలా కష్టం ఉంది. మా కష్టాన్ని ఈరోజు తెరపై చూస్తారు. ‘సుడిగాడు’ తర్వాత నేను ఒక సినిమా చేస్తే.. నరేష్‌గారు 12 చిత్రాలు చేశారు’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘భీమనేని మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. పెద్ద హీరోలందరూ తమ సినిమాల్ని కనీసం ఒక షెడ్యూల్ అయినా ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ చేయాలని కోరుకుంటున్నా. ఇందుకు దర్శక–నిర్మాతలను, హీరోలను రిక్వెస్ట్ చేస్తున్నా’’ అన్నారు ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణ. ఈ వేడుకలో డైరెక్టర్ కె.నాగేశ్వర్ రెడ్డి, నటి నందినీరాయ్ పాల్గొన్నారు. -
డైరెక్షన్ చేస్తా
‘‘డబ్బు గురించి, సినిమాల సంఖ్య గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. క్వాలిటీగా సినిమాలు చేద్దామనుకుంటున్నా. కెరీర్ మొదట్లో విలన్ అవుదామనుకున్నా. రవిబాబుగారు నాతో ‘అల్లరి’ చేశారు. భవిష్యత్‌లో చిన్న బడ్జెట్లో సినిమా డైరెక్షన్ చేస్తా’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, సునీల్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. టీజీ విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘అల్లరి’ నరేశ్ పంచుకున్న విశేషాలు... ► ‘సిల్లీ ఫెలోస్’ లో రాజకీయాలంటే ఆసక్తి ఉండే వీరబాబు అనే లేడీస్ టైలర్ పాత్ర చేశాను. సూరిబాబు క్యారెక్టర్లో సునీల్‌గారు కనిపిస్తారు. ‘తొట్టిగ్యాంగ్’ తర్వాత మేమిద్దరం ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్స్ చేసిన చిత్రమిది. కామెడీలో అందరూ పాత నరేశ్, పాత సునీల్‌ను మిస్ అవుతున్నామని అంటున్నారు. ఆ పాతను వెతికి మళ్లీ ఈ సినిమాలో పెట్టాం. ► ఈ సినిమాకి తొలుత ‘సుడిగాడు 2’ టైటిల్ పరిశీలనకు వచ్చింది. ఆ పేరు పెడితే ప్రేక్షకులు స్పూఫ్ కామెడీ ఆశించి వస్తారు. ఆడియన్స్‌ను మోసం చేయకూడదని ‘సిల్లీ ఫెలోస్’ ఫిక్స్ చేశాం. భీమనేనిగారికి ‘ఎస్’ సెంటిమెంట్ ఉందిగా(నవ్వుతూ). ఒకరిని అనుకరించటం నటన కాదని నా భావన. ► రియలిస్టిక్ సినిమాలపై నాకు ఆసక్తి ఉంది. కామెడీ చేసేవారు ఏమైనా చేయగలరని నా నమ్మకం. ‘లడ్డుబాబు’ చిత్రానికి ఎంతో కష్టపడ్డా. కానీ, వర్కౌట్ కాలేదు. ఇకపై నా కామెడీని, ఎమోషన్ని బ్యాలెన్స్ చేసే ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనుకుంటున్నా. అన్నయ్య(ఆర్యన్ రాజేశ్) రామ్‌చరణ్ సినిమా చేస్తున్నారు. ► మహేశ్‌బాబుగారి సినిమాలో ఓ మంచి పాత్ర చేస్తున్నా. గిరి దర్శకత్వంలో నేను హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. మారుతి దర్శకత్వంలో ఈవీవీ బ్యానర్లో నేను హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. మరికొన్ని కథలు వింటున్నాను. వెబ్ సిరీస్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి వాటి పట్ల ఆసక్తి ఉంది. తమిళంలోనూ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి తెలుగు ఇండస్ట్రీపైనే దృష్టి పెట్టాను. -
అది వాళ్లే ఊహించేసుకున్నారు
‘‘నేను హీరోగా ఉన్నప్పుడు మామూలు పాత్రలు చేద్దామని అనుకున్నాను. కానీ, ‘అతను హీరో అయిపోయాడుగా.. వేరే పాత్రలు చేయడేమో?’ అని దర్శకులే ఊహించేసుకున్నారు. అలా వేరే పాత్రలు చేయడం కుదర్లేదు. హీరోగా చేసినప్పుడు హిట్, ఫ్లాప్ కౌంట్లోకి వస్తుంది. కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే మన ట్రాక్ పండిందా? లేదా? అన్నది చాలు’’ అని సునీల్ అన్నారు. ‘అల్లరి’ నరేశ్, సునీల్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. టీజీ విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అవుతోంది. ఈసందర్భంగా సునీల్ పంచుకున్న విశేషాలు... ► అప్పట్లో జంధ్యాలగారు, ఈవీవీ సత్యనారాయణగారు కామెడీ సినిమాలు తీసేవారు. ఇప్పుడు కామెడీ టైమింగ్ ఉన్న దర్శకులు తగ్గారు. త్రివిక్రమ్, శ్రీనువైట్ల, వినాయక్‌గారు ఉన్నారు. అప్పటితో పోలిస్తే కామెడీ తగ్గింది. ఆడియన్స్‌ను ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో ఎంటర్టైన్ చేస్తున్నారు. ‘సిల్లీ ఫెలోస్’ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకూ ఫుల్ ఫన్‌తో ఉంటుంది. ఈ పాత్రకు నేనైతే బావుంటుందని టీమ్ డిసైడ్ అయ్యారు. సెకండ్ హాఫ్‌లో చివరి 20 నిమిషాల ట్రాక్‌కి ఆడియన్స్ సీట్లలో కూర్చోరు. అంతలా నవ్వేస్తారు. ► మా సినిమాలో హీరో నరేశే. మేం ఇంతకుముందు ‘అత్తిలి సత్తిబాబు, తొట్టిగ్యాంగ్’ సినిమాలు చేశాం. ‘సిల్లీ ఫెలోస్’లో తనకి హీరోయిన్ ఉంటుంది. నాకు ఉండదంతే. ► ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో డేట్స్ కుదరక చేయలేదు. మళ్లీ కామెడీ పాత్రల్లోకి రావడం పెద్ద మార్పేమీ అనిపించడం లేదు. అప్పుడెలా ఉండేదో ఇప్పుడూ అదే ట్రీట్మెంట్. హీరో అప్పుడు ఒకలా.. కమెడియన్‌గా మరోలా ట్రీట్మెంట్ జరుగుతుందంటే తప్పు మన బిహేవియర్లో ఉన్నట్టే. హీరోగా ఉన్నప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ రెమ్యునరేషన్ వస్తోంది (నవ్వుతూ). ► ‘అరవింద సమేత’ సినిమా ఫస్ట్ డే షూటింగ్లో త్రివిక్రమ్ కూడా ‘వీడు హీరో కదా.. ఇప్పుడెలా చేస్తాడు? అనుకున్నట్టున్నాడు. మంచి పాత్ర డిజైన్ చేశాడు త్రివిక్రమ్. ‘అతడు’ సినిమాలో నేను పోషించినటువంటి పాత్రలానే ఉంటుంది. సత్య, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాసరెడ్డి కామెడీ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ► హీరోగా రెండు కమిట్మెంట్స్ ఇచ్చాను. అవి చేయాలి. ‘అందాల రాముడు’ బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ 5 ఏళ్ల వరకూ హీరోగా ఏ సినిమా చేయలేదు. సినిమాల్లో పని చేయాలన్నది నా లక్ష్యం. దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ► బ్రహ్మానందంగారి స్థానాన్ని భర్తీ చేసేవాడివి అంటున్నారు. ఇక్కడ ఎవ్వరూ ఎవరి స్థానాన్ని భర్తీ చేయడం ఉండదు. యస్వీఆర్ మళ్లీ రారు. రావుగోపాలరావు రేంజ్ విలనిజం.. బ్రహ్మానందంగారి స్టైల్ కామెడీ మళ్లీ చూడలేం. కొన్ని సినిమాలు స్టార్ హీరో చేయడం కుదరదు. మేం మాత్రమే చేసే సినిమాలుంటాయి. పూర్తీగా నవ్వించే పాత్రలైతే మళ్లీ హీరోగా చేస్తా. -
దర్శకుడికి ప్రతి సినిమా పరీక్షే
‘‘ప్రతి సినిమాకు ప్రెషర్ ఉంటుంది. ప్రతి సినిమా ఫస్ట్ సినిమా అని చేయాలి. హీరోకు ఇంకో చాన్స్ ఉంటుంది. కానీ దర్శకుడికి ప్రతి సినిమా పరీక్షే. బావుంటే ప్రేక్షకులు ఎంత ఎత్తుకు తీసుకువెళ్తున్నారో బాలేకపోతే అంతే సులువుగా మరచిపోతున్నారు. అది ఎన్ని కోట్లుతో తీసిన సినిమా అయినా, ఎన్ని హిట్స్ ఇచ్చిన దర్శకుడు అయినా సరే’’ అని భీమనేని శ్రీనివాస్ అన్నారు. ‘అల్లరి’ నరేశ్, సునీల్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. టీజీ విశ్వ ప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కుచ్చిభొట్ల నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా భీమనేని శ్రీనివాస్ చెప్పిన విశేషాలు. ► ‘అల్లరి’ నరేశ్, నేను ‘సుడిగాడు’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని చాలా డిస్కస్ చేసుకున్నాం. ‘సుడిగాడు’ హిట్ అవుతుంది అనుకున్నాం కానీ అంత పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందనుకోలేదు. దాంతో మా కాంబినేషన్లో మళ్లీ ఎలాంటి సినిమా చేయాలి? ‘సుడిగాడు’ సీక్వెల్ చేయలా? అని ఆలోచించాం. ఓ లైన్ కూడా అనుకున్నాం. ఈలోపు ఈ పాయింట్ వచ్చి ఈ సినిమా చేశాం. ఇందులో నరేశ్ లేడీస్ టైలర్‌గా కనిపిస్తారు. జయప్రకాశ్ రెడ్డి టైలర్ నుంచి ఎంఎల్ఏ అవుతారు. అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమాలో నరేశ్ కూడా అతని దారినే ఫాలో అవుతాడు. ► సునీల్ హీరోగా మంచి సక్సెస్ చూశారు. మళ్లీ కామెడీ చేయాలనుకున్నప్పుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాతో లాంచ్ అవ్వాలనుకున్నారు. ఈ సినిమా నచ్చడంతో ఒప్పుకున్నారు. నరేశ్ ఫ్రెండ్‌గా ఓ కీ రోల్లో కనిపిస్తారాయన. ► క్లైమాక్స్ ముందు వచ్చే 20 నిమిషాలు సినిమాకు హైలైట్ అని ఫీల్ అవుతున్నాం. ఆడియన్స్ సీట్లో కూర్చోకుండా నవ్వుతారు. లాజిక్, మేజిక్‌లు పట్టించుకోకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసే ఎంటర్టైనర్ ఇది. ► ఏదైనా క్రాఫ్ట్ బాగా చేస్తే మన మీద ఆ ముద్రపyì పోతుంది. ఫస్ట్ సినిమా ‘సుప్రభాతం’ హిట్ అయింది. ఆ తర్వాత వరుసగా రీమేక్‌లు చేశాను. తర్వాత సొంత కథలతో చేసిన ‘స్వప్నలోకం, నీ తోడు కావాలి’ సరిగ్గా ఆడలేదు. అందుకే రీమేక్స్‌లో బాగా రాణిస్తాడనే ముద్ర పడిపోయింది. దాంతో ఇవే చేస్తున్నాను. ► ఈ నిర్మాతలతో చాలా రోజులుగా అనుబంధం ఉంది. వాళ్లు ఆల్రెడీ ‘నేనే రాజు నేనే మంత్రి’ , ఎం.ఎల్.ఎ’ సినిమాలు తీశారు. హ్యాట్రిక్ కోసం స్క్రిప్ట్ జాగ్రత్తగా ఎంచుకున్నారు. -
నవ్వుల జర్నీలా ఉంది
‘అల్లరి’ నరేశ్, సునీల్ హీరోలుగా భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సిల్లీ ఫెల్లోస్’. చిత్రా శుక్లా కథానాయిక. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం మహేశ్‌బాబు రిలీజ్ చేశారు. ‘‘అల్లరి’ నరేశ్, సునీల్‌కు.. అలాగే ‘సిల్లీ ఫెల్లోస్’ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ట్రైలర్ చూస్తుంటే నవ్వుల జర్నీలా అనిపిస్తోంది’’ అన్నారు.‘‘మా ‘సిల్లీ ఫెల్లోస్ చిత్రం ట్రైలర్ మహేశ్‌బాబు గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం హ్యాపీగా ఉంది’’ అని నిర్మాతలు అన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. బ్రహ్మానందం, జయప్రకాశ్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, కెమెరా: అనీష్ తరుణ్ కుమార్. -
దేవాలయంలో వీర రాఘవ
ఆలయంలో పూజలు చేస్తున్నారట వీర రాఘవ. ఈ పూజ ఫలం ఎవరికి దక్కుతుంది అనేది వెండితెరపై తెలుస్తుంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఓ దేవాలయంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోందని సమాచారం.ఇటీవల పూజాహెగ్డే, సునీల్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు టీమ్. అలాగే ఈ సినిమాలో నటుడు నాగబాబు ఓ గ్రామ సర్పంచ్ పాత్రలో నటిస్తున్నారని, ఈ సర్పంచ్ కొడుకు పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారని టాక్. రావు రమేష్ ఓ పొలిటికల్ లీడర్ రోల్ చేస్తున్నారని సమాచారం. జగపతిబాబు, ఈషా రెబ్బా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఆ లోటు తీరుతుంది
‘అల్లరి’ నరేశ్, సునీల్ కలిసి నటిస్తున్న చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. చిత్రా శుక్లా కథానాయిక. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘సుడిగాడు’ వంటి హిట్ చిత్రం తర్వాత నరేశ్, నా కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. సునీల్ ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఏడాదిపాటు కష్టపడి హిట్ సాధించాలనే లక్ష్యంతో వస్తున్నాం. దాదాపు 200 టైటిల్స్ అనుకున్నాం. ఆఖరికి నా ‘ఎస్’ సెంటిమెంట్‌ను కూడా వదిలేద్దామనుకున్నా. చివరికి ‘ఎస్’తోనే టైటిల్ ఫిక్స్ చేశాం’’ అన్నారు. ‘‘ఆడియన్స్ నా నుంచి ఏదైతే ఇన్నాళ్లు మిస్ అయ్యారో నేనూ అదే మిస్ అయ్యాను. ‘సిల్లీ ఫెలోస్’తో ఆ లోటు తీరుతుంది. ఒకప్పటి కామెడీ జానర్లను తలపించే సినిమా అవుతుంది’’ అన్నారు సునీల్. ‘‘దాదాపు మూడేళ్లు స్క్రిప్ట్‌పై వర్క్ చేసిన సినిమా ‘సిల్లీ ఫెలోస్’. పూర్తి స్థాయి ఎంటరై్టన్మెంట్తో వస్తున్నాం’’ అన్నారు నరేశ్. ‘‘నేనే రాజు నేనే మంత్రి, ఎమ్.ఎల్.ఎ’ చిత్రాల తర్వాత మా బ్యానర్లో వస్తోన్న చిత్రమిది. హ్యాట్రిక్ సాధిస్తామని నమ్ముతున్నాం’’ అన్నారు భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి. చిత్రా శుక్లా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బ్లూ ప్లానెట్ ఎంటరై్టన్మెంట్స్ ఎల్ ఎల్ పీ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కెమెరా: అనీష్ తరుణ్ కుమార్, సంగీతం: శ్రీ వసంత్. -
'అన్నయ్య'కు ఓకే చెప్పిన సునీల్
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కథ కోసం ఇంకా కసరత్తు పూర్తవకపోవడంతో ఇన్నాళ్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ సినిమా త్వరలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కబోతుందని టాక్. ప్రి ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైందని.. కొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్నారని వినికిడి. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. అయితే హీరోగా మారిన స్టార్ కమెడియన్ సునీల్ తిరిగి ఈ చిత్రంలో కమెడియన్‌గా కనిపిస్తారట. అది కూడా ప్రత్యేకించి మెగాస్టార్ అభ్యర్థన మేరకు. చిరు స్వయంగా పిలిచి మరీ సునీల్‌ను తన 150వ సినిమాలో కమెడియన్ నటించమని అడిగారని సమాచారం. మొదటి నుంచి చిరంజీవికి ఫ్యాన్ అయిన సునీల్.. 'అన్నయ్య' అడగ్గానే నవ్వుతూ ఓకే చెప్పేశారట. ఇదే నిజమైతే తిరిగి మనం సునీల్ కామెడీ టైమింగ్‌కి కనెక్ట్ అవడం గ్యారెంటీ. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం బుల్లెట్లు దొరికిన ఘటన కలకలం రేపింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఢిల్లీ వెళుతున్న సునీల్ అనే ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు ఉన్నట్లు కనుగొన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని 9 ఎంఎం బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా సునీల్ ఢిల్లీ నుంచి చికాగో వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'భీమవరమే హీరోను చేసింది'
భీమవరం : భీమవరంలో చూసిన సినిమాలే తాను హీరో అవ్వడానికి కారణమని హీరో సునీల్ అన్నారు. ‘భీమవరం బుల్లోడు’ చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా మంగళవారం యూనిట్ ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకులో సందడి చేసింది. భీమవరంలో విజయలక్ష్మి థియేటర్లో హీరో సునీల్ మాట్లాడుతూ ‘వర్షంలోని పిడుగు భీమవరం బుల్లోడి అడుగు’ అంటూ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చిత్రం విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ చిత్ర విజయానికి కారణం ప్రేక్షకులే అని అన్నారు. ముందుగా ఓ రెస్టారెంట్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ తనను 20 ఏళ్లపాటు మోసిన భీమవరానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఇక్కడ నిర్వహించిన ఆడియో ఫంక్షన్‌కి వచ్చిన స్పందనే సినిమా విజయానికి కారణమని చెప్పారు. రాబోయే రోజుల్లో ఓ సంస్థను ఏర్పాటుచేసి పట్టణాభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని చెప్పారు. భీమవరం బుల్లోడు చిత్రానికి వచ్చిన ఓపెనింగ్ కలెక్షన్లు గతంలో తన ఏ చిత్రానికి రాలేదని సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. సునీల్ కోరిక మేరకే టైటిల్ హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ భీమవరం పట్టణం అందమైన పేయింటింగ్‌లా ఉందన్నారు. ఆడియో ఫంక్షన్లో భీమవరం అంటే ఏమిటో చూశానని మళ్లీ ఇప్పుడు మరోసారి రుజువైందని చెప్పారు. చిత్రం డెరైక్టర్ ఉదయ శంకర్ మాట్లాడుతూ భీమవరం బుల్లోడు అనే టైటిల్‌ను సునిల్ కోరిక మేరకే పెట్టామన్నారు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. నటుడు పృధ్వీరాజ్, రచయిత శ్రీధర్, పి.రామకృష్ణ, సంతోష్‌వర్మ, శ్రీను, మురళీ పాల్గొన్నారు. -
భీమవరం బుల్లోడి సందడి
కంబాలచెరువు (రాజమండ్రి), న్యూస్‌లైన్ : ‘భీమవరం బుల్లోడు’ చిత్రం విజయయాత్రకు వచ్చిన హీరో సునీల్ మంగళవారం రాజమండ్రిలో సందడి చేశారు. స్థానిక శ్యామలా థియేటర్‌కు ఉదయం ఆట జరుగుతూ ఉండగా సునీల్, హీరోయిన్ ఎస్తేర్, యూనిట్ సభ్యులు వచ్చారు. సునీల్ రాకతో ప్రేక్షకులు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. భీమవరం బుల్లోడు చిత్రాన్ని విజయవంతం చేసి తనకు ఎంతో ఉత్సాహాన్నిచ్చారని పేర్కొన్నారు. ఇదే ఊపుతో మరో విభిన్నమైన సినిమాతో ముందుకు వస్తానన్నారు. హీరోయిన్ ఎస్తేర్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు ఉదయ్‌శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా ఇంతపెద్ద హిట్ అవుతుందని అనుకోలేదన్నారు. ‘భీమవరం బుల్లోడు’ టైటిల్‌సాంగ్‌కు సునీల్, ఎస్తేర్ కాసేపు నర్తించి ప్రేక్షకులను హుషారెత్తించారు. అభిమానులు యూనిట్‌పై పూలవర్షం కురిపించారు. థియేటర్ మేనేజర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. విలన్ వేషానికీ ఓకే కల్చరల్ (కాకినాడ) : అవకాశం వస్తే విలన్ పాత్రకైనా సిద్ధమేనని నటుడు సునీల్ పేర్కొన్నారు. బీమవరం బుల్లోడు చిత్రం యూనిట్ విజయయాత్రలో భాగంగా మంగళవారం కాకినాడ వచ్చిన సునీల్ హోటల్ రాయల్‌పార్క్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ీహీరోయిన్ ఎస్తేర్,దర్శకుడు ఉదయశంకర్, మాటల రచయిత శ్రీధర్, కమెడియన్ పృథ్వి తదితరులు పాల్గొన్నారు. తన చిత్రం ఘనవిజయానికిసహకరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక సినిమా పూర్తయ్యేవరకూ మరో సినిమాపై దృష్టి పెట్టడం తనకు ఇష్టం ఉండదని, అందుకే గ్యాప్ ఎక్కువ వస్తోందని సునీల్ అన్నారు. సిక్స్ ప్యాక్ సాధనకు ఆహార నియమాల విషయంలో తనకు ప్రముఖ హీరో మహేష్‌బాబు సలహాలు ఇచ్చేవారన్నారు. పైరసీ వలన పరిశ్రమ నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు తనకు తెలియవని, ఎప్పటికీ అడుగుపెట్టబోనని స్పష్టం చేశారు. ఎస్తేర్ మాట్లాడుతూ సునీల్‌తో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. మాటల రచయిత శ్రీధర్ మాట్లాడుతూ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల చిత్రాల్లోని డైలాగులంటే ఇష్టమన్నారు. ఆ ట్రెండ్‌లోనే ఈ చిత్రానికి మాటలు రాశానన్నారు. సురేష్ మావీస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ మేనేజర్ లక్ష్మణరావు, సురేష్ మూవీస్ మేనేజర్ సురేష్, శ్రీనివాసరావు, దేవి మల్టిప్లెక్స్ థియేటర్ మేనేజర్ నారాయణ పాల్గొన్నారు. -
విజయనగరంలో ‘భీమవరం బుల్లోడు’యూనిట్ సందడి
ఆశీర్వదించండి విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: ‘మీ ఆశీర్వాదాలుంటే సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్తాను. యాక్షన్ నుంచి కామెడీ వరకూ ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నా’ అంటూ భీమవరం బుల్లోడు సునీల్ విజయనగరంలో సోమవారం సందడి చేశారు. చిత్ర విజయోత్సవంలో భాగంగా పట్టణంలోని రంజనీ థియేటర్‌కి సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చిత్ర యూనిట్ సభ్యులు వచ్చారు. సునీల్ రాకతో థియేటర్ చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులకు ముగ్ధుడైన సునీల్ మాట్లాడుతూ మంచి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని మరోసారి రుజువు చేశారన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో చిత్రం చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. నటనే ప్రాణంగా ఉన్న తనకు ఇంతటి సక్సెస్నిచ్చిన అభిమానులకు రుణపడి ఉంటానన్నారు. అభిమానుల ప్రోత్సాహంతో మరిన్ని మంచి చిత్రాలు చేస్తానని చెప్పారు. పైరసీ రక్కసిని దరిచేరనీయకుండా అభిమానులే చూడాలన్నారు. సినిమా విజయోత్సవ వేడుకలను రాష్ట్రమంతా నిర్వహిస్తున్నామని, సినిమా ప్రదర్శితమవుతున్న ప్రతి జిల్లాకు వెళ్లి వేడుకల్లో స్వయంగా పాల్గొంటున్నానన్నారు. హీరోయిన్ ఎస్తర్ మాట్లాడుతూ ‘సినిమా బాగుందా’ అంటూ ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. హాస్యనటులు రాజేష్, పృథ్వీ, సంగీత దర్శకుడు అనూప్ తదితరులు వారి వెంట ఉన్నారు. -
భీమవరం బుల్లోడు వెంకటేశ్‌తో చేయాలనుకున్నాను
‘‘ఈ సినిమా వెంకటేశ్‌తో చేయాలనుకున్నాను. కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. తర్వాత ‘పూలరంగడు’ చూశాక సునీల్‌కి యాప్ట్ అనిపించింది’’ అని దర్శకుడు ఉదయ్‌శంకర్ చెప్పారు. సునీల్, ఎస్తేర్ జంటగా ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ‘భీమవరం బుల్లోడు’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఉదయ్‌శంకర్ హైదరాబాద్‌లో పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘నేను ఇంతకు ముందు కలిసుందాం రా’, ‘బలాదూర్’ సినిమాలు డెరైక్ట్ చేశాను. వాటి తరహాలోనే పూర్తి స్థాయి కుటుంబ హాస్య చిత్రమిది. ఇందులో యాక్షన్‌ని కూడా కామెడీ రూపంలోనే చూపించాను. సునీల్ బాగా ఇన్వాల్వ్ అయి పనిచేశారు. ఈ సినిమా విషయంలో అందరికంటే నిర్మాత సురేష్‌బాబు బాగా నమ్మకంతో ఉన్నారు’’ అని తెలిపారు. ఈ చిత్రాన్ని హిందీలో అక్షయ్‌కుమార్‌తో చేయాలనుకుంటున్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.