భీమవరం బుల్లోడి సందడి
కంబాలచెరువు (రాజమండ్రి), న్యూస్‌లైన్ :
‘భీమవరం బుల్లోడు’ చిత్రం విజయయాత్రకు వచ్చిన హీరో సునీల్ మంగళవారం రాజమండ్రిలో సందడి చేశారు. స్థానిక శ్యామలా థియేటర్‌కు ఉదయం ఆట జరుగుతూ ఉండగా సునీల్, హీరోయిన్ ఎస్తేర్, యూనిట్ సభ్యులు వచ్చారు. సునీల్ రాకతో ప్రేక్షకులు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. భీమవరం బుల్లోడు చిత్రాన్ని విజయవంతం చేసి తనకు ఎంతో ఉత్సాహాన్నిచ్చారని పేర్కొన్నారు. ఇదే ఊపుతో మరో విభిన్నమైన సినిమాతో ముందుకు వస్తానన్నారు. హీరోయిన్ ఎస్తేర్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు ఉదయ్‌శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా ఇంతపెద్ద హిట్ అవుతుందని అనుకోలేదన్నారు. ‘భీమవరం బుల్లోడు’ టైటిల్‌సాంగ్‌కు సునీల్, ఎస్తేర్ కాసేపు నర్తించి ప్రేక్షకులను హుషారెత్తించారు. అభిమానులు యూనిట్‌పై పూలవర్షం కురిపించారు. థియేటర్ మేనేజర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
విలన్ వేషానికీ ఓకే
కల్చరల్ (కాకినాడ) : అవకాశం వస్తే విలన్ పాత్రకైనా సిద్ధమేనని నటుడు సునీల్ పేర్కొన్నారు. బీమవరం బుల్లోడు చిత్రం యూనిట్ విజయయాత్రలో భాగంగా మంగళవారం కాకినాడ వచ్చిన సునీల్ హోటల్ రాయల్‌పార్క్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ీహీరోయిన్ ఎస్తేర్,దర్శకుడు ఉదయశంకర్, మాటల రచయిత శ్రీధర్, కమెడియన్ పృథ్వి తదితరులు పాల్గొన్నారు. తన చిత్రం ఘనవిజయానికిసహకరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక సినిమా పూర్తయ్యేవరకూ మరో సినిమాపై దృష్టి పెట్టడం తనకు ఇష్టం ఉండదని, అందుకే గ్యాప్ ఎక్కువ వస్తోందని సునీల్ అన్నారు. సిక్స్ ప్యాక్ సాధనకు ఆహార నియమాల విషయంలో తనకు ప్రముఖ హీరో మహేష్‌బాబు సలహాలు ఇచ్చేవారన్నారు.
పైరసీ వలన పరిశ్రమ నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు తనకు తెలియవని, ఎప్పటికీ అడుగుపెట్టబోనని స్పష్టం చేశారు. ఎస్తేర్ మాట్లాడుతూ సునీల్‌తో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. మాటల రచయిత శ్రీధర్ మాట్లాడుతూ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల చిత్రాల్లోని డైలాగులంటే ఇష్టమన్నారు. ఆ ట్రెండ్‌లోనే ఈ చిత్రానికి మాటలు రాశానన్నారు. సురేష్ మావీస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ మేనేజర్ లక్ష్మణరావు, సురేష్ మూవీస్ మేనేజర్ సురేష్, శ్రీనివాసరావు, దేవి మల్టిప్లెక్స్ థియేటర్ మేనేజర్ నారాయణ పాల్గొన్నారు.